all

Tuesday, December 25, 2012

తవా ముర్గ్ - స్పెషల్ స్టార్టర్స్‌

మాంసాహార ప్రియులు వివిధ రకాల వెరైటీలను తయారు చేసుకొని తింటుంటారు. అయినా కూడా మరేదో కొత్తరకంను ఆశిస్తుంటారు. అటువంటి వారికోసం తయారు చేసిన ఈ తవా ముర్గ్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఒక్కటి మాత్రమే కాదు.. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో తయారు చేసేసుకోవచ్చు.ఈ తవా ముర్గ్ చికెన్ బ్రెస్ట్ తో తయారుచేసుకోవచ్చు. కొన్ని పదార్థాలతో మ్యారినేట్ చేసుకొని తవాలో ఫ్రై చేయడం వల్ల తవా ముర్గ్ అంటారు. కొన్ని మసాలా దినుసులతోనే అద్భుతమైన రుచితో తయారయ్యే ఈ స్పెషల్ ముర్గ్ ను లంచ్ లేదా డిన్నర్‌ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.

 Tawa Murgh



కావలసిన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్ పీస్: 250grms
శనగపిండి: 2tbsp
గుడ్డు సొన: 1tbsp
వెనిగర్: 2tbsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి: 2tsp
జీలకర్రపొడి: 1tsp
గరం మసాల పౌడర్: 1tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
అల్లంవెల్లుల్లి పేసు: 1tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్‌ని శుభ్రంగా కడిగి పలుచని స్లైస్ గా కట్ చేసుకోవాలి.

2. తర్వాత ముక్కల మీద శనగపిండి చల్లి చేత్తో కలపాలి. శనగపిండి ముక్కల్లో తడిని పీల్చుకోవడమే కాక పచ్చివాసనని కూడా తగ్గిస్తుంది.

3. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ పీసెస్, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, గుడ్డు సొన, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరమ్ మసాల పౌడర్, నిమ్మరసం కలిపి 10 నిమిషాలపాటు నానబెట్టాలి.

4. తర్వాత నాన్ స్టిక్ పాన్ లేదా తవా ని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి తక్కువ సెగ మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.

వీటిని లంచ్ లేదా డిన్నర్‌ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.

No comments: