all

Tuesday, December 25, 2012

చికెన్ టిక్కా బిర్యానీ-క్రిస్మస్ స్పెషల్

చికెన్ బిర్యానీ ఓ ట్రెడిషిన ల్ వంటకం. ఇది ఇండియా, పాకిస్తాన్ లో ఓ పాపులర్ రైస్ డిష్. బిర్యానీ వంటకంలో చాలా వెరైటీలు కలిగి ఉన్నాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సింధీ బిర్యానీ, షాన్ చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ చికెన్ బిర్యానీ ఇలా... చాలా వెరైటీలే ఉన్నాయి.

ఇండియా, పాకిస్తాన్ లో చికెన్ టిక్కా బిర్యాని చాలా పాపులర్ రిసిపి.ఇది చాలా టేస్ట్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది. చికెన్ టిక్కాను బిర్యానీ మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేయడం అంత సులభం కాదు. అతి త్వరగా చేసి వడ్డించే వంటకం కాదు. దీన్ని తయారు చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొన్నా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ ఈ స్పైసీ చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసి లచ్ డిన్న సర్వ్ చేసి అద్భుతమైన రుచితో ఎంజాయ్ చేయండి.


chicken tikka biryani recipe chritmas special


కావలసిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్: 1kg (చిన్న ముక్కలుగా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి)
బాస్మతి రైస్ : 1kg
అల్లం పేస్ట్: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
నిమ్మరసం: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 3tbsp
కారం: 2tsp
పసుపు: 1/3tsp
చాట్ మసాలా: 1tbsp
ఉల్లిపాయలు: 2onion
టమోటో: 2
పెరగు: 1cup
లవంగాలు: 5
బిర్యానీ ఆకు: 2
యాలకులు: 4
చెక్క: 2-3( అంగులపొడవు )
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp
నూనె: 1cup
పసుపు కలర్ ఫుడ్ కలర్: 1/4tsp
కుంకుమ పువ్వు: చిటికెడు
పాలు: 1/2cup

తయారు చేయు విధానం:

1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉన్న పాలను ఒక కప్పు తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, లవంగాలు, చెక్క, యాలకులు, ఛాట్ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ ను 1-2 గంటలపాటు అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేదా ఫ్రిజ్ లో పెట్టాలి.

3. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి, అందులోనే టమోటో వేసి చిక్కటి గ్రేవి తయారయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి మసాలామిశ్రమంతో నానబెట్టి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా అందులో వేసి 5-10నిముషాల పాటు మీడియం మంట మీ ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి బాగా కాగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు చికెన్ గ్రేవీ మిశ్రమాన్ని, వండిని అన్నంను రెండింటినీ లేయర్ గా పరచుకోవాలి. మొదటి అన్నంను ఒక ఇంచ్ మందగా పరవాలి. దానీ మీద చికెన్ మిశ్రమాన్ని పరవాలి. ఇలా మూడు నాలు లేయర్స్ పరచి చివరగా(టాప్ లో) చికెన్ గ్రేవి లేయర్ వచ్చేలా చూసుకోవాలి.

6. ఇప్పుడు ఈ అన్నం మీద పాలలో నానబెట్టుకొన్ని కుంకుమ పువ్వు, పాలతో సహాయ చిలకరించాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదునిముషాల పాటు తక్కువ మంటమీద ఆవిరిమీద ఉడికించాలి.

అంతే చికెన్ టిక్కా బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని రైతా, గ్రీన్ సలాడ్, నిమ్మకాయతో సర్వ్ చేయాలి. అంతే...

No comments: