all

Thursday, March 7, 2013

ఈ మసాజ్ ఆయిల్స్ ఉండగా..చర్మం నల్లబడుతుందనే భయమెందుకు...?

అందం విషయంలో ఫెయిర్ స్కిన్ కలిగి ఉండటం ఒక బెచ్ మార్క్ ఉంది. ఎందకంటే, చర్మం రంగును బట్టి జాతివివక్షత మరియు గతంలో వివక్షత కారణంగా ఉంది.. కృతజ్ఞతగా, విషయాలు (చర్మ రంగును బట్టి జాతి వివక్షతను)ఆధునిక కాలంలో మార్చారు.

మిల్కీ వైట్ కలర్ కలిగి ఇండటం ఇకపై అందం యొక్క సమాహారం. బ్రౌన్ లేదా టాన్ చర్మం తత్వాన్ని గ్లామర్ పరంగా ఇప్పుడు చూస్తే ఫెయిర్ రంగును భర్తీ చేస్తోంది.మన ఒంటి ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ.

ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.
అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్‌టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు.
అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్‌టాన్ లోషన్‌ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలిశరీరంలో ఎటువంటి ఆచ్ఛాదనా లేని అవయవాలు అంటే ముఖం, చేతులు మొదలైనవి సూర్యతాపానికి గురయ్యే అవకాశం ఉంది.
ఎండలో తిరిగినప్పుడు చర్మంలో నలుపుదనానికి కారణమయ్యే మెలనిన్ పొర ఆచ్ఛాదనలేని భాగాలకు చేరి క్రమేపీ ఆ భాగాలు కూడా నల్లగా మారతాయి.
దీనినే సన్‌టాన్ అంటారు.
ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మంచి బ్రాండ్‌కు చెందిన సన్‌స్క్రీన్ లోషన్‌ను ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి 15 లేదా 20 నిమిషాల ముందుగా ముఖం, మెడ, చేతులు... ఎండ ప్రభావానికి గురయ్యే భాగాలకు రాసుకుని అప్పుడు వెళ్లడం మంచిది.అయితే మనం రాసుకునే లోషన్ 3 లేదా 4 గంటలు మాత్రమే పని చేస్తుందని గుర్తుంచుకోండి.
అలాగే పడుకోబోయే ముందు కోజిక్ యాసిడ్, అర్బుటిన్ వంటి వాటిని కలిగి ఉండే క్రీమును ముఖానికి రాసుకోవాలి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ప్రతి పదిహేనురోజులకు ఒకసారి గ్లైకాలిక్ పీల్స్ అప్లై చేయడం మంచిది.

ఈ జాగ్రత్తలతోబాటు ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టమోటాలు, తాజాకూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం అవసరం. చర్మ రంగును కాపాడుకోవడానికి వీటితో పాటు కొన్ని సన్ టాన్ ఆయిల్స్ ఉన్నాయి.
అవి ఏవిధంగా ఉపయోగపడుతాయో ఒక సారి చూద్దాం...




మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె): సాధారణంగా మస్టర్డ్ ఆయిల్ చర్మాన్ని నల్లబరుస్తుంది. మస్టర్డ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేసి సూర్య రశ్మిలో పడుకోవడం వల్ల ఎముకలకు కీలక పోషకంగా మరియు చర్మానికి విటమిన్ డి అందించడానికి సహాయపడుతుంది. అందువల్లే, చిన్న పిల్లల ఎముకలు బలోపేతం చేయడానికి వారి శరీరాన్ని ఆవనూనెతో మసాజ్ చేస్తారు.

 



సన్ ఫ్లవర్ఆయిల్: సన్ ఫ్లవర్ ఆయిల్ తో శరీరాన్ని లేదా ముఖానికి మసాజ్ చేయడం వల్ల సూర్యరశ్మి వల్ల ఏర్పడే ముడతలను నివారిస్తుంది.

 




ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ ల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ గ్రంధుల పునరుత్పత్తి ఈ విటమిన్ చాలా బాగా సహాయపడుతుంది. సూర్యతాపానికి గురైన మీ చర్మాన్ని రక్షించడానికి ఈ ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ఒక ఉత్తమైన మార్గం. ఈ ఆలివ్ నూనె కు అయోడిన్ ద్రావణంను మిక్స్ చేసి తర్వాత చర్మానికి అప్లై చేయడం వల్ల సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది.

 





 
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెను ఒక లేపనంగా ఉపయోగిస్తారు. సన్ స్క్రీన్ లోషన్ లో భాగంగా ఉపయోగిస్తారు. మీరు కనుక అతి సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నట్లైతే, సన్ టానింగ్ ను నిరోధించలేదు. అందుకు సున్నిత చర్మం కలవారు సూర్య తాపం పొందడానికి, అలెర్జీ, చర్మ దద్దుర్లు పొందడానికి ముందే కొబ్బరి నూనె తో తయారు చేసిన సన్ స్క్రీన్ లోషన్ లేదా కొబ్బరి నూనె ను చర్మానికి మసాజ్ చేయాలి.




గోధుమ నూనె: గోధుమ గింజలతో తయారు చేసే ఆయిల్ ఇది చాలా ఆరోగ్యకరమైన సహజ నూనె. ఇందులో విటమిన్ ఇ, డి మరియు ఎ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆయిల్ చర్మాన్ని సున్నితంగా మార్చి సూర్య రశ్మి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.



అవకాడో ఆయిల్: సూర్య రశ్మిలో ఎక్కువ సమయం గడపటం వల్ల చర్మ పొడిబారుతుంది. నల్లగా మారుతుంది. కాబట్టి అవకాడు నూనె చర్మాన్ని తేమగా ఉంచి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

No comments: