all

Thursday, March 7, 2013

పంటి నొప్పి సమస్యకు తక్షణ ఉపశమనం కలిగించే ఔషధాలు...! Read more at: http://telugu.boldsky.com/health/wellness/2013/home-remedies-toothache-005518.html

పంటి నొప్పి (Tooth Ache): పంటి పై ఉండే గారలో బాక్టీరియా నివాసముండి, నోటిలో ఉన్నా తీపిపదర్దాములను , పిందిపదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఏనామేల్ పై దెబ్బతీయును. తద్వారా ఏనామేల్ పాడవడం వలన ఇన్ఫెక్షన్... పంటి నరాలు, మూలభాగము (root of Tooth)లో చేరి కణజాలము, నాడులు చెడిపోవడం వలన పంటి నొప్పి కలుగుతుంది.

పంటి నొప్పి అనేది సాధారణంగా కనిపించినా రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. మనలో చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. పంటి నొప్పి నివారణకు ఇంట్లో చేసే పరిష్కారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉత్తమమైన పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకొందాం...

 





లవంగ నూనె: మీరు లవంగాలను పంటి నొప్పి ఉన్న చోట పెట్టి సుమారు 4-6 గంటలు ఉంచితే తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.లవంగాలకు చిన్న ముళ్ళు ఉంటాయి కంగారుపడవద్దు.




వెల్లుల్లి: వెల్లుల్లి, లవంగంలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.

 





మాత్ర: నొప్పిని తగ్గించే మాత్రను తీసుకోని పొడి చేసి నోటిలో వేసుకొని తర్వాత మీ నోటిలోని లాలాజలంతో మిక్స్ చేసి పుక్కిలించి ఊయాలి. ఈ విధంగా ప్రతి రెండు గంటలకు ఒకసారి చేయాలి.





వెనిలా రసం లేదా నూనె: వెనిలా సారంను నేరుగా పోయడం ద్వారా,లేదా 3 నుండి 4 చుక్కలు కాటన్ లో వేసి పంటి నొప్పి ఉన్న ప్రదేశంను శుభ్రపరచడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.




హైడ్రోజెన్ పెరాక్సైడ్: 6 ఔన్సుల వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పును కలిపి దానిని నోటిలో పోసుకొని పుక్కిలించి ఊయాలి.ఉప్పు వలన గొంతు లేదా ఇబ్బందికి గురిచేసే చిగుళ్ళ వల్ల వచ్చే పంటి నొప్పి కి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.


విక్స్: కాగితపు టవల్ పై విక్స్ ని రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంత చర్మంపై రాయాలి.


కఫ్ సిరఫ్: హాల్స్ దగ్గు డ్రాప్స్ లో కొంచెం మత్తు ఉంటుంది. వాటిని నోటిలో వేసుకొని చప్పరిస్తే నొప్పి తగ్గటానికి సహాయపడుతుంది.



వీట్ గ్రాస్ జ్యూస్: గోధుమ గడ్డి రసం దంత క్షయం కోసం ఒక మౌత్ వాష్ ఉపయోగిస్తారు. మీ చిగుళ్ళ నుండి విషక్రిములు బయటకు పంపటానికి సహాయపడుతుంది, మరియు బ్యాక్టీరియా అభివృద్దిని ఆపుతుంది.





ఐస్ ముక్క: కనీసం 15-20 నిమిషాల పాటు రోజుకి 3 నుండి 4 సార్లు బాధాకరంగా ఉన్న దంతం చెంప మీద ఐస్ క్యూబ్లను ఉంచితే కొంత నొప్పి తగ్గుతుంది.



బ్లాక్ పెప్పర్: మీ చిగుళ్ళ మీద మిరియాల పొడితో రుద్దడం వల్ల వెంటనే ఆ ప్రాంతం తిమిరిగా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

 



ఉల్లిపాయ: పచ్చి ఉల్లిపాయ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండుట వల్ల దానిని 3 నిముషాలు నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నములుట కష్టంగా ఉంటె అప్పుడే కోసిన ఉల్లిపాయ ముక్కను పెట్టుకోవచ్చు.




విస్కీ: 3 నుండి 4 చుక్కల విస్కీని కాటన్ లో వేసి పంటి నొప్పి ఉన్నచోట నొక్కి పెట్టితే కొంత సేపటికి ఆ ప్రాంతంలో తిమ్మిరి కలిగి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.



బ్రష్: బోజనం చేసిన తరువాత, రాత్రి పడుకునే ముందు బ్రష్‌ చేసి ఉప్పు కలిపిన నీటిని పుక్కిలించాలి.

No comments: