all

Thursday, March 7, 2013

ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ తో పురుషుల చిరుబొజ్జ ఇట్టే మాయం...!

ఇండియన్ వంటకాలు వెరీ రిచ్ అని చాలా మంది నమ్ముతారు. అందుకు కారణం వీటిలో బరువు తగ్గించే గుణాలు ఎక్కువని. చాలా వరకు ఇండియన్ వంటకాలను ఎక్కువ మసాలా దినుసులతోనూ మరియు బట్టర్(ప్యురిఫైడ్ నెయ్యి)తో తయారు చేస్తారు.

నన్ను ఒక నిజాన్ని చెప్పనియ్యండి, చాలా వరకూ ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని ఆరోగ్యకరమైన ఇండియన్ ఫుడ్స్ బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అంతే కాదు అవి తినడం వల్ల బరువు తగ్గించడంతో పాటు మన శరీరానికి కావల్సి న్యూట్రిషయిన్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా అంధిస్తాయి.

కాబట్టి ఇండియన్ ఫుడ్స్ లో బరువు తగ్గించే వాటిని సెలక్ట్ చేసుకొని మరీ ఉపయోగించడం వల్ల బరువు తగ్గించే ప్రయోజనాలు కూడా మెండుగా కనబడుతాయి. మసాలా దినుసుల ఎంపిక మాత్రమే కాదు వాటిని ఏవిధంగా, ఏఏ వంటకాల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలి.

సాధారణంగా పురుషులు జిమ్ కు వెళితేనే బరువు తగ్గించుకోవచ్చు అని అనుకుంటుంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. జిమ్ బరువు తగ్గించుకొనే మార్గాల్లో ఒకటి మాత్రమే.
కాబట్టి ప్రతి రోజూ తీసుకొని ఆహారంలో హెల్తీ మరియు లో ఫ్యాట్ డైయట్ తీసుకోవడం వల్ల కొన్ని పౌండ్లను బరువును తగ్గించుకోవచ్చు.
అందుకు మంచి రుచికోసం ఆలివ్ ఆయిల్ లేదా లోఫ్యాట్ సోయా మిల్క్ తీసుకోనక్కర లేదు.
అంత కంటే తక్కువ కరీదైన ఆహారాలు వెల్లుల్లి, మెంతిఆకు కూర, పసుపు, మస్టర్డ్ ఆయిల్, వంటివి మీ వెయిట్ లాస్ డయట్ లో చేర్చుకోవచ్చు.
మన ఇండియాలో చాలా మంది పురుషులు బెల్లీ ఫ్యాట్(చిరు బొజ్జ)కలిగి ఉన్నారు. అటువంటి వారు పొట్ట తగ్గించికొని ఆరోగ్యంగా స్లిమ్ గా మార్చే ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ తీసుకోవాలి. మరి ఆ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...





వెల్లుల్లి: వెల్లుల్లిల్లో క్రొవ్వు కరిగించే గుణాలు అలిసిన్ పుష్కలంగా ఉంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. కాబట్టి పురుషులు ఈ ఇండియన్ స్పైసీ వెల్లుల్లిని రెగ్యులర్ గా తింటే శరీర బరువును తగ్గించుకొని, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.



గుడ్డు: పురుషులు వారి డైలీ డయట్ లో తప్పని సరిగా గుడ్డును చేర్చుకోవాలి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి గుడ్డు బాగా సహాయపడుతుంది. క్రొవ్వు నిల్వలను కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.






మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె): బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి.



జొన్నలు: ఇది మరొక ఆరోగ్యకరమైన ఇండియన్ గ్రెయిన్. ఇందులో కొవ్వు తగ్గించే గుణాలు ఎక్కువ. వీటిని ఎక్కువగా రాజస్తాన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు . ఈ భారతదేశపు చిరు ధాన్యం శరీర బరువును తగ్గించడమే కాదు ఆకలిని కూడా దూరం చేస్తుంది.


పెసరపప్పు: ఈ పసుపు వర్ణంలో ఉండే పప్పు ధాన్యం చాలా ఆరోగ్యకరం మరియు డైటర్స్ కు ఇది పౌష్టికాహారం. పెసరపప్పులో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ, ప్రోటీనులు మరియు ఫైబర్ అధికంగా ఉండి, హైబ్లడ్ ప్రెజర్ ను మరియు హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.



మజ్జిగ: పురుషులకు ఇది ఆరోగ్యకరం మాత్రమే కాదు బరువు తగ్గించే ప్రోటీన్ డ్రింక్. జిమ్ లేదా ఇంట్లో వ్యాయామం చేసిన తర్వాత ఇక గ్లాసు వెన్నతీసిన మజ్జిగ త్రాగడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరాన్ని తేమగా ఉంచుకోవడంతో పాటు శరీరంలో నిల్వ ఉన్న మలినాలను తొలగించుకోవచ్చు. కాబట్టి లోఫ్యాట్ పెరుగు ను తీసుకోవడం వల్ల లోక్యాలరీస్ కలిగి ఉంటుంది.



సిట్రస్ పండ్లు: పురుషులు కొన్ని ఆరోగ్యకరమైన మరియు ఫ్యాట్ బర్నింగ్ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటివి ఫ్యాట్ బర్నింగ్ ఫ్రూట్స్ . ఎందుకంటే వీటిలో అధికంగా ఫైబర్ మరియు విటమిన్ సి ఉండి క్రొవ్వు నిల్వలను కరిగించడానికి సహాయపడుతుంది.





కరివేపాకు: బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతగా పనిచేసే హెర్బ్స్ లో ఇది ఒకటి. ఈ కరివేపాకు ఆకులు జీర్ణక్రియను క్రమబద్దంచేయడానికి మరియు జీవక్రియలు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను తొలగిస్తుంది.



యాలకులు: సువసన భరితమైన ఈ యాలకలు బరువు తగ్గించడంలో ఉపయోగిస్తారు . దీన్ని వివిధ రకాల వంటకాల్లో మంచి ఫ్లేవర్ కోసం వినియోగిస్తారు. ఇది శరీర జీవక్రియలను మెరుగు పరిచి, నోటి దుర్వాసను దూరం చేస్తుంది.


గోధుమలు: గోధమలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు అత్యధిక పోషకాహారం కూడా. ఇందులో ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నాయి. లోక్యాలరీస్ కలిగిన ఈ గోధుమలతో తయారైయ్యే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు.

 

No comments: