మొటిమల మచ్చలను సహజంగా తొలగించడానికి ఎన్నో విధానాలు ఉన్నాయి. యుక్తవయస్సులోని శరీరం చురుకుగా హార్మోన్ల ఉత్పత్తి చెయ్యడం వల్ల సెబమ్ అనబడే పదార్ధం చర్మం పై ఎక్కువ అవుతుంది. దీని వాళ్ళ మొటిమలు వస్తాయి. మొటిమల మచ్చలని తొలగించడానికి ఎన్నో రకాల మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పటికీ సహజమైన పద్దతులని పాటించడం వల్ల ఎంతో సమయాన్ని అలాగే డబ్బుని అదా చేసుకోవచ్చు. సమయం గడిచే కొద్దీ ఈ చికిత్సా పద్దతుల వల్ల చర్మంపై ఉన్న మొటిమల మచ్చలు తగ్గిపోతూ ఉంటాయి.
మొటిమల మచ్చలను సహజంగా నిర్మూలించడం ఎలా ?
మొటిమల మచ్చలను సహజంగా నిర్మూలించడం ఎలా ?
హైడ్రేషన్ - మొటిమల మచ్చలను తొలగించడం లో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుందని నిరుపితమయింది. అనవసరమైన మృత చర్మ కణాలను చర్మం విసర్జించడానికి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి.
మెంతి ఆకులని రుబ్బి పేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. కొంత సేపు ఆరనిచ్చి, ముఖాన్ని కడగాలి. మొటిమలని తొలగించడానికి ఇదే పద్దతి కొన్ని రోజులపాటు పాటించాలి. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
పళ్ళు అలాగే కూరగాయలు ఎక్కువ మొత్తం లో విటమిన్లని అలాగే మినరల్స్ ని కలిగి ఉండటం వల్ల చర్మపు కాంతిని తిరిగి పొందేందుకు తోడ్పడతాయి. శరీరం హైడ్రేట్ అవడానికి తగినంత రసాలు అవి కలిగి ఉంటాయి. చర్మం ఆరోగ్యకరంగా ఉండేందుకు ఎక్కువ పళ్ళు అలాగే కూరగాయలు తీసుకోవాలి. మొటిమల మచ్చలు కూడా తొలగిపోతాయి.
మొటిమలని తొలగించడం లో ఆలో విరా సహజమైన ప్రకృతి చికిత్స. మొటిమల మచ్చలపై లావెండర్ ఆయిల్ వంటి వివిధ రకాల ముఖ్యమైన నూనె లని అప్లై చెయ్యడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. ఇవి అత్యంత ఖరీదైనవి కావు. మార్కెట్ లో సులభంగా లభిస్తాయి. వీటిని తరచూ వాడటం వలన ఎంతో మెరుగుదల ని గమనించవచ్చు.
మొటిమల మచ్చలని మసాజ్ చెయ్యండి. మసాజ్ వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి మచ్చలు కలిగిన ఈ ప్రాంతానికి పోషకాలు చేరుకుంటాయి. అంతే కాకుండా, మచ్చల కణ జాలం ని విచ్చిన్నం చెయ్యడానికి కూడా ఈ మసాజ్ ఉపయోగపడుతుంది.
మీ ముని వేళ్ళపై కొన్ని చుక్కల రోజ్ హిప్ సీడ్ ఆయిల్ ని వేసుకుని. మొటిమల మచ్చలపై సుతారంగా రబ్ చెయ్యండి. ప్రతి రెండు రోజులకు ఒకసారి వల్ల మొటిమల మచ్చలను నిర్మూలించేందుకు ఈ విధానాన్నివాడండి. హెల్త్ ఫుడ్ స్టోర్స్ లో రోజ్ హిప్ సీడ్ ఆయిల్ లభ్యం అవుతుంది.
ఒక కప్పు పాలు ని చిక్కగా కాచి అందులో కొంత నిమ్మరసాన్ని కలపాలి. పొయ్య మీద నుండి తీసి కొంత సేపు చల్లారడానికి గరిటతో తిప్పుతూ ఉండాలి. ఆ వచ్చిన పేస్టు ని నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోవాలి. ఒక గంట తరువాత లేదా మరునాడు ఉదయం ముఖాన్ని కడుక్కోవాలి. ఇది పాటించడం వల్ల చర్మం మృదువు గా మారుతుంది.
రోజ్ వాటర్ తో గంధపు పేస్టు ని కలిపి చర్మంపై మొటిమల మచ్చలు కలిగిన చోట అప్లై చెయ్యాలి. రాత్రంతా అలాగే ఉంచి మరునాడు ఉదయం చల్లటి నీళ్ళతో కడగాలి.
రోజుని తియ్యగా మార్చే శక్తి కలిగినట్టే తేనె కి చర్మాన్ని కూడా ప్రకాశవంతంగా మార్చే శక్తి ఉంది. చర్మం పై న దెబ్బ తిన్న ప్రదేశాలలో ఈ తేనె ని అప్లై చెయ్యడం వల్ల మొటిమల మచ్చలు తొలగిపోతాయి. చర్మం యవ్వనగా కనబడుతుంది.
కొంత నీళ్ళతో బేకింగ్ వాటర్ ని కలిపి పేస్టు లాగా చేసుకోవాలి. మొటిమల మచ్చలపై అప్లై చేసే ముందు ఈ పేస్టు నురగ లాగా వచ్చే వరకు ఆగాలి. వృత్తాకార కదలికల లో ఈ పేస్టు ని చర్మం పై అప్లై చేసి కొంత సేపు తరువాత స్వచ్చటి నీళ్ళతో కడగాలి.
No comments:
Post a Comment