all

Wednesday, July 3, 2013

స్వచ్చమైన చర్మం పొందడానికి ఫేస్ స్టీమింగ్ టిప్స్..!

ఫేస్ స్టీమింగ్ (ఆవిరి పట్టడం)ముఖానికి స్టీమింగ్ చేయడం చాలా మంచిది. స్టీమింగ్ వల్ల చర్మంలో ఉన్న మలినాలు, దుమ్ము, దూళి తొలగిపోయి, చర్మరంద్రాలు తెరచుకొనేలా చేసి చర్మ గ్రంధులను శుభ్రపరుస్తుంది. ఆవిరి పట్టడం లేదా స్టీమింగ్‍ చేయడం ద్వారా మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి, blackheads and whiteheads రిమూవ్‍ చేయవచ్చు, ఇంకా పింపుల్స్ రాకుండా నిరోధించవచ్చు. చర్మ రంధ్రాలకు దుమ్ము, ధూలి అడ్డుపడితే అది చర్మానికి చికాకు కలిగిస్తుంది, దాంతో ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది. చర్మ రంధ్రాలు తెరచుకోవడం వల్ల మెటిమలకు దారితీస్తుంది.

అందువల్ల చర్మంలోని దుమ్ము, ధూళి, మరియు మృత కణాలను తొలగించడానికి ముఖానికి స్టీమింగ్ (ఆవిరి పట్టడం)ఒక అద్భుతమైన మార్గం.స్టీమింగ్ (ముఖానికి ఆవిరి పట్టడం)ద్వారా ముఖ చర్మం లోపల మరియు చర్మ మీద(బయట) శుభ్రం అవుతుంది. ఫేస్ స్టీమింగ్ వల్ల ఆవిరి పట్టిన ప్రదేశంలో చెమట పడుతుంది. దాంతో చర్మంలో దాగి ఉన్న దుమ్ము, ధూళి, మురికి మరియు శిధిలాలు బయటకు నెట్టివేయబడుతుంది. ఫేస్ స్టీమింగ్ చాలా సులభ పద్దతి.

ఈ పద్దతిని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు.ఫేస్ స్టీమింగ్ కోసం కొన్ని డిఫరెంట్ పద్దతులు..


హాట్ వాటర్ స్టీమింగ్: ఫేస్ స్టీమింగ్, ముందుగా మీ కురులను హెయిర్ బ్యాండ్ లేదా హెయిర్ రిబ్బన్ తో ముడి వేసుకోవాలి. తర్వాత చిన్న పాట్(కుండ)తీసుకొని అందులో కొద్దిగా నీరు నింపాలి. ఈ నీటిని బాగా వేడి చేయాలి. నీరు బాగా వేడయ్యాక, నీటి ముడగలు క్రిందిపోయేందుకు టెంపరేచర్ ను తగ్గించుకోవాలి. తర్వాత కుండలోని నీటిని మరో గిన్నెలోని మార్చుకొని ఈ వేడి నీటిని టేబుల్ మీద పెట్టాలి. తర్వాత తల, ముఖం కవర్ అయ్యేలా ఒక టవల్ ను పూర్తిగా కప్పుకోవాలి. (లేదంటే ఆవిరి మొత్తం బయటకు పోతుంది. దాంతో త్వరగా నీరు చల్లబడిపోతాయి). ముఖాన్ని వేడినీటి గిన్నెకు దగ్గరగా పెట్టాలి. టెంపరేచర్ తగ్గే కొద్దీ ఇలా తలను క్రింది(గిన్నెకు దగ్గర)కి వంచుతూ పోవాలి. ఇలా 10-15నిముషాలు ఆవిరి పట్టాలి. తర్వాత ఒక కాటన్ వస్త్రంతో చెమటను అంత తుడవాలి . తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని పత్తిని తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ వేసి ముఖాన్ని తుడవాలి.


హెర్బల్ స్టీమింగ్: మీరు స్టీమింగ్ చేసే నీటిలో కొన్ని మూలికలు వేసి స్టీమ్ చేయవచ్చు. దాంతో హెర్బల్ ఫేస్ స్టీమ్ చేసుకోవచ్చు. మొదటి పద్దతి ప్రకారమే నీరు కాచే కుండలోనే నీటితో పాటు హెర్బ్స్ ను కూడా వేసి ఉడికించుకోవాలి. మీకు పొడి చర్మం కలవారైతే లావెండర్ లేదా చమోమైల్ హెర్బల్స్ చాలా ఉపయోగకరం. మీ చర్మం జిడ్డు చర్మం అయితే సేజ్ లేదా రోస్మెరీ బాగా సహాయపడుతుంది. మీది సాధారణ చర్మం అయితే లావెండర్ లేదా రోజ్ వంటివి అద్భుతంగా పనిచేస్తాయి.


స్టీమ్ ఐరన్: నీరును బాయిల్ చేయడాని కంటే, మీరు స్టీమ్ ఐరన్ ను పద్దతిని పాటించవచ్చు . ఈ స్టీమ్ ఐరన్ మీ ముఖానికి ఆవిరి పట్టించడంలో అద్భుతమైన మార్గం. ఇది చర్మంలో దాగి ఉన్న మలినాలంటినీ తొలగిస్తుంది. చర్మ రంధ్రాల్లో ఉన్న దుమ్మును తొలగిస్తాయి. చర్మాన్ని స్వచ్ఛమైనదిగా మరియు తాజాగా ఉంచుతుంది. స్టీమ్ ఐరన్ తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మర్చిపోకండి.



వాటర్ వాపొరైజర్: వాటర్ వాపొరైజర్ ను ఉపయోగించి వాటర్ స్టీమ్ చేయడం చాలా ప్రభావంతమైన మార్గం. మీ ముఖానికి చాలా తేలికగా మరియు సులభంగా ఆవిరి పట్టవచ్చు. వాటర్ వాపొరైజర్ మీరు స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోవచ్చు. స్నానం నుండి వచ్చే ఆవిరి మీ ముఖం పరిశుద్ధమైనదిగా మరియు రిఫ్రెష్ గా మార్చుతుంది.



స్టీమ్ షవర్: షవర్ ను బాత్ చేస్తున్నప్పుడు నీళ్ళు వేడిగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి స్టీమ్ బాత్ చేయానుకొన్నప్పుడు బాత్ రూమ్ కు ఎక్కడా చిన్న గ్యాప్ లేకుండా చేసుకోవాలి. డోర్స్ మరియు ఫ్లోర్ వద్ద గ్యాప్ లేకుండా చేసుకోవాలి. తర్వాత స్నానం చేయడం వల్ల ముఖం ఆవిరి పట్టి శరీరం మొత్తం చెమటలు పట్టడం మొదలవుతుంది. దాంతో చెమట రూపంలో శరీరంలోని మలినాలు, వ్యర్థాలు బయటకు విసర్జింపబడుతాయి. ఫేస్ట్ స్టీమ్ కు ఇది ఒక అద్భుతమైన మార్గం. మీ ముఖ చర్మం శుభ్రం చేసుకొన్న తర్వాత మామిశ్చరైజర్ ను రాయడం మర్చిపోకండి.


ముగింపు: ఇవన్నీ కూడా చాలా సులభంగా మీ ముఖ చర్మానికి స్టీమింగ్ చేసే పద్ధతులు. మీ ముఖానికి తరుచూ ఆవిరి పట్టడం వల్ల మీ ముఖంలో మెరుపు సంతరించుకుంటుంది.

No comments: