all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Wednesday, October 30, 2013
దీప్తులు చిందించే దీపావళి
శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి, సేతమ్మను తీసుకుని, అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం నెలకొందని చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది.
హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.
మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంత అపురూపమైన దీపాల పండుగ దీపావళి. దీపావళితో మొదలుపెట్టి, కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.
అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తారు. దీపావళి రోజున కుటుంబసభ్యులందరూ తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. ఇళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు. మావిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. నైవేద్యానికి ప్రసాదాలను, పిండివంటలను సిద్ధం చేసుకుంటారు. ఆనక లక్ష్మీదేవి పూజకు సంసిద్ధమౌతారు.
దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటో చూద్దాం. పూర్వం దూర్వాసముని దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. కానీ, దేవేంద్రునికి దాని గొప్పతనం తెలీక, తన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు కాస్తా హారాన్ని కాళ్ళతో తోక్కేసేంది. ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి దీనమైన స్థితిలో పడ్డాడు. శ్రీహరిని ప్రార్ధించగా ''ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ, భక్తిగా పూజించమని'' పరిహారం చెప్పాడు. దేవేంద్రుడు అలాగే చేశాడు. దాంతో లక్ష్మీదేవి కరుణ చూపి, ఇంద్రునికి తిరిగి దేవలోక ఆధిపత్యాన్ని, సర్వ సంపదలను అనుగ్రహించింది.
తనను అనుగ్రహించిన లక్ష్మీదేవిని ఉద్దేశించి, దేవేంద్రుడు ''తల్లీ, సామాన్యులు నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా?” అనడిగాడు.
అప్పుడు లక్ష్మీదేవి ''నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్ధించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను'' అని బదులిచ్చింది. అప్పటినుంచీ దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.
దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకుంటారు. ఆనక దీపాలను తులసికోట వద్ద, వాకిట్లో ఉంచుతారు. రెండు దీపాలకు తక్కువ లేకుండా కొందరు అనేక దీపాలతో స్వర్గాన్ని తలపించేలా అలంకరిస్తారు.
ఇక సాయంత్రం అయ్యేసరికి బాణాసంచా కాల్చడం మొదలౌతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, రకరకాల టపాకాయలు కాలుస్తూ సంబరం చేసుకుంటారు.
దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.
దీపావళి సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఒకరికొకరు గ్రీటింగులు, కానుకలు ఇచ్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి పిండివంటలు తింటూ, ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు. దీపావళి హిందువుల పండుగే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో ఈ పండుగను వేడుక చేసుకుంటున్నారు.
నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. హిరణ్యాక్షుడు, బకాసురుడు తదితర రాక్షసుల్లాగే నరకాసురుడు దేవ, మానవ లోకాల్లో సంక్షోభం కలిగించాడు. నరకాసురుడు వరాహస్వామి, భూదేవిల సంతానం. నరకాసురుని విష్ణుమూర్తి చంపకూడదని, తన కొడుకు తన చేతిలోనే మరణించాలని, ఎంత లోక కంటకుడు అయినప్పటికీ తన కొడుకు నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని వరం పొందుతుంది భూదేవి. ఆ వరాన్ని అనుసరించి, భూదేవి, ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది.
దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నరకాసురుని అకృత్యాలను వివరించాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ అసురుని హతమార్చేందుకు బయల్దేరాడు.
ఇదంతా చూసిన సత్యభామ ఆ దుష్టున్ని తానే వధిస్తాను అంది. శ్రీకృష్ణుడు వద్దని వారించినా ఆమె తన పట్టు విడవలేదు. గరుడ వాహనాన్ని అధిరోహించి శ్రీకృష్ణునితో కలిసి రణరంగానికి వెళ్ళింది. చాకచక్యంగా బాణాలు వేసి శత్రుసైన్యాన్ని మట్టి కరిపించింది. గతంలో పొందిన వరాలను అనుసరించి, చివరికి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలోనే మరణించాడు నరకాసురుడు. అలాగే నరకాసురుని వధించిన రోజు ''నరక చతుర్దశి'' అయింది. అలా నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
దేవ, మానవులను పీడించే నరకాసురుని బాధ తొలగిపోవడంతో ఆ మరుసటి రోజు, అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించి, పరవశంగా టపాసులు కాల్చారు. అదే దీపావళి పండుగ.
శుక్రవారం మహిళలు అమ్మవారిని ఎలా పూజించాలి
శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి చేరుకుని నేతితో దీపమెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుంది.
ఇంకా ఈతిబాధలు తొలగిపోవడం, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి.
ఇంకా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం గావించి అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుందని విశ్వాసం.
ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని పండితులు అంటున్నారు.
ఇకపోతే.. ధవళ వర్ణ వస్త్రాలు ధరించడం, అరటి పండు జ్యూస్ తాగడం లేదా అరటి పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పురోహితులు చెబుతున్నారు.
శుక్రవారం రోజున పాలుతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరమునందు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.
శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?
దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి.
ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు. ఇలా చేస్తే మీకు కలగాల్సిన శుభ ఫలితాలు ఇతరులకు చేరుతుందని పురోహితులు చెబుతున్నారు.
ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి.
ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి.
అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.
ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
సాధారణంగా దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు ఏమిటి? -
స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే “ఓమ్ నమః శివాయ ” అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా.
శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి.
దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.
* సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.
* దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది.
* ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.
* నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము వుండదు.
* మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి.
* తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది.
* అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.
* జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.
* పసుపురంగు బట్టలతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.
* కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.
* సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.
* వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.
దీపావళి రోజు లక్ష్మీ గణపతుల పూజ ప్రాముఖ్యత ఏంటి
భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలుగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లక్ష్మీ పూజ లేదా దీనినే ఐశ్వర్యాన్ని సంపదలను ఇచ్చే మాత లేదా అమ్మవారి పూజ అంటారు.
ఉత్తర భారత దేశమైనా లేక దక్షిణ భారతదేశమైనప్పటికి దీపావళి పండుగ కార్యక్రమాలలో లక్ష్మీ పూజ ప్రధానమైంది. లక్ష్మీ దేవి చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతూ, ప్రతి ఇంట్లోను పండుగనాడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ మాత కు పూజలు చేసి ఆశీర్వాదాలు కోరతారు.
మాత లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కళ కళ లాడే ఇంటిని ఆ మాత మొట్టమొదటే అడుగిడుతుందన్న నమ్మకంతో ప్రతి ఇల్లు ఈ రోజు ఎంతో శుభ్రతతో, వివిధ రకాల ముగ్గులతో, దీపాలతో, పూలతో అలంకరిస్తారు.
శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు, కుంకుమలు పెట్టి ఈ రోజున పూజిస్తారు.
అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు.
ఇక దీపావళి పూజ ఎలా చేస్తారు?
పూజలో ప్రధానంగా వినాయకుడిని, మాత లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి.
దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు.రతి హైందవ గృహంలోనూ లక్ష్మీ దేవి రూపం వుంటుంది.
విడిగా, విష్టుసమేతంగా లక్ష్మీదేవికి నిత్య పూజలు నిర్వహించడం కద్దు. దీపావళి పండుగనాడు ఆమెకు ప్రత్యేకంగా పూజ చేస్తారు. లక్ష్మీ గణపతులకు మ్రొక్కుతారు. లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది.
తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు.
దీపావళి రోజున ప్రతి ఇంటికీ లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ, ముంగిళ్ళను రంగవల్లులతో అలంకరిస్తారు. ప్రతిరోజు, అనేక పర్వదినాలలో లక్ష్మీదేవిని కోలిచినా, దీపావళి నాటి లక్ష్మీపూలకు విశిష్టత వుంది.
ఆభరణాలు కొత్తవాటిలా మెరిపించే క్లీనింగ్ టిప్స్
ఆభరణాలు కొత్తవాటిలా మెరిపించే క్లీనింగ్ టిప్స్
ఆభరణాలని అందంగా శుభ్రపరచడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదు. అవి కొత్తగా కొన్నప్పుడు ఎలా మెరిసిపోతూ ఉంటాయో.. అలా మెరిసిపోతూ ఉండేట్టు చేయవచ్చు.
కాని, బిజీ జీవితాల వల్ల మనకి వాటిని శుభ్రపరచుకునేంత తీరికా, ఓపికా లేవు. ఇంట్లో సాధారణంగా లభించే ఎంటాసిడ్, అల్యూమినియం ఫాయిల్ మరియు వెనిగర్ లతో ఆభరణాలని శుభ్రపరచుకోవచ్చు. వీటిని వాడి అతి సులువుగా ఆభరణాలని ఎలా శుభ్రపరచుకోవచ్చో తెలుసుకోండి.
(గమనిక - ఈ క్రింద చెప్పబడిన పద్దతులలో కెమికల్స్ మరియు ఇతర కఠినమైన విధానాలు ఒపల్స్ మరియు ముత్యాలకి వర్తించదు. వాటికి సబ్బు నీళ్ళు మాత్రమే వాడాలి.)
కాని, బిజీ జీవితాల వల్ల మనకి వాటిని శుభ్రపరచుకునేంత తీరికా, ఓపికా లేవు. ఇంట్లో సాధారణంగా లభించే ఎంటాసిడ్, అల్యూమినియం ఫాయిల్ మరియు వెనిగర్ లతో ఆభరణాలని శుభ్రపరచుకోవచ్చు. వీటిని వాడి అతి సులువుగా ఆభరణాలని ఎలా శుభ్రపరచుకోవచ్చో తెలుసుకోండి.
(గమనిక - ఈ క్రింద చెప్పబడిన పద్దతులలో కెమికల్స్ మరియు ఇతర కఠినమైన విధానాలు ఒపల్స్ మరియు ముత్యాలకి వర్తించదు. వాటికి సబ్బు నీళ్ళు మాత్రమే వాడాలి.)
అమ్మోనియా:
అమ్మాయిల కి అత్యుత్తమ స్నేహితురాలు వజ్రాలు. కాని అవి మురికిగా ఉన్నప్పుడు మాత్రం కావు. వజ్రాల ఆభరణాలను గోరు వెచ్చటి నీరు మరియు పావు కప్పు అమోనియా కలిపిన మిశ్రమం లో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తరువాత మెత్తటి టూత్ బ్రష్ తో సున్నితం గా కడగాలి. ప్రత్యేకించి వజ్రం కింద భాగం లో ఇలా చేయాలి.
అమ్మాయిల కి అత్యుత్తమ స్నేహితురాలు వజ్రాలు. కాని అవి మురికిగా ఉన్నప్పుడు మాత్రం కావు. వజ్రాల ఆభరణాలను గోరు వెచ్చటి నీరు మరియు పావు కప్పు అమోనియా కలిపిన మిశ్రమం లో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తరువాత మెత్తటి టూత్ బ్రష్ తో సున్నితం గా కడగాలి. ప్రత్యేకించి వజ్రం కింద భాగం లో ఇలా చేయాలి.
వెనిగర్ ;
బంగారం మరియు రత్నాల ఆభరణాలను తెల్లటి వెనిగర్ తో శుభ్రపరచడం సులభం. వినెగర్ కలిగిన జార్ లో ఆభరణాలని 10 నుండి 15 నిమిషాల వరకు ఉంచి అప్పుడప్పుడు కదిలించాలి. ఆ తరువాత వాటిని తీసి మెత్తటి బ్రష్ లో కడగాలి.
బంగారం మరియు రత్నాల ఆభరణాలను తెల్లటి వెనిగర్ తో శుభ్రపరచడం సులభం. వినెగర్ కలిగిన జార్ లో ఆభరణాలని 10 నుండి 15 నిమిషాల వరకు ఉంచి అప్పుడప్పుడు కదిలించాలి. ఆ తరువాత వాటిని తీసి మెత్తటి బ్రష్ లో కడగాలి.
యాంటాసిడ్ :
మీ కడుపుకి ఉపశమనం కలిగించే శక్తితో పాటు ఆభరణాలని కూడా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి మిశ్రమం లో రెండు ఎంటాసిడ్ టాబ్లెట్స్ ని కలిపి ఆ తరువాత అందులో ఆభరణాలను ఉంచాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత తీసివేసి కడగాలి.
మీ కడుపుకి ఉపశమనం కలిగించే శక్తితో పాటు ఆభరణాలని కూడా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి మిశ్రమం లో రెండు ఎంటాసిడ్ టాబ్లెట్స్ ని కలిపి ఆ తరువాత అందులో ఆభరణాలను ఉంచాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత తీసివేసి కడగాలి.
అల్యూమినియం ఫాయిల్ :
వెండి ఆభరణాలను శుభ్రపరచడానికి అల్యూమినియం ఫాయిల్ ఉపయోగపడుతుంది. ఒక ట్రే లో నలిగిన అల్యుమినియం ఫాయిల్ ని పెట్టి దాని మీద ఆభరణాలని ఉంచాలి. ఆభరణాలపై కొద్దిగా బేకింగ్ సోడా ని జల్లాలి. ఆ తరువాత ఉడకబెట్టిన నీళ్ళు పోయాలి. మురికి ఆభరణాల నుండి ఫాయిల్ కి అంటుకుంటుంది. ఆ ఫాయిల్ లో ని అన్ని వైపులకీ ఆభరణాలను కదపాలి. ఆ తరువాత వాటిని తీసి వేసి నీళ్ళతో కడగాలి.
వెండి ఆభరణాలను శుభ్రపరచడానికి అల్యూమినియం ఫాయిల్ ఉపయోగపడుతుంది. ఒక ట్రే లో నలిగిన అల్యుమినియం ఫాయిల్ ని పెట్టి దాని మీద ఆభరణాలని ఉంచాలి. ఆభరణాలపై కొద్దిగా బేకింగ్ సోడా ని జల్లాలి. ఆ తరువాత ఉడకబెట్టిన నీళ్ళు పోయాలి. మురికి ఆభరణాల నుండి ఫాయిల్ కి అంటుకుంటుంది. ఆ ఫాయిల్ లో ని అన్ని వైపులకీ ఆభరణాలను కదపాలి. ఆ తరువాత వాటిని తీసి వేసి నీళ్ళతో కడగాలి.
సబ్బు నీళ్ళు :
ముత్యాలు అలాగే వైడుర్యాల వంటి మృదువైన ఆభరణాలని శుభ్రపరిచేందుకు సబ్బు నీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రెండు కప్పుల గోరు వెచ్చటి నీళ్ళు అలాగే కొన్ని చుక్కల తేలికపాటి డిటర్జంట్ కలగలిపిన మిశ్రమం లో ఆభరణాలని ఉంచాలీ. మెత్తటి పొడి కాటన్ వస్త్రం తో ప్రతి ముత్యాన్ని తుడవాలి. వాటిని ఆరనివ్వాలి. తరచూ వాడడం ద్వారానే ముత్యాలు పాలిష్డ్ గా ఉంటాయి. వైడుర్యాలకి అయితే సబ్బు నీలు కూడా అవసరం లేదు. గోరువెచ్చటి నీటిలో మెత్తని బ్రష్ ని ముంచి వీటిని శుభ్రపరచాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రం తో డవాలి.భద్రపరిచే ముందు వీటిని ఆరనివ్వాలి.
ముత్యాలు అలాగే వైడుర్యాల వంటి మృదువైన ఆభరణాలని శుభ్రపరిచేందుకు సబ్బు నీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రెండు కప్పుల గోరు వెచ్చటి నీళ్ళు అలాగే కొన్ని చుక్కల తేలికపాటి డిటర్జంట్ కలగలిపిన మిశ్రమం లో ఆభరణాలని ఉంచాలీ. మెత్తటి పొడి కాటన్ వస్త్రం తో ప్రతి ముత్యాన్ని తుడవాలి. వాటిని ఆరనివ్వాలి. తరచూ వాడడం ద్వారానే ముత్యాలు పాలిష్డ్ గా ఉంటాయి. వైడుర్యాలకి అయితే సబ్బు నీలు కూడా అవసరం లేదు. గోరువెచ్చటి నీటిలో మెత్తని బ్రష్ ని ముంచి వీటిని శుభ్రపరచాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రం తో డవాలి.భద్రపరిచే ముందు వీటిని ఆరనివ్వాలి.
టూత్ పేస్ట్:
టూత్ పేస్ట్ ను సిల్వర్ వస్తువులను, సిల్వర్ జ్యువెలరీస్ ను శుభ్రపరచడానికి మాత్రమే ఉపయోగిస్తారు. సిల్వర్ ఆభరణాల మీద చాలా కొద్దిగా టూత్ పేస్ట్ ను రబ్ చేసి పదినిముషాలు అలాగే ఉంచాలి. పది నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచాలి.
టూత్ పేస్ట్ ను సిల్వర్ వస్తువులను, సిల్వర్ జ్యువెలరీస్ ను శుభ్రపరచడానికి మాత్రమే ఉపయోగిస్తారు. సిల్వర్ ఆభరణాల మీద చాలా కొద్దిగా టూత్ పేస్ట్ ను రబ్ చేసి పదినిముషాలు అలాగే ఉంచాలి. పది నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరచాలి.
కెచెప్:
రాళ్ళు పొదిగిన ఆభరణాలను కెచెప్ తో శుభ్రపరుస్తారాని మీకు తెలుసా? ఈ అద్భుతమైన స్టోన్ జ్యువెలరీలను శుభ్రపరచడానికి, ఆభరణాల మీద కొద్దిగా కెచెప్ ను పోసి కెచెప్ ను ఉపయోగించి సర్కులర్ మోషన్ లో రుద్దాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
రాళ్ళు పొదిగిన ఆభరణాలను కెచెప్ తో శుభ్రపరుస్తారాని మీకు తెలుసా? ఈ అద్భుతమైన స్టోన్ జ్యువెలరీలను శుభ్రపరచడానికి, ఆభరణాల మీద కొద్దిగా కెచెప్ ను పోసి కెచెప్ ను ఉపయోగించి సర్కులర్ మోషన్ లో రుద్దాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
డిష్ వాషింగ్ లిక్విడ్:
పాత్రలకు ఉపయోగించే లిక్విడ్ తో ఏరకమైన ఆభరణాలైనా శుభ్రపరుచుకోవచ్చు . స్టోన్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఏదైనా క్లీన్ గా శుభ్రపడుతాయి. ఈ ఆభరణాల మీద కొద్దిగా లిక్విడ్ ను పోసి, నిదానంగా రుద్ది కడగాలి. ఇలా ఒకసారి శుభ్రపరిస్తే సరిపోతుంది.
పాత్రలకు ఉపయోగించే లిక్విడ్ తో ఏరకమైన ఆభరణాలైనా శుభ్రపరుచుకోవచ్చు . స్టోన్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఏదైనా క్లీన్ గా శుభ్రపడుతాయి. ఈ ఆభరణాల మీద కొద్దిగా లిక్విడ్ ను పోసి, నిదానంగా రుద్ది కడగాలి. ఇలా ఒకసారి శుభ్రపరిస్తే సరిపోతుంది.
బేకింగ్ సోడా:
సిల్వర్ ఆభరణాల మీద మరకలను నిర్మూలించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయపడుతుంది. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఆభరణాల మీద చిలకరించాలి, అరగంటా అలా నానినతర్వాత చల్లటి నీటితో శుభ్రపర్చాలి.
బీర్:
మీ బంగారు ఆభరణాలు తళతళ మెరవాలంటే, వాటి మీద చాలా తక్కువగా బీర్ ను చిలకరించి అరగంట తర్వాత మంచి నీటితో కడిగేయాలి. తర్వాత మెత్తటి కాటన్ వస్త్రంతో తుడిచేయాలి.
సిల్వర్ ఆభరణాల మీద మరకలను నిర్మూలించడానికి బేకింగ్ సోడా అద్భుతంగా సహాయపడుతుంది. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఆభరణాల మీద చిలకరించాలి, అరగంటా అలా నానినతర్వాత చల్లటి నీటితో శుభ్రపర్చాలి.
బీర్:
మీ బంగారు ఆభరణాలు తళతళ మెరవాలంటే, వాటి మీద చాలా తక్కువగా బీర్ ను చిలకరించి అరగంట తర్వాత మంచి నీటితో కడిగేయాలి. తర్వాత మెత్తటి కాటన్ వస్త్రంతో తుడిచేయాలి.
Thursday, October 24, 2013
హై రిస్కు ప్రెగ్నెన్సీ అంటే?
మహిళ గర్భం ధరిస్తే, ఆమెకు ఆరోగ్యపర రిస్కులు చాలా వుంటాయి. ఎన్ని రిస్కులున్నప్పటికి మహిళలు అన్నిటిని భరించి తమ బిడ్డలకు జన్మనివ్వటమనేది ప్రకృతి వారికిచ్చిన వరం. కనుక మీ వైద్యులు చెప్పినట్లు మీది నార్మల్ డెలివరీ అయినప్పటికి అందులో కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. అయితే, కొన్ని కేసుల్లో, గర్భవతి పడే కష్టాలు చాలా తీవ్రంగా కూడా వుంటాయి. తీవ్రంగా వుంటాయని భయపెట్టటం కాదు. అందులో వున్న కష్టాలను తెలుపాలని మా ధ్యేయం. అన్ని వివరాలు తెలిస్తే, ఆరోగ్యపరంగా గర్భవతి కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించవచ్చు.
హై రిస్కు ప్రెగ్నెన్సీ అంటే పరిస్ధితి ఎలా వుంటుంది?
1. రక్తపోటు అధికం - ఇప్పటికే మీరు రక్తపోటు కలిగి వుంటే, గర్భవతైన తర్వాత అది మరింత అధికం అవుతుంది. కనుక తగినంత అధిక విశ్రాంతి తీసుకుంటూ, మందులు వాడాలి. లేకుంటే, గర్భానికి హాని కలిగే ప్రమాదముంది.
2. అధిక బ్లడ్ షుగర్ స్ధాయి - మీరు డయాబెటిక్ అయితే, షుగర్ స్ధాయి నార్మల్ కు రాకుండా గర్భం ధరించటం మంచిదికాదని వైద్యులు సలహానిస్తారు. అయితే, మీరు గర్భవతైనపుడు కలిగే షుగర్ స్ధాయి పెరిగినట్లయితే అది మీ గర్భానికి ఒక హై రిస్కు కాగలదు. నియంత్రణ కలిగించే ఆహార ప్రణాళిక అమలు చేయాలి. ఇటువంటపుడు తల్లులు అధిక బరువుగల పిల్లలకు జన్మనిస్తారు. వారికి ఇన్సులిన్ స్ధాయి సాధారణంకంటే కూడా అధికంగా వుంటుంది.
3. బొడ్డుతాడు కిందకు జారటం - బొడ్డుతాడు కిందకు జారితే, మీ గర్భం ప్రమాదకర పరిస్ధితిలో వున్నట్లే. మూడవ త్రైమాసికంలో రక్తస్రావం అధికమవుతుంది. ఈ పరిస్ధితికి తక్షణం వైద్యులను సంప్రదించటం. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ, ప్రయాణాలు చేయకుండా, కాళ్ళు ఎత్తులో పెట్టి పడుకోవాలి.
4. ఇప్పటికే మీకు అబార్షన్లయివుంటే - గతంలో మీకు అబార్షన్ల చరిత్ర వుంటే, మీరు మరింత జాగ్రత్తగా వుండాలి. మీ గర్భం బలహీనంగా వుందని అబార్షన్లు సూచిస్తాయి. అటువంటపుడు పూర్తి విశ్రాంతితోపాటు డాక్టర్ల సలహా అత్యవసరంగా పొందాలి.
పైన తెలుపబడిన పరిస్ధితులు గర్భవతికిగల అత్యధిక రిస్కులలో ప్రధానమైనవి మాత్రమే. ఇవికాక ఇంకనూ కొన్ని రిస్కులు వుండగలవని గ్రహించాలి.
మహిళ గర్భం ధరించకూడని సమయాలేవి?!
మహిళకు కొన్ని సమయాలలో ప్రెగ్నెంట్ కాని పరిస్ధితులుంటాయి. ఇవి వైద్యపరంగా, లేదా ఆమెకుగల పరిస్ధితులు, లేదా మానసిక స్ధితి ఫలితంగా వుంటాయి. అటువంటపుడు ఆమె బేబీని పూర్తి కాలంగా తన గర్భంలోనిలుపుకోలేదు. ఆమె జీవితానికే కాక, బిడ్డకు కూడా హాని కలిగే స్ధితి వుంటుంది. అవేమిటో పరిశీలించండి.
1. హైపో ధైరాయిడ్ - ప్రెగ్నెన్సీకి ముందు ధైరాయిడ్ హార్మోన్ పరీక్ష తప్పక చేయాలి. హైపో ధైరాయిడ్ వుంటే బిడ్డ కు హాని లేదా తీవ్ర జబ్బులు కలుగుతాయి. అసలు గర్భం దాల్చటంలోనే సమస్య రావచ్చు.
2. డయాబెటీస్ - డయాబెటీస్ వ్యాధి వుండి మహిళ గర్భం దాల్చాలననుకుంటే మొదటగా తన షుగర్ లెవెల్ నియంత్రణలోకి తెచ్చుకోవాలి. బ్లడ్ షుగర్ అధికంగా వుంటే, బేబీలు బరువుతక్కువగా వుండి పూర్తి నెలలు నిండక ముందే పుడతారు. లేదంటే పుటకలో కొన్ని వైకల్యాలు సంభవిస్తాయి.
3. హెమోఫిలియా - ఈ స్ధితిలో రక్తం తేలికగా గడ్డకట్టదు. బిడ్డ పుడుతుందంటే మహిళకు రక్తస్రావం అధికంగా వుంటుంది. కనుక ఈ స్ధితి వున్న మహిళలు గర్బందాల్చటానికి పనికిరారు.
4. వంశానుగత వ్యాధులు - కొన్ని అరుదైన వ్యాధులు కుటుంబ సభ్యులననుండి సంక్రమించినవి అంటే మానసికపరమైనవి వుంటాయి. వీటిని పరీక్షలలో తెలుసుకోవడం కూడా కష్టమే. కుటుంబ చరిత్ర వలననే సేకరించటం సాధ్యమవుతుంది.
5. హై రిస్క్ హిస్టరీ - డెలివరీ హై రిస్కు తో కూడి గతంలో మరణం తప్పిందనుకున్నపుడు మరోమారు ఆమె వైద్యపర అనుమతులుంటేగాని గర్భం దాల్చరాదు.
6. మొదటి బిడ్డ - మొదటి బిడ్డకుకనుక సెరిబరల్ పాల్సీ వంటి వ్యాధులు వుంటే మరో మారు గర్భం ధరించాలంటే వైద్యుల అనుమతి తప్పక వుండాల్సిందే.
Tuesday, October 22, 2013
Subscribe to:
Posts (Atom)