స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే “ఓమ్ నమః శివాయ ” అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా.
శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి.
దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.
* సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.
* దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది.
* ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.
* నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము వుండదు.
* మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి.
* తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది.
* అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.
* జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.
* పసుపురంగు బట్టలతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.
* కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.
* సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.
* వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.
No comments:
Post a Comment