ఆరోగ్యవంతమైన సంతానం కలిగినప్పుడే దంపతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మరి ఆరోగ్యవంతమైన సంతానం కావాలంటే గర్భం ధరించక ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి. దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఉండటంతో పాటు, పండంటి బిడ్డను పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు
సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక. ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకంగా ఎలా ప్లాన్ చేసుకుంటారు?
అని చాలా మందికి సందేహం ఉంటుంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక వైద్యుల దగ్గరకు వెళతారే తప్ప ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం, తగిన సలహా ఇవ్వండని వైద్యుల దగ్గరకు ఒక్కరు కూడా వెళ్లరు. చాలా మంది చేసే తప్పు ఇది. నిజానికి ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే గర్భం ధరించకముందే వైద్య సలహాలు తీసుకోవాలి.
వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు, వాటి వల్ల తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.ఏం చేయాలి?ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముందుగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
అక్కడ వైద్యులు కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకుంటారు. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉందా? మేనరికం వివాహమా? ఇతర సమస్యలేమైనా గతంలో వచ్చాయా? తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. దాని ఆధారంగా సలహాలు ఇస్తారు. ఆరోగ్యవంతమైన గర్భధారణకు దంపతులకు ఈ కౌన్సెలింగ్ బాగా ఉపయోగపడుతుంది. మేనరికం వివాహం చేసుకున్నట్లయితే మరిన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. వారి సంతానంలో క్రోమోజోమ్ అబ్‌నార్మాలిటీస్ వల్ల పిల్లలు వైకల్యంతో జన్మించే అవకాశం ఉంటుంది.
పుట్టుకతో కొన్ని లోపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కౌన్సెలింగ్‌లో ఈ విషయం చెప్పడం ద్వారా జెనెటిక్ టెస్టింగ్ చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయవచ్చు.ఇవీ పాటించాలిప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నట్లయితే మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు వేసుకోవడం ప్రారంభించాలి. గర్భం నిర్ధారణ అయ్యాక 3 నెలల పాటు కొనసాగించాలి. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నా, తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్, ఫిజీషియన్, గైనకాలజిస్ట్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్స్ ఉన్నట్లయితే వాడుతున్న మందులు తెలియజేయాలి.
ఫిట్స్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి ముందు నాలుగైదు రకాల మందులు వాడవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఒకే మాత్రను వాడాల్సి వస్తుంది. అంటే పాలీథెరపీ నుంచి మోనోథెరపీకి మారడం జరుగుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ గుండె సంబంధ సమస్యలు ఉన్నట్లయితే వైద్యులు రిస్క్‌ను అంచనా వేస్తారు. రిస్క్ తక్కువగా ఉన్నట్లయితే వారు సూచించిన సలహాలు పాటించడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాలి.అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే...అధిక రక్తపోటు ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ప్రెగ్నెన్సీకి ముందే బీపీ ఎలా ఉందో చెక్ చే యించుకోవాలి. ఒకవేళ బీపీకి మందులు వాడుతున్నట్లయితే ఆ వివరాలను డాక్టర్‌కు తెలియజేయాలి.
ప్రెగ్నెన్సీలో మందులు మార్చుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు ప్లానింగ్ ఉంటే కనుక సమస్య రాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ ఉంటే కనుక అదుపులో ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలంగా డయాబెటిస్ ఉన్నట్లయితే కళ్లు ఎలా ఉన్నాయి. కిడ్నీల పనితీరు ఎలా ఉందీ అనే విషయాన్ని వైద్యులు పరీక్షించి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో మరో ముఖ్యమైన అంశం థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాలి.
థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్‌లో తేడా ఉంటే కనుక మందులు వాడి నార్మల్‌గా ఉండే లా చూసుకోవాలి. కొందరు అధిక బరువు ఉంటారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గి నార్మల్ వెయిట్‌కు వచ్చిన తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కొంరదు అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటారు.
బేరియాటిక్ సర్జరీ మూలంగా మైక్రోన్యూట్రి యెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి రెండేళ్ల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఆ తరువాత ప్లాన్ చేసుకోవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లయితే పోషకాహారం తీసుకోవడం, మందులు వాడటం ద్వారా సరిచేసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ముందే వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చని గుర్తుంచుకోవాలి.
డాక్టర్ రాధిక
సీనియర్ గైనకాలజి
స్ట్యశోద హాస్పిటల్స్సో
మాజిగూడ, హైదరాబాద్ఫోన్ : 90300 56362 -