all

Saturday, July 20, 2013

జుట్టుకు పోషణ అందిచే హోంమేడ్ ఇండియన్ షాంపులు

మనకు ఇష్టమైన అందమైన, ఆరోగ్యకరమైన కురులు వుండటం అంత సులభం కాదు, కానీ అలా ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది . మనలో చాలా మంది మన కురలు మంచి షైనింత్ తో ఉండాలని, ఒక ఖచ్చితమైన జుట్టు సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటారు. అటువంటి జుట్టును పొందాలంటే, హెయిర్ డ్యామేజ్ చేసే రసాయన ఉత్పత్తులను మరియు వేడి, ఒత్తిడి వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటప్పుడే మీరు అందుమైన జుట్టును పొందగలుగుతారు.

కఠిమైన హెయిర్ ప్రొడట్స్ నుండి జుట్టును సంరక్షించుకోవాలంటే, మీరు ఎల్లప్పుడూ రసాయనిక హెయిర్ ప్రొడక్ట్స్ ప్రత్యామ్నాయంగా హోం మేడ్ షాంపూలను ఉపయోగించవచ్చు. ఇవి జుట్టు సంరక్షణకు మరియు జుట్టు ఆరోగ్యంగా పెరుగుదలకు ఈ ఇండియన్ హోం మేడ్ షాంపులు బాగా సహాయపడుతాయి. వీటిని మనం ఇట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి, వీటిలో ఎటువంటి రసాలయనాలు లేకుండా ఉంటాయి. ఈ నేచురల్ ఇండియన్ మోం మేడ్ షాంపులు మీ కురలకు ఎటువంటి హాని కలిగించదు. కరులను బలహీన పరచవు, కఠినంగా పొడిగా మార్చవు, మరియు నిర్జీవంగా మార్చవు.

మనలో చాలా మంది రెగ్యులర్ గా తలస్నానం చేస్తూ, కఠినమైన రసాయ షాంపూలను ఉపయోగించే అలవాటు ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి దారితీయవచ్చు. కాబట్టి, మీ జుట్టులో చైతన్యం నింపడానికి, మీ జుట్టుకు మంచి షైనింగ్ ను తిరిగి పొందడానికి, కొన్ని హోం మేడ్ ఇండియన్ షాంపులను ట్రై చేయండి. ఈ హోం మేడ్ ఇండియన్ షాంపులను మీరు ఇంట్లోని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ట్రై చేసి చూడండి..


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! బేకింగ్ సోడా: ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసికొని నీళ్ళలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి, బాగా షేక్ చేసి, తర్వాత తడి జుట్టుకు పట్టించాలి. ఈ నేచురల్ షాంపుకు కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా, తలలోని చుండ్రు వదలగొడుతుంది.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! ఆరెంజ్-ఎగ్ షాంపు: మీ కేశాలు కురచగా లేదా పొడవుగా ఉన్నాసరే, ఈ షాంపు మీ కేశాలను సాఫ్ట్ గా చేస్తుంది. ఒక బౌల్లో ఒక గుడ్డుసొన మరియు ఆరెంజ్ జ్యూస్ ను తీసుకొని బాగా గిలకొట్టాలి. ఈ రెండింటి మిశ్రమం స్మూత్ గా తయారయ్యే వరకూ, బాగా మిక్స్ చేసి, తర్వాత ఈ షాంపును మీతలకు పట్టించి, పది నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! గుడ్డు షాంపు: సాఫ్ట్ గా, షైనింగ్ తో , మరీ మెత్తని కురులకోసం గుడ్డును సాధారణంగా ఉపయోగిస్తుంటారు. మీ జుట్టు మందం, పొడవును బట్టి 2-3గుడ్లు తీసుకోవాలి. ఈ గుడ్లలోని లిక్విడ్ ను గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత గిలకొట్టిన గుడ్డులిక్విడ్ ను తలకు పట్టించి అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.


తేనె-నిమ్మరసంతో షాంపు: ఈ హోం మేడ్ ఇండియన్ షాంపును జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడటంతో పాటు, చుండ్రులేని జుట్టును పొందవచ్చు. 3టేబుల్ స్పూన్ల నిమ్మరసం, మరియు తేనె మిక్స్ చేయాలి. మరో బౌల్లో రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. ఈగుడ్డు లిక్విడ్ ను నిమ్మరసం, తేనె మిశ్రమంలో వేసి బాగా గిలకొట్టాలి. చివరగా మూడు చుక్కల ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! రీటా లేదా శీకాకాయ్ షాంపు: రీటా లేదా శీకాయ షాంపు కురులకు మంచి పోషణను అంధిస్తుంది. అందుకు 100grmఉసిరికాయ, 100grms రీటా మరియు 75గ్రాములు శీకాయ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కు తగినన్ని నీళ్ళు కలిపి రాత్రంత నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం, శీకాయ లిక్విడ్ ను తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.


ఇండియన్ హోం మేడ్ షాంపులతో జుట్టు సురక్షితం! గసగసాలు మరియు శీకాయ: శీకాయ, కందిపప్పు, పెసరపప్పు, గసగసాలను ప్రతి ఒక్కటీ 250grms తీసుకొని, అందులోనే మెంతులు మరియు హార్స్ గ్రామ్స్ ను కూడా మిక్స్ చేసి ఈ పద్దార్థలన్నింటి ఒక్క మిశ్రమంగా చేసి, మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్ తో తలస్నానం చేయవచ్చే. ఈ పౌడర్ ను కొద్దిగా నీళ్ళలో కలుపుకొని, తలకు పట్టించి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.


అవొకాడో షాంపు: అవొకాడోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి అందులోనే బేకింగ్ సోడా, నీళ్ళు కూడా వేసి, మెత్తగా అయ్యే వరకూ బ్లెడ్ చేయాలి. ఈ హోం మేడ్ ఇండియన్ షాంపును మీ కేశాలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా కేశాలను రక్షించుకోవచ్చు.


నిమ్మ మరియు ఉసిరికాయ షాంపు: ఒక మిక్సింగ్ బౌల్లోనికి మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు 50గ్రాములు ఉసిరికాయ పొడి తీసుకొని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!

కేశాలను సంరక్షించుకోవడం కోసం చాలా మంది కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు.

ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ ఇంట్లో లభించే బెస్ట్ హెయి ప్రొడక్ట్. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు!.

నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దాంతో పాటు కేశాలు చిట్లడానికి అడ్డుకుంటుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది.

కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరికట్టాలనుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ రసాన్ని జుట్టు పట్టించాలి.ఉల్లిపాయ వాసన మనకు ఇబ్బంది కలిగించినా కొంత సమయం తర్వాత జుట్టు పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని గ్రహించవచ్చు. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలతో పాటు, జుట్టు పోషణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హోం రెమడీ వల్ల కేశాలు షైనింగ్ మెరుస్తుండటమే కాదు, కేశాలను బలంగా కూడా ఉంచుతుంది. జుట్టు రాలడంతో పోరడా, జుట్టు పెరగాలంటే ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ప్టించాల్సిందే.ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణలో ఉపయోగించడానికి చాలా మార్గాలున్నాయి.

ఉదా: ఉల్లిపాయ రసాన్ని తేనెతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని నేచురల్ గా తగ్గిస్తుంది. అదే విధంగా, సింపుల్ గా ఉల్లిపాయ ముక్కలను రుబ్బి ఆ రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో ఉల్లిపాయ జ్యూస్ ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చిక్కుముడులను మరియు పొడి జుట్టును నివారిస్తుంది. దాంతో పాటు మీ కేశాలు మంచి మెరుపుతో పాటు, నిర్వాహణ కూడా సులభం అవుతుంది.

కాబట్టి ఈ క్రింద ఇచ్చిన ఆనియన్ హెయిర్ చిట్కాల ట్రై చేసి, రిజల్ట్ చూడండి. స్పాలకు, బ్యూటీపార్లకు డబ్బు ఖర్చు చేయడం మానుకొని ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ తో వ్యత్యాసాన్ని గమనించండి . ఒక సూచన ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ ను మినిమం ఒక నెల పాటించాల్సి ఉంటుంది. మరి ఆనియన్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దామా...


ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల తల మాసిన వాసన శుభ్రంగా తొలగిపోతుంది.



ఉల్లిపాయ నుండి రసాన్ని వేరుచేసుకొని అందులో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. హెయిర్ ఆయిల్స్ కు మీరు ఎసెన్సియల్ ఆయిల్స్(రోజ్ మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ మరియు సీడర్ వుడ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. తలకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.



ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలి ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్ మరియు కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి . ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది. కేశాలు అందంగా మెరుస్తుంటాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది




ఆనియన్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా జెల్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించిన రెండు గంటల తర్వాత లెమన్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ జెల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది మరియు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. ఈ హెయిర్ జెల్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు.



ఒక కప్పు బీర్ లో ఉల్లిపాయను రాత్రంతా నానబెట్టాలి. ఈ బీర్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.



ఉల్లిపాయ రసానికి నిమ్మరసం కలిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది మరియు చుండ్రును వదలగొడుతుంది. నిమ్మరసం తలను శుభ్రపరుస్తుంది మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.






ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీసి అందులో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, బాగా గిలకొట్టి తలకు మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి షాంపూతో తలస్నానం చేయాలి.



గుడ్డు జుట్టు సంరక్షణకు చాలా మంచిది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి గుడ్డులో ఉల్లిపాయ రసాన్ని కలిపి, బాగా గిలకొట్టి, తడి జుట్టు మీద అప్లై చేయాలి 25-30నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.


Friday, July 19, 2013

వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తీనాల్సిన బెస్ట్ ఫుడ్స్

ఉదయం వ్యాయామం మీ శరీరంలోని ప్రోటీనులు, ద్రవాలు మరియు కార్బోహైడ్రేట్లనుతగ్గిస్తుంది. ఈ వ్యాయామం శరీరంలో నిల్వఉన్న పోషకాలు బలవంతంగా లాగేసుకుంటుంది.దాంతో మిగిలిన రోజంతా అలసిపోవల్సి వస్తుంది.కాబట్టి వ్యాయామాలు చేసిన అరగంటలోపు ఆహారాలను తీసుకోవాలి.

ఎందుకంటే ఈ సమయంలో మీ శరీరం వ్యాయామం చేస్తున్నప్పుడు పోషకాలను నష్టపోవడం జరుగుతుంది కాబట్టి తిరిగి వేగంగా పోషకాలు గ్రహించాలంటే వ్యాయామాలు చేసిన అరగంటలోపు, ఆహారాలను తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం వల్ల వ్యాయామం తర్వాత అలసట నిరోధిస్తుందా?ఆందోళన అవసరం లేదు! కోల్పోయిన పోషకాలు తిరిగి పొందడానకి కొన్ని పోస్ట్ వ్యాయమ ఆహారాలున్నాయి. వాటిని పరిశీలించి, మీరు వ్యాయామం తర్వతా ఇటువంటి ఆహారాలను తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం.


ఆమ్లెట్:
శరీర కండర నిర్మాణం కోసం వ్యాయామం తర్వాత శరీరానికి హైప్రోటీన్ ఆహారం చాలా అవసరం. కాబట్టి, ఎగ్ వైట్ లో అధిక ప్రోటీనులు మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మంచి పరిమాణంలో కలిగి ఉంది. తీవ్రమైన వ్యాయామం తర్వాత దెబ్బతిన్న కణజాలాల పునర్నిర్మాణానికి అమైనో యాసిడ్స్ సహాయపడుతుంది.


అవెకాడో :
అవొకాడోలో సంతృప్త కొవ్వులు, ఫోలిక్ యాసిడ్, విటమిన్ K, విటమిన్ సి, విటమిన్ E మరియు పాంతోతేనిక్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇది ఇంకా పొటాషియంతో నిండి ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శక్తి స్థాయిలు సౌలభ్యం మరియు మీరు చురుకుగా మరియు రోజు మొత్తం శక్తివంతంగా ఉంచుతుంది.



సాల్మన్ చేప:
సాల్మన్ చేపల్లో ప్రోటీన్ మరియు వ్యాయామం తర్వాత వేగవంతంగా కోలుకోవడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. దీనిలో ఇంకా, విటమిన్ డి, విటమిన్ బి6 మరియు మరియు శక్తి కోసం విటమిన్ బి 12 కలిగి ఉంటుంది. సాల్మన్ చేపలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. మరియు ఎనర్జీని మరియు శక్తి పెంచడానికి సహాయపడుతుంది.


సెరీల్ (ఒక రకమైనటువంటి ధాన్యం) ఒక గిన్నె సెరీల్ (ధాన్యం)ను తీసుకోవడం వల్ల కండరాల శక్తి పునరుద్ధరణకు ఒక మంచి మూలం. వీటిలో పుష్కలమైన ప్రోటీనులు మరియు కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా కలిగి ఉండి, ఇవి సెల్యులార్ శక్తిని పొందడానికి దోహదపడతాయి . ఈ ద్యానంను పాలు లేదా చాక్లెట్ మిల్క్ తో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కండరాలను రివకర్ చేసి , మరమ్మత్తులు చేస్తుంది.


చిలగడ దుంప(స్వీట్ పొటాటో):
స్వీట్ పొటాటోలో కాప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, బీటా కెరోటిన్, విటమిన్ సి, మ్యాంగనీస్ మరియు పొటాషియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. వ్యాయామం తరువాత, శరీరం యొక్క గ్లైకోజెన్ లెవల్స్ పడిపోయినపుడు, స్వీట్ పొటాటోలో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గ్లైకోజెన్ స్థాయి పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.


వైట్ రైస్: గోధుమ బియ్యం వైట్ రైస్ కంటే ఆరోగ్యకరమైన ఎంపిక. కానీ వ్యాయామం తర్వాత మీలో అధిక గ్లైసెమిక్ సూచిక (GI) తో గ్లైకోజెన్ స్థాయి పునరుద్ధరించడానికి ఇది సహాయపడుతుంది. తద్వారా శరీరంలోని ఎనర్జీలెవల్స్ పెంచుతుంది.


డ్రై ఫ్రూట్స్(ఎండిన ఫలాలు):
నట్స్ మరియు ఎండు ఫలాలు అధిక ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్ ఎ, విటమిన్ K మరియు కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. సాధారణ పిండి పదార్థాలు నిల్వ ఉండటం వల్ల, ఇవి సులభంగా జీర్ణం అవ్వడానికి మరియు గ్లైకోజెన్ స్థాయి తిరిగి పొందడానికి, తద్వారా శరీర శక్తి స్థాయి పెంచుకోవడం కోసం సహాయ పడుతాయి.


Hummus: Hummus వీటిలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలం. వీటిలో ఇంకా ప్రోటీనులు మరియు పిండి పదార్థాలు కలిగి ఉండటం వల్ల ఇది ఒక అద్భుతమైన, మంచి పోస్ట్ వ్యాయామం ఆహారంగా ఉన్నాయి.

చికెన్: చికెన్ ప్రోటీన్, ఒమేగా 3S మరియు సెల్యులార్ శక్తికి దోహదం చేసే అమైనో ఆమ్లం అందిస్తుంది.


పండ్లు: పండ్లలో ఫైబర్, నీరు, విటమిన్ సి మరియు కార్బోహైడ్రేట్ల అధికం. ఇవి పోషకాలు విచ్ఛిన్నం మరియు మీ అలసటతో కూడిన కండరములు తిరిగి పునర్నిమానంకు సహాయం చేసే ఎంజైమ్లను కలిగి ఉంటాయి. వ్యాయామం తర్వాత , పండ్లు, పండ్ల రసాలు లేదా స్మూతీలను తీసుకోవడం ఆరోగ్యకరం. ఇవన్నీ కండరాలకు కావల్సినంత ప్రోటీనులను అందిస్తుంది.

Thursday, July 18, 2013

అందమె ఆనందం

 
     
కోమలమైన చేతుల కోసం... టొమాటో జ్యూస్, నిమ్మరసం సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని చేతుల మీద కొద్దికొద్దిగా వేస్తూ సుతిమెత్తగా మర్దనా చేయాలి.

Monday, July 15, 2013

పిల్లల పెంపకంలో మెళుకువలు పాటించక పోతే...?

ప్రస్తుత కాలంలో పిల్లలంతా చాలా స్పీడ్‌ గా ఉంటున్నారు. చదువుల్లోనూ, ఆట పాటల్లోనూ చాలా ఫాస్టు గా ఉంటున్నారు. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవారు. ఇప్పుడు న్యూక్లియర్‌ ఫ్యామిలీల కారణంగా ఒక్కరు తప్పితే ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. వాళ్లకు ఆటా పాట అన్నీ తల్లిదండ్రులతోనే అవుతోంది. దీంతో గారాబం ఎక్కువ అవుతోంది. ఫలితంగా మొండిపట్టు, మంకుపట్టు తప్పనిసరి అవుతోంది. ఇటువంటి పిల్లలతో వ్యవహరించటం తలకు మించిన పని అవుతుంది. ఇటువంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని సదరన్‌ ఇల్లియోనిస్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యాపకులు సూచిస్తున్నారు. ఇటువంటి పిల్లలతో పట్టు విడుపుతో మెలగాలని చెబుతున్నారు.

పిల్లల పెంపకంలో మెళకువలు పాటించక పోతే విసుగుదల, చిరాకు పెరిగిపోతాయి. మానసికంగా ఆందోళన పెరిగి పోయి అనారోగ్యానికి కారణం అవుతుంటాయి. పెద్దలంతా ఒకప్పుడు పిల్లలే అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణగా ఏ రకంగా పెంచాలి అనేది తెలసుకోవాలి. పట్టు విడుపులతో పిల్లల్ని మంచి మార్గంలో ఎలా తీసుకొని వెళ్లాలి అనేది తెలుసుకోవాలి. గతంలో ప్రతీ ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య వంటి పెద్దలు ఉండే వారు కాబట్టి ఓర్పుతో అన్ని విషయాలు తెలియ చెప్పేవారు. కానీ రాను రాను న్యూక్లియర్‌ఫ్యామిలీలు వచ్చేశాక మంచి, చెడు నేర్పేవారు తక్కు వ అయ్యారు. దీంతో పిల్లల పెంపకం కత్తి మీద సాములా మారుతోంది.


స్నేహా వాతావరణంతో మెలగటం:

పిల్లలు ఎప్పుడూ పిల్లలతోనే ఆడుకోవాలని కోరుకొంటారు. తోటి పిల్లలతో అనుకరించటం లేదా తోటి పిల్లలకు నేర్పించటం అంటే బాగా ఇష్టపడతారు. సరిగ్గా ఈ టెక్నిక్‌ నే పెద్దలు కూడా అనుసరించాలని చెబుతున్నారు. అంటే పిల్లలతో బాస్‌ మాదిరిగా మాట్లాడటానికి బదులు తోటి పిల్లల మాదిరిగా అనునయించి చెప్పటం మేలని నిపుణులు అంటున్నారు. ఒక పని వద్దని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం కన్నా నిదానంగా అందులోని మంచి చెడ్డల్ని విడమరిచి చెప్పటం మేలని అంటున్నారు. ద కేస్‌ ఫర్‌ ద ఓన్లీ చైల్డు అనే పరిశోధక గ్రంథం లో పిల్లల్ని ఎంత అనునయంతో పలకరిస్తే అంత మేలని తేల్చిచెప్పారు. ఇంట్లో ని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలకరించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం వంటివి ఇంట్లోనే అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇవి పెద్ద వారిని చూసి పిల్లలు బాగా నేర్చుకొంటారు. అందుచేత పిల్లలకు ఈ విషయాల్ని విడమరిచి చెప్పాలి. ఒకవేళ ఇటువంటి విషయాల్లో సక్రమంగా లేకపోతే నెమ్మదిగా నేర్పించాల్సి ఉంటుంది. అంతే తప్ప కేకలు పెట్టడం, ఒక్కసారిగా విరుచుకు పడటం మంచిది కాదు. మంచి అలవాట్లను నెమ్మదిగా తెలియచేయాలి.


పిల్లలలో కలుపుగోలుతనం ముఖ్యం: పిల్లల్ని ఒంటరిగా ఉంచటం మంచిది కాదు. ఒక్కరూ తనలో తానే మథనపడే అవకాశం ఇవ్వకూడదు. నలుగురిలోనూ కలిసిపోనివ్వాలి. చుట్టుపక్కల వారితో కలవక పోవటం, స్కూల్‌లో తోటి ఫ్రెండ్సుకి దూరంగా ఉండటం మంచి అలవాట్లు కాదని తెలియచెప్పాలి. తామే అధికులం అన్న భావన ఎంత ప్రమాదకరమో, తాము అల్పులం అన్న న్యూనత కూడా సరి కాదు. అందుచేత ఇతరులతో కలిసిపోయేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. ఇందుకోసం తోటివారికి సాయపడటం, ఇతరుల నుంచి సహాయం తీసుకోవటం వంటివి నేర్పించాలి. ఇది క్రమంగా అలవాటు చేయాలి. దీని వలన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కుమిలిపోయే లక్షణం తప్పుతుంది. పైగా కలిసికట్టుగా ఎదుర్కొనే స్వభావం అలవాటు అవుతుంది. కొంత మంది పిల్లలు గారాబం ఎక్కువ అయినప్పుడు ఎవరినైనా ధిక్కరించే లక్షణంతో ఉంటారు. ఇటువంటి వారికి క్రమంగా తామే అధికులం అన్న భావన కలుగుతుంది. ఇటువంటి వారు చిన్నపాటి ఇబ్బందిని కూడా సహించలేని వారుగా మారతారు. ఇటువంటి పోకడల్ని మొదట్లోనే గుర్తించి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.


పిల్లలలో కలుపుగోలుతనం ముఖ్యం: పిల్లల్ని ఒంటరిగా ఉంచటం మంచిది కాదు. ఒక్కరూ తనలో తానే మథనపడే అవకాశం ఇవ్వకూడదు. నలుగురిలోనూ కలిసిపోనివ్వాలి. చుట్టుపక్కల వారితో కలవక పోవటం, స్కూల్‌లో తోటి ఫ్రెండ్సుకి దూరంగా ఉండటం మంచి అలవాట్లు కాదని తెలియచెప్పాలి. తామే అధికులం అన్న భావన ఎంత ప్రమాదకరమో, తాము అల్పులం అన్న న్యూనత కూడా సరి కాదు. అందుచేత ఇతరులతో కలిసిపోయేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. ఇందుకోసం తోటివారికి సాయపడటం, ఇతరుల నుంచి సహాయం తీసుకోవటం వంటివి నేర్పించాలి. ఇది క్రమంగా అలవాటు చేయాలి. దీని వలన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒంటరిగా కుమిలిపోయే లక్షణం తప్పుతుంది. పైగా కలిసికట్టుగా ఎదుర్కొనే స్వభావం అలవాటు అవుతుంది. కొంత మంది పిల్లలు గారాబం ఎక్కువ అయినప్పుడు ఎవరినైనా ధిక్కరించే లక్షణంతో ఉంటారు. ఇటువంటి వారికి క్రమంగా తామే అధికులం అన్న భావన కలుగుతుంది. ఇటువంటి వారు చిన్నపాటి ఇబ్బందిని కూడా సహించలేని వారుగా మారతారు. ఇటువంటి పోకడల్ని మొదట్లోనే గుర్తించి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది.



పిల్లల స్నేహితుల్ని మన్నించటం: పిల్లలకు తమ స్నేహితుల మీద అభిమానం చూపుతారు. తోటి పిల్లలు నచ్చితే ఎంతో గొప్పలు చెబుతారు. నచ్చక పోతే మాత్రం తెగడ్తలు కూడా అంతే స్పీడు గా ఉంటాయి. ఇంటికి తిరిగి వచ్చాక తోటి స్నేహితుల గురించి చెప్పుకొని వస్తుంటారు. సహజంగానే ఇవన్నీ సుత్తి మాటలుగా అనిపిస్తాయి. వాటిని వెంటనే కొట్టి పారేయటం మంచిది కాదు. ఇతర స్నేహితుల కు సంబంధించిన విషయాలు మనం ఆసక్తి కరంగా వింటున్నట్లు ఉంటే మేలు. వీలుంటే పిల్లల స్నేహితుల్ని ఇంటికి పిలవటం మంచిది. అప్పుడప్పుడు పిలిపించి ఇంట్లోనే ఆడుకొనే వెసులుబాటు కల్పించాలి. దీంతో పిల్లలు పొంగి పోతారు. స్నేహితుల ఎదుట పిల్లల్ని చికాకు పడటం, కోప్పడటం, పోల్చి తిట్టడం మాత్రం మంచి పద్దతి కాదు సుమా.. స్నేహితుల సమక్షంలో పిల్లలతో అభిమానంగా వ్యవహరిస్తే మా పేరంట్సు చాలా మంచివాళ్లు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. స్నేహితులకు పెద్దల గురించి గొప్పగా చెబుతారు.


పిల్లల కోప తాపాలకు ప్రాధాన్యం: ఇటీవల కాలంలో పిల్లలకు కోప తాపాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలు ఎదిగే కొద్దీ ఇటువంటి పోకడలు అదికం అవుతున్నాయి. పిల్లలు చికాకుగా ఉంటే మనం మండిపోవటం మంచిది కాదు. చీటికి మాటికీ కోపం తెచ్చుకోవటం ఎంత చేటో విడమరిచి చెప్పాలి. పిల్లల కోపానికి కారణం ఏమిటో గుర్తించాలి. అటువంటి సందర్భం ఎందుకు ఏర్పడిందో వివరంగా చెప్పటం మేలు. అటువంటప్పుడు కోపం తెచ్చుకోకుండా వ్యవహరించాలని సూచించాలి. పెంకితనంతో ఉన్నప్పుడు మొండిగా వ్యవహిరిస్తుంటారు. అటువంటప్పుడు కోపం తెచ్చుకొంటే మరింత మొండిగా మారిపోతుంటారు.


టీవీలు, ఇంటర్‌నెట్‌ల వాడకాన్ని తగ్గించటం: పిల్లల్లో టీవీ, ఇంటర్‌ నెట్‌చూసే వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా కార్టూన్‌ చానెల్సు, ప్లే చానెల్సు కు ఎక్కు వగా అలవాటు పడుతున్నారు. అందులో ఉండే క్యారెక్టర్ల ను బాగా అనుకరిస్తున్నారు. కొంత మంది పిల్లలు గంటల తరబడి టీవీలకు అతుక్కొనిపోతున్నారు. దీని వలన బద్దకం, మందకొడి తనం పెరిగిపోతున్నాయి. సరి కదా, ఆ చానెల్సుని మారిస్తే ఊరుకోవటం లేదు. వెంటనే చిందులు వేస్తున్నారు. ఈ పోకడను ముందుగానే గమనిం చుకోవాలి.

అటువంటి చానెల్సు ను క్రమంగా తగ్గించి వేయాలి. అటువంటి చానెల్సు లో ఏ ప్రోగ్రామ్‌ ను క్రమం తప్పకుండా చూస్తున్నారో గమనించి ఆ సమయంలో వేరే వ్యాపకం అలవాటు చేయటం మేలు. లేదంటే ఆ కార్యక్రమాలకు అలవాటు పడిపోతే పిల్లలను కంట్రోల్‌చేయటం కష్టం అవుతుంది. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు అన్నం తినిపించటానికి, పనులు చేయించుకోవటానికి టీవీ ని అలవాటు చేస్తుంటారు. ఇది సరికాదు. తర్వాత కాలంలో ఈ అలవాటు కొంప ముంచుతుంది.



అవసరమైనప్పుడు‚ఠిన వైఖరి: పిల్లలతో ప్రశాంతంగా, నిదానంగా ఉండటం మంచిదే కానీ, అవసరమైనప్పుడు కఠిన వైఖరి అవలంబించాలి. వద్దన్న పని చేస్తామని పదే పదే మొండికేస్తుంటారు. కొన్ని సార్లు చెప్పిన మాట వినకుండా మొండికేస్తుంటారు. అటువంటప్పుడు సంయమనంతో చెబుతునే ఉండాలి. అదే సమయంలో పిల్లల మనస్సు మరలించి రాంగ్‌ స్టెప్‌ పడకుండా చూడాలి.అవసరమైతే ఇటువంటి సమయంలో కఠినంగా కూడ వ్యవహరించాలి. మొకై్క వంగనిది మానై వంగదు అని గుర్తించుకోవాలి. మొండితనాన్ని పిల్లల్లో ప్రోత్సహిస్తే అది క్రమంగా చేటు తెస్తుంది.


పిల్లలకు అతి గారాబం కూడదు: పిల్లలకు కావలసిన వస్తువులు తెచ్చి పెట్టి ఇవ్వటం మంచిదే. షాపింగ్‌ కు తీసుకొని వెళితే ఎన్నయినా కొని పెట్టవచ్చు. కానీ, దీనికి పరిమితి ఉండాలి. ఏది కనిపించినా కావల్సిందే అని కొందరు పిల్లలు మొండికేస్తారు. ఇటువంటి అలవాటును ప్రోత్సహించటం మంచిది కాదు. డబ్బు విలువ ఎటువంటిదో తెలియ చెప్పాలి. అవసరం అయినపుడు మాత్రమే విడిగా పిల్లలను షాపింగ్‌ కు పంపిస్తుండాలి.

పక్క తడపడానికి దారితీసే రాత్రి పూట భోజనం-చిరుతిళ్ళు !

మీకు పక్కతడిపే పిల్లలు ఉంటే, మీరు పక్కతడపడం సమస్యను పరిష్కరించే పోషకాల గురించి పుకార్లు వినేవుంటారు.సాయంత్రం 6 గంటల నుండి ద్రవపదార్ధాలు తగ్గించండి.

ఆరంజ్ జ్యూస్ మానేయండి. మసాలాతో చేసిన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండండి. మీరు మీ పిల్లల పక్కతడిపే సమస్యను పోగొట్టడానికి మీరు వీటన్నిటినీ ప్రయత్నించి ఉండవచ్చు.

కానీ మీరు ఇవి చేయడానికి ముందు, పక్కతడపడం ఆపే ప్రయత్నంలో అనవసరమైన ఆహార మార్పుల వల్ల మీరు మీ పిల్లలు ఆనందంగా లేకుండా, మునుపటి కన్నా ఎక్కువ నిరాశ చెందుతారు. పక్కతడపడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్ధాలు కారణం కావచ్చని వైద్యులు చెప్తారు, అయితే వీటిని సమర్ధించే ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు, ఇవన్నీ సంప్రదాయంగా చెప్తూ వస్తున్నవే.

పక్కతడపడానికి దారి తీసి ఆహారాలను కనుక్కోవడానికి చిట్కాలుప్రతి వారూ ప్రత్యేకమైన వారే కాబట్టి, మీ పిల్లవాడు పక్క తడపడానికి కారణ మౌతున్న ఆహారాలను కనుక్కోవడానికి మీరు, మీ పిల్లవాడు కలిసి ప్రయత్నం చేయండి.ఒక పుస్తకం వుంచి పక్క తడపడం జరిగినప్పుడు నమోదు చేస్తుంటే ఈ ప్రమాదానికి కారణమైన సంఘటనలను పసి గట్ట వచ్చని నిపుణులు చెప్తున్నారు.కొంత మంది పిల్లలు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు పక్క తడపకుండా ఉండడానికి ఉపకరిస్తున్నాఎమో తెలుసుకోవడానికి తమదైన సిద్ధాంతాలు ప్రయత్నించే ఆసక్తి కలిగి వుంటారు.

పక్క తడపడానికి వారి వ్యక్తిగత కారణాలు తెలుసుకోవడం పిల్లలకు రెండు రకాలుగా మంచిది.వారి పక్క తడిపే సమస్య మీద వారికి నియంత్రణ ఉందన్న భావన వారికి వస్తుంది, దాని వల్ల దాన్ని పరిష్కరించుకోవడానికి వారు బాధ్యత వహిస్తారు.పక్క తడపడాన్ని నియంత్రిస్తుందని గానీ, కలుగచేస్తుందని కానీ వారు ఏదైనా ఆహార పదార్ధాన్ని కనుగొంటే అది తీసుకోవడమో, మానేయడమో వారే చేస్తారు, అది కేవలం ప్లాసేబో ప్రభావం వల్ల అయినా సరే.పక్కతడపడం లో పోషకాహార వ్యూహాలు అమలు చేయడం మీరు మీ పిల్లల పక్కతడిపే సమస్య నియంత్రించే ప్రయత్నంలో సాయంత్రం తీసుకునే ఆహరం లో మార్పులు చేయాలని నిర్ణయిస్తే, అవి ఈ చెడు ప్రవర్తనకు శిక్ష కాకుండా ఉండేలా చూసుకోండి.

పక్కతడిపే అనేకమంది పిల్లలు, ప్రత్యేకంగా పెద్ద పిల్లలు, నిద్రలో అప్రయత్నంగా మూత్రవిసర్జన చేయడం ద్వారా ఇబ్బందికి గురై సిగ్గుపడుతు౦టారు. అలాగే తరచుగా, తల్లితండ్రులు వారు పరిశుభ్రంగా లేరనే నిస్పృహకు లోనౌతున్నారు.

ఇది పిల్లలకు ఆందోళన కలిగించవచ్చు, మానసికంగా వ్యాకులత చెంది, పక్కతడపడం మరింత ఎక్కువ అవుతుంది.అందువల్ల, మీరు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, వారిని శిక్షించడానికి కాదని పిల్లలకు అర్ధమయ్యేలా చేయడం ముఖ్యం.



మసాలాలతో కూడిన ఆహార పదార్ధాలు పక్క తడపడానికి దారి తీస్తాయని తెలియగానే మీ ఇంట్లో సమోసా తినడం మానేశారా? అలా అయితే సరదాగా సలాడ్ లు, సాస్ లు తినేయండి, ఎందుకంటే మసాలాలతో చేసిన ఆహార పదార్ధాల వల్ల పక్క తడపడం జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.కొంత మందిలో మసాలా పదార్ధాలు మూత్రాశయాన్ని ప్రేరేపించడం వల్ల ఈ అపోహ వహ్చింది, విద్యులు కూడా పక్క తడిపే సమస్య వున్న వారిని మసాలా పదార్ధాలు తినవద్దని సలహా ఇస్తారు. కానీ పరిశోధనల్లో మసాలా దినుసులు వాడడానికి, పక్క తడపడానికి ఎలాంటి సంబంధం రుజువు కాలేదు.


మసాలా పదార్ధాల లాగానే, నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పదార్ధాలు కూడా వాటిలో వుండే ఆమ్లాల వల్ల మూత్రాశాయాన్ని ప్రేప్రేపిస్తాయి. అందువల్ల పిల్లలకు బత్తాయి రసమో, నిమ్మ రసమో ఇవ్వకు౦డా వారికి మేలు చేస్తున్నామని మీరు అనుకోవచ్చు.కానీ మసాలా పదార్ధాల లాగానే, పరిశోధనల్లో సిట్రస్ పళ్లకు, పిల్లలలో పక్క తడిపే అలవాటుకు, అరుదుగా కొంతమందిలో సిట్రస్ కు అలర్జీ వుండే పిల్లలకు తప్ప, ఎటువంటి సంబంధం వున్నట్టు వైద్య పరిశోధనల్లో రుజువు కాలేదు.



.
ఆహారం లేదా పానీయంలో కెఫీన్ వుంటే అది మూత్ర కారకంగా పనిచేస్తుంది, అంటే మూత్రాశయాన్ని ప్రేరేపించి ఎక్కువ మూత్రం ఉత్పత్తి అయ్యేలా చేస్తు౦ది. అందువల్ల మధ్యాహ్నం, సాయంత్రాలలో కెఫీన్ వుండే పదార్ధాలు తీసుకోక పోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.మీ పిల్లవాడు కాఫీ తాగడం లేదు కనుక కెఫీన్ వాడట్లేదని అనుకోవద్దు. టీ, కోలాలు, ఎనర్జీ డ్రింక్ లలో కూడా కెఫీన్ వుంటుంది. ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడే చాకొలేట్ లో కెఫీన్ కు బాగా దగ్గరి సంబంధం వుండే రసాయనం వుంటుంది. అందువల్ల మీరు మీ పిల్లలు వేడి చాకొలేట్ డ్రింక్ కానీ, బ్రౌన్ గా వుండే పానీయాలు కానీ చాకొలేట్ ఐస్ క్రీమ్ కనీ తినకుండా జాగ్రత్త పడ౦డి.



కేవలం మూత్రాశయం లో ఎక్కువ నీళ్ళు వుండడం వల్ల మాత్రమె మీ పిల్లవాడు పక్క తడుపుతున్నాడని అనుకోవద్దు. ఇలా ఆలోచించండి - మీరు పడుకునే ముందు ఒక గాలన్ నీళ్ళు తాగినా మీరు పక్క తడిపే బదులు, లేవగానే మూత్రాశయం ఖాళీ చేయాల్సిందే.అయినా, పడుకునే ముందు మీ పిల్లవాడికి తక్కువ మోతాదులో ద్రవాలు పట్టించడం మంచిది, ఎందుకంటే అది మూత్రాశయం నిండడాన్ని ఆలస్యం చేసి పక్క తడపడం మరింత ఆలస్యం అవుతుంది. ఈ అదనపు సమయం వల్ల మీ పిల్లవాడు పక్క తడపకుండా మేల్కోవడానికి అవకాశం వుంటుంది.

Sunday, July 14, 2013

తెలివితేటల్ని పెంపొందించే A to Z లైఫ్ స్టైల్

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రస్తుతం వారు ఉన్నదాని కంటే మరింత స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుత రోజుల్లో కొంతమందేమో ఎక్కువ డబ్బు సంపాధించాలనుకుంటారు, మరికొందరేమో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనుకుంటారు. ఇలా ఎవరి కోరికలు వారికి ఉంటాయి. కానీ చివరకి మనందరం కోరుకొనేది మాత్రం మన ఇంటెలిజెన్స్ ను పెంచుకోవడ కోసమే చూస్తాం.

అందుకు చింతించాల్సిన పనిలేదు, అందుకు బ్రెయిన్ సర్జరీ చేయించుకోవల్సిన పనిలేదు. అదంతా మీరు జీవిస్తున్న జీవన విధానం మీదే ఆధారపడి ఉంది. ఒక జీవన శైలే మిమ్మల్ని మరింత తెలివిగా మారడానికి సహాయపడుతుంది.అందుకు మందు వాడక్కర్లేదు మరియు వ్యాయామాలు చేయక్కర్లేదు. మీ ఇంటెలిజెన్స్ ను పెంచుకోవడానికి జస్ట్ లైఫ్ స్టైల్ ను మార్చుకోండి. మీరు అలవర్చుకొనే మంచి అలవాట్లే మీ శారీరక, మానసిక ఆరోగ్యం చురుకుగా మరియు హెల్తీగా ఉండేందుకు సహాయపడుతుంది.

అనారోగ్యకరమైన జీవనశైలి, మీమ్మిల్ని మరింత క్రుంగదీయడానికి దోహదం చేస్తుంది. సరైన జీవన శైలిలో కొన్ని మార్పులు అంటే మంచి నిద్ర, సరైన తిండి, మరియు కొన్ని వ్యాయామాలు వంటి మంచి అలవాట్ల వల్ల మీ ఇంటెలిజెన్స్ ను పెంపొంధించుకోవచ్చు.ఇవన్నీ కూడా చాలా సులభమైనవి, సాధారణమైన పనులే. మీరు ఉత్తమమైన బ్రెయిన్ ఫుడ్స్ ను తీసుకోవాలి, మీకు కావల్సినంత నిద్ర నిద్రపోండి. మరియు కొంత జాగింగ్ చేయండి . అయితే ఇది మిమ్మల్ని స్మార్ట్ గా మార్చే మంత్రం మాత్రం కాదు.

ఇంటెలిజెన్స్ ను పెంపొందించే లైఫ్ స్టైలో చాలా జాగ్రత్తగా తీసుకొనే, లేదా అవర్చుకొనే అలవాట్లే మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకు మీరు క్రమశిక్షణ మార్గంలో అనుసరించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేయడం వల్ల మిమ్మల్ని మీరు స్మార్ట్ గా మార్చుకోవచ్చు. అందుకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ ఇంటెలిజెన్స్ ను పెంపొంధించుకోండి..

బ్రేక్ ఫాస్ట్: మీరు ఉదయాన్ని నిద్రలేస్తానే, మీ వాహానాల్లో పరుగులు తీయడానికి బయలుదేరుతారు, మరి కారు వెంటనే పనిచేస్తుందా? దానికి కొంత పెట్రోల్ లేదా డీజిల్ పట్టించాలి కదా? అదేవిధంగా మీశరీరంలో జీవక్రియలన్నీ 8-10గంటలు నిద్రావస్తలో ఎటువంటి కదిలికలు లేకుండా పనిచేయకపోవడం వల్ల ఉదయం లేవగానే ఒంట్లో శక్తిలేనట్లు అనిపిస్తుంది. కాబట్టి నిద్రలేవగానే మీ శరీరానికి బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. మీరు తీసుకొనే ఉదయం బ్రేక్ ఫాస్టే మిమ్మల్ని ఆ రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. దీనిపై కొన్ని పరిశోధనులు కూడా జరిగాయి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారికంటే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకొనే వారి చాలా స్మార్ట్ గా ఉంటారని. మరి మీ బ్రేక్ ఫాస్ట్ కథ ఏమిటి?


వ్యాయామాలు: చాలా గ్యాప్ తర్వాత మీ కారు మీరు స్టార్ట్ చేసినప్పుడు, కొంత సమయం అది(గురుగుర ధ్వని చేస్తుంది)లేదా మెరాయిస్తుంది. ప్రతి యంత్రానికి కొంత వెచ్చదనం కావాలి. అదే విధంగా మీ శరీరానికి కూడా. మీరు వ్యాయామం చేయకపోవడం వల్ల మీ మెదడకు రక్తం అందక కొంత సమయం మెరాయిస్తుంది. జీవక్రియలు మందగిస్తాయి. అన్ని పనులు నిదానంగా జరుగుతాయి. దాంతో మీ స్మార్ట్ నెస్ అంతా మాయం అవుతుంది. మరి ఈ రోజు నుండి మీరు వ్యాయామం మొదలు పెడతారా?

తగినంత నిద్ర: మంచి జీవన శైలికి కావల్సింది తగినంత నిద్ర, విశ్రాంతి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రకరువౌతోంది. దాంతో అనారోగ్యాలు, ఊబకాయం. కాబట్టి రోజుకు కనీసం 8గంటల నిద్ర చాలా అవసరం. మీ శరీరానికిలాగే మీ మెదడుకు కూడా విశ్రాంతి అవసరం. నిజానికి నిద్రలేమి అనేది పిచ్చితనానికి కారణం కావచ్చు. కాబట్టి నిద్రను తేలికగా తీసుకోకండి. మరి ఈ రోజు నుండీ మీ నిద్ర ఎంత సమయం?

పంచదారకు బైబై, తేనెకు వెల్ కమ్: పంచదార మీ బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతుందని అనుకోవచ్చు, అయితే మీరు పప్పులు కాలు వేసినట్లే, పంచదార మీ రక్తంలోని గ్లూకోజ్ కు చిక్కులు తెచ్చిపెడుతుంది మరియు తాత్కాలికంగా మీ శక్తి స్థాయిలను అధికం చేస్తుంది. తర్వాత చివరి గంటల్లో తగ్గుతూ వస్తుంది. కాబట్టి పంచదారకు బదులు తేనె తీసుకోవడం ఉత్తమం.


ఆనందం కోసం చదవడం: చదడం వల్ల జీవిత పాఠాలను నేర్చుకోవడానికి చదడం ప్రాథమికం మార్గం, దీనికి ముగింపనేది ఉండదు. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం, మంచిది. ఇది ఇంటర్నెట్ విజ్ఞానంను భర్తీ చేయదు. చదవడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుంది మరియు మీ మెదడు వ్యాయామంగా సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ : యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఎప్పటికీ బ్రెయిన్ కు బెస్ట్ ఫుడ్స్ గా ఉంటాయి. అందుకు సింపుల్ రీజనర్ ఇవి మీ బ్రెయిన్ సెల్స్ కు ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తాయి. బెర్రీస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మరియు ఆలివ్ ఆయిల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి: ఒక ఆరోగ్యకరమైన గుండె ఒక ఆరోగ్యకరమైన మెదడుకు మందువంటింది. దీన్ని మీరు నమ్మరా? ఎందుకనీ, మీ గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు మెదడుకు కావల్సిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి మీ గుండెకు హానీ కలిగించే ఫాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ కు స్వస్తి పలికి, మంచి ఆరోగ్యకరమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

పజిల్స్ : మీ శరీరంలోని కండరాల వలే మీ మెదడుకు కూడా కొన్ని వ్యాయామాలు కావాలి. బ్రెయిన్ కు సంబంధించిన వ్యాయామం పజిల్స్. మీ మెదడు ఉపయోగించకపోతే, అప్పుడు అది బద్దకిస్తుంది మరియు మీరు బద్దకస్తులుగా మారుతారు. కాబట్టి, పజిల్స్ ఆడటం, రాయటం, సూడ్కో, మైండ్ గేమ్స్ ఈ రోజు నుండే మొదలు పెట్టండి. ఇవి బ్రెయిన్ ను యాక్టివ్ గా ఉంచుతాయి.

విరామం తీసుకోండి: బ్రెయిన్ సెల్స్ రిలాక్స్ పొందాంటే, వాటికి విశ్రాంతి కల్పించాలి. మీ బ్రెయిన్ సెల్స్ అలసటకు గురై ఉంటాయి. అటువంటి సమయంలో వెకేషన్ కు వెళ్ళడం అనేది మీ లైఫ్ స్టైల్లో ఒక భాగమనే గుర్తించాలి . ఇవే మీలోని ఇంటెలిజెన్స్ ను పెంచుతాయి.


మెడిటేషన్: మీరు హార్డ్ వర్క్ చేసేటప్పుడు మీరు ఎప్పటికీ హార్డ్ కాన్షియస్ గా ఉండలేరు. అందువల్ల, కొన్ని సార్లు మీరు మీ మనస్సు ఆదీనంలో ఉంచుకోలేరు. మెడిటేషన్ వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు మరియు మీకు నచ్చేవిధంగా ఉండగలుగుతారు.

మ్యూజిక్: ఇది నిజం, మ్యూజిక్ వినడం వల్ల, పరికరాలు ప్లే చేయడం వల్ల మీ ఐక్యూ 7పాయిట్లు పెరుగుతుంది.

తీసుకొనే వ్యర్థ ఆహారాలను మానుకోండి: శరీరానికి వంటి ఆహారాలను కడుపులోకి తోసేయకండి. ల్యాప్ టాప్, కంప్యూటర్ ముందు కూర్చొని మీ నిజజీవితంలోని సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా టీవీ ముందు కూర్చుని స్నాక్స్, చిప్స్, కూల్ డ్రిక్స్ తో ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకొంటున్నారు. వీటిన మానుకొన్నట్లైతే మీ ఐక్యూ ఖచ్చితంగా పెంచుకోవచ్చు.
ఒత్తిడి అనేది శక్తిమంతమైన చోదకశక్తి కావాలి తప్ప, ఎదుగుదలకు అవరోధంగా మారకూడదు.
- రిచర్డ్ కార్ల్‌సన్

అందమె ఆనందం

 
     
నారింజ తొక్కల్ని అయిదు నిమిషాలపాటు ఉడకబెట్టి చల్లార్చాలి. చల్లారినవాటితో మెడపైన, ముఖం మీద సుతిమెత్తగా రుద్ది అయిదు నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా వారంలో ఒక్కసారయినా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.