all

Friday, December 14, 2012

డాక్టర్‌ని అడగండి- ఇ.ఎన్.టి.

 
నా వయసు 38 ఏళ్లు. వృత్తిరీత్యా సంగీత పాఠాలు చేప్పుకునే నాకు ఈ మధ్య గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా ఉండటం, నొప్పిగా అనిపిస్తోంది. నాకు జీవనాధారం నా స్వరం. డాక్టర్ సూచన మేరకు మందులు వాడినా నా సమస్య తగ్గలేదు. నా సమస్యకు సరైన పరిష్కారం తెలియజేయగలరు?
- సోమాచార్యులు, తిరుపతి


సాధారణంగా ఎక్కువసేపు మాట్లాడేవారిని లేదా స్వరం ఉపయోగించేవారిని ‘ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్’ అని అంటారు. మనం ఉపయోగించాల్సిన దానికన్నా ఎక్కువగా గొంతు వాడుతున్నప్పుడు లేదా ఎక్కువసేపు మాట్లాడుతుంటే దానిని వాయిస్ ఓవర్‌యూజ్ లేదా వాయిస్ మిస్‌యూజ్ అంటారు. దీనివల్ల స్వరపేటికలో ఉండే వోకల్ ఫోల్ట్స్ అనే స్వరాన్ని పలికించే రెండు ఫోల్డ్స్‌లో సమస్యలు వస్తాయి. సాధారణంగా నాడ్యూల్స్ అనే సమస్య వస్తుంది. ఇది మనకు దెబ్బతగిలినప్పుడు ఏవిధంగా అయితే ఆ ప్రవేశంలో ఉబ్బుతుందో అదేవిధంగా వోకల్ ఫోల్ట్స్ పైన వస్తాయి. ఇవి ఆరంభదశలో ఉంటే మెడికల్ ట్రీట్‌మెంట్‌తో తగ్గించవచ్చు. కాని ఎక్కువైతే చిన్న ఆపరేషన్ చేసి తొలగించవలసి ఉంటుంది. వీటినే ‘సింగర్స్ నాడ్యుల్స్’ అంటారు. ఆపరేషన్ చేసి తొలగించిన తర్వాత లేదా మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత ‘వాయిస్ థెరపిస్ట్’ని కూడా సంప్రదించి వారి సూచనల ప్రకారం మీ వృత్తిని ప్రాక్టీస్ చేసుకోవలసి ఉంటుంది. గొంతును వీలైనంత వరకు తక్కువగా వాడండి. ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. అంటే ఎక్కువ నీరు తాగవలసి ఉంటుంది.

నేను తరచు విమాన ప్రయాణాలు చేస్తుంటాను. ఈ మధ్య విమానం పైకి వెళ్తున్నప్పుడు, ల్యాండ్ అయ్యే సమయంలో చెవి అంతా బిగుసుకుపోతుంది. ఆ సమయంలో వినికిడి తగ్గిపోతున్నట్లుగా, చెవులు దిమ్ముగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకు ఇలా అవుతుంది. నేను ఏం చేయాలో తెలియజేయగలరు.
- రాజేంద్ర, హైదరాబాద్


మన చెవిని ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి. మధ్య చెవి గాలితో నింపబడిన కావిటీ లాంటి భాగంలో మూడు ఎముకల గొలుసుతో పాటుగా ‘యూస్టేషియన్ ట్యూబ్’ అనే గొట్టంలాంటి భాగం కూడా ఉంటుంది. దీని ముఖ్యమైన పని ఏమిటంటే బయట వాతావరణంలోని గాలి పీడనం, మధ్యచెవిలో నుంచి ముక్కులోనికి తెరుచుకొని ఉంటుంది. మనం గాలి తీసుకున్నప్పుడు ముక్కువైపు ఉన్న భాగం ద్వారా గాలి మధ్య చెవిలోకి వెళుతుంది. ఈ గాలి పీడనం సమానంగా లేనప్పుడు చెవి మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా విమానంలో ప్రయాణించేటప్పుడు బయటవున్న గాలి పీడనం ఎక్కువగా మారుతుండటం వల్ల ఈ సమస్య వస్తుంది. మీరు చూయింగ్ గమ్స్ నమలటం లేదా ఇయర్ పిన్స్ వాడటం తగ్గించుకోవాలి. ఒకసారి ఇఎన్‌టి వైద్యుల్ని కూడా సంప్రదిస్తే మంచిది.
 

No comments: