all

Friday, December 14, 2012

ఉసిరి ప్రయోజనాలు

 
ఉసిరిలో ఎనభై శాతం నీళ్లు ఉంటాయి. ఇంకా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, పిండిపదార్థాలు, పీచుపదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఉసిరిలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది.

తేనెలో ఉసిరిపొడి కలిపి పరగడపున తీసుకుంటే కంటిచూపు మెరుగవుతుంది. భోజనానికి ముందు మజ్జిగలో తేనె కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపులో మంట తగ్గాలంటే టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఉసిరిపొడి, కొద్దిగా పంచదార కలిపిన గ్లాసు నీటిని సేవించాలి.

ఒంట్లోని హార్మోన్ల హెచ్చుతగ్గులను, చక్కెరస్థాయులను ఉసిరి నియంత్రణలో ఉంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను ఎదుర్కోగలిగే యాంటీబ్యాక్టీరియల్ సుగుణాలు మెండుగా ఉన్న ఉసిరి... అందాన్ని మెరుగుపరచడంలో అగ్రస్థానంలో ఉంటుంది. శిరోజాల ఆరోగ్యానికి, మేనిసౌందర్యానికి ఉసిరి కాయ, పొడి, రసం ఎంతగానో ఉపయోగపడతాయి.

No comments: