హజ్రత్ ఉమర్ (ర) గొప్పనాయకుడు. ప్రజారంజక పాలకుడు. పరిపాలనా దక్షుడు. ప్రతిక్షణం ప్రజాసంక్షేమం కోసమే ఆలోచించే ప్రభువు. పగలంతా పాలనావ్యవహారాల్లో తలమునకలై ఉన్నా, రాత్రుళ్లు కూడా సరిగా నిద్రపోయేవారు కారు. తన పాలనలో ప్రజలెలా ఉన్నారోనన్న ఆలోచన ఆయన్ను అనుక్షణం వెంటాడేది. ఈ ఆలోచనే ఆయన్ను గస్తీలు తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేలా ప్రేరేపించేది. ఖలీఫా హజ్రత్ ఉమర్ తరచుగా మారువేషంలో గస్తీ తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. ఒకరోజు హజ్రత్ ఉమర్ యథాప్రకారం గస్తీ తిరుగుతూ ఓ మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న పూరిపాకలో ఓ వితంతువు నివసిస్తోంది. కూలినాలి చేస్తూ తన ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటోంది.
ఓసారి ఆరోగ్యం సహకరించక ఆమె మూడురోజుల నుండీ పనికి వెళ్లకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షుద్బాధకు తట్టుకోలేక పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. ఎంత సర్దిచెప్పినా లాభం లేకపోయేసరికి ఆమె ఓ ఉపాయం ఆలోచించింది. ‘‘ఇక ఏడవకండి, కాసేపు ఓపిక పట్టండి. వెంటనే అన్నం వడ్డిస్తాను’’ అంటూ పొయ్యి రాజేసింది. ఓ గిన్నెలో నీళ్లు పోసి ఎసరు పెట్టింది. గరిటెతో మాటిమాటికీ తిప్పుతూ, ‘‘కాసేపట్లో ఉడికిపోతుంది, మీరలా కొద్దిసేపు నిద్రపోండి. అన్నం ఉడకగానే లేపి తినిపిస్తాను’’ అంటూ పిల్లలకు ఆశ కల్పించింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్న ఆ అమాయక పసిపిల్లలు తల్లి మాటలతో ఊరట చెంది, పొయ్యి చుట్టూ తలా ఒకవైపు మేను వాల్చారు. కొద్దిదూరంలో నిలబడి ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్న ఖలీఫా హజ్రత్ ఉమర్ ఆమెను సమీపించారు. ‘‘అమ్మా! పిల్లలు ఎందుకలా ఏడుస్తున్నారు? ఏమిటీ విషయం?’’ అంటూ ఆరా తీశారు, ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని పంటికింద బిగబట్టుకుని, ‘‘అది... అది కాదండీ... నిజానికి ఈ గిన్నెలో ఏమీ లేవు. పిల్లల్ని ఓదార్చడానికి కాసిని నీళ్లు, నాలుగు రాళ్లు పోసి వారిని నమ్మిస్తున్నాను, ఇంతకంటే ఇంకేమీ చేయలేని నిస్సహాయురాలిని’’ అన్నదామె కొంగుతో కళ్లు తుడుచుకుంటూ. పసిపిల్లల ఆకలిబాధను కళ్లారా చూసిన ఖలీఫాకు కూడా అప్రయత్నంగానే కళ్లవెంట నీళ్లు జలజలా రాలాయి. ‘‘అమ్మా! ఈ విషయం ఖలీఫాకు (పాలకుడు) చెప్పలేదా? పాలకుల దృష్టికి తీసుకెళితే నీకేమైనా సహాయం అందేదేమో!’’ అన్నారు ఉమర్. ‘‘అయ్యా! పేదవితంతువును. పాలకుల వద్దకు వెళ్లగలనా? అయినా తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకులకు లేదా? ప్రజాసంక్షేమం పట్టనివారు, కనీస ధర్మం నెరవేర్చలేని వారు పాలకులుగా ఎలా ఉంటారు?’’ అన్నదామె ఒకింత ఆవేదనతో. బాధ, నిస్సహాయతల్లోంచి ఆవేశంగా దూసుకొచ్చిన ఈ మాటలు ఖలీఫా ఉమర్ గుండెకు తూటాల్లా తగిలాయి. మారుమాట్లాడకుండా శరవేగంతో వెనుదిరిగిన ఉమర్ కోశాగారానికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ గోనెసంచిలో నింపుకుని స్వయంగా తన భుజాలపై మోసుకొచ్చి ఆమెకు అందజేశారు. స్వహస్తాలతో వండి పిల్లలకు తినిపించారు. ఈ ఆప్యాయతకు, ఇంతటి సహాయానికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియని ఆ స్త్రీ ‘‘అయ్యా... పాలకుడిగా (ఖలీఫాగా) ఉండాల్సింది నిజంగా మీరే. ఆ ఉమర్ కానేకాదు. పాలకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి’’ అంటూ కృతజ్ఞతగా తెలిపిందామె. పశ్చాత్తాప భావంతో కుమిలిపోతున్న ఉమర్ ‘‘అమ్మా! ఇప్పటివరకు మీ కష్టసుఖాలు తెలుసుకోలేకపోయిన ఉమర్‌ను నేనేనమ్మా! నన్ను మన్నించండి. నా వల్ల పెద్ద పొరబాటే జరిగిపోయింది. ఇకముందు అలా జరగకుండా చూసుకుంటాను’’ అంటూ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, పింఛను కూడా మంజూరుచేశారు. ఇంతటి జవాబుదారీతనం, బాధ్యతాభావం ఉండబట్టే ఖలీఫా హజ్రత్ ఉమర్ పాలనా కాలాన్ని చరిత్రకారులు సువర్ణాక్షరాలతో లిఖించారు. ఇందులో కనీసం వందోవంతైనా నేటి పాలకులు ఆచరించగలిగితే బాగుండు. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, May 16, 2013
పాలకులంటే ఇలా ఉండాలి,,,,,,,,,,,,,దైవాలజీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment