నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో మన గురించి మనం పట్టించుకునే తీరిక సమయాన్ని కేటాయించుకుంటూ చివరికి మరచిపోతున్నది మాత్రం మన ఆరోగ్యాన్నే. ఒడిదుడుకుల మధ్య సాగుతూ మరింత ఫ్యాషన్ గా కనపడడానికి జుట్టుకు రంగులు, డైలు వాడుతున్నారు. ఆధునిక జీవితంలో పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం ప్రభావంతో జుట్టు నిర్జీవంగా మారుతోంది.
అలాంటి జుట్టుపై ట్రిమ్మింగ్, ఫర్మింగ్, కలరింగ్ డై చేయించడం మూలంగా కుదుళ్లు కూడా బలహీనపడుతున్నాయి. ఇలాగే కొనసాగితే కొంత కాలనికి బట్టతల వచ్చేస్తుంది.జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఒత్తిడి. జుట్టు రాలడానికి ప్రధానంగా శరీర తత్వం, అనారోగ్యం, ఆపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమానత, మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పురుషుల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. ఒక వయసు దాటాక పురుషుల్లో స్త్రీల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అది పురుషులకు వస్తుంది.
ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్నే ‘మ్యాన్ ప్యాటర్నల్ బాల్డ్ నెస్' అంటారు. పురుషుల్లో ‘ఆండ్రోజన్' హార్మోన్ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇలా రాలిన జుట్టు తిరిగి రావడం కష్టం తరచుగా చుండ్రు, ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. ఫలితంగా బట్టతల వచ్చేస్తుంది..కాబట్టి బట్టతల రాకముందే అసలు జాగ్రత్తలు పాటించండి...కొన్ని పరిష్కార మార్గాలు మీకోసం...
అలాంటి జుట్టుపై ట్రిమ్మింగ్, ఫర్మింగ్, కలరింగ్ డై చేయించడం మూలంగా కుదుళ్లు కూడా బలహీనపడుతున్నాయి. ఇలాగే కొనసాగితే కొంత కాలనికి బట్టతల వచ్చేస్తుంది.జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఒత్తిడి. జుట్టు రాలడానికి ప్రధానంగా శరీర తత్వం, అనారోగ్యం, ఆపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమానత, మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పురుషుల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. ఒక వయసు దాటాక పురుషుల్లో స్త్రీల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అది పురుషులకు వస్తుంది.
ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్నే ‘మ్యాన్ ప్యాటర్నల్ బాల్డ్ నెస్' అంటారు. పురుషుల్లో ‘ఆండ్రోజన్' హార్మోన్ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇలా రాలిన జుట్టు తిరిగి రావడం కష్టం తరచుగా చుండ్రు, ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. ఫలితంగా బట్టతల వచ్చేస్తుంది..కాబట్టి బట్టతల రాకముందే అసలు జాగ్రత్తలు పాటించండి...కొన్ని పరిష్కార మార్గాలు మీకోసం...
ప్రతిరోజూ తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగండి : మీ జుట్టును, తలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రతిరోజూ తలస్నానం చేయడం అనేది జుట్టురాలడాన్ని నిరోధించడంలో ఒక భాగం. ఇలా చేయడం వల్ల, జుట్టు రాలడం, జుట్టు విరగడం వంటి సమస్యలకు దారితీసే అ౦టువ్యాధులను, చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాక శుభ్రంగా ఉన్నజుట్టు ఎక్కువ పరిమాణంలో ఉన్న అనుభూతిని ఇస్తుంది.
జుట్టు రాలినపుడు విటమిన్లు : విటమిన్లు ఆరోగ్యంగా ఉండడానికే కాకుండా మీ జుట్టుకి కూడా చాలా మంచిది. విటమిన్ ఎ, మీ తలమీది సిబం ఆరోగ్యకర నిర్మాణానికి ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ, మీ తలమీద రక్తప్రసరణ సరిగా ఉండేటట్లు చేసి కోల్పోయిన జుట్టును తిరిగి పొందడానికి సహాయపడుతుంది. విటమిన్ బి మీ జుట్టు ఆరోగ్యకరమైన రంగుతో ఉండడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్లతో సంపన్న ఆహరం : శుష్క మాంసాలు, చేపలు, సోయా లేదా ఇతర ప్రోటీన్లను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది.
హెడ్ మసాజ్: జుట్టు రాలుతున్న వారు కొన్ని నిముషాలు సుగంధ తైలాలతో తలపై కొంత సమయం పాటు మర్దనా చేసుకోవడం తపానిసరి. ఇది మీ జుట్టుకుదుళ్ళను ఉత్సాహభరితం చేయడానికి సహాయపడుతుంది. మీరు బాదాం లేదా సేసమే నూనెలో లవేండర్ ని కలపవచ్చు.
తడి జుట్టును దువ్వకండి : జుట్టు తడిగా ఉన్నపుడు, చాలా బలహీనమైన స్థితిలో ఉంటుంది. అందువల్ల తడి జుట్టును దువ్వితే జుట్టురాలే అవకాసం ఎక్కువగా ఉంటుంది. కానీ తడి జుట్టును దువ్వవలసి వస్తే, వెడల్పు పళ్ళ దువ్వేనను ఉపయోగించండి. అదేవిధంగా తరచుగా జుట్టును దువ్వడం మానండి దీనివల్ల జుట్టు దెబ్బతిని ఎక్కువగా రాలుతుంది. చిక్కుబడ్డ వెంట్రుకలకు మీ వేళ్ళను ఉపయోగించండి, దువ్వెన లేదా బ్రష్ వాడకండి
వెల్లి రసం, ఉల్లి రసం లేదా అల్లం రసం
మీ తలపై ఏదోఒక రసాన్ని రుద్దండి, రాత్రంతా ఉంచి పొద్దున్న కడిగేయండి. ఒక వారంపాటు ఇలా చేయండి, ఫలితాన్ని మీరే గుర్తిస్తారు.
మిమ్మల్ని మీరు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుకోండి : జుట్టు కుదుళ్ళు పావువంతు నీటిని కలిగిఉంటాయి అందువల్ల మీరు రోజులో కనీసం నలుగు నుండి ఎనుమిది కప్పుల నీరు తీసుకొని ఆర్ద్రీకరణ తో ఉండాలి, దీనివల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది.
మీ జుట్టుకు గ్రీన్ టీ ని పట్టించండి : గ్రీన్ టీ ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. మీరు చేయవలసినదల్లా ఒక కప్పు నీటిలో రెండు బాగ్ ల గ్రీన్ టీ ని కాయండి, చల్లబడిన తరువాత, మీ జుట్టుకు అప్ప్లై చేయండి. ఒక గంట తరువాత మీ జుట్టును పూర్తిగా శుభ్రం చేయండి. ఇలా ఒక వారం నిండి పదిరోజులు చేసి, ఫలితాన్ని చూడండి.
జుట్టుకు చేడు ఏమిటో తెలుసుకోండి : మీరు మీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలుసుకోవాలి. టవలుతో పొడి జుట్టును రుద్దకూడదు, అలాకాకుండా జుట్టు సహజంగా ఆరనివ్వాలి.
మద్య పానీయాలను తగ్గించండి : మీకు జుట్టు రాలుతుంటే మద్యపానం తగ్గించండి ఎందుకంటే మద్యపానం జుట్టు పెరుగుదలను అరికడుతుంది. అందువల్ల మీరు మీ జుట్టు పెరుగుదలను చూడాలి అంటే మద్యపానం తగ్గించని లేదా మానేయండి.
పొగత్రాగడం మానేయండి : సిగరెట్లు తాగడం వల్ల తలలో తగినంత రక్తప్రసరణ జరగదు ఇందువల్ల జుట్టు ఎదుగుదల తగ్గిపోతుంది.
శారీరక శ్రమ : ప్రతిరోజూ శారీరక శ్రమకు కొంత సమయం కేటాయించండి. నడక, ఈత లేదా బైక్ సవారీ ప్రతి రోజూ 30 నిముషాలు చేయడం వల్ల హార్మోన్ల స్థితి సరిగా ఉండడం, ఒత్తిడి స్థాయిని తగ్గించి జుట్టు రాలడం తగ్గడానికి సహాయపడుతుంది.
ఒత్తిడి లేకుండా ఉండడం : జుట్టు రాలడానికి ఒత్తిడి తో సంబంధం ఉన్నట్లు వైద్య పరిశోధన అధ్యయనాలు కనుగొన్నాయి. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురుకాకుండా చూసుకోండి; ప్రాణాయామం నేర్చుకోవడం ఒక మార్గం. ప్రాణాయామం, యోగా వంటివి కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా హార్మోన్ల స్థితిని పునరుత్పత్తి చేస్తాయి.
ఎప్పుడూ వేడిగా & పొడిగా ఉంచకండి : మీరు తరచుగా మీ జుట్టును వేడిగా, పొడిగా ఉంచడం మానుకోండి. వేడి జుట్టు ప్రోటీన్లను నీరసింప చేస్తాయి, ఎపుడూ వేడిగా, పొడిగా ఉంచడం వల్ల బలహీనంగాం ,పెళుసుగా అయ్యి జుట్టు తాలుతుంది.
మీ తలలో చెమట లేకుండా చూసుకోండి : ఆయిలీ జుట్టు గల పురుషులు, వేసవిలో చెమటవల్ల చుండ్రుకి గురౌతారు, జుట్టురాలే ప్రమాదం కూడా ఉంది. కలబంద, నిమ్మ ఉన్న షాంపూలు మీ తలను చల్లగా ఉంచి, చుండ్రును నివారిస్తాయి. అంతేకాకుండా, హెల్మెట్ ధరించే పురుషులు వేసవిలో జుట్టురాలడం ప్రధాన సమస్య. చెమట రంధ్రాలలో పేరుకుని జుట్టు కుడుల్లను బలహీన పరచి పురుషులలో జుట్టురలడం సంభవిస్తుంది. అందువల్ల మీ జుట్టుకి స్కార్ఫ్/చేతి రుమాలు లేదా టెర్రీ క్లాత్ హెడ్ బాండ్ ధరించడం వల్ల జుట్టురాలడాన్ని నివారిస్తుంది.
మీ జుట్టు శైలిని మార్చుకోవడం (పొడవు జుట్టు గల పురుషులు): మీరు మీ జుట్టును ఇప్పటివరకు కోల్పోకుండా ఉంటె, జుట్టును లూజుగా వదిలేయండి. పోనీటైల్, బ్రైడ్, కృత్రిమ కేశాలంకరణ, జుట్టు మోడళ్ళు లాగి కట్టడం వంటివి బట్టతలకు దారితీస్తాయి.
మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి : ఆరోగ్య సమస్యలు జుట్టురాలడానికి దోహదపడతాయి. మీరు దీర్ఘకాల వ్యాధితో, అధిక జ్వరంతో, అంటువ్యాధులను సరిగా సమర్ధించుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు.
మందుల విషయంలో శ్రద్ధ వహించాలి : కొన్ని మందులు దుష్ఫలితాలను కలిగిఉండడం వల్ల జుట్టు రాలవచ్చు. వైద్యుడిని సంప్రదించి మీరు మీ పరిస్థితిని తెలియచేయండి. మందుల వల్ల జుట్టు రాలుతుందేమో తెలుసుకోండి, అదే కారణమైతే మందులు మార్చమని అడగండి.
రసాయనాలను దూరంగా ఉంచండి : గాఢమైన రసాయనాలు, శాశ్వత జుట్టు రంగులు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీకు జుట్టు రాలుతుంటే, మీ జుట్టుకు రంగు వేయవద్దని సూచన.
No comments:
Post a Comment