all

Sunday, February 2, 2014

నూనె పెట్టాలి ఇలా...



'జుట్టుకి నూనె పెట్టుకునేందుకు కూడా ఒక పద్ధతి ఉంది. అలాకాకుండా ఎలాగంటే అలా రాస్తే జుట్టు రాలిపోతుంది, పాడయిపోతుంది' అంటున్నారు ప్రముఖ హెయిర్‌స్టయిలిస్ట్ జావెద్ హబీబ్. అంతేకాదు జుట్టు రకాన్ని బట్టి నూనె ఎంపిక చేసుకోవాలి అంటూ కొన్ని సలహాలు సూచనలు చేశారాయన.

-గోరు వెచ్చటి నూనెలో చేతి వేళ్లు ముంచి, జుట్టును రెండు భాగాలుగా చేసి మాడుకి నూనె పట్టించి మునివేళ్లతో నెమ్మదిగా మర్దనా చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు మర్దనా చేయడం వల్ల మాడుకి రక్త సరఫరా బాగా అవుతుంది.

-రాత్రి నూనె పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చేస్తే ఫలితం బాగుంటుంది. ఒకవేళ పగలు పెట్టుకుంటే కనక ఎక్కువ సమయం మాడుకి నూనె పట్టించాలి. 24 గంటలకంటే ఎక్కువ మాత్రం తల మీద నూనె ఉంచుకోవద్దు. అలా ఉంచితే జుట్టుపై దుమ్ము చేరుతుంది. దాంతో జుట్టు బలహీనపడి రాలిపోతుంది.

-నూనె పెట్టిన తరువాత వేడి నీళ్లలో ముంచిన తుండుతో ఆవిరి పడితే నూనెని జుట్టు బాగా పీల్చుకుంటుంది. ఇందుకు వేడి తుండును తలకు చుట్టి పదినిమిషాలు ఉంచాలి. ఇలా చేసేటప్పుడు తుండు మరీ వేడిగా ఉండకూడదు. వేడి ఎక్కువగా ఉంటే జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి.

-వారానికి ఒకసారి జుట్టుకి నూనె పట్టించాలి. కుదిరితే ఒకటికంటే ఎక్కువ సార్లు పెట్టినా మంచిదే.
జుట్టు రకాన్ని బట్టి ...
నార్మల్ హెయిర్: ఈ రకం జుట్టు జిడ్డుగా లేదా పొడిగా ఉంటుంది. జొజొబా, బాదం, ఉసిరి నూనెలు వాడాలి.
పొడి జుట్టు: ఈ జుట్టు నిస్సారంగా కనిపిస్తుంది. త్వరగా చిట్లిపోతుంది. బాదం, జొజొబా, కొబ్బరి, నువ్వులు, ఆవాలు, కోకో-బటర్ నూనెలు వాడాలి.

జిడ్డు జుట్టు: ఆలివ్, నువ్వులు, జొజొబా నూనెలు వాడాలి.

చుండ్రు జుట్టు: టీ ట్రీ నూనె చాలా బాగా పనిచేస్తుంది.

ఏ నూనె వాడుతున్నా అందులో విటమిన్-ఇ కలిపి వాడితే జుట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది.

వాతావరణం తేమగా ఉంటే జుట్టుకి నూనె రాయొద్దు. అలాగే జిడ్డు చర్మం వాళ్లకి మాడు నుంచి నూనె ఉత్పత్తి అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా జుట్టుకి నూనె వాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ సేపు ఆరు బయట ఉండేవాళ్లు కూడా నూనె రాసుకోవద్దు. దీనివల్ల దుమ్ము వచ్చి చేరిజుట్టు ఎక్కువగా రాలుతుంది.

 

రాలే జుట్టుకు కరివేపాకు ప్యాక్........

పౌష్టికాహార లోపం, కాలుష్యాలు దాడి చేయడం వల్ల, షాంపూలు, తలకు వేసుకునే రంగులతో రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. మరి దీన్ని ఆపడం ఎలా? అది మీ చేతుల్లోనే ఉంది. అందుకు బెస్ట్ మెడిసిన్ కూరల్లో వాడే కరివేపాకు. అదెలాగంటే...పొడవు, మందం బట్టి జుట్టుకు సరిపడా కరివేపాకులు తీసుకుని మెత్తగా రుబ్బాలి.

ఇందులో నానబెట్టిన మెంతుల్ని ఆ నీళ్లతో సహా కలపొచ్చు. ఈ పేస్ట్‌ను మాడుకు రాసుకుని రెండు గంటల పాటు ఉంచుకోవాలి. రాసుకున్న మిశ్రమం త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకోవాలి.

జుట్టు జిడ్డుగా అతుక్కున్నట్టు ఉంటుంది గాని ఆరిన తరువాత బాగానే ఉంటుంది. ఒకవేళ మరీ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తే మైల్డ్ షాంపూ వాడొచ్చు.జుట్టు ఆరిన తరువాత దువ్వితే జుట్టుకు కరివేపాకులేమైనా ఉంటే వచ్చేస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి జుట్టుకు వేసుకుంటే పట్టుకుచ్చులా మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం. అంతేకాదు ఎక్కువ జుట్టు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది.

జుట్టుకు పళ్లతో ప్యాక్‌లు, మాస్క్‌లు..



జుట్టు పై రకరకాల ప్రయోగాలు చేసి రసాయనాలతో నింపి పాడుచేశారా. అలాంటి జుట్టుకు జీవం తినే పళ్లతో వస్తుంది. ఒక అరటిపండు, ఒక గుడ్డు తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట లేదా నలభై నిమిషాలు ఉండాలి. ఆ తరువాత నీళ్లతో జుట్టుని కడిగి తుండుతో నెమ్మదిగా వత్తాలి. ఇలాచేస్తే రసాయనాల వల్ల పాడయిన జుట్టు రిపేర్ అవడం ఖాయం.
 స్టయిల్, ఫ్యాషన్‌లంటూ తడవకో రంగు వేసి జుట్టు గడ్డిలా తయారైందా... ఈ సమస్యనుంచి బయటపడేయడంలో అరటి పండు సాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వేప పొడి, ఒక కప్పు బీరు, ఒక కప్పు అరటిపండు పేస్ట్, రెండు కప్పుల బొప్పాయి పేస్ట్‌లను ఒక గిన్నెలో వేయాలి. ఇందులో గోరు వెచ్చటి నీళ్లు పోసి పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకి రాసి అరగంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.
 రోజులో ఎక్కువ సమయం నెత్తిన చెయ్యి పెట్టుకుని గీరుతూనే ఉన్నారా. అయితే చుండ్రు సమస్య కావచ్చు. దీన్నుంచి బయటపడేందుకు అరకప్పు ఉసిరి రసం, ఒక కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాలను గిన్నెలో వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. దీన్ని తలకు రాసుకుని గంట తరువాత గోరువెచ్చటి నీళ్లతో తల కడిగేయాలి. చివర్లో కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు మెరవడమే కాకుండా చుండ్రు సమస్యను ప్రభావంతంగా తగ్గిస్తుంది.
 జుట్టు తెగ రాలిపోతుందా అయితే సగం అవకాడో తీసుకుని మెత్తగా చేయాలి. ఇందులో మూడు టేబుల్ స్పూన్ల మెంతుల పేస్ట్, పావు కప్పు గ్రీన్ టీ, సరిపడా గోరువెచ్చటి నీళ్లు పోసి కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్‌లా వేయాలి. ఇది మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఈ మాస్క్ కాస్త రెగ్యులర్‌గా వేసుకుంటే ఫలితం బాగుంటుంది.

 తలంటుకున్న కాసేపటికే జిడ్డు కారుతుంటుంది కొందరి జుట్టు. ఈ రకం జుట్టు ఉన్న వాళ్లు కమలా రసం మూడు టేబుల్ స్పూన్లు, పెరుగు ఒక కప్పు, ఉసిరి పొడి మూడు టేబుల్ స్పూన్లు, తులసి ఆకుల పొడి ఒక టేబుల్ స్పూన్ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకి, మాడుకి, జుట్టు చివర్లతో సహా పట్టించి నలభై నిమిషాల నుంచి గంట సేపు ఉంచాక గోరు వెచ్చటి నీళ్లతో కడిగేయాలి.

 

ముందు జాగ్రత్తలతోనే ఆరోగ్యవంతమైన సంతానం......



ఆరోగ్యవంతమైన సంతానం కలిగినప్పుడే దంపతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. మరి ఆరోగ్యవంతమైన సంతానం కావాలంటే గర్భం ధరించక ముందు నుంచే ప్లానింగ్ చేసుకోవాలి. దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఉండటంతో పాటు, పండంటి బిడ్డను పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు

సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక. ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకంగా ఎలా ప్లాన్ చేసుకుంటారు?
అని చాలా మందికి సందేహం ఉంటుంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక వైద్యుల దగ్గరకు వెళతారే తప్ప ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాం, తగిన సలహా ఇవ్వండని వైద్యుల దగ్గరకు ఒక్కరు కూడా వెళ్లరు. చాలా మంది చేసే తప్పు ఇది. నిజానికి ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే గర్భం ధరించకముందే వైద్య సలహాలు తీసుకోవాలి.

వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు, వాటి వల్ల తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.ఏం చేయాలి?ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముందుగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

అక్కడ వైద్యులు కుటుంబ చరిత్రను అడిగి తెలుసుకుంటారు. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉందా? మేనరికం వివాహమా? ఇతర సమస్యలేమైనా గతంలో వచ్చాయా? తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. దాని ఆధారంగా సలహాలు ఇస్తారు. ఆరోగ్యవంతమైన గర్భధారణకు దంపతులకు ఈ కౌన్సెలింగ్ బాగా ఉపయోగపడుతుంది. మేనరికం వివాహం చేసుకున్నట్లయితే మరిన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. వారి సంతానంలో క్రోమోజోమ్ అబ్‌నార్మాలిటీస్ వల్ల పిల్లలు వైకల్యంతో జన్మించే అవకాశం ఉంటుంది.

పుట్టుకతో కొన్ని లోపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కౌన్సెలింగ్‌లో ఈ విషయం చెప్పడం ద్వారా జెనెటిక్ టెస్టింగ్ చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేయవచ్చు.ఇవీ పాటించాలిప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నట్లయితే మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు వేసుకోవడం ప్రారంభించాలి. గర్భం నిర్ధారణ అయ్యాక 3 నెలల పాటు కొనసాగించాలి. ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉన్నా, తల్లిదండ్రులకు డయాబెటిస్ ఉన్నా ఎండోక్రైనాలజిస్ట్, ఫిజీషియన్, గైనకాలజిస్ట్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్స్ ఉన్నట్లయితే వాడుతున్న మందులు తెలియజేయాలి.

ఫిట్స్ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి ముందు నాలుగైదు రకాల మందులు వాడవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఒకే మాత్రను వాడాల్సి వస్తుంది. అంటే పాలీథెరపీ నుంచి మోనోథెరపీకి మారడం జరుగుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ గుండె సంబంధ సమస్యలు ఉన్నట్లయితే వైద్యులు రిస్క్‌ను అంచనా వేస్తారు. రిస్క్ తక్కువగా ఉన్నట్లయితే వారు సూచించిన సలహాలు పాటించడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.

రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండాలి.అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే...అధిక రక్తపోటు ఇప్పుడు ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ప్రెగ్నెన్సీకి ముందే బీపీ ఎలా ఉందో చెక్ చే యించుకోవాలి. ఒకవేళ బీపీకి మందులు వాడుతున్నట్లయితే ఆ వివరాలను డాక్టర్‌కు తెలియజేయాలి.

ప్రెగ్నెన్సీలో మందులు మార్చుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీకి ముందు ప్లానింగ్ ఉంటే కనుక సమస్య రాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్ ఉంటే కనుక అదుపులో ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలంగా డయాబెటిస్ ఉన్నట్లయితే కళ్లు ఎలా ఉన్నాయి. కిడ్నీల పనితీరు ఎలా ఉందీ అనే విషయాన్ని వైద్యులు పరీక్షించి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో మరో ముఖ్యమైన అంశం థైరాయిడ్ గ్రంధి పనితీరు సక్రమంగా ఉండాలి.

థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నప్పుడే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. థైరాయిడ్ లెవెల్స్‌లో తేడా ఉంటే కనుక మందులు వాడి నార్మల్‌గా ఉండే లా చూసుకోవాలి. కొందరు అధిక బరువు ఉంటారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల ప్రెగ్నెన్సీలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక బరువు ఉన్నట్లయితే బరువు తగ్గి నార్మల్ వెయిట్‌కు వచ్చిన తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కొంరదు అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటారు.

బేరియాటిక్ సర్జరీ మూలంగా మైక్రోన్యూట్రి యెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి రెండేళ్ల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఆ తరువాత ప్లాన్ చేసుకోవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లయితే పోషకాహారం తీసుకోవడం, మందులు వాడటం ద్వారా సరిచేసుకోవాలి. ప్రెగ్నెన్సీకి ముందే వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందవచ్చని గుర్తుంచుకోవాలి.

డాక్టర్ రాధిక
సీనియర్ గైనకాలజి
స్ట్యశోద హాస్పిటల్స్సో
మాజిగూడ, హైదరాబాద్ఫోన్ : 90300 56362 -

పోషకాలు ఉన్నాయి కాబట్టి...



ఈ మధ్య చిరుధాన్యాలు, ముతకబియ్యం తినడాన్ని ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. వీటిని ఎందుకింతగా ఇష్టపడు తున్నారంటే వాటిలో బోలెడు పోషకాలు ఉన్నాయి కాబట్టి. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా వాటికే ఓటేస్తారు. చిరుధాన్యాలుజొన్న, రాగి, సజ్జలపై ప్రేమ బాగా పెరిగిపోవడానికి కారణం ఇవన్నీ గుండెకు మేలుచేస్తాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

వందగ్రాముల రాగిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అదే గోధుమ, బియ్యంలలో అయితే 50 మిల్లీగ్రాముల క్యాల్షియమే ఉంటుంది. బార్లీలో ఎనిమిది ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలతో పాటు మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, పాస్ఫరస్‌లు కూడా ఉన్నాయి. జొన్నలో టాన్నిన్, యాంథోసైనిన్ వంటి ఫైటోకెమికల్స్ మెండుగా ఉన్నాయి. ఇవి మనుషుల్లో కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అరికడతాయని శాస్త్రీయంగా రుజువైంది. అలాగే తోటకూర గింజల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు 20శాతం అదనంగా ఉంటాయి.

ముతకబియ్యం (బ్రౌన్‌రైస్)ముతకబియ్యంలో కొవ్వు తక్కువగా ఉండడమే కాకుండా ఎన్నో లాభాలున్నాయి. వడ్ల గింజల పై పొరను మాత్రమే తీయడం వల్ల సహజసిద్ధమైన పోషకాలు బయటికి పోవు. అందుకని ఈ బియ్యాన్ని తినడం వల్ల గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చు.
దీంతోపాటు ఊబకాయం, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటివి కూడా దరిచేరవు. రక్తంలో ఇన్సులిన్ మోతాదును కూడా సరిచేస్తాయి ఇవి. వీటిలో ఉండే 'క్యు10' అనే సహ ఎంజైమ్ కొవ్వు, చక్కెరల్ని శక్తిగా మారుస్తుంది. ఇదేకాకుండా ఈ బియ్యంలో 70 యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, శక్తిస్థాయిని క్రమపరిచే బి-విటమిన్స్ ఉన్నాయి.

పాలిష్ పట్టిన బియ్యంలో ఇవేవీ ఉండవు. ముతకబియ్యంలో విటమిన్-ఇ మెండుగా ఉంటుంది. దీనిపై ఉండే బ్రాన్ పొర జింక్, మెగ్నీషియంలను కలిగి ఉంటుంది. అందుకని ఈ బియ్యాన్ని తిన్న వాళ్ల చర్మం మెరిసిపోతుంది. -

వసంతపంచమి



సకల విద్యాస్వరూపిణి, సమస్త వాఙ్మయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తకధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు వేదవేదాంగవేత్త అవుతాడు, పరమ మూర్ఖుడు కూడా మహావిద్వాంసుడుగా మారిపోతాడు. అందుకు మహాకవి కాళిదాసే మంచి ఉదాహరణ. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకం కోల్పోయి మతిహీనుడై సర్వం పోగొట్టుకుంటాడు. అభ్యసించే విద్య, చేసే వృత్తి, చేపట్టిన పని... ఇలా ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సంపాదించాలంటే కృషి, పట్టుదలతోపాటు సరస్వతీదేవి అనుగ్రహమూ అవసరం. అందుకే ఆ చల్లని తల్లి కరుణ కోసం తహతహలాడనివారుండరు.

ఆమె ప్రాదుర్భవించిన పరమ పవిత్రమైన మాఘపంచమి పర్వదినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెకు తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రాలతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి.

సరస్వతి అంటే కేవలం చదువు మాత్రమే కాదు. సంస్కారం, విచక్షణాజ్ఞానం, వినయం, వివేకం, లోకజ్ఞానం, వృత్తి నైపుణ్యం కూడా సరస్వతే! చదువులు నేర్పే గురువులందరూ ఆ తల్లికి ప్రతిరూపాలే! కాబట్టి శారదాదేవి జన్మదినాన ఆమెను పూజించడంతో పాటు వేదపండితులు, గురువులు, విద్యావంతులు, వృత్తి నిపుణులు, సంగీత, నృత్య కళాకారులు... మనకు విద్య గరిపిన గురువుని, వివేకజ్ఞానాన్ని ఇచ్చినవారిని మనకు చేతనైనంతలో సత్కరించడం, చేతకాకపోతే చేతులెత్తి నమస్కరించడం సంస్కారం.

Tuesday, January 7, 2014

తెల్ల జుట్టు నివారణకు బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్

తెల్ల జుట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో పొందడం సహజం. ముఖ్యంగా గతంలో వయస్సు పెరగడం వల్ల హార్మోనుల అసమతుల్యతతో తెల్ల జుట్టు ఏర్పడుతుండేది. కానీ ప్రస్తుత కాలంలో ఒత్తిడి, జీవశైనలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల, కాలుష్యం వల్లకూడా చిన్న వయస్సులలోనే చాలా మంది తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. తెల్ల జుట్టుకు ప్రధాణ కారణం అనారోగ్యకరమైన డైట్, టన్స్ లో ఒత్తిడి వంటివి ప్రధాన కారణంగా ఉన్నాయి .

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మీరు కూడా ఒకరైతే, మీరు మీ జుట్టు కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. అందువల్ల మీ జుట్టు మొదల్లో మెలనిన్ ఉత్పత్తికి కొంత సమయం ఉంటుంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటాన్ని, దాచుకోవడం కూడా కష్టమైన పనే. ఈ సమస్య ఉన్నవారు వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ తెల్లజుట్టును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.



తెల్ల జుట్టు సమస్య ఉన్నప్పుడు, మార్కెట్లో దొరికే కొన్ని రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించే తెల్లజుట్టు కనబడకుండా చేస్తారు, కానీ జుట్టు మొదళ్ళు మాత్రం బలహీనపడుతాయి . అందువల్ల, తెల్లజుట్టు నివారణకు కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి మీ జుట్టును సహజంగా, నేచురల్ కలర్ ఉండేట్లు పెంచుకోండి . అటువంటి హోం రెమెడీస్ కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా ఉన్నాయి.



అల్లం: మీ తెల్లజుట్టును, నేచురల్ హెయిర్ కలర్ పొందాలంటే, ఈ హోం రెమెడీని ప్రయత్నించాల్సిందే. కొంచెం అల్లం తీసుకొని, చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి, కొద్దిగా పాలు జత చేసి చిక్కటి పేస్ట్ గా తయారుచేసి, మీ తెల్లజుట్టుకు పట్టించి , పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే, మంచి ఫలితం ఉంటుంది.


తేనె:  తేనె ఉపయోగించడం వల్ల మీ జుట్టు నేచురల్ గా కనిపిస్తుంది. తెల్ల జుట్టుకు కొంచెం, తేనె అప్లై చేయడం వల్ల మీ జుట్టు నేచురల్ గా మారుతుంది.


కొబ్బరి నూనె:   కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం పిండి, మిక్స్ చేసి, తలకు పట్టించడం వల్ల మీ జుట్టు రంగా నేచురల్ గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిం, పది నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.



పాలు: పాలు జుట్టుకు మంచి షైనింగ్, పోషణ అంధించడంతో పాటు, నేచురల్ కలర్ ను కూడా అంధిస్తుంది . కాబట్టి, ఒక కప్పు పాలను తలమీద పోసుకొని, ఐదు, పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో షాంపుపెట్టి, తలస్నానం చేసుకోవాలి.

కరివేపాకు:   పొడిబారిన మరియు జిడ్డుగల జుట్టు బెస్ట్ హోం రెమెడీ కరివేపాకు అని నిపుణుల సలహా.అంతే కాదు, ఇంకా ఇది తెల్లజుట్టుకు కరివేపాకు నేచురల్ హెయిర్ కలర్ అంధిస్తుంది.


పెరుగు: పెరుగు, మరియు హెన్నా రెండూ సమంగా తీసుకొని, మెత్తగా పేస్ట్ ను కలుపుకొని, తలకు ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ రసం ఉల్లిపాయ రసం మరియు ఉల్లిపాయ గుజ్జును తలకు పట్టించడం వల్ల జుట్టు మంచి షైనింగ్ తో పాటు, నేచురల్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. ఈ హోం రెమెడీని నాలుగు వారాలకొకసారి ప్రయత్నించండి.




బ్లాక్ పెప్పర్:

ఉడికించిన బ్లాక్ పెప్పర్ వాటర్, తెల్లజుట్టు నివారణకు ఒక మంచి హోం రెమెడీ. ఇది తెల్లజుట్టుకు వ్యతిరేకంగా నేచురల్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. తలస్నానం చేసిన తర్వత చివరగా ఒక మగ్గు బ్లాక్ పెప్పర్ వాటర్ ను తలరా పోసుకోవాలి.


ఆమ్లా:  జుట్టు సంరక్షణ విషయంలో ఈ హోం రెమెడీని పురాత కాలం నుండి ఉపయోగిస్తున్నారు.జుట్టుకు ఉసిరి ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్. మీ తెల్ల జుట్టును నివారిస్తుంది. మరియు జుట్టుకు మంచి షైనింగ్ తో పాటు, బలాన్ని కూడా చేకూర్చుతుంది.


బ్లాక్ టీ లేదా కాఫీ: బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ హెయిర్ కేర్ కు నేచురల్ గా చలా మంచిది. అదే విధంగా మీ గ్రేహెయిర్ ను నివారించడంలో కూడా ఈ నేచురల్ కలర్ అంధించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

వింటర్ హెయిర్ కేర్ టిప్స్ ఫర్ బ్యూటిఫుల్ హెయిర్

ఈ కాలంలో పొడిజుట్టు మరింతగా పొడిగా తయారవుతుంది. స్టీమ్‌ హీట్‌ వాడినా లేదా బయట ఎక్కువసేపు తిరిగినా జుట్టు మరింత పొడిబారుతుంది. అధికంగా షాంపు చేసుకోకుండా ఉండడం మంచిది. నరిషింగ్‌ షాంపూల్ని వాడాలి. కండీషనర్లు వాడితే ఫలితం కనిపిస్తుంది.

షాంపు చేసుకున్న ప్రతిసారీ కండిషనర్‌ వాడుతుంటే జుట్టు మృదువుగా మెరుస్తుంది. మెరుపును పెంచే సెరం లేదా క్రీమ్‌లను ఉపయోగించాలి. తలస్నానం తర్వాత జుట్టును డ్రయ్యర్‌ ద్వారా కాకుండా సహజంగా ఆరబెట్టుకోవాలి. ఏ మందుల షాపునకు వెళ్లినా, సూపర్‌మార్కెట్లకు వెళ్లినా ముఖానికి, శరీరానికి, కళ్లకు, చేతులకు, గోళ్లకు రకరకాల క్రీమ్‌లు, లోషన్లు జెల్‌లు దర్శనమిస్తున్నాయి.

వింటర్ హెయిర్ కేర్ టిప్స్ ఫర్ బ్యూటిఫుల్ హెయిర్

మరి శిరోజాల సంగతేంటి?

మాడు చికిత్సలు, హెడ్‌మసాజ్‌లు, లీవ్‌ ఇన్‌ క్రీమ్స్‌ అన్నీ ప్రభావవంతంగానే పనిచేస్తాయి. రాత్రివేళ పడుకునే ముందు తలకు చికిత్సలు బాగా ఉపకరిస్తాయి. సమయంలో విశ్రాంతిగా ఉంటారు. మురికి జిడ్డు పగటివేళ మిరుమిట్లు గొలిపించే లైటింగ్‌ బెడద, సూర్యకిరణాల తాకిడి ఇవేమీ అస్సలు ఉండనే ఉండవు. అన్నింటికీ మించి శిరోజాల పట్ల తగినంత శ్రద్ధ చూపగల సమయమూ ఉంటుంది.

శరీరమూ,శిరోజాలు కూడా ఎటువంటి స్ట్రెస్‌ లేకుండా ఉండి, రాత్రివేళ చికిత్సలకు అనకూలంగా ఉంటాయన్న సంగతిని గుర్తించాలి. రాత్రివేళ పడుకునే ముందు తలను వందసార్లు దువ్వెనతో దువ్వుకుంటామని అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పే మాటల్ని గుర్తుచేసుకోవాలి. చాలామంది ఈ మాటల్ని కేవలం అపోహ మాత్రమే అని కొట్టివేస్తారు. అయితే ఇది ప్రభావవంతమైన రొటీన్‌ అని పరిశోధనలు పేర్కొంటు న్నాయి.

దీనివల్ల మాడుకు చక్కని మసాజ్‌ చేసినట్లు అవుతుంది. మృత కణాలు తొలగిపోయి, జుట్టు పట్టుకుచ్చులా మాదిరి మెరుస్తూ చిక్కులు పడకుండా ఉంటుంది. విభిన్న స్ట్రోక్స్‌ రాత్రికి రాత్రి శిరోజాల రక్షణ అన్నది ఒకప్పుడు కొత్త కాన్సెప్ట్‌గా మారింది. అనేక కొత్తకొత్త ఉత్పత్తుల్ని కనుక్కోవడం వల్ల ఈ రంగంలో నూతన దృక్పథం, జిజ్ఞాస పెరిగాయి.

తలకు నూనెపెట్టి మసాజ్‌ చేసిన ప్పుడు శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు శిరోజాలకు చక్కని తేమ, కండీషనింగ్‌ లభిస్తుంది. నిద్రించడానికి ముందువేళ్లతో సింపుల్‌గా మాడును మసాజ్‌ చేసుకున్నా శిరోజాల మాడుకణాల్ని ఉద్దీప్తం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలాగే, జుట్టు రాలకుండా క్రీమ్‌లు, ఎనర్జీ సెరంలాంటి వాటిని రాత్రివేళ రాస్తేనే ఫలితం ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని రకాల ఓవర్‌ నైట్‌-యూజ్‌ సెరమ్స్‌(మార్కెట్‌లో లభిస్తాయి) పొడిబారిన, చిట్లిన వెంట్రుకల మరమ్మతులకు సహకరిస్తాయి.

చాలామంది చర్మం పట్ల చూపిన శ్రద్ధలో ఓ వంతు కూడా జుట్టుపట్ల చూపరు. ఇంట్లోనే చికిత్సలు చేసుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తారు. ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, ఒక టీస్పూన్‌ గ్లిజరిన్‌, రెండు మూడు చుక్కలు లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, పావు టీస్పూన్‌ వెనిగర్‌ కలిపి మాడు నుంచి, శిరోజాల కొసలదాకా అప్లయి చేయాలి.

జుట్టు రఫ్‌గా, పొడిగా ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. ఇవన్నీ కూడా శిరోజాలకు పోషకాలను ఇచ్చే పదార్థాలే. ఈ మిశ్రమాన్ని రాసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే షాంపు చేసుకోవాలి. రాత్రివేళ అతిగా ఉత్పత్తుల్ని అలాగే ఉంచేసి పడుకోవడం మంచిది కాదు.

ముఖంపై మేకప్‌ను ఏవిధంగా క్లీన్‌ చేసుకుని పడుకుంటారో అదే మాదిరి మాడునూ శుభ్రం చేసుకోవాలి. పగటివేళ ఏవైనా హెయిర్‌ ప్రొడక్ట్‌ను వాడినట్లయితే పడుకునే ముందు శిరోజాల్ని బాగా బ్రెష్‌ చేయాలి. లేదా క్విక్‌ వాష్‌ చేసుకుని, పరిశుభ్రమైన మాడుతో నిద్రకు ఉపక్రమించాలి.

కలర్‌ చేసినా లేదా ఏవిధంగానైనా కెమికల్‌ ట్రీట్‌మెంట్స్‌ చేయించుకున్నా అది ఆక్సిడైజ్‌ అవుతుంది. అలాగే విభిన్నవాసనలు, జిడ్డు, పగటివేళపడే దుమ్ము తాలూకు మురికి తలలో అలాగే ఉండిపోతే జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. ఆయిలింగ్‌ నైట్‌కేర్‌ రొటీన్‌లో మంచి ఆయిలింగ్‌ ప్రక్రియ ఉండాలి. రెండు మూతల అరోమాథెరపి ఆయిల్‌ను ఆలివ్‌ లేదా ఆల్మండ్‌ ఆయిల్‌తో కలిపి మసాజ్‌ చేసుకోవాలని, రాత్రంతా అలా వదిలేసి మర్నాడు షాంపు చేసుకోవాలని శిరోజాల నిపుణులు సూచిస్తున్నారు.

సాదా కొబ్బరినూనె కూడా వాడవచ్చు. అయితే అవసరానికి మించి అతిగా నూనె పెట్టవద్దు. ఇలా నూనెపెడితే, మరునాడు దానిని వదిలించుకోవడానికి ఎక్కువ షాంపు వాడాల్సి వస్తుంది.

దీనివల్ల జుట్టు డ్రైగా అయిపోతుంది. అప్పుడు పొడిజుట్టును అనువుగా మలుచుకోవాలన్న ప్రధాన ఉద్దేశ్యమే దెబ్బతింటుంది. రాత్రి పడుకునే ముందు జుట్టును పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా అని, తలస్నానం చేసేసి తడిజుట్టుతో పడుకోకూడదు. తేలికపాటి, నీటి ఆధారిత మాయిశ్చరైజింగ్‌ లీవ్‌-ఇన్‌ కండిషనర్‌ ఓవర్‌నైట్‌ను వారానికి రెండుసార్లు వాడడం మంచి ప్రత్యామ్నాయం.

నాణ్యమైన నైట్‌రిపేర్‌ క్రీమ్‌, జిడ్డులేని కొబ్బరినూనె, రోజ్‌మేరీ ఆయిల్‌, జొజోబా ఆయిల్‌, కొబ్బరిపాల ప్రొటీన్‌, విటమిన్‌ బి5 వాడాలి. ఇవి మాడులో రక్తప్రసరణను పెంచుతాయి. శిరోజాలకు ప్రొటీన్‌ అందించి, జుట్టును జిడ్డుగా మార్చే అదనపు సెరం విడుదలను తగ్గిస్తాయి. చుండ్రు అవకాశాల్ని కూడా తగ్గిస్తాయి.

హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మీకు తెలియని కారణాలు

స్త్రీ మరియు పురుషులు ఎదుర్కొనే ఒక ప్రధాన జుట్టు సమస్య హెయిర్ బ్రేకేజ్. మీకు పొడవాటి జుట్టు ఉన్నట్లైతే ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది . హెయిర్ బ్రేకేజ్ అనేది ప్రధానంగా హెయిర్ డ్యామేజ్ వంటిదే. ఇది మీ జుట్టును మరింత రఫ్ గా మార్చుతుంది. దాంతో మీ జుట్టు చూడటానికి అనారోగ్యకరంగా ఉంటుంది.

హెయిర్ బ్రేకేజ్ కు కారణం స్పష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, జుట్టు చిక్కుబడటం, ముడులు బడటం వల్ల జుట్టు మద్యలోనిక తెగిపోతాయన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. వీటివల్లే చాలా సులభంగా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. అలాగే తడి జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల కూడా, హెయిర్ బ్రేకేజ్ కు కారణం కావచ్చు. హెయిర్ బ్రేకేజ్ కు చిక్కు, ముడులు మాత్రమే కారణం కాదు, హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మరికొన్ని కారణాలు కూడా దాగున్నాయి.

జుట్టు చిట్లడం మరియు చిట్లిన జుట్టు డ్యామేజ్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. హెయిర్ బ్రేకేజ్ మరియు హెయిర్ డ్యామేజ్ కు కొన్ని తెలియని కారణాలు క్రింది విధంగా ఉన్నాయి...

హెయిర్ బ్రేకేజ్ అవ్వడానికి మీకు తెలియని కారణాలు



హార్డ్ వాటర్(కఠినమైన నీరు): మీజుట్టు శుభ్రతకు హార్డ్ వాటర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం జరుగుతుంది. దాంతో హార్డ్ వాటర్ లోని ఆల్కలైన్ వల్ల మీ జుట్టు పూర్తిగా తేమను కోల్పోతుంది. దాంతో హెయిర్ బ్రేకేజ్ చాలా సులభంగా జరుగుతుంది. ఆ జుట్టు చూడటానికి డ్యామేజ్ గా కనబడుతుంది.

ఫ్రిక్షన్(రాపిడి): మీ జుట్టుకు ఏదైనా రాపిడి కలిగినా కూడా హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. మీరు కాటన్ పిల్లో(దిండు)ను ఉపయోగించినా, అప్పుడు మీ జుట్టు కాటన్ త్రెడ్ కు రాసుకోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ కు కారణం అవుతుంది.

జింక్ అండ్ ఐరన్ లోపం: కొన్ని సమయాల్లో, కొన్ని పోషకాలు లోపించడం వల్ల ఇంటర్నల్ గా కొన్నిపోషకాల లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ మొదలవుతుంది. ముఖ్యంగా జుట్టుకు సహాయపడే జింక్ మరియు ఐరన్ వంటి పోషకాంశాలు లోపం వల్ల కూడా మీ జుట్టు చిట్లడం మరియు బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కారణం వల్ల హెయిర్ బ్రేకేజ్ అవుతుంటే మీరు గుడ్డును మీ జుట్టుకు పట్టించడం మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను తీసుకోవడం ఉత్తమం.

ఓవర్ స్ట్రెచ్చింగ్: మీరు జుట్టును చాలా కఠినంగా వెనుకకు లాగడం?కొన్ని సందర్భాల్లో మీ జుట్టును వెనుకకు కఠినంగా లాగడం వల్ల అది జుట్టుయొక్క ఎలాసిటిని కోల్పోతుంది . కాబట్టి కొన్ని సమయాల్లో మీరు హెయిర్ స్టైల్స్ ను నివారించాలి. ప్రోటీన్ డైట్ లేకపోవడం వల్ల: మీ జుట్టు పెరుగుదలకు సాధారణంగా ప్రోటీనులు చాలా అవసరం అవుతాయి. మీరు రోజులో సరిపడా పోషకాంశాలు మీ రెగ్యులర్ డైట్ ద్వారా తీసుకోకపోతే, మీ హెయిర్ క్వాలిటీలో క్లియర్ గా కనిబడుతుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో లెగ్యుమ్స్ మరియు గుడ్డు వంటి ఆహారాలను తీసుకోవడం జుట్టు రక్షణ.

ఎండకు తిరగకూడదు: ఎక్కువ సమయం ఎండలో మీ జుట్టు ఎక్స్ పోజ్ అయినప్పుడు, ప్రోటీనులు కోల్పోవడంతో పాటు, హెయిర్ డ్యామేజ్ కూడా పెరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా జుట్టు మీద పడటం వల్ల జుట్టు పొడిబారడం ఎక్కువ అవుతుంది . ఫలితంగా మీ జుట్టు పొడిబారడం మరియు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది.

తప్పుగా దువ్వడం: మీ జుట్టును ఎక్కువగా దువ్వడం కొన్ని సందర్భాల్లో ఓకే అయినా, లేదా ఉపయోగించి దువ్వెన, ఎక్కువ సార్లు దువ్వడం వల్ల తల, జుట్టులో రాపిడి వల్ల, హెయిర్ బ్రేకేజ్ కు కారణం కావచ్చు.

Sunday, January 5, 2014

ముడుతలు రాకుండా ఉండాలంటే?

  
 
 వయసు పెరిగేకొద్దీ మన చర్మం ముదుతలు పడటం సహజం. డార్క్ సర్కిల్స్,ఫైన్ లైన్లు వంటి వాటికీ కూడా ముఖ్య కారణం ఇదే అవుతుంది. ముడుతలు,కర్లింగ్ చర్మం మరియు ఫైన్ లైన్లు తగ్గించేందుకు అనేక క్రీములు ఉన్నాయి. ఏ చర్మ రకానికి అయిన రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు సమర్థవంతమైనవి కాదు. ఎందుకంటే అంటువ్యాధులు,దద్దుర్లు మరియు మచ్చల వంటి ప్రతికూల ప్రభావాలకు కారణం కావచ్చు.

ముడుతలు మరియు వయస్సు మీద పడిన ఇతర చిహ్నాల కొరకు ఇంట్లో తయారు చేసిన క్రీములు ఉపయోగించటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇంట్లో తయారుచేసే క్రీములు సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి తయారుచేయుట వలన ఏ విధంగానూ హానికరం కాదు. అవి శాశ్వత ప్రభావం కలిగి ఉంటాయి. ఏ చర్మ రకానికి అయిన ముడుతల కొరకు సహజమైన మరియు ఇంట్లో తయారుచేసే క్రీములు అందుబాటులో ఉన్నాయి.

1. గుడ్డులో చర్మం బిగించి, ముడుతలను తగ్గించే బోయోటిన్,ప్రోటీన్లు మరియు విటమిన్లు వంటివి ఉన్నాయి. పచ్చసొన యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. క్రీమ్ చర్మంను మృదువుగా మరియు ప్రకాశవంతమైన తయారుచేస్తుంది. ఈ మాస్క్ తయారుచేయటానికి ఒక గుడ్డును అర కప్పు క్రీమ్ లో కలపాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. మాస్క్ వేసుకొని 15 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ క్రమంగా ఉపయోగిస్తే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. అరటిపండు మరియు క్యారట్ మాస్క్ ఇది బాగా పని చేసే ప్యాక్. చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు మరియు క్యారట్ రెండు కూడా చర్మంను బిగించి ముడుతలను తగ్గించేందుకు అవసరమైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. ఈ ప్యాక్ తయారుచేయటానికి ఒక అరటిపండు మరియు ఒక క్యారట్ ను తీసుకోని పేస్ట్ గా చేయాలి. బాగా కలిపి ముఖం మీద రాయాలి. ఈ మాస్క్ ను 15 నిమిషాలు ఉంచి తర్వాత వెచ్చని నీటితో కడగాలి.

3. రోజ్ వాటర్తో చర్మం శుబ్రం చేసుకుంటే చర్మం మీద మలినాలు మరియు ధూళి ఎక్కువగా ఉండుట వలన ముడుతలు మరియు ఫైన్ లైన్లు వస్తాయి. ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు రోజ్ వాటర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మం పునరుత్పత్తి మరియు కళ్ళు కింద వాపు మరియు డార్క్ సర్కిల్స్ వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకోని రోజ్ వాటర్ లో ముంచి వలయాకార కదలికలతో ముఖాన్ని శుభ్రం చేయాలి. మర్దన చేయుట వలన చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది.

4. బంగాళాదుంప అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ వృద్ధాప్యం లక్షణాలను కలిగి ఉంది. ప్రతి రోజు మీ ముఖాన్ని బంగాళాదుంప స్క్రబ్ తో శుభ్రం చేస్తే చర్మం లేత గోధుమ రంగులోకి మారటం తగ్గుట,ముడుతలు మరియు ఫైన్ లైన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఒక బంగాళదుంప గుజ్జు మరియు దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించి, ముఖం మీద రాసి 5-10 నిమిషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలోస్తాయి.

5. పెరుగు చర్మం కణజాలాలు,కణాల రిపేరు మరియు పునర్నిర్మాణానికి అవసరమైన విటమిన్లు కలిగి ఉంటుంది. పెరుగును రోజూ తింటే చర్మం కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు మాస్క్ తయారుచేయటానికి ఒక కప్పు పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. నిమ్మరసం ముఖాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పెరుగు ముడుతలను తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు ఉంచండి. తర్వాత వెచ్చని నీటితో కడగాలి. :

Thursday, November 21, 2013

అన్నిరకాల జుట్టు సమస్యలకు హోం రెమడీస్

ప్రతి ఒక్కరికి వారి జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో జుట్టు సమస్యను ఎదుర్కోక తప్పదు, కానీ జీవిత కాలం పూర్తిగా ఎల్లప్పుడు జుట్టు సమస్యలుటే ? మనం ఆలోచించడానికే ఎంతకష్టంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మరియు అందమైన జుట్టు ఉండట వల్ల అందాన్ని అదనపు ప్రయోజనం చేకూరుతుంది.

ఒక అందమైన అమ్మాయి మరియు సెక్సీ బాడీ కలిగి ఉండి, ఒక నిర్జీవమైన హెయిర్ కలిగి ఉంటే ఎలా ఉంటుందో ఇమ్యాజిన్ చేసుకోండి. అధిక సంఖ్యలో ప్రజలు మొదటి ప్రతికూల స్థానం కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు.నిస్తేజంగా , ప్రాణములేని , పీల్చబడడం జుట్టు మరియు వివిధ రకాల ఇతర జుట్టు సమస్యలు నుండి రక్షణ పొందడానికి ఇక్కడ మేము కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

ఇవి మీకు మందంగా ,బలమైన జుట్టును పెంచుకోవడానికి ఒక్కడ కొన్ని మన వంటగది వస్తువులను అంధిస్తున్నాము. వీటిని ఉపయోగించడం వల్ల మందమైన , బలమైన మరియు మంచి ఆకారం ఉన్న కేశ సౌందర్యాన్ని మీరు సొంతచేసుకోగలరు.ఈ పద్దతుల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అదే సమయంలో వీటి కరీదు కూడా తక్కువే.

వీటికోసం బ్యూటీపార్లర్ లో ఎక్కువ డబ్బు మరియు సమయం వెచ్చించక్కర్లేదు.ఈక్రింది ఇవ్వబడిన హెయిర్ ప్రొటక్షన్ పద్దతులను అనుసరించి, మీ జుట్టు లో ఒక అనుకూల మార్పును ఎలా తెలుసుకొస్తుందో పరిశీలించండి..



1 . హెయిర్ లాస్ (జుట్టు నష్టం) గృహ చికిత్స : హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ కావలసినవి :ఏదైనా సహజ నూనె - ఆలివ్ నూనె , కనోలా కాయిల్ , కొబ్బరి నూనె లేదా ఆముదము నూనె విధానం : 1 . పైన ఇచ్చిన నూనెల్లో ఏదోఒకదానికి వేడి చేయాలి. దాంత నూనె వెచ్చగా అవుతుంది.

2 . మీ జుట్టుకి నిదానంగా మసాజ్ చేయాలి.

3 . తర్వాత ఒక రోజు రాత్రి అలాగే ఉంచాలి. లేదా ఒకటి రెండు గంటలు అలాగే ఉంచిత తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

2. హోం రెమడీ: కొబ్బరి పాలు కావలసినవి :కొబ్బరి పాలు ( కొన్ని కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసి మరియు వాటిని పాలను పిండుకవాలి)
విధానం :1 . జుట్టుకు మరియు అన్ని జుట్టు మూలాల్లోకి ఇంకిపోయేలా కొబ్బరి పాలను అప్లై చేయాలి. 2 . 1-2 గంటల అలాగే వదిలి తర్వాత శుభ్రం చేసుకోవాలి.


3 . హోం రెమడీ 3: ఆవాలు మరియు హెన్నా ఆకులు
కావలసినవి :ఆవాల నూనెహెన్నా ఆకులు
విధానం :

1 . ఒక టిన్ బేసిన్ లో కొన్ని ఆవాల నూనె వేసి కాచుకోవాలి మరియు అందులో కరింటాకు ఆకులను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

2 . తర్వాత ఈ నూనెను ఫిల్టర్ చేసుకోవాలి

3 . ఈ నూనెతో హెయిర్ కు రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహింస్తుంది.

4. జుట్టు సమస్య # 2 : అవాంఛిత రోమాల పెరుగుదల
గృహ చికిత్స : షుగర్ స్కీజర్ కావలసినవి :చక్కెరతాజా నిమ్మరసంనీరు
విధానం :1 . ఒక మిక్సింగ్ బౌల్లో, కొన్ని నీళ్ళు, తాజాగా పిండిన నిమ్మరసంలో కొద్దిగా పంచదార వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
2 . ప్రభావితమైన ప్రాంతంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి మరియు 15 నిమిషాలు అలాగే వదిలేయాలి.
3 . ప్రాంతం కొంత సేపు అలాగే రుద్దుతుండాలి. తర్వాత చల్లటి నీటితో బాగా శుభ్రం చేయాలి.


5. గృహ చికిత్స : శెనగపిండి విత్ పెరుగు

కావలసినవి :శెనగపిండిపసుపుపెరుగు
విధానం :1 . ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగా శెనగపిండి మరియు పెరుగు, పసుపు వేసి పేస్ట్ చేసుకోవాలి.

2 . ప్రభావిత అయిన ప్రాంతంలో పేస్ట్ ను అప్లై చేసి అది తడి ఆరిపోయే వరకూ అలాగే ఉండాలి.

3 . కాసేపు తర్వాత ఈ ఎండిన పేస్ట్ ను బాగా రుద్ది, తర్వాత నిధానంగా శుభ్రం చేసుకోవాలి.
4 . ఒకసారి తలస్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
6.జుట్టు సమస్య # 3 : గ్రే జుట్టు

గృహ చికిత్స : నిమ్మకాయ మరియు తేనె
కావలసినవి :పెద్ద నిమ్మపండుతేనె
విధానం :1 . తేనె మరియు నిమ్మ రెండూ సమానంగా తీసుకొని మిక్స్ చేయాలి
2 . ప్రభావిత అయిన ప్రాంతంలో దీన్ని అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి.
3 . తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి.


7. గృహ చికిత్స : కొబ్బరి నూనె మరియు నిమ్మ
కావలసినవి :కొబ్బరి నూనెపెద్ద నిమ్మపండు

విధానం :1 . కొబ్బరినూనెకు, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ తలకు బాగా పట్టించాలి.

2 . 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి


8. గృహ చికిత్స : ఉసిరి చేసే మ్యాజిక్
కావలసినవి :ఉసిరికాయ,కొబ్బరి నూనె
విధానం :1 . కొబ్బరి నూనెలో కొన్ని తాజా ఉసిరికాయ ముక్కలు వేసి బాగా ఉడికించాలి. అవి నల్లగా మారే వరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
2 . మీ నూనెను తలకు పట్టించి గంట, రెండు గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి.


9. గృహ చికిత్స : కరివేపాకు
కావలసినవి :తరిగిన కరివేపాకు,కొబ్బరి నూనె
విధానం :1 . 7-8 కరివేపాకు ఆకులను తీసుకొని, కొబ్బరి నూనెలో వేసి , మీడియం మంట మీద కాచుకోవాలి.
2 . తర్వాత ఈ నూనెను ఒక గిన్నెలోకి వడగట్టుకొని, గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ తలకు అప్లై చేయాలి.
3 . 1 గంట తరువాత తలస్నానం చేసేసుకోవాలి .

10. జుట్టు సమస్య  4 : డ్రై మరియు నిస్తేజంగా ఉన్నజుట్టు
గృహ చికిత్స : బీర్
కావలసినవి :బీరు
విధానం :1 . మీరు తలస్నానానికి వెళ్ళే ముందు మీ వెంట కొద్దిగా బీర్ ను తీసుకెళ్ళండి, తలస్నానం పూర్తి అయిన ఒక మగ్గు నీటిలో బీర్ మిక్స్ చేసి తలారా పోసుకోవాలి.
2 . ఇది 5-7 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.
3 . తర్వాత తిరిగి జుట్టును మంచి నీళ్ళత శుభ్రం చేసి, జుట్టుకు మంచి కండీషనర్ ను అప్లై చేయాలి. 

11. గృహ చికిత్స : బేకింగ్ సోడా
కావలసినవి :నీరుబేకింగ్ సోడా
పద్ధతి:1 . బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి సాఫ్ట్ గా పేస్ట్ తయారుచేసుకోవాలి.
2 . తలస్నానం చేసేటప్పుడు, తడి జుట్టుకు ఈ పేస్ట్ ను అప్లై చేయాలి.
3 . తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని ఆ తర్వాత షాంపు చేసుకోవాలి.
12. జుట్టు సమస్య # 5 : చిక్కుబడే జుట్టు
గృహ చికిత్స : హనీ మరియు పాలు
కావలసినవి :తేనెపాలు
విధానం :1 . కొద్దిగా తేనె, కొన్ని చుక్కల పాలు మిక్స్ చేసి మీతలకు బాగా అప్లై చేయాలి .
2 . పూర్తిగా మీ తల మొత్తానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి.
3 . తర్వాతా 10-20నిముషాలు అలాగే ఆరనివ్వాలి, తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి.


13. గృహ చికిత్స : ఎగ్
కావలసినవి :గుడ్డు,నీరు
విధానం :1 . గుడ్డులోని పచ్చసొన నుండి ఎగ్ వైట్ ను వేరు చేయాలి.
2 . గ్రుడ్డులో ఉండే పచ్చ సొనకు కొద్దిగా నీరు మిక్స్ చేసి క్రీమ్ గా తయారయ్యే వరకూ గిలకొట్టాలి.
3 . తర్వాత ఈ మిశ్రమానికి ఎగ్ వైట్ ను మిక్స్ చేయాలి.
4 . ఇప్పుడు మీజుట్టును తడి చేసి, ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

14. జుట్టు సమస్య  6 : జుట్టు చివర్లు చిట్లడం
గృహ చికిత్స : బొప్పాయి ప్యాక్
కావలసినవి :బొప్పాయి ,పెరుగు
విధానం :1 . సాదాపెరుగుకు, గింజలు, పొట్టు తొలగించిన బొప్పాయి ముక్కలను జోడించి ఒక మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి .
2 . ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 45 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి.
3 . తర్వాత పూర్తిగా తలస్నానం చేసి శుభ్రం చేసుకోవాలి.

15. గృహ చికిత్స : అరటి , గుడ్డు మరియు తేనె
కావలసినవి :అరటి పండు,గుడ్డు,పాలు,తేనె
విధానం :1 . మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరటి , గుడ్డు , పాలు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.
2 . ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.
3 . అరగంట తర్వాత తేలికైన మన్నికైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి.


16. గృహ చికిత్స : దాల్ ట్రీట్మెంట్
కావలసినవి :బ్లాక్ పప్పు ( కాయధాన్యాలు )మెంతులు,పెరుగు
విధానం :1 . ఉద్దిపప్పు మరియు మెంతులను మెత్తగా పొడి చేసుకోవాలి.
2 . తర్వాత ఈ పొడికి కొంచెం పెరుగు చేర్చి, మెత్తగా పేస్ట్ చేసు-కోవాలి .
3 . ఈ పేస్ట్ ను మీజుట్టుకు పట్టించి ఒక గంట అలాగే వదిలేయాలి.
4 . తేలికపాటి షాంపూతో తలస్నానం చేసుకోవాలి.


17. జుట్టు సమస్య   : చుండ్రు
గృహ చికిత్స : నిమ్మకాయ పీల్స్
కావలసినవి :నిమ్మకాయ పీల్స్
విధానం :1 . 3-4 నిమ్మకాయ యొక్క తొక్కలు తీసుకొని, 4-5కప్పులు నీళ్ళు పోసి, అందులో నిమ్మ తొక్కలు వేసి 15-20ఉడికించాలి.
2 . ఒకసారి అది చల్లబడిన తర్వాత , ఈ నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

18. గృహ చికిత్స : పెరుగు పరిష్కారం
కావలసినవి :పెరుగు
విధానం :1 . మీ జుట్టు కు కొంత పెరుగును తలమాడుకు మరియు కేశఆలకు అప్లై చేయాలి తర్వాత కనీసం ఒక గంట పాటు అలాగే ఉంచాలి
2 . తర్వాత ఒక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేసుకోవాలి.

చిక్కు బడ్డ జుట్టుకు ఉత్తమ నివారణోపాయాలు !




సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉరుకులు పరుగుల జీవితం అలవాటై పొయి... పూర్తిగా యాంత్రికంగా మనిషి బతికేస్తున్న క్రమంలో స్త్రీలు సైతం ఆర్ధిక కారణాల దృష్ట్యా ఉదోగం చేయాల్సి రావటంతో పట్టణ ప్రాంతాలలోనే కాదు గ్రామీణ ప్రాంతాల మహిలలు సైతం తమ శిరోజాల సంరక్షణకు కేటాయించే సమయం బాగా తక్కువై పోయింది.ప్రతి నిత్యం కురులకు నూనె కూడా రాసుకోలేని వారు కొందరైతే...

ట్రేండు, స్టైల్ అంటూ ఆధునికత పేరుతో కురుల సంరక్షణకి సమయాన్ని కేటాయించక ఎలా పడితే అలా అనేక రకాల రంగులలో ముంచెత్తుతుండటంతో వాటి కురులు చిట్లిపోవటం, కట్ అవ్వడం, రాలిపోవటం ప్రారంభించి చివరికి బట్ట తల కూడా వచ్చే అవకాశాలు బొలెడు ఉన్నాయి. అయితే మరి కొందరు కనీసం అప్పుడప్పుడు తలంటు కొని కేశ సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తున్నా... వెంట్రుకలు రాలుట, చిక్కు తీసుకొనుట మొదలైన ప్రక్రియ లపైనే శ్రద్ధ వహిస్తుంటే... మరి కొందరు స్పాః ట్రీట్‌మెంట్‌ని ఆశ్రయించేందుకు మక్కువ చూపు తాన్నారు.

అయితే ఈ ప్రక్రియ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా దానివలన పొందే ప్రయోజనం ఎక్కువకాలం ఉండదని... దాని కన్నా ఇంట్లో తీసుకునే సంరక్షణ చర్యలే కురులకు మేలు చేకూరుస్తాయని బ్యుటీషియన్లు సైతం అంగీకరి స్తున్నారు.

ముఖ్యంగా చిక్కుబడ్డ జుట్టు చూడటానికి నిర్జీవంగా మరియు అశుభ్రతతో కనిపిస్తుంది. హెయిర్ వాష్ చేసుకొన్న తర్వాత చిక్కుబడ్డ జుట్టును నిర్వహించడానికి చాలా కష్ట అవుతంది. అందుకు కెమికల్ ట్రీట్మెంట్లకు ఎంత డబ్బు ఖర్చుచేసిన ఫలితం మాత్రమే తాత్కాలికమే. కొన్ని సార్లు, జుట్టుకు తగినంత తేమ అందకపోవడం, హెయిర్ కేర్ తీసుకోకపపోవడం వల్ల హెయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. చిక్కుబడ్డ జుట్టు పొడిబారి, వికారంగా కనిపిస్తుంది. చిక్కుబడ్డ జుట్టును మ్యానేజ్ చేయాలంటే చాలా కష్టం. మీ జుట్టుకు తగినంత తేమఅంధించడానికి, నేచురల్ షైన్ పొందడానికి మరియు మెరుస్తుండాలంటే కొన్ని సాధారణ వంటగది వస్తువులు ఉపయోగపడుతాయి. మెయోనైజ్ బాగా సహాయపడుతుంది.
అవొకాడో, గుడ్డు, అరటిపండు వంటివి చిక్కుబడ్డ జుట్టును మ్యానేజ్ చేయవచ్చు. మరి చిట్కాలేంటో ఒక సారి పరిశీలిద్దాం..

1. అరటిపండు: అరపండును బాగా గుజ్జులా చేసి రెండు టీస్పూనులన బాదం, మరియు అవొకాడో ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీజుట్టుకు బాగా పట్టించి 20-25నిముషాలు అలాగే ఉండనిచ్చి, తర్వాత కడిగేయాలి. దాంతో కేశాలు స్మూత్ గా మరియు మ్యానేజ్ బుల్ గా ఉంటాయి. మరియు మంచి నేచురల్ షైనింగ్ వస్తుంది.


2. పెరుగు: అనేక జుట్టు సమస్యలను నివారించడంలో అద్భుతంగా ఉపయోగపడే వస్తువు పెరుగు. జుట్టుకు పెరుగును అప్లై చేయడం వల్ల, పొడి జుట్టు, నిర్జీవం మరియు చిక్కు తొలగిపోతుంది. పెరుగును అలాగే అప్లై చేయండి లేదా ఇతర హెయిర్ ప్యాక్ లతో చేర్చి అప్లై చేయండి.



3. అవొకాడో: డ్రై హెయిర్ ను నివారించడానికి మరియు నేచురల్ గా మాయిశ్చరైజ్ చేయడానికి , అవొకాడో బాగా సహాయపడుతుంది. చిక్కు బడ్డ జుట్టును నివారిచడానికి అవొకాడోను మెత్తగా చేసి అందులో పెరుగు మిక్స్ చేసి వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి సాఫ్ట్ హెయిర్ పొందవచ్చు.

4. మయోనైజ్: ఇది ఒక మంచి నేచురల్ కండీషనర్. దీర్ఘకాలిక ఫలితాలను అంధించడంలో ఇది బాగా సహాయపడుతుంది. మోయోనైజ్ ను తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.



5. నిమ్మరసం: నిమ్మరసం జుట్టును శుభ్రం పరచడంతో పాటు, జుట్టుకు పోషనను అంధిస్తుంది . మీ హెయిర్ మాస్క్ లలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయండి.

6. బీర్: ఇది ఒక నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది జుట్టును సాఫ్ట్ గా చేస్తుంది. చిక్కుబడిన, పొడిబారిన జుట్టును బీర్ తో కడగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

7. వెనిగర్: చిక్కును వదిలించుకోవడానికి ఇది మరొక ఉత్తమ మార్గం. వాటర్ తో పాటు, వెనిగర్ మిక్స్ చేసి తలను శుభ్రం చేసుకోవాలి . దాంతో జుట్టు సాఫ్ట్ గా మరియు మ్యానేజబుల్ గా ఉంటుంది.

8. తేనె: తేనెలో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నా . చిక్కుబడ్డ జుట్టును నివారించడానికి బెస్ట్ హోం రెమడీ తేనె . హెయిర్ మాస్క్ లలో మిక్స్ చేసి వేసుకోవడం వల్ల చిట్లిన జుట్టును కూడా నివారించుకోవచ్చు.

9. గుడ్లు: జుట్టు సాఫ్ట్ గా మరియు సిల్కీగా మారుతుంది. జుట్టు సంరక్షణకు గుడ్డు ఒక ఉత్త బ్యూటీ వస్తువు.


10. హాట్ ఆయిల్ మసాజ్: డ్రై అండ్ డల్ హెయిర్ నివారించడానికి ఒక ఉత్తమ పద్దతి హాట్ ఆయిల్ మసాజ్ . బాదం ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో మాసాజ్ చేయండి.

హెయిర్ ఫాల్, చుండ్రు అనేక సమస్యలకు కాకరకాయ

జుట్టు సంరక్షణకు ఒక ఉత్తమ హోం రెమెడీ బిటర్ గార్డ్ (కాకర కాయ)జ్యూస్. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. అటువంటి కాకరకాయ చర్మం సంరక్షణకు మరియు శరీర సంరక్షణకు అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది.

అంతే కాదు, అనేక జుట్టు సమస్యలకు మంచి చికిత్సను అంధిస్తుంది. కాకరకాయ రసంతో హెయిర్ కేర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టుకు ఒక మంచి షైనింగ్ మరియు కేశాలకు దీర్ఘాయువును అంధిస్తుంది. చేదుగా ఉండా ఈ కాకర కాయ కేశాలకు ఏవిధంగా సహాయపడుతుందని మీకు ఆశ్చర్యం కలగవచ్చు, అందుకే కొన్ని విషయాలను మీతో  పంచుకుంటోంది..జుట్టు సంరక్షణలో కాకరకాయను మీరు ఉపయోగించడానికి, మీరు ఖచ్చితంగా ఒక ఇంట్లో ఉండే ఒక నేచురల్ పదార్థంతో మిక్స్ చేయాలని గుర్తుంచుకోవాలి. చేదుగా ఉండే కూరగాయలను లేదా కూరగాయల రసాన్ని నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి, జుట్టుకు ప్యాక్ వేసుకొన్నప్పుడు, మీరు మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు .

కాకరకాయ రసంలో అత్యధికంగా ప్రోటీలు కలిగి ఉంటాయి, ఇవి మీ జుట్టును స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతాయి. కాకరకాయ రసాన్ని ఇతర సహజ పదార్థాలతో మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకొన్నప్పుడు, ఈ ప్యాక్ కనీసం ఒక గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.జుట్టు సంరక్షణలో కాకరకాయ జ్యూస్ ఎలా ఉపయోగించాలి, ఏవిధంగా ఉపయోగపడుతుంది అని ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి. కాకరకాయ రసాన్ని ఉపయోగించి హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక అద్భుతమైన విలాసవంతమైన జుట్టును సహజంగా పొందండి..

హెయిర్ ఫాల్ తగ్గించే కాకరకాయ రసం...

1. జుట్టుకు మంచి షైనింగ్: మీ జుట్టుకు నేచురల్ గా మంచి షైనింగ్ రావాలంటే, ఒక కప్పు తాజా కాకరకాయ రసంలో పెరుగు మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయాలి. ఈ రెండు వస్తువులు మీ జుట్టుకు ఒక నేచురల్ మరియు బ్యూటిఫుల్ షైనింగ్ ను అంధిస్తాయి.

2. జుట్టు చివర్లు చిట్లడాన్ని నిరోధిస్తుంది: మీ జుట్టు చివర్లు చిట్లడంతో బాధపడుతుంటే, ఈ సమస్యను నివారించడం కోసం కాకరకాయ జ్యూస్ ను మీ జుట్టుకు అప్లై చేయాలి. కాకరకాయ రసం మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చిట్లడం తగ్గుతుంది మరియు తిరిగి సహజ జుట్టులా పెరుగుతుంది . జుట్టు చిట్లడాన్ని తగ్గించడం కోసం ఈ పద్దతిని వారానికి రెండు సార్లు ప్రయత్నించాలి.

3. చుండ్రు నివారణకు: ప్రస్తుత రోజుల్లో ఆహారం మరియు వాతావరణం, కాలుష్యం వల్ల చుండ్రు సాధారణ సమస్యగా మారుతోంది. కాకర కాయ రసంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు నివారించుకోవచ్చు. కాకరరసం మరియు జీలకర్రను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా ఒక నెలలోపు మీరు ఈ సమస్య నుండి బయటపడగలుగుతారు.

4. పొడి బారిన జుట్టు: పొడిబారిన జుట్టు మరీ దురదగా ఉంటుంది. దురదతో పాటు ఇతర హెయిర్ సమస్యలకు కూడా ఏర్పడుతాయి. ఈ పొడి జుట్టును నివారించడానికి, తాజాగా ఉండే ఒక కాకర కాయ ముక్కను తలమాడుకు బాగా రుద్దాలి. కాకరకాయ ముక్కతో తలలో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. మొటిమల నివారణకు: స్లాప్ పింపుల్స్ (తలలో చిన్న చిన్న మెటిమలు)ఉండటం వల్ల తలలో అదనపు చెమటకు దారితీస్తుంది. కాబట్టి మీ తలను చాలా చల్లగా ఉంచుకోవాలి. కాకరకాయ, మరియు కీరదోస కాయ రెండూ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది స్లాప్ పింపుల్స్ కు ఒక ఉత్తమ నివారినిగా పనిచేస్తుంది. ఇది మీ జుట్టుకు ఒక సున్నితత్వాన్ని కలిగిస్తుంది.


6. తలలో దురద: దరుదగా ఉండే తలకు ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. ఈ కాకరకాయ జ్యూస్ ను అవొకాడో లేదా అరటిపండుతో మిక్స్ చేసి తలకు హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దురదను పోగొట్టుకోవడానికి వారానికి ఒకసారి అప్లై చేయాల్సిందే.

7. రెగ్యులర్ హెయిర్ కేర్ కోసం: మీ జుట్టు చాలా రఫ్ గా ఉన్నప్పుడు ఒక కప్పు కాకరకాయ రసంను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ హోం రెమడీ మీ మీ జుట్టు నిర్మాణం చదును మరియు మృదువైన తయారుచేస్తుంది

8. తెల్ల జుట్టుకు: చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం ప్రస్తు రోజుల్లో ఎక్కువ మంది చూస్తున్నాం. ఈ సమస్యకు కాకరకాయ రసంతో చికిత్స అందించవచ్చు. తాగా ఉండే బిటర్ వెజిటేబుల్ రసాన్ని మీ తెల్ల జుట్టు మూలాలకు అప్లై చేయాలి. ఇలా ప్రతి 10రోజులకొకసారి చేయడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్యను నివారిస్తుంది.

9. జిడ్డు గల జుట్టు: మీరు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టులో అదనపు ఆయిల్ ఏర్పడి కేశాలు జిడ్డుగా కనిపిస్తాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఆయిల్ కంటెంట్ తగ్గించుకుంటే తప్పని సరిగా తలలో జిడ్డును తొలగించుకోవచ్చు . కాకరకాయ రసంలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల అదను నూనె తొలగిపోతుంది.

 
10. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: మీ దువ్వెను ఎక్కువగా వెంట్రుకలు ఊడి, చుట్టుకొన్నప్పుడు మీకు బాధగా అనిపిస్తుంది. చాలా మందిలో హెయిర్ లాస్ చాలా సాధారణ సమస్య. జుట్టు సమస్య నివారించుకోవడం కోసం కాకరకాయ జ్యూస్ లో కొద్దిగా పంచదార మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

Monday, November 11, 2013

కార్తీక పౌర్ణమి





కార్తీకమాసము



కార్తీకమాసంతో సమానమైనమాసం, విష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం,గంగతో సమానమైన తీర్దం లేదని చెప్తారు. సూర్యుడు తులారాశిలోకి రాగానే కార్తీకమాసం ఆరంభమైంది.
పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. శివ కేశవులకు అద్యంత ప్రియమైన ఈ మాసంలో ఆచరించవలసిన వ్రతాలు,చేయవలసిన దీపారాధనల గురించి….
కార్తీకమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజాముల నదీతీరంలోగాని, చెరువులు, కొలనులు, బావుల వద్ద స్నానం చేయాలి. స్నానానంతరం ఓం ప్రభాకరాయనమః, ఓం దివాకరాయమః, ఓం ప్రభాకరాయమః, ఓం అచ్చుతాయమః, ఓం నమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆత్గ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.

ఉత్థాన ఏకాదశి

ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీ-సమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కోరికలను తీర్చే దీపపు కాంతులు

పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.
పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.

కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు

కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది.


దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి

కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

వనభోజనం

కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.

క్షీరాబ్ది ద్వాదశి:

అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.
దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

కార్తీకమాస వ్రతాలు

కేదారేశ్వర వ్రతం

చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

అఖండమాస సౌభాగ్యవ్రతం

వివాహితులు ఈ అఖండ సౌ భాగ్యాలను చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రునికి ఆద్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తీక చతుర్థశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తీకేయుని,గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రనీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు.ఎంతకాలమైన తిరిగి రాలేదు. అర్జనుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపతి ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌబాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం,వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం

ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిన గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్కపూట భోజనం చేయాలి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు.

గోత్రి రాత్రీ వ్రతం

ఈ వ్రతాన్ని కార్తీక కృష్ణాత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్దునికి రెండు వైపుల రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రిమంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతిఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి.

Wednesday, October 30, 2013

లక్ష్మి దేవి గురించి......................


 

దీప్తులు చిందించే దీపావళి



శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుని పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. శ్రీరాముడు, రావణాసురుని అంతం చేసి, సేతమ్మను తీసుకుని, అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకునే ఆచారం నెలకొందని చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి చెడును రూపుమాపి, మంచిని మిగిల్చిన సందర్భంగా, సంతోష చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచకంగా టపాసులు మోగించే ఆచారం ఏర్పడింది.


హిందువుల ప్రముఖ పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి పండుగ ఆశ్వయుజ అమావాస్య నాడు వస్తుంది. అంతకుముందు రోజు నరక చతుర్దశి. వ్యాపారులు దీపావళి పర్వదినాన్ని నూతన సంవత్సరంగా భావిస్తారు. లక్ష్మీదేవికి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు.

 
మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంత అపురూపమైన దీపాల పండుగ దీపావళి. దీపావళితో మొదలుపెట్టి, కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.


అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే సంప్రదాయం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తారు. దీపావళి రోజున కుటుంబసభ్యులందరూ తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరిస్తారు. ఇళ్ళముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గుమ్మాలకు పసుపు, కుంకుమలు రాస్తారు. మావిడాకులు, బంతిపూలతో తోరణాలు కడతారు. నైవేద్యానికి ప్రసాదాలను, పిండివంటలను సిద్ధం చేసుకుంటారు. ఆనక లక్ష్మీదేవి పూజకు సంసిద్ధమౌతారు.


దీపావళి రోజున మహాలక్ష్మి పూజ చేస్తారు. ఈ పూజ చేయడం వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటో చూద్దాం. పూర్వం దూర్వాసముని దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషించి ఒక మహిమ గల హారాన్ని ప్రసాదించాడు. కానీ, దేవేంద్రునికి దాని గొప్పతనం తెలీక, తన ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు కాస్తా హారాన్ని కాళ్ళతో తోక్కేసేంది. ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి దీనమైన స్థితిలో పడ్డాడు. శ్రీహరిని ప్రార్ధించగా ''ఒక దీపాన్ని వెలిగించి, ఆ దీపజ్యోతిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ, భక్తిగా పూజించమని'' పరిహారం చెప్పాడు. దేవేంద్రుడు అలాగే చేశాడు. దాంతో లక్ష్మీదేవి కరుణ చూపి, ఇంద్రునికి తిరిగి దేవలోక ఆధిపత్యాన్ని, సర్వ సంపదలను అనుగ్రహించింది.


తనను అనుగ్రహించిన లక్ష్మీదేవిని ఉద్దేశించి, దేవేంద్రుడు ''తల్లీ, సామాన్యులు నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా?” అనడిగాడు.

 
అప్పుడు లక్ష్మీదేవి ''నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్ధించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను'' అని బదులిచ్చింది. అప్పటినుంచీ దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది.
 
దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించుకుంటారు. ఆనక దీపాలను తులసికోట వద్ద, వాకిట్లో ఉంచుతారు. రెండు దీపాలకు తక్కువ లేకుండా కొందరు అనేక దీపాలతో స్వర్గాన్ని తలపించేలా అలంకరిస్తారు.


ఇక సాయంత్రం అయ్యేసరికి బాణాసంచా కాల్చడం మొదలౌతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కాకరపూవొత్తులు, మతాబులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, రకరకాల టపాకాయలు కాలుస్తూ సంబరం చేసుకుంటారు.
 
దీపావళి పండుగ వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అప్పటివరకూ వర్షాలు పడి ఉంటాయి కనుక వాతావరణంలో రకరకాల క్రిములు వృద్ధి చెందివుంటాయి. వాటిని నాశనం చేసి, మనకు మేలు చేస్తుంది ఈ పండుగ. దీపాలు చీకటిని పారదోలుతాయి. టపాసులు క్రిమికీటకాలను సంహరిస్తాయి. మతాబుల్లోంచి వచ్చే పొగ దోమలు మొదలైనవాటిని మట్టుపెడుతుంది.
 
దీపావళి సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఒకరికొకరు గ్రీటింగులు, కానుకలు ఇచ్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి పిండివంటలు తింటూ, ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు. దీపావళి హిందువుల పండుగే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో ఈ పండుగను వేడుక చేసుకుంటున్నారు.