ఎంటెక్ (క్లినికల్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
-శివ, నల్గొండ.
ఎంటెక్ (క్లినికల్ ఇంజనీరింగ్) కోర్సు పూర్తి చేసిన వారికి హాస్పిటల్స్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు, డయోగ్నస్టిక్ సెంటర్లు, బయో మెడికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో అవకాశాలు ఉంటాయి. వీరు ఆస్పత్రుల్లో, మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉపయోగించే పరికరాల నిర్మాణ-నిర్వహణ,వినియోగం సంబంధిత విభాగాల్లో విధులు నిర్విహ స్తుంటారు. ఎంటెక్(క్లినికల్ ఇంజనీరింగ్) కోర్సులో బయో మెటీరియల్స్,మాలిక్యులర్,సెల్ బయాలజీ, బయో మెకానిక్స్, ఫంక్షనల్ అనాటమీ, ఫిజియాలజీ, బయో మెడికల్ ఇమేజింగ్ సిస్టమ్స్, మెడికల్ డివైజ్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి టాపిక్స్ ఉంటాయి.
ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
వివరాలకు: www.iitm.ac.in
క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ)-వెల్లూరు
వివరాలకు: www.cmchvellore.edu
న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
-రవి, మిర్యాలగూడ.
న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సు పూర్తి చేసిన వారికి.. పరిశోధన రంగంలో పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. వీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, వేస్ట్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత పరిశ్రమలలో మెడికల్ ఫిజిక్సిస్ట్, రేడియోగ్రాఫర్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. అమెరికా, యూరప్‌లలో కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పుర్
వివరాలకు: www.iitk.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
కోర్సు: ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్)
అర్హత: బీఎస్సీ (మ్యాథ్స్,ఫిజిక్స్)
ప్రవేశం: వర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా.
వివరాలకు: www.andhrauniversity.info
యూనివర్సిటీ ఆఫ్ పుణే-పుణే
కోర్సు: ఎంఎస్సీ(ఫిజిక్స్-న్యూక్లియర్ టెక్నిక్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా).
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్). సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే.
ప్రవేశం: వర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా.
వివరాలకు:www.unipune.ac.in
మద్రాస్ యూనివర్సిటీ
కోర్సు: ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్)
వివరాలకు: www.unom.ac.in
ఎంఎస్సీ(ఎన్విరాన్‌మెంటల్ సైన్స్)కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలేవి?
-బాబు, తుని.
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రధానంగా ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్, టెక్స్‌టైల్స్, మైనింగ్, ఫార్మాస్యుటికల్, కెమికల్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ సంస్థలు, అర్బన్ ప్లానింగ్, వాటర్ కన్జర్వేషన్ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు వివిధ ఎన్‌జీఓలు, వివిధ పరిశోధన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.
ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
వెబ్‌సైట్: www.andhrauniversity.info
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
మన రాష్ట్రంలో ఎంఎస్సీ(హోమ్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి?
- రవి, నిర్మల్.
హోమ్ సైన్స్ కోర్సు చేసిన అభ్యర్థులకు ఫుడ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్, హోటళ్లు, రిసార్‌ట్స, టూరిజం సంబంధిత సంస్థల్లో ప్రొడక్షన్, సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వివిధ ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో న్యూట్రిషన్ కన్సల్టెంట్లుగా, రీసెర్చ్ అసిస్టెంట్లు, ఫుడ్ సైంటిస్టులు, ఫుడ్ అనలిస్ట్‌లుగా కూడా స్థిర పడొచ్చు. ఫుడ్ ప్రొడక్ట్స్, బేబీ ఫుడ్స్, రేడీ టూ కుక్‌ఫుడ్ వంటి ఉత్పత్తులకు చెందిన సేల్స్ విభాగంలో కూడా వీరికి అవకాశాలు ఉంటాయి.
ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.angrau.net
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ - అనంతపూర్ క్యాంపస్.
వెబ్‌సైట్: http://sssihl.edu.in
ఎంఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
- నవీన్, విశాఖపట్నం.
డెయిరీ సైన్స్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు డైరీ ఫార్మ్స్, కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్స్, రూరల్ బ్యాంకులు, పాల ఉత్పత్తుల సంబంధిత పరిశ్రమల్లో డైయిరీ టెక్నాలజిస్ట్‌గా అవకాశాలు ఉంటాయి. మిల్క్ ప్లాంట్, ఐస్‌క్రీమ్ వంటి యూనిట్లకు కన్సల్టెంట్‌గా కూడా సేవలందివచ్చు.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.vetversitytirupati.gov.in
శామ్ హిగ్గిన్‌బాథమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ సైన్స్-అలహాబాద్.
వెబ్‌సైట్: www.aaidudec.org
ఇందిరాగాంధీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాయ్‌పూర్-ఛత్తీస్‌గఢ్.
వెబ్‌సైట్: www.igau.edu.in
బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు?
- శ్రీకాంత్, తిరుపతి.
బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ కోర్సును చేసిన వారికి వివిధ బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక బ్యాంక్‌ను ముందంజలో ఉంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్‌కు కావల్సిన నాలెడ్జ్, అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ బ్యాంక్‌లలో ఎగ్జిక్యూటివ్, మేనేజీరియల్ స్థానాల్లో అవకాశం ఉంటుంది.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
అర్హత:50శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం:క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్‌ఏటీ/జీమ్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల కు నిర్వహించే గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ ద్వారా
వివరాలకు: www.ipeindia.org
సింబయాసిస్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్-పుణే
కోర్సు: ఎంబీఏ(బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వివరాలకు: www.ssbm.edu.in
అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ అక్చూరియల్ సైన్స్-నోయిడా
కోర్సు: ఎంబీఏ(ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్)
అర్హత:50శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం: క్యాట్/మ్యాట్/ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వివరాలకు: www.amity.edu/asias
No comments:
Post a Comment