all

Sunday, January 13, 2013

వడ్డీ భారం తగ్గుతోందా? పెరుగుతోందా?

 
టిప్స్
నేరుగా అనకూడదు కానీ, అవకాశమొస్తే వినియోగదారులను ముంచడానికి కొన్ని ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉంటాయి. మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా పర్సనల్ లోన్, బైకు లోన్లలో ఇలాంటివి జరుగుతుంటాయి. మనకేమో 14-16 శాతం వడ్డీ అని చెబుతారు కానీ, 24-36 శాతం వేస్తారు. అంటే 36,000 రుణం తీసుకుని, నెలకు మూడు వేలు చెప్పున కడుతున్నారనుకుంటే, ప్రతి నెలా వడ్డీ తగ్గాలి. కానీ, కొన్ని ఆర్థిక సంస్థలు మొదటి ఈఎంఐ నుంచి చివరి ఈఎంఐ వరకు, 36,000 కు వడ్డీ కట్టించుకుంటాయి.

మొదటి ఈఎంఐ తర్వాత మనం 33,000 కు, రెండో ఈఎంఐ తర్వాత 30,000 వేలకు, మూడో ఈఎంఐ తర్వాత 27,000లకు వడ్డీ కట్టాలి. అయితే, మనకు ఆర్థిక జ్ఞానం లేనితనాన్ని అలుసుగా తీసుకుని, ప్రతి నెలా చెల్లించిన రుణానికి కూడా వడ్డీ కట్టించుకుంటారు. కాస్త అప్రమత్తంగా ఉండి ఇలాంటి వడ్డీలు వసూలు చేసేవారిని ప్రశ్నించండి. మీ డబ్బుకు మీరే రక్ష. తప్పనిసరి అయితే, బంగారాన్ని బ్యాంకులో పెట్టి అవసరాలు తీర్చుకుని నెలనెలా బ్యాంకుకు ఈఎంఐ కట్టడమే చాలా మంచిది. 
- ప్రకాష్ చిమ్మల

No comments: