all

Sunday, January 13, 2013

సంక్రాంతి మొదటి రోజు ‘భోగి’ భాగ్యాల విశిష్టత

పండుగల్లో అతి పెద్దగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి కొత్త కాంతి వచ్చినట్లే. ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం వెల్లువిరుస్తుంటుంది. పండగ సంబరాలు కనిపిస్తుంటాయి. మనకు ఉన్న చాలా పండుగలు ఒకటి రెండు రోజుల మాత్రమే జరుపుకుంటారు. అయితే సంక్రాంతిని మాత్రం మూడు... నాలుగు రోజులు జరుపుకుంటారు.

మొదిటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుక అయితే మరికొందరు నాలుగవ రోజుకూడా ముక్కనుమ పేరుతో సంబరాలు జరుపుకుంటారు.మొదటి భోగి రోజు ప్రత్యేకత తెలుసుకుందాం...

భోగి రోజు తెల్లవారు జామునే ఇంటిలోని వారంతా తలంటుస్నానం చేయటం, కొత్త బట్టలు ధరించటం, అడుతూ, పాడుతూ గడపటం పరిపాటి. ఉదయం పూట భోగి మంట ఓ మధురాను భూతి కలిగిస్తుంది. ఈ భోగి మంటకు పిల్లలు పెద్దలు అందరూ ఉండి సంతోషంగా భోగి మంటలు వేసుకొంటారు. భోగి రోజు ఉదయాన్నే ప్రతి ఇంటి ముందూ భోగి మంట మండాల్సిందే.
అందరూ తమ ఇళ్ళలోని పాత వస్తువులు, వాడకంలో లేని పలు సామాగ్రిని పోగుపెట్టి భోగి మంటగా వేస్తారు.‘భగ' అనే పదం నుండి ‘భోగి' అన్న మాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతిచేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు ‘భోగి మంటలు'మకర సంక్రాంతి నెలంతా కన్నెపిల్లలు తమ ముంగిళ్ళలో ఆవుపేడతో పెట్టిన గొబ్బిళ్ళను పిడకలుగా చేసి, ఆ పిడకలతో భోగి మంట వేస్తారు. ఇది భోగి మంట ప్రాధాన్యత.

pongal first day special bhogi mantalu

 ఆవు పేడలోని ఔషధగుణాలు కారణంగా మంటల నుండి వెలువడిన పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. భోగి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానాలు చేసి భోగి మంటలపై వండిన మధుర పదార్ధాల్ని తింటారు. ఈ రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఇలా చేయడం వలన పిల్లలకు దృష్టి దోషం తొలుగుతుందని భావిస్తారు.కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి "సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని "కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు. ఇదే భోగి యొక్క విశిష్టత.

 

No comments: