అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్, సీమ మేడిపండు... ఎలా పిలిచినా పలుకుతుంది.
అయితే, దీన్నెవరూ పెద్దగా పట్టించుకోరు. కారణం - దీని రంగు వెంటనే కంట్లోపడదు.
ఇక రుచి విషయానికొస్తే తీపి, పులుపు, వగరు కలిసిన అదోరకం రుచి. ఈమధ్య డ్రైఫ్రూట్ లడ్డూలో దీన్ని విరివిగా వాడుతున్నారు. అవును!
డ్రై ఫ్రూట్స్ షాపులో దారానికి ఎక్కించి చుట్టలా కనిపిస్తుందే! అదే అంజూర్! ఆ... ఇప్పుడు అర్థమైంది కదా!
ఎన్నయినా చెప్పండి! అంజూర్ కొనడం మా వల్ల కాదు అంటారా? అంజూర్ ఎందుకు కొనాలంటే ఇందులో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి కనుక! అవి తింటే మనకే మంచి జరుగుతుంది కనుక!
అంజూర్‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటివి తక్కువ.
ఖనిజాలు, పీచు, విటమిన్లు అంజూర్‌లో సమృద్ధిగా లభిస్తాయి.
పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన క్యాల్షియం, ఐరన్ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్ తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు.
కడుపులో మంట, అజీర్తి, పేగుపూత లాంటివి తలెత్తకుండా అంజూర్ కాపాడుతుంది.
ఇందులోని పొటాషియం గుండెకు సమస్యలు రానివ్వదు.
రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.

No comments:
Post a Comment