వడపప్పు, పానకం!
శ్రీరామచంద్రునికి నైవేద్యం. పెసరపప్పును గంటసేపు నానబెడితే చాలు.... వడపప్పు రెడీ. పానకానికి మాత్రం కాస్త కష్టపడాలి. ఈ చైత్రంలో... ఈ ఎండల్లో పప్పును, పానకాన్ని సేవిస్తే చలువ. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన వంటల్ని రేపటి శ్రీరామనవమి కోసం ఫ్యామిలీ మీకు అందిస్తోంది. పానకం... కావలసినవి బెల్లం పొడి - కప్పు నీళ్లు - మూడు కప్పులు నిమ్మకాయలు - రెండు ఎండు అల్లంపొడి - అర టీ స్పూను ఏలకుల పొడి - అర టీ స్పూను మిరియాల పొడి - అర టీ స్పూను తయారి పెద్ద పాత్రలో బెల్లం పొడి, నీరు వేసి కరిగేదాకా కలపాలి. వడపోసి, నిమ్మరసం, ఎండు అల్లంపొడి, ఏలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అన్నిటినీ బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. హులీ అవలక్కి కావలసినవి: బియ్యం - నాలుగు కప్పులు నీళ్లు - ఆరు కప్పులు; చింతపండురసం - అరకప్పు బెల్లం తురుము - కొద్దిగా; పసుపు - తగినంత ఉప్పు - తగినంత పోపుకోసం నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను పచ్చిశనగపప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - పది పచ్చిమిర్చి - పది; పల్లీలు - పావు కప్పు నువ్వులు - పావు కప్పు; కరివేపాకు - నాలుగు రెమ్మలు తయారి బియ్యాన్ని మూడు గంటల సేపు నానబెట్టి, నీరు వడగట్టి, బియ్యాన్ని ఆరబెట్టాలి. కొద్దిగా తడిగా ఉండగా బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా పట్టాలి (అవసరమనుకుంటే జల్లెడపట్టాలి). ఒక పాత్రలో చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు, ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి. మందపాటి పాత్రలో ఆరు కప్పులు నీరు పోసి స్టౌ మీద ఉంచాలి. మరిగాక బియ్యపురవ్వ వేసి కలపాలి. (రవ్వ పోస్తున్నంతసేపు కలుపుతుండాలి) ఉడికిన రవ్వను పెద్ద పాత్రలోకి తిరగదీయాలి. స్టౌ మీద బాణలి ఉంచి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పల్లీలు, నువ్వులు, కరివేపాకు జతచేసి వేయించాలి. ఉడికించిన రవ్వలో వేసి కలపాలి. చింతపండులో నానబె ట్టి ఉంచుకున్న పదార్థాలను వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. రెండుమూడు గంటల తర్వాత సర్వ్‌చేయాలి. క్యారట్ కోసాంబరి కావలసినవి: క్యారట్ తురుము - అర కేజీ; పెసరపప్పు - అర కప్పు; సన్నగా తరిగిన కొత్తిమీర - అర కప్పు; నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; ఉప్పు -తగినంత పోపుకోసం: నూనె - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు తయారి: పెసరపప్పును రెండుమూడు గంటలు నానబె ట్టి, నీరు వడగట్టాలి ఒక పాత్రలో క్యారట్ తురుము, పెసరపప్పు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి కరివేపాకు, కొద్దిగా ఇంగువ జతచేసి వేయించాలి క్యారట్ మిశ్రమంలో వేసి కలపాలి. చల్లగా సర్వ్ చేయాలి. కోసాంబరి (సలాడ్) కావలసినవి శనగపప్పు - కప్పు పచ్చిమిర్చి - నాలుగు అల్లం తురుము - టీ స్పూను కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు ఉప్పు - తగినంత నిమ్మరసం లేదా మామిడికాయ రసం - 3 టీ స్పూన్లు పోపు కోసం నూనె - టీ స్పూను ఆవాలు - అర టీ స్పూను జీలకర్ర - అర టీ స్పూను కొత్తిమీర - కొద్దిగా తయారి శనగపప్పును మూడు నాలుగు గంటలపాటు నానబెట్టాలి. పచ్చిమిర్చి కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా తిప్పాలి. ఉప్పు, నిమ్మరసం, కొబ్బరితురుము కలపాలి. స్టౌ మీద బాణలి ఉంచి కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అన్నిటినీ ఒక బౌల్‌లో వేసి బాగా కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, April 18, 2013
శ్రీరామ నైవేద్యం.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment