
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్‌ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Wednesday, May 22, 2013
మొటిమల నివారణకు ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం..!
మొటిమలు అనేవి చర్మ సమస్యల్లో చాలా సాధారణమైన సమస్య. మరీ ముఖ్యంగా టీనేజర్స్ లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మరీ మీరూ మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? మొటిమల నివారించుకోవడానికి చాలా రకాల రసాయణాలు మరియు మెడిసిన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే రసాయనాలతో కూడిన క్రీములు, మెడిసిన్స్ ఉపయోగించడం కన్నా మొటిమలు నివారించడానికి సహజసిద్దంగా ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. అందమైన చర్మాన్ని పొందడానికి ఆయుర్వేదం చాలా ఉపయోగకరమైన మరియు సహజ సిద్దమైన చికిత్స.
మొటిమలు లేని చర్మ సౌందర్యాన్ని పొందడానికి వివిధ రకాల హోం రెమడీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించనట్లైతే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఆ వ్యత్యాసాన్ని మీరు తప్పకుండా గుర్తించవచ్చు. మొటిమలతో అందవిహీనంగా మారిన చర్మానికి ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ వల్ల మొటిమలు నివారించబడి అందమైన మరియు కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని మీరు పొందగలరు.
ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు కూడా నిరభ్యంతరంగా పాటించవచ్చు . మరి మీ ముఖం మొటిమలు లేని అందమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే మీరు కూడా ఈ క్రింది ఆయుర్వేద ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించి చూడండి...
పసుపు-శెనగపిండి: హిందూ పెళ్ళిళ్ళు మరియు శుభకార్యాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగించడం మనకు తెలిసిన విషయమే. రెండు చెంచాలో రోజ్ వాటర్ లో పసుపు మరియు శెనగపిండి వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. దాంతో మీ ముఖం మీద మొటిమల మాత్రమే కాదు చర్మ సమస్యలు కూడా నివారించడంతో పాటు మీ ముఖంలో సరికొత్త కాంతి పొందుతారు.

బంతి పూల((మ్యారిగోల్డ్ )తో ఫేస్ ప్యాక్: ఇది వినడానికి ఆశ్చర్యం కలిగించవచ్చు . అయితే ఈ బంతి పూలలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నందున మొటిమలను సులభంగా నివారించగలుగుతాయి. కొన్ని తాజా బంతిపూలను తీసుకొని వాటిని మెత్తగా పేసట్ లా తయారుచేసి, దానికి తేనె మరియు పాలు మిక్స్ చేసి ముఖం మీద అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత 15నిముషాలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

చందనం ఫేస్ ప్యాక్: ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్స్ లో చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ ఇది. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇది బాగా సహాయపడుతుంది. చందనం పౌడర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్నితెచ్చుకొని రోజ్ వాటర్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా సాధారణ ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చర్మానికి కాంతిని మరియు సున్నితత్వాన్ని కలిగిస్తుంది.

వేపాకుతో ఫేస్ ప్యాక్: కొన్ని తాజా వేపఆకలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, దానికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి రెండు మూడు చుక్కల వేపనూనెను మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకొని ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, బాగా ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్: ఇది చాలా సులభమైన ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్. దీన్ని మొటిమలు నివారించడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసి అరగంట తరవ్ాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పుదీనా ఫేస్ ప్యాక్: పుదీనా ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే మొటిమలు మటు మాయం అవుతాయి. ఇది మొటిమల తాలూకు మచ్చలను కూడా నివారిస్తాయి. ఇది అద్భుతమైన యాంటీ ఎన్స్ ఏజెంట్.

వెల్లుల్లి: అధికంగా మొటిమలున్న ప్రదేశంలో వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి అప్లై చేయాలి. లేదా వెల్లల్లి రెబ్బలతో మసాజ్ చేయాలి. దీనిలో ఇల్ల్యూషన్ ఉండటం వల్ల యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొండుగా ఉండి మొటిమలను నివారించబడుతాయి.

వెల్లుల్లి: అధికంగా మొటిమలున్న ప్రదేశంలో వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి అప్లై చేయాలి. లేదా వెల్లల్లి రెబ్బలతో మసాజ్ చేయాలి. దీనిలో ఇల్ల్యూషన్ ఉండటం వల్ల యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొండుగా ఉండి మొటిమలను నివారించబడుతాయి.
నువ్వులు: నువ్వులను, కొద్దిగా నీళ్ళు చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలు నివారించబడుతాయి.

ఉప్పు- వెనిగర్: ఉప్పుకు వెనిగర్ చేర్చి పేస్ట్ లా చేసి ముఖం మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలు ఏర్పడవు.

గోధుమగడ్డి జ్యూస్: ప్రతి రోజూ రెండు సార్లు వీట్ గ్రాస్ జ్యూస్ త్రాగడం వల్ల మొటిమలు, మచ్చలు నివారించవచ్చు.

పపాయ: పచ్చిగా ఉండే పాపాయను మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

పపాయ: పచ్చిగా ఉండే పాపాయను మెత్తటి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద మరియు ఉసిరి రసం: కలబంద మరియు ఉసిరి కాయ రసంను మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ కు ముందు 30యంఎల్ సేవిస్తే మొటిమలు ఎప్పటికీ రాకుండా నివారించబడుతాయి.

కొత్తిమీర-పసుపు: గుప్పెడు కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకొని అందులో పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి శుభ్రం చేసుకోవాలి.


క్యారెట్ జ్యూస్: మొటిమలను నివారించడంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో క్యారెట్ జ్యూస్ ను చేర్చుకోండి.

చెక్క: చెక్కను మెత్తను పౌడర్ గా చేసి అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి మొటిమలున్న ప్రాంతంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి.


తేనె: చెంచా తేనెకు ఒక చెంచా చెక్కపౌడర్ కలిపి, నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి, నిద్ర లేచిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా ప్రతి రోజూ రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పవచ్చు.

టమోటో: టమోటో గుజ్జును మొటమలున్న ప్రదేశంలో అప్లై చేసి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

దానిమ్మ: దానిమ్మ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి, దానికి నిమ్మరసం మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించుకోవచ్చు.

దానిమ్మ: దానిమ్మ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి, దానికి నిమ్మరసం మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మొటిమలను నివారించుకోవచ్చు.

పాలు: బాగా మరిగించి, చల్లార్చిన పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల బ్లాక్ హెడ్స్, పగుళ్ళు, మొటిమలు నివారించబడుతాయి.

బంగాళదుంపు: బంగాళదుంపను మొత్తగా పేస్ట్ లా తయారుచేసి మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి.

బంగాళదుంపు: బంగాళదుంపను మొత్తగా పేస్ట్ లా తయారుచేసి మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇతర చర్మ సమస్యలు తొలగిపోతాయి.
Tuesday, May 21, 2013
విపరీతమైన దగ్గు, గ్యాస్... గొంతు మారుతోంది...
డాక్టర్‌ని అడగండి - ఇ.ఎన్.టి.
నా వయసు 36. ఉద్యోగరీత్యా తరచూ దూరప్రాంతాలకు వెళ్లాల్సిన జాబ్‌లో ఉన్నాను. రోజూ సరైన వేళకు తినే అవకాశం ఉండదు. ఒక్కోసారి వేరే రాష్ట్రాలకూ వెళ్లాల్సి ఉండటంతో నేను తినే ఆహారాలూ మారుతుంటాయి. నాకు గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఉంది. దగ్గు, గ్యాస్ సమస్యలతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. స్వరం బొంగురుగా మారుతోంది. నా సమస్యకు సరైన సలహా ఇవ్వండి.
- ఎం.డి. అన్వర్‌ఖాన్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన కడుపులో కొన్ని ఆసిడ్స్ తయారవుతూంటాయి. ఇవి ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంటాయి. అయితే మనం ఆహారం సరిగా తీసుకోకపోయినా, సరైనవేళకు తినకపోయినా ఈ ఆసిడ్స్ తేన్పుల రూపంలో పైకి వస్తాయి. ఇవి మొదట స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్, గొంతులోని ఇతరభాగాలపై ప్రభావం చూపుతాయి. దాంతో దగ్గు వస్తుంది. స్వరం మారుతుంది. ఎప్పుడూ గొంతు సరిచేసుకోవాలనిపిస్తుంది. దగ్గు ఎక్కువ కావడం, స్వరం మారడం, చెవిలో నొప్పి, ఇతర సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఈఎన్‌టీ నిపుణులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి, ఎండోస్కోపీ వంటి అవసరమైన పరీక్షలు జరిపించి సమస్య ఏమిటన్నది నిర్ధారణ అయిన తర్వాత దాన్నిబట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మందులతో పాటు మీ సమస్యకు అసలు కారణాలైన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. నా వయసు 20. మాట్లాడుతుంటే నత్తివస్తోంది. ఈ పోటీ యుగంలో నెగ్గుకురావడం ఎలా అన్నది ఆలోచిస్తే ఆందోళన కలుగుతోంది. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. - అఖిలేష్, విజయవాడ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. మొదట మీరు... మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించండి. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడిన కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడల్లా ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషిస్తూనే ఉండండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల కౌన్సెలింగ్ తీసుకుంటూ వారు చెప్పినవి ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సీనియర్ ఇఎన్‌టి నిపుణులు, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ (సాహి), అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్ |
చిరిగిపోయిన పాత కార్పెట్‌తో...
-కార్పెట్ అనుకోకుండా కాలితే వెంటనే ఆలుగడ్డ ముక్కవేసి గట్టిగా రుద్దండి. నల్లమరకలు పోతాయి. -కార్పెట్ మరకలు పడి పాతగా కనిపిస్తుంటే పచ్చి ఆలుగడ్డ ముక్కతో మరకలు ఉన్నచోట రుద్ది వేడినీళ్లలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒత్తితే మళ్లీ కార్పెట్ కొత్తదానిలాగా కనిపిస్తుంది. |
Friday, May 17, 2013
మైక్రోవేవ్ ఓవెన్ గురించి కొన్ని విశేషాలు,వివరాలు..
లాభాలు:
1. అన్నం, కూరలు చిటికలో వేడి చేసుకోవచ్చు/వండుకోవచ్చు.
2. ఒక్క ళ్ళే వున్నప్పుడు మీ దగ్గర మైక్రో వేవ్ కుక్కర్ వుంటే దానిలో అన్నం వండుకోవచ్చు. (ఇది చిన్నది పెద్ద గా ఖరీదు కూడా వుండదు). ఇందులోనే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు.
3. కూరలు దీనిలో వేడి చేసుకున్నాప్పుడు చాలా ఫ్రెష్ గా వుంటాయి ముఖ్యం గా బంగాళ దుంప చికెన్ వంటివి.
4. పిల్లలకు అప్పటి కప్పుడు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కావాలని గోల పెడితే మనం చేసి ఇచ్చే నూడుల్స్ ఈ మైక్రోవేవ్ లో చాలా తొందర గా పోషకాహార విలువలు పోకుండా చేసుకోవచ్చు.
5. పిల్లలకు కేక్ ల వంటి వి కూడా తొందర గా చేసి ఇవ్వవచ్చు.
మనలో చాలా కామన్ గా వుండే అపోహలు ఈ మైక్రోవేవ్ గురించి:
1. దీని మూలం గా ఆరోగ్యం పాడైపోతుంది, ఇందులో నుంచి వెలువడే రేడియో యాక్టీవ్ తరంగాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.
2. ఇందులో ఆహారం సమం గా వుడకదు.
3. ఇందులో వండిన పదార్ధాలలో పోషకాహార విలువలు మాయం అవుతాయి.
4. ఇందులో ఏదో మిగిలి పోయిన కూరలు వేడి చేసుకోవటం తప్ప పెద్ద వుపయోగం లేదు, దాని కోసం అంత ఖర్చు పెట్టి కొనటం దండుగ.
పైన చెప్పిన అపోహలకు కొన్ని సమాధానాలు.
1. దీని మూలం గా ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమి లేదు, మనం సాధారణం గా అన్ని రకాల ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను రేడియో యాక్టీవ్ తరంగాలనే అంటాము. (రేడియో తరంగాలు, ఎక్స్ రే తరంగాలు, మైక్రోవేవ్స్, కాంతి తరంగాలు, ఆల్ట్రా వయొలెట్ తరంగాలు) కాని నిజానికి దాన్లో శక్తి వాటి వేవ్ లెంత్ తో కొలుస్తారు. హ్రస్వమైన (షార్ట్ వేవ్ లెంత్ ) కిరణాలకు ఎక్కువ శక్తి (ఎక్స్ రే, గామా రే), దీర్ఘ(లాంగర్ వేవ్ లెంత్) కిరణాలు తక్కువ శక్తి (మైక్రో వేవ్) ను బహిర్గతం చేస్తాయి. నిజానికి vhf uhf రేడియో తరంగాలకంటే మాత్రమె ఈ మైక్రోవేవ్ తరంగాలు బలమైనవి ఈ రకమైన కిరణాల కుటుంబం లో.
అందుకనే ఏదైనా వేడి చేసే టప్పుడు దాని మీద మూత వుంచి వేడి చేస్తే సమం గా వేడి అవుతుంది, ఆహారం బిరుసేక్కినట్లు అవ్వదు (తేమ అలాగే వుంటుంది కాబట్టి) , అలాగే ఇది ఎటు వంటి ఆరోగ్య సమస్య లు కలిగించాడు.
2. పైన చెప్పిన సమాధానమే దీనికి కూడా, మనం మూత పెట్టి వండి/ వేడి చేసినప్పుడు ఇది చక్క గా సమ తుల్యం గా వుడుకుతుంది.
3. ఇందులో వండటం వలన పోషకాహార విలువలు వుండవు అనేది కేవలం ఒక అపోహ. నిజానికి దీని మూలం గా మనం పోషకాహార విలువలను వృధా చేయటం తగ్గుతుంది అని FDA అప్రువ్ చేసింది. దీనికి కారణం ప్రోటీన్ లు వుండే ఆహారం ఎక్కువసేపు పొయ్య మీద వేడి అవటం మూలం గా వాటిలోని A మరియు E వైటమిన్ లను కోల్పోయే ప్రమాదం వుంది కాని మైక్రోవేవ్ తో అలా కాదు ఎందుకంటే తొందర గా వేడి అవుతుంది కాబట్టి.
4. వుపయోగించుకోవటం తెలియాలే కాని ఇది నిజం గా చాలా సహాయకారి. దీనితో అన్నం కూరలు వేడి చేసుకోవటమే కాదు, అన్నం ఇడ్లీ వండుకోవచ్చు కూడా, అంతే కాదు మనం రోజు వండుకునే కూరలు వుదాహరణకు దొండకాయ పొయ్య మీద పెట్టి దానిని చాలా సేపు చాలా నూనె తో వేయించితే కాని మంచి రుచి రాదు కాని మైక్రోవేవ్ లో, కోసిన దొండకాయలను కొంచం వుప్పు కొంచం నీళ్ళు చిలకరించి మూత పెట్టి ఒక 5- 8 నిమిషాల మధ్య ( ఒక కిలో కాయలకు) వేడి చేసి తరువాత పొయ్య మీద వేసుకుంటే నూనె తక్కువ పడుతుంది తొందర గాను ఐ పోతుంది.
రుచి కూడా చాలా బాగుంటుంది, పోషకాహార విలువలు పోవు తక్కువ సేపు వండుతున్నాము కాబట్టి. ఇలానే వంకాయ (ముఖ్యం గా గుత్తి వంకాయ కు), కేలిఫ్లవర్, క్యాబేజ్, తోట కుర, బీట్రూట్, కేరట్ వంటివి ఇలా చేస్తే చాలా మంచిది. (బెండకాయ మాత్రం ఇలా చేసి , నన్ను తిట్టవద్దు).
5. కాఫీ, టీ లు చాలా ఈజీ చెయ్యటం, ఒక కప్పు లో పాలు నీళ్ళు మీకు కావలసిన నిష్పత్తి లో కలుపుకుని దానిలో ఒక టీ బేగ్ వేసుకుని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోండి టీ రది. కాఫీ ఐతే ఈ పాలు , నీళ్ళు కలిపిన కప్ ను 2 నిమిషాలు వేడి చేసి బయటకు తీసి మీకు ఇష్టమైన బ్రూ నో నేస్కేఫ్ నో వేసుకుని పంచదార వేసి తిప్పుకుంటే కాఫీ కూడా రడి.
ట్రిక్స్:
1. మూత మామూలు పింగాణీ మూత కాకుండా ప్లాస్టిక్ లోనే మందమైనవి ప్రత్యేకం గా మైక్రోవేవ్ లో వేడి చేసుకునే వాటి మీద మూతల కోసం చేసినవి దొరుకుతాయి అవి వుపయోగించండి, తొందర గా సమం గా వేడి అవుతాయి.
2. పచ్చళ్ళు అస్సలు వేడి చెయ్యకండి వాటి రంగు రుచి కూడా పోతాయి.
3. మైక్రోవేవ్ లో స్టీల్ గిన్నెలు పెట్టకూడదు, ప్లాస్టిక్ దొరుకుతాయి వీలైనంత వరకు గోల్డ్ లైనింగ్ లేని పింగాణి, లేదా కార్నింగ్ వేర్ గిన్నెలు వాడండి. అవి మంచివి.
4. కొంచం ఎక్కువ మొత్తం గా వేడి చేస్తున్నప్పుడో లేదా చారు వంటి ద్రవ పదార్ధాలు వేడి చేసేప్పుడు లేదా చాలా కాలం గా ఫ్రిజ్ లో వున్నవాతినో వేడి చేసేప్పుడు మధ్య లో ఒక్క సారి డోర్ తీసి కలియబెట్టి మళ్ళీ వేడి చేస్తే చాలా సమం గా కింద వరకు ఒకేలా వేడి అవుతాయి.
5. పండగలప్పుడు పాయసం వంటివి చేసేప్పుడు బెల్లం తరుగు కోవటం ఒక పనే కదా, ఆ బెల్లం గడ్డ ను ఒక గిన్నెలో వేసి కొంచం నీటి చుక్కలు చిలకరించి మైక్రోవేవ్ లో 2 నిమిషాలు వేడి చేసి చూడండి బెల్లం పాకం రడీ.
6. చింతపండు నాన పెట్టటం మర్చి పోయారా పప్పు చారు లోకి. కొంచం చింతపండు గిన్నెలో వేసి కొంచం నీళ్ళు పోసి ఒక నిమిషం వేడి చేయండి (మూత మర్చి పోవద్దు), గుజ్జు రడీ.
7. పైన సూత్రమే పిల్లలకు తల అంటే టప్పుడు కుంకుడుకాయలు అప్పటికప్పుడు నాన పెట్టుకోవటానికి కూడా వుపయోగ పడుతుంది.
8. అంట్లు తోముకునే స్పాంజ్ తో చికెన్, రోయ్యాలో వండిన గిన్నెలో, చికెన్ కడిగి వుంచుకున్న గిన్నో, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిన పెనమో తోమి తరువాత దానితో పాల గిన్నె తోమాలంటే కొంచం ఇబ్బంది గానే వుంటుంది.
వాసన ఒక చిరాకు, ఆ బేక్టీరియా మిగతా వాటికి వస్తుందేమో అని మనసు లో ఒకటే నస గా వుంటుంది. అది పోవాలంటే ఆ స్పాంజ్ ను తడిచేసి ఒక రెండు నిమిషాలు మైక్రోవేవ్ లో వేడి చేయండి. ఆ రేడియేషన్ కు బేక్టీరియా ఫ్రీ అవుతుంది అట, వాసన కూడా వుండదు.
9. కాఫీ టీ లు పెట్టుకునేప్పుడు ముందే పంచదార వేసి వేడి చేయకండి పంచాదర వేసి మైక్రోవేవ్ లో పెడితే పాలు పొంగి పోతాయి.
Thursday, May 16, 2013
చిట్కాలు
1. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే చారెడు ఉప్పు వేసి 10 నిమిషాలు
నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి.
2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను
అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం
శ్రమ, టైం వేస్టూనూ.
3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి.
అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు.
4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే
వేయాలి. ఇటువంటి కూరలు రెండుసార్లు శుభ్రపడవలసిందే.
5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే
అవి పైకి తేలిపోతాయి.
6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని
పోషకాంశాలు నశించే ప్రమాదముంది.
7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో
ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె
రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు.
8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో
తడుపుకుంటే దురదలు పుట్టవు.
9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.
10. బంగాళాదుంపలు మెత్తబడినట్లయితే తరగబోయేముందు వాటిని ఒక అర
గంట ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.
12. వంకాయలు, అరటికాయలు తరిగేటప్పుడు కొంచెం పెరుగు కలిపిన నీళ్ళలోకి
తరిగితే కనరెక్కకుండా ఉంటాయి.
13. వంకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళలోకాని, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే
కనరెక్కకుండాను, నల్లబడకుండానూ ఉంటాయి.
14. అరటిపువ్వును దంపేటప్పుడు పసుపు వేసి దంపితే నల్లబడదు.
15. ఉల్లిపాయలను ఒక అరగంట సేపు నీళ్ళలో నాననిచ్చి, ఆ తర్వాత తరిగితే
కళ్ళమ్మట నీళ్ళు రావు.లేదా ఫ్రిజ్లో పెట్టి తీసినా సరే.
16. కాలిఫ్లవర్ ను ఎప్పుడుగానీ చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన గోరువెచ్చటి
నీళ్ళలో వేసి కొద్ది సేపు తర్వాత తీసి వండుకోవాలి. ఇలా చేస్తే అందులోని
క్రిములు చచ్చిపోతాయి.
17. ఉల్లిపాయ తరిగేటప్పుడు రెండువైపులా కోసి మధ్యకి తరిగితే పైనున్న పొర
త్వరగా వచ్చేస్తుంది.
18. వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో బెడితే పొట్టు తేలిగ్గా వస్తుంది.
19. నిమ్మకాయను నేలమీద పెట్టి అరచేత్తో అదిమి కాస్త మెత్తబడ్డాక కోస్తే రసం
పిండటం తేలికగా ఉంటుంది ఎక్కువ వస్తుంది కూడా.
20. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితె లోపలి ద్రవం
బైటకు రాకుండా బాగా ఉడుకుతుంది.
21. గ్రుడ్లను ఉడకబెట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పైపెంకు
ఒలవడం తేలికవుతుంది.
22. ఉడికిన గ్రుడ్లను చన్నీళ్ళలో ముంచిన కత్తితో కోస్తే బాగా తెగుతాయి.
23. కోడిగ్రుడ్లను అల్యూమినియం, లేదా వెండిపాత్రలలో పగలగొడితే
అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
24. తడిగా ఉన్న పాత్రలలోకి పగలగొడితే గ్రుడ్డులోని పసుపు భాగం పాత్రకు
అంటుకోకుండా ఉంటుంది.
25. ఆమ్లెట్లు వేసేముందు గిన్నెలో ఉప్పు కారం మసాలా అన్నీకలిపి కొద్దిగ
నీరుపోసి కలిపిన తర్వాత గ్రుడ్లను కొట్టి కలిపితే అవి సమానంగా కలుస్తాయి.
నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి.
2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను
అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం
శ్రమ, టైం వేస్టూనూ.
3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి.
అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు.
4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే
వేయాలి. ఇటువంటి కూరలు రెండుసార్లు శుభ్రపడవలసిందే.
5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే
అవి పైకి తేలిపోతాయి.
6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని
పోషకాంశాలు నశించే ప్రమాదముంది.
7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో
ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె
రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు.
8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో
తడుపుకుంటే దురదలు పుట్టవు.
9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.
10. బంగాళాదుంపలు మెత్తబడినట్లయితే తరగబోయేముందు వాటిని ఒక అర
గంట ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.
12. వంకాయలు, అరటికాయలు తరిగేటప్పుడు కొంచెం పెరుగు కలిపిన నీళ్ళలోకి
తరిగితే కనరెక్కకుండా ఉంటాయి.
13. వంకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళలోకాని, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే
కనరెక్కకుండాను, నల్లబడకుండానూ ఉంటాయి.
14. అరటిపువ్వును దంపేటప్పుడు పసుపు వేసి దంపితే నల్లబడదు.
15. ఉల్లిపాయలను ఒక అరగంట సేపు నీళ్ళలో నాననిచ్చి, ఆ తర్వాత తరిగితే
కళ్ళమ్మట నీళ్ళు రావు.లేదా ఫ్రిజ్లో పెట్టి తీసినా సరే.
16. కాలిఫ్లవర్ ను ఎప్పుడుగానీ చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన గోరువెచ్చటి
నీళ్ళలో వేసి కొద్ది సేపు తర్వాత తీసి వండుకోవాలి. ఇలా చేస్తే అందులోని
క్రిములు చచ్చిపోతాయి.
17. ఉల్లిపాయ తరిగేటప్పుడు రెండువైపులా కోసి మధ్యకి తరిగితే పైనున్న పొర
త్వరగా వచ్చేస్తుంది.
18. వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో బెడితే పొట్టు తేలిగ్గా వస్తుంది.
19. నిమ్మకాయను నేలమీద పెట్టి అరచేత్తో అదిమి కాస్త మెత్తబడ్డాక కోస్తే రసం
పిండటం తేలికగా ఉంటుంది ఎక్కువ వస్తుంది కూడా.
20. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితె లోపలి ద్రవం
బైటకు రాకుండా బాగా ఉడుకుతుంది.
21. గ్రుడ్లను ఉడకబెట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పైపెంకు
ఒలవడం తేలికవుతుంది.
22. ఉడికిన గ్రుడ్లను చన్నీళ్ళలో ముంచిన కత్తితో కోస్తే బాగా తెగుతాయి.
23. కోడిగ్రుడ్లను అల్యూమినియం, లేదా వెండిపాత్రలలో పగలగొడితే
అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
24. తడిగా ఉన్న పాత్రలలోకి పగలగొడితే గ్రుడ్డులోని పసుపు భాగం పాత్రకు
అంటుకోకుండా ఉంటుంది.
25. ఆమ్లెట్లు వేసేముందు గిన్నెలో ఉప్పు కారం మసాలా అన్నీకలిపి కొద్దిగ
నీరుపోసి కలిపిన తర్వాత గ్రుడ్లను కొట్టి కలిపితే అవి సమానంగా కలుస్తాయి.
పాలకులంటే ఇలా ఉండాలి,,,,,,,,,,,,,దైవాలజీ
హజ్రత్ ఉమర్ (ర) గొప్పనాయకుడు. ప్రజారంజక పాలకుడు. పరిపాలనా దక్షుడు. ప్రతిక్షణం ప్రజాసంక్షేమం కోసమే ఆలోచించే ప్రభువు. పగలంతా పాలనావ్యవహారాల్లో తలమునకలై ఉన్నా, రాత్రుళ్లు కూడా సరిగా నిద్రపోయేవారు కారు. తన పాలనలో ప్రజలెలా ఉన్నారోనన్న ఆలోచన ఆయన్ను అనుక్షణం వెంటాడేది. ఈ ఆలోచనే ఆయన్ను గస్తీలు తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేలా ప్రేరేపించేది. ఖలీఫా హజ్రత్ ఉమర్ తరచుగా మారువేషంలో గస్తీ తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. ఒకరోజు హజ్రత్ ఉమర్ యథాప్రకారం గస్తీ తిరుగుతూ ఓ మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న పూరిపాకలో ఓ వితంతువు నివసిస్తోంది. కూలినాలి చేస్తూ తన ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటోంది.
‘‘అమ్మా! పిల్లలు ఎందుకలా ఏడుస్తున్నారు? ఏమిటీ విషయం?’’ అంటూ ఆరా తీశారు, ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని పంటికింద బిగబట్టుకుని, ‘‘అది... అది కాదండీ... నిజానికి ఈ గిన్నెలో ఏమీ లేవు. పిల్లల్ని ఓదార్చడానికి కాసిని నీళ్లు, నాలుగు రాళ్లు పోసి వారిని నమ్మిస్తున్నాను, ఇంతకంటే ఇంకేమీ చేయలేని నిస్సహాయురాలిని’’ అన్నదామె కొంగుతో కళ్లు తుడుచుకుంటూ. పసిపిల్లల ఆకలిబాధను కళ్లారా చూసిన ఖలీఫాకు కూడా అప్రయత్నంగానే కళ్లవెంట నీళ్లు జలజలా రాలాయి. ‘‘అమ్మా! ఈ విషయం ఖలీఫాకు (పాలకుడు) చెప్పలేదా? పాలకుల దృష్టికి తీసుకెళితే నీకేమైనా సహాయం అందేదేమో!’’ అన్నారు ఉమర్. ‘‘అయ్యా! పేదవితంతువును. పాలకుల వద్దకు వెళ్లగలనా? అయినా తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకులకు లేదా? ప్రజాసంక్షేమం పట్టనివారు, కనీస ధర్మం నెరవేర్చలేని వారు పాలకులుగా ఎలా ఉంటారు?’’ అన్నదామె ఒకింత ఆవేదనతో. బాధ, నిస్సహాయతల్లోంచి ఆవేశంగా దూసుకొచ్చిన ఈ మాటలు ఖలీఫా ఉమర్ గుండెకు తూటాల్లా తగిలాయి. మారుమాట్లాడకుండా శరవేగంతో వెనుదిరిగిన ఉమర్ కోశాగారానికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ గోనెసంచిలో నింపుకుని స్వయంగా తన భుజాలపై మోసుకొచ్చి ఆమెకు అందజేశారు. స్వహస్తాలతో వండి పిల్లలకు తినిపించారు. ఈ ఆప్యాయతకు, ఇంతటి సహాయానికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియని ఆ స్త్రీ ‘‘అయ్యా... పాలకుడిగా (ఖలీఫాగా) ఉండాల్సింది నిజంగా మీరే. ఆ ఉమర్ కానేకాదు. పాలకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి’’ అంటూ కృతజ్ఞతగా తెలిపిందామె. పశ్చాత్తాప భావంతో కుమిలిపోతున్న ఉమర్ ‘‘అమ్మా! ఇప్పటివరకు మీ కష్టసుఖాలు తెలుసుకోలేకపోయిన ఉమర్‌ను నేనేనమ్మా! నన్ను మన్నించండి. నా వల్ల పెద్ద పొరబాటే జరిగిపోయింది. ఇకముందు అలా జరగకుండా చూసుకుంటాను’’ అంటూ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, పింఛను కూడా మంజూరుచేశారు. ఇంతటి జవాబుదారీతనం, బాధ్యతాభావం ఉండబట్టే ఖలీఫా హజ్రత్ ఉమర్ పాలనా కాలాన్ని చరిత్రకారులు సువర్ణాక్షరాలతో లిఖించారు. ఇందులో కనీసం వందోవంతైనా నేటి పాలకులు ఆచరించగలిగితే బాగుండు. |
Subscribe to:
Posts (Atom)