all

Thursday, April 18, 2013

ఫన్నీ
తండ్రి: రాత్రి ఎన్ని గంటల వరకు చదివావు?
కొడుకు: పన్నెండు గంటల వరకు చదివాను.
తండ్రి: పదిన్నరకే కరెంట్ పోయిందిగా...
కొడుకు: చదువు ధ్యాసలో పడి ఆ విషయమే గమనించలేదు

*****

ఏమి మార్కులు!

తండ్రి: పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయ్?
కొడుకు: అన్నయ్య కంటే పదిమార్కులు తక్కువగా వచ్చాయి.
తండ్రి: వాడికి ఎన్ని మార్కులు వచ్చేయ్?
కొడుకు: పదకొండు!
- See more at: http://sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=60764&Categoryid=5&subcatid=16#sthash.gQRoO0If.dpuf

ఆహారమే మనసుగా మారుతుంది...

 

ఇంటిరియం
జగత్తులో చైతన్యం నింపే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. సృష్టిలోని సకల జీవరాశులు సూర్యకిరణాల స్పర్శతోనే చైతన్యవంతం అవుతాయి. రవి కిరణాలు మానవులకే కాక సకల జీవజాతులకు, వృక్షజాతులకు ఉపకరిస్తాయి. వేర్వేరు కాంతిదైర్ఘ్యాలకు వేర్వేరు జీవులు స్పందిస్తుంటాయి. ఆత్మకారకుడైన రవి చైతన్యాన్ని కోల్పోతే శరీరం మరణానికి చేరువ అవుతుంది.

మధ్యాహ్న సమయాన తమోగుణాన్ని చూపిస్తాడు. తన ప్రచండరూపంతో ప్రకృతిలోని రజోగుణాన్ని నశింపచేస్తాడు. రోజంతా మనలో చైతన్యాన్ని నింపి, ఆనందాన్ని పంచి ఒక తండ్రిలా కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. సాయంసంధ్యకల్లా పశ్చిమానికి వెళ్లిపోతాడు.

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు గ్రహాలకు రారాజు. ఆరోగ్యకారకుడు, పితృకారకుడు. ఉచ్ఛ్వాసనిశ్వాసలకు, రక్త ప్రసరణ వ్యవస్థకు, అతి ముఖ్యమైన గుండెకు... బాధ్యుడు సూర్యుడే.

వేర్వేరు కాంతి దైర్ఘ్యాలకు వేర్వేరు జీవులు స్పందిస్తుంటాయి. ఆ కాంతులు భూ ఉపరితలంపైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సూర్యకిరణాల్లో ఆరోగ్యసూత్రాలు ఇమిడి ఉన్నాయి. సూర్యకిరణాలు సోకనివారికి అస్వస్థత, చర్మవ్యాధులు వంటివి సంక్రమించడం తెలిసిందే. అప్పుడే పుట్టిన పిల్లలకు కామెర్లవ్యాధి సోకితే సూర్యుని లేలేత కిరణాలలో ఉంచుతుంటారు. ఇక మనం తీసుకునే ఆహారంలో కాయలు, పండ్లు, ధాన్యాలు కిరణజన్యసంయోగక్రియ ద్వారా వచ్చినవే.

‘ఆహారమే మనసుగా మారుతుంది’ అన్నది ఉపనిషద్వాక్యం. మనసులో అలజడులు, సంతోషాదులే శరీరంలో మార్పులకు, అనారోగ్యాలకు కారణం. అందుకే మనం తీసుకునే ఆహారం శక్తిని కలిగించేదై ఉండాలి. పరోక్షంగా కూడా ఆహారాన్ని, మనస్సును, శరీరాన్ని సూర్యుడే పోషిస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్షదైవం. సూర్యుడిని పూజించడం వలన తేజస్సు, బలం, ఆయువు, నేత్రకాంతి వృద్ధి అవుతాయి. సూర్యోపాసన ద్వారా మానవులు రోగవిముక్తులు కాగలరు.

అందుకే ఇంటిలోకి సూర్యకాంతి పడేవిధంగా చూసుకోవాలి. వీలైనంతసేపు ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. ఉదయాన్నే సూర్యుని నుంచి వచ్చే కిరణాలలో విటమిన్ - డి ఉంటుంది. అందువల్ల సూర్యుని లేలేత కిరణాలు పడే సమయంలో కొద్దిసేపైనా ఎండలో నిలబడటం మంచిది. వీలైతే సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యదాయకం. ప్రాణప్రదాత అయిన సూర్యుడిని భగవంతునిగా భావిస్తూ సూర్యనారాయణుడు అనడానికి కారణం ఇదే.
 

సోషల్ నెట్‌వర్కింగ్‌తో సొమ్ము!


వెబ్‌సైట్, బ్లాగ్, ఫేస్‌బుక్ , ట్విటర్‌లలో యాక్టివ్‌గా ఉండేవారు తమ అప్‌లోడింగ్, షేరింగ్‌లతో కూడా గూగుల్ యాడ్‌సెన్స్ ద్వారా మరింత సొమ్ము సంపాదించే అవకాశాన్ని ఇస్తోంది సోషల్‌డో.కామ్. సొంతంగా వెబ్‌సైట్‌ను నడిపేవారు తమ సైట్‌ను సోషల్‌డోతో అనుసంధానిస్తే చాలు... గూగుల్ యాడ్‌సెన్స్ సంపాదించినట్టే! సోషల్‌మీడియాలో మీ కంటెంట్‌కు ఫ్యాన్స్‌ను సంపాదించుకోవడమే కొంచెం కష్టమైన పని. దాన్ని ఈ వెబ్‌సైట్ ద్వారా సులభంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ సైట్‌లో ఉచితంగా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ వెబ్‌సైట్‌ను దీనికి లింకప్ చేస్తే విస్తృతమైన ప్రచారం వస్తుంది. తద్వారా యాడ్ రెవెన్యూను కళ్లజూడవచ్చు! మీ సైట్ లేదా బ్లాగ్ లేదా మరే సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్‌కు ఈ సైట్ ద్వారా ట్రాఫిక్ పెంపొందించుకోవచ్చు. రెవెన్యూ ట్రాకింగ్ గురించి కూడా ఫీడ్ బ్యాక్ ఉంటుంది. సైట్లతో సొమ్ము చేసుకోవడానికి ఒక అవకాశం http://socialdoe.com/

 

ధనురాసనం...యోగా

 

 
ధనుస్సు అంటే విల్లు. ఈ ఆసనం వేసినప్పుడు దేహం ధనుస్సును పోలి ఉంటుంది. అందుకే దీనికి ధనురాసనం అని పేరు.

ఎలా చేయాలి?
బోర్లా పడుకుని రెండు మోచేతులను మడిచి అరచేతులు బోర్లించి ఒకదాని మీద మరొకటి ఉంచాలి. బోర్లించిన చేతుల మీద గడ్డాన్ని ఆనించాలి.

రెండు మోకాళ్లను వంచి రెండు చేతులతో రెండు కాళ్ల మడమల్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో రెండు పాదాలు, మోకాళ్ల మధ్య కొద్దిగా దూరం ఉండాలి.

ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కాళ్లను, చేతులను పరస్పర వ్యతిరేక దిశలో పెకైత్తాలి. ఈ స్థితిలో మోకాళ్లు, తొడలు, తల, ఛాతీ పైకి లేచి ఉంటాయి, పొత్తికడుపు మాత్రమే నేలను తాకుతూంటుంది. ఈ స్థితిలో దేహం ధనుస్సును తలపిస్తుంది. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి.

ఈ ఆసనాన్ని రోజూ ఉదయం మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

ఆ ఆసనం వేస్తే ఉపయోగం ఏంటి?
నడుమునొప్పి, మోకాళ్లనొప్పి, కీళ్ల వ్యాధులు, థైరాయిడ్ సమస్యలతో పాటు ఇతర గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి.

కాళ్లు, చేతులు, భుజాలు, గుండెకండరాలు శక్తిమంతం అవుతాయి.

ఛాతీ విశాలమవుతుంది. శ్వాస వాహికలు శుభ్రపడి కఫదోషాలు తొలగుతాయి.

ఊపిరితిత్తులు పూర్తిగా గాలితో నిండుతాయి, తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

శరీరం బరువు పొత్తికడుపు మీద కేంద్రీకృతం కావడం వల్ల పొట్ట కండరాలు, జీర్ణవ్యవస్థల మీద ఒత్తిడి కలుగుతుంది. దాంతో ఇవి చైతన్యం అవుతాయి. దీంతో మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు సమసిపోతాయి.

తొడలు, పిరుదులపై ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది.

రుతుక్రమ సమస్యలు తగ్గుతాయి.

క్రమం తప్పకుండా ఈ ఆసనం సాధన చేస్తే ముఖం ప్రసన్నంగా ఉంటుంది.

ఎవరైనా చేయవచ్చా?
గర్భిణులు, పీరియడ్స్ సమయంలో ఉన్నవాళ్లు చేయకూడదు.

హెర్నియా, డిస్క్ సమస్య ఉన్నవాళ్లు చేయకూడదు.

స్పాండిలోసిస్, హైబీపీ ఉన్నవాళ్లు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

వార్ధక్యదశకు చేరినవాళ్లు, మరీ బలహీనంగా ఉన్నవాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకపోవడమే మంచిది.


‘చిత్తవృత్తి నిరోధకః’ అంటే... చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడమే యోగ.

చిత్తం... అంటే ఉపచేతన మనసు; వృత్తులు... అంటే అలల వంటి ఆలోచనలు.

మనసులో నిత్యం అలలుగా ఎగిసిపడే ఆలోచనలను అదుపుచేయడం స్థూల - సూక్ష్మ శరీరాల కలయికతోనే సాధ్యం... అదే యోగసాధన.
 

శ్రీరామ నైవేద్యం.....

 

వడపప్పు, పానకం!
శ్రీరామచంద్రునికి నైవేద్యం.
పెసరపప్పును గంటసేపు నానబెడితే చాలు....
వడపప్పు రెడీ.
పానకానికి మాత్రం కాస్త కష్టపడాలి.
ఈ చైత్రంలో... ఈ ఎండల్లో పప్పును, పానకాన్ని సేవిస్తే చలువ.
వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన వంటల్ని
రేపటి శ్రీరామనవమి కోసం ఫ్యామిలీ మీకు అందిస్తోంది.


పానకం...

కావలసినవి
బెల్లం పొడి - కప్పు
నీళ్లు - మూడు కప్పులు
నిమ్మకాయలు - రెండు
ఎండు అల్లంపొడి - అర టీ స్పూను
ఏలకుల పొడి - అర టీ స్పూను
మిరియాల పొడి - అర టీ స్పూను

తయారి
పెద్ద పాత్రలో బెల్లం పొడి, నీరు వేసి కరిగేదాకా కలపాలి.

వడపోసి, నిమ్మరసం, ఎండు అల్లంపొడి, ఏలకుల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
అన్నిటినీ బాగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి.

ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

హులీ అవలక్కి

కావలసినవి:
బియ్యం - నాలుగు కప్పులు
నీళ్లు - ఆరు కప్పులు; చింతపండురసం - అరకప్పు
బెల్లం తురుము - కొద్దిగా; పసుపు - తగినంత
ఉప్పు - తగినంత

పోపుకోసం
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
పచ్చిశనగపప్పు - టీ స్పూను; ఎండుమిర్చి - పది
పచ్చిమిర్చి - పది; పల్లీలు - పావు కప్పు
నువ్వులు - పావు కప్పు; కరివేపాకు - నాలుగు రెమ్మలు

తయారి
బియ్యాన్ని మూడు గంటల సేపు నానబెట్టి, నీరు వడగట్టి, బియ్యాన్ని ఆరబెట్టాలి.

కొద్దిగా తడిగా ఉండగా బియ్యాన్ని మిక్సీలో వేసి రవ్వలా పట్టాలి (అవసరమనుకుంటే జల్లెడపట్టాలి).

ఒక పాత్రలో చింతపండు రసం, బెల్లం తురుము, పసుపు, ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి.

మందపాటి పాత్రలో ఆరు కప్పులు నీరు పోసి స్టౌ మీద ఉంచాలి.

మరిగాక బియ్యపురవ్వ వేసి కలపాలి. (రవ్వ పోస్తున్నంతసేపు కలుపుతుండాలి)

ఉడికిన రవ్వను పెద్ద పాత్రలోకి తిరగదీయాలి.

స్టౌ మీద బాణలి ఉంచి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

పల్లీలు, నువ్వులు, కరివేపాకు జతచేసి వేయించాలి.

ఉడికించిన రవ్వలో వేసి కలపాలి.

చింతపండులో నానబె ట్టి ఉంచుకున్న పదార్థాలను వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.

రెండుమూడు గంటల తర్వాత సర్వ్‌చేయాలి.

క్యారట్ కోసాంబరి

కావలసినవి:
క్యారట్ తురుము - అర కేజీ; పెసరపప్పు - అర కప్పు; సన్నగా తరిగిన కొత్తిమీర - అర కప్పు; నిమ్మరసం - రెండు టీ స్పూన్లు; ఉప్పు -తగినంత

పోపుకోసం: నూనె - టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి:
పెసరపప్పును రెండుమూడు గంటలు నానబె ట్టి, నీరు వడగట్టాలి ఒక పాత్రలో క్యారట్ తురుము, పెసరపప్పు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి కరివేపాకు, కొద్దిగా ఇంగువ జతచేసి వేయించాలి క్యారట్ మిశ్రమంలో వేసి కలపాలి. చల్లగా సర్వ్ చేయాలి.

కోసాంబరి (సలాడ్)

కావలసినవి
శనగపప్పు - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం తురుము - టీ స్పూను
కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
నిమ్మరసం లేదా మామిడికాయ రసం - 3 టీ స్పూన్లు

పోపు కోసం నూనె - టీ స్పూను
ఆవాలు - అర టీ స్పూను
జీలకర్ర - అర టీ స్పూను
కొత్తిమీర - కొద్దిగా

తయారి
శనగపప్పును మూడు నాలుగు గంటలపాటు నానబెట్టాలి.

పచ్చిమిర్చి కలిపి మిక్సీలో కచ్చాపచ్చాగా తిప్పాలి.

ఉప్పు, నిమ్మరసం, కొబ్బరితురుము కలపాలి.

స్టౌ మీద బాణలి ఉంచి కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.

అన్నిటినీ ఒక బౌల్‌లో వేసి బాగా కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
 

Saturday, April 6, 2013

వేసవి అంటే ఆహ్లాదం కూడా!

 

కొన్ని వస్తువులు కొన్నాళ్లు వాడాక పాతబడిపోతాయి. వాటిని పారేద్దామంటే పర్యావరణానికి హాని కలుగుతుందేమోనని సందేహంతో ఇంట్లోనే ఉంచేసుకుంటాం. అలా ఉంచుకునేసరికి కొన్నిరోజులకి ఇంట్లో తట్టెడంత చెత్త పేరుకుని ఉంటుంది. వాటిని ఉంచలేక పారేయలేక సందిగ్థంగా ఉంటుంది మీ మనసు. అలాంటప్పుడు మెదడుకి కాస్తంత పదును పెడితే సరి. అద్భుతమైన కళాఖండాలు తయారవుతాయి.

గాజు పాత్రలు, హ్యాండ్‌బ్యాగులు, టీ కెటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇలా చేయడం వలన ఈ వేసవిని వేడిగా కాకుండా మనసుకి ఆహ్లాదం కలిగేలా చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసింది కొద్దిగా మట్టి, అందమైన రాళ్లు, చిన్నచిన్న మొక్కలు ఉంటే చాలు. వాటితో పాతవస్తువులకు కొత్తరూపం తీసుకువచ్చి, ఇంటిని స్టార్ హోటల్ గా మార్చేయవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

1. గాజు గ్లాసులో కొద్దిగా మట్టి వేసి అందులో చిన్న ఇండోర్ ప్లాంట్‌ని అమర్చి, కొద్దిగా నీరు పోస్తే చాలు, వేళ్లతో సహా మొక్క కనిపిస్తూ ఎంతో అందంగా ఉంటుంది.

2. గాజు బౌల్‌లో సగం వరకు మాత్రమే మట్టి పోసి, పైన అందమైన రంగురంగుల గులకరాళ్లు వేసి, కలబంద లాంటి మొక్కను ఉంచితే, గాజు బౌల్‌లో మట్టి, రాళ్లతో పాటు మొక్క కూడా కనువిందు చేస్తుంది.

3. చాలాకాలంగా అటకె క్కిన టీ కెటిల్స్‌ని కిందకి దించి శుభ్రంగా కడిగి, అందులో నీళ్లు పోసి, ఆర్టిఫీషియల్ ప్లాంట్ అమర్చి, టీవీ వంటి వాటి మీద పెట్టండి. గది రూపం మారిపోతుంది.

4. ప్లాస్టిక్ బూట్లు, బకెటు, మగ్గుల వంటివి ఉంటే వాటిని ఒక్కసారి శుభ్రంగా కడిగి, ఇంకా అందంగా అనిపించకపోతే పైన రంగురంగుల కాగితాలు అంటించి, ఆ పాత్రలో ప్లాస్టిక్ పూలు కాని, ప్లాస్టిక్ మొక్కలు కాని వేసి రూమ్ కార్నర్‌లో డెకొరేట్ చేస్తే గది అందం రెట్టింపవుతుంది.

5. పాతబడిన పూలబుట్ట ఉంటే, ఒక్కసారి దాని దుమ్ము దులిపి, అందులో మట్టి వేసి, అందమైన క్రీపర్‌లాంటివి పెట్టి, గుమ్మం ముందు ఇంటి పైకప్పుకి ఉండే హుక్‌కి తగిలించండి. ఇంట్లోకి వస్తున్న వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, తల మీద పూలు చల్లుతున్న భావన కలుగుతుంది.

ఇవే కాదు... మీ మనసుకి నచ్చేవిధంగా, మీ ఇంటికి సరిపోయే విధంగా పాతవస్తువులను కొత్తగా తయారుచేయండి. ఇంటిని కొత్తగా మార్చేయండి.
 

రియల్ ఎస్టేట్ వర్సెస్ షేర్ మార్కెట్

 

డబ్
ఎంత చెప్పుకున్నా రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేవి షేర్లు మాత్రమే. వీటి రెండింటి లక్షణాలు పరిశీలిస్తే...

రియల్ ఎస్టేట్

కొనేటపుడు మోసపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అన్నివర్గాలకు అందుబాటులో ఉండదు. అవసరమైన వెంటనే అమ్మలేం. అమ్మేటపుడు సమయానికి మంచి డీల్ రావాలి. వెంటనే డబ్బు కట్టి కొనే వ్యక్తి దొరకాలి. అంతా సక్రమంగా జరిగితేనే సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

షేర్ మార్కెట్

ఎప్పుడయినా పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరైనా కొనవచ్చు. విడతలవారీగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. స్థలం కొనే స్థోమత లేనివారు ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా ఇలాంటివాటిలో పెట్టుబడి పెట్టుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు. షేర్ల గురించి తెలియని వారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా తొలుత వీటిలో అడుగు పెట్టొచ్చు. అవగాహన పెంచుకున్నాక కంపెనీల షేర్లను నేరుగా కొనొచ్చు. ఇటీవల మార్కెట్ బాగా తగ్గింది. ఇపుడు మొదలుపెట్టిన వారు మంచి లాభాలు పొందే అవకాశాలుంటాయి. వారెన్ బఫెట్ చెప్పినట్టు అందరూ భయపడేటపుడు నువ్వు ధైర్యం చెయ్యి!.