'చిన్ని పసిబుర్రలో ఎన్ని ఆలోచనలో' అంటూ ఒక్కోసారి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు మురిసిపోతూ, మరొకవైపు ఆశ్యర్యపోతూ ఉంటారు తల్లితండ్రులు. నిజమే పసివయసులో వారికి ప్రత్యేకించి సృజనాత్మకతను నేర్పనవసరంలేదు. వారే అనేక ఆలోచనలకు పునాది వేస్తారు. ఆ పసిమనసు మెదడులో ఎంత ఆలోచనా శక్తి ఉందో ప్రతి తల్లికీ తెలిసే ఉంటుంది. అయితే వారిలోని కళలకు ప్రోత్సాహం ఒక్క పొగడ్తకో, ముద్దుల వర్షంతో ముం చెత్తడానికో పరిమితమై పోకూడదు. వారి సృజనాత్మకతకు ఊతమివ్వాలి. అప్పుడే వారిలోని కళ ఇంటిల్లి పాదికీ కళను తెస్తుంది. విద్యార్థిగా పరిచయం కాకముందునుంచే ఇంట్లో వాతావరణం, ప్రోత్సాహాన్ని బట్టి చాలా మంది చిన్నారుల్లో అనేక కళలు ఉట్టి పడుతుంటాయి. ఇంటిదగ్గర అప్పటికే చదువుకుంటున్న వారిని చూసి వారి పలక, పుస్తకాలను లాక్కుని పిచ్చిగీతలు గీయడంతో తమ చేతివ్రాత ప్రస్థానాన్ని మొదలుపెడతారు ఈ బుడతలు. ఈ వయసులోనే ఒక్కోసారి ఊహించని రీతిలో వారికి ఆడుకోవడానికి కొని ఇచ్చిన బొమ్మల రూపాలను గీయాలని చూడటం, ఇంట్లో ఉన్న చిన్నచిన్న వస్తువులతో ఏదో రూపాన్ని తయారు చేయడానికి ప్రయత్నించటం చేస్తుంటారు. ఇవే పిల్లల్లో సృజనాత్మకతను గమనించడానికి ప్రధానమైన ఆధారాలు అంటున్నారు నిపుణులు. ఇక్కడి నుంచే వాళ్ళకళలకు పదును పెట్టడం కూడా అంత కష్టంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది కాదు అంటున్నారు. కావలసిందల్లా వారిని కాస్త దగ్గరగా గమనిస్తూ మరికాస్త శ్రద్ధ జోడించడం. అలా కాకుండా... ఏదైనా కాగితంపై గీతలు గీస్తుంటే చాలు 'ఏయ్...ఏంటి ఆ పిచ్చిగీతలు, అన్నీ నాశనం చేస్తున్నావ్' అంటూ పెద్దగా అరుపులు వినిపిస్తాయి. నిజానికి పిచ్చి గీతలకు, బాపు బొమ్మకు తేడా తెలియదు వారికి. ఆమాటకొస్తే ఎంత గొప్ప చిత్రమైనా రూపుదిద్దుకోవలసింది ప్రధానంగా గీతతోనే కదా! అందరితో ఆడుకోవలసిన అంత చిన్న వయసులోనే ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పసివారిలో, అదేదో చేయకూడని పని అనే ముద్రను ఎందుకు వేయడం? అలాంటి సమయంలో వారికి బొమ్మకు, పిచ్చిగీతలకు తేడా చూపించే ప్రయత్నం చేయండి. వారు పెట్టిన గీతలకే బొమ్మరూపం తెచ్చి చూపించండి. వారి ఆలోచన మరింత ముందుకు నడుస్తుంది. అంతే కాదు మంచిమంచి బొమ్మలు, చిత్రాలు వారికి సులభంగా అర్థమయ్యేవి తెచ్చి ఇవ్వండి. ఇవి కొత్తకొత్త ఆలోచనలు చేసే బుల్లి మేధావి మెదడుకు సాయం చేస్తాయి. అవి గొప్పవే మరి కాస్త ఎదిగే కొద్దీ వారు వేస్తున్న చిన్న చిన్న పెయింట్స్ ఎంతో ఆలోచింపజేసేవిగా అంతకుమించి అందంగా కూడా ఉంటాయి. అలాంటివాటిని బాగుందమ్మా అంటూ పక్కన పెట్టడం అలవాటు. కానీ ఇలాంటి వాటిని చక్కగా ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు అమర్చితే అది చూసిన ప్రతిసారీ వారికి ఇంకా మంచి పెయింట్ వేయాలనో, ఇంకా మంచి కళాకృతిని తయారు చేయాలనో అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు వాటిగురించి అడగటం మీరు చెప్పడం, వాళ్లు మీ చిన్నారులను మెచ్చుకోవటం ఇవన్నీ వారికి మంచి ప్రోత్సాహాన్నిచ్చే టానిక్‌లా పనిచేస్తాయి. ఇంట్లో గది గోడలకు నిండుదనాన్ని, గదికి అందాన్ని ఇస్తాయని అప్పుడప్పుడూ బజార్లో చిత్రపటాలు కొంటూ ఉంటారు. కానీ ఆ ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోనే మీ పసివాళ్ల కళాఖండాలకు ఫ్రేమ్‌లు కట్టిస్తే రెండు విధాలా మంచిది. వాళ్లలో సృజనాత్మకతను పెంపొందించే (అందుబాటులో ఉండే వస్తువులతో చేసిన) కళాకృతులు ఏవైనా తెచ్చి వారికి బహుమతిగా అందజేస్తే వాటినుండి ఎన్నో కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు పసివాళ్లు. అందుకే వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేన్నీ అశ్రద్ధగా పక్కన పడేసే ప్రయత్నం చేయకుంటే మంచిది. కాస్త ఆలోచించి... ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న వస్తువులన్నీ చిత్రలేఖనం, మంచిమంచి హస్తకళలతో మెరుగులు దిద్దుకొని వస్తున్నాయి. గ్లాసు దగ్గరనుంచి ప్లేటువరకు, గడియారం దగ్గరనుంచి టేబుల్ ల్యాంప్ వరకూ అన్నింటిలోనూ హస్త కళల ఉనికిని చాటే సామాగ్రి ఎక్కువగా వస్తోంది. ఇది కూడా మీ పిల్లల కళలను ప్రోత్సహించడానికి ఉపయో గపడుతుంది. చేయ వలసిందల్లా ఇంటికి సంబం ధించి ఏదైనా సామాగ్రి కొనేటపుడు కాస్త ఆలోచిం చి, చిన్నారుల అభిరుచు లకు దగ్గరగా, ప్రోత్సా హకరంగా ఉన్న వాటిని కొంటే చాలు. మంచి పెయింటింగ్స్, హస్త కళలతో రూపుదిద్దుకున్నవి కొంటే నిత్యం వాటి అవసరం ఉన్న పిల్లలు వాటిని గమనిస్తూనే ఉంటారు. అచ్చం అలానే మరొక వస్తువుపై వేసే ప్రయత్నమూ చేస్తారు. దానికి మీరు ప్రత్యేకించి వారిని ఉత్సాహ పరచవచ్చు. క్రమేపి ఇంట్లో ఉన్న వస్తు వులపై మీ పిల్లల కళానైపుణ్యం దర్శన మివ్వటానికి ఎంతో కాలం పట్టదు. అది వారికి భవిష్యత్తును ఇచ్చే మంచి వృత్తిగా మారినా ఆనందమే కదా! మీరు వెళ్లే ఫంక్షన్‌లకు వారే మంచిమంచి గిఫ్ట్స్‌తయారు చేసి ఇస్తే ఎంత సంతృప్తిగా ఉంటుంది. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Monday, June 17, 2013
చిన్ని మనసుతో స్నేహంగా...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment