all

Monday, June 17, 2013

ఐ క్రీములు వాడితే...


 
NewsListandDetailsచర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేయటంలో ఐ క్రీములెంతగానో తోడ్పడుతాయి. ముఖంలో కంటి చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాని వల్లే ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్‌ ప్రభావం ఉండదు.

ఈ సున్నితమైన చర్మం మాయిశ్చరైజర్‌ తాలూకూ గుణాన్ని గ్రహించదు. ఈ కంటి చుట్టూ ఉండే ప్రాంతాన్ని టిష్యూ పేపర్‌తో పోల్చవచ్చు. మిగతా ముఖంలో ఉండే చర్మాన్ని రైటింగ్‌ పేపర్‌తో పోల్చవచ్చు.

సో... కంటిచుట్టూ ఉండే ప్రాంతంలో వాడే ఏ క్రిములైనా మంచివి, సున్నితమైనవి వాడాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సున్నిత చర్మానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎలాంటి ఐక్రీములు వాడాలో తెలుసుకుందాం.


- లైట్‌ క్రీములు వాడండి. తెలిసి తెలియక మాయిశ్చరైజర్‌లు రాస్తే ఫలితం కనబడదు సరికదా వాపులు లాంటివి రావచ్చు.

- పడుకునే ముందు ఐ క్రీములు వాడండి.

- కనురెప్పలను చాలా శ్రద్ధగా చూసుకోవాలి.

- ఐజెల్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. అలాంటి వాటితో కంటి క్రింద చారలు, నల్లటి లేయర్లను లేకుండా చేసుకోవచ్చు.

- నైట్‌ క్రీములు చర్మానికి రాసినప్పుడు చర్మకణాలతో కలిసిపోయి చర్మానికి కొత్తదనంతో పాటు పోషకవిలువలు కూడా ఇస్తాయి.

- ఎలాంటివి కొనాలి? ఏ వస్తువులు కొనాలి? బ్యూటీ ఉత్పత్తులు కొనటం తలనొప్పిగా ఉందా?

- క్లెన్సర్‌, టోనర్‌, మాయిశ్చరైజర్‌ లాంటి అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులు కొనే ముందు మీకు కావలసిన పోషక పదార్థాలు ఉన్నాయో లేదో చూడండి. అయితే మీ చర్మ తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీ చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకుని వాడండి. లేదా బ్యూటీషియన్‌ను సంప్రదించండి.

No comments: