all

Monday, June 17, 2013

తెల్లజుట్టు రాకుండా....


 
 ముఫ్పయి అయిదేళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం సర్వసాధారణం. అంతకు ముందే జుట్టు తెల్లబడుతూ ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, వేపుళ్లు, మసాలాలు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడు తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని నివారించ గలుగుతాం.

ఒక స్పూన్‌ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకొని ప్రతిరోజు తలకి మసాజ్‌ చేసుకోవాలి.
మల్లెతీగ వేర్లని, నిమ్మరసంతో కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.

తలస్నానానికి వీలైనంత వరకు కుంకుడు, శీకాయ, హెర్బల్‌ షాంపూలనే వాడాలి. జుట్టుకు తరచూ నూనెతో మసాజ్‌ చేయడం చాలా అవసరం.

వారానికి రెండు-మూడు సార్లు మస్టర్డ్‌ ఆయిల్‌ కానీ, కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.తలస్నానం తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలంతా మసాజ్‌ చేస్తే బ్లడ్‌ సర్క్యులేషన్‌ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవు తుంది.

కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది. తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.
జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది,,,?
ఈకాలంలో చుండ్రుకు అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా జుట్టు ఎక్కువ శాతం రాలిపోతుంటుంది.
జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్‌గనూ తయా రవుతుంది.
తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించి వేస్తాయి.
అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్‌ అప్లయి చేయాలి. లేదా కండీషనర్‌ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి.

హెయిర్‌ డ్రయర్‌ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉండాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది.

వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి.
కొబ్బరినూనె, నువు్వలు లేదా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్‌ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచి చుట్టుకుని కొద్దినిమాషాలు ఉంచుకోవాలి.

No comments: