యోగా:
పాదాలను దగ్గరగా ఉంచి చేతులను శరీరానికి ఇరువైపులా తాకించి నిటారుగా సమస్థితిలో నిలబడాలి. చేతులను నిదానంగా పైకి తీసుకుని ఫొటోలో ఉన్నట్లుగా ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లతో కలిపి ఉంచాలి. పూర్తిగా శ్వాస తీసుకుని రెండు అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ శరీరాన్ని ఎడమవైపుకి తిప్పి కాలివేళ్ల మీద నిలబడాలి. ఈ స్థితిలో శరీరాన్ని వీలైనంత వరకు పైకి లాగిపట్టి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇదే క్రమాన్ని కుడివైపు కూడా చేయాలి. అలాగే పాదాలను ఒక అడుగు దూరంలో ఉంచి కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. ఉపయోగాలు పొడవు పెరగడానికి దోహదం చేస్తుంది. కండరాలు, నరాలు, పేగులు, వెన్ను ఉత్తేజితమవుతాయి. మలబద్దకం వదులుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది, కాళ్లు చేతులు, నడుము శక్తిమంతం అవుతాయి. కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి క్రమంగా తగ్గిపోతాయి. రక్తప్రసరణ క్రమబద్ధమవుతుంది.శరీరం చైతన్యవంతం అవుతుంది. దేహాన్ని మెలితిప్పడం వల్ల ఛాతీ కండరాలు శక్తిమంతం అవుతాయి. శ్వాస క్రియ చక్కగా జరుగుతుంది. మానసిక ఒత్తిడులు తొలగిపోతాయి. జాగ్రత్తలు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు. భుజాలు అరిగిపోయిన వాళ్లు, స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు చేయకూడదు. కాలివేళ్లు, మడమలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్ | |||
No comments:
Post a Comment