all

Friday, July 5, 2013

పెళ్లి చేసుకుని, తల్లయ్యాక కూడా సినిమాలను వదలను

 
     
‘ఏ... గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా...’
ఈ అబ్బాయిలకేం పన్లేదు, అమ్మాయి కనిపిస్తే చాలు...
గబ్బర్‌సింగ్‌లా రెచ్చిపోయి సాంగ్ ఎత్తుకుంటారు.
జున్నులాంటి పిల్లకు గన్నులాంటి కళ్లు లేకపోతే...
ఆ మాత్రమైనా ఆగుతారా?!
శ్రుతిహాసన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి స్వీట్ డిలైట్.
మొన్న గబ్బర్‌సింగ్‌లో ఆమే, ఇవాళ ‘బలుపు’లో ఆమే...
రేపు ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’లో కూడా ఆమే!
కమల్ కూతురు అనే ట్యాగ్ సడన్‌గా ఎక్కడో రాలిపోయి...
సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌గా మెరిసిపోతున్నారు శ్రుతిహాసన్.
స్క్రీన్ మీద ఇంతవరకు ‘గన్ను’లాంటి ఆమె కళ్లనే చూశాం.
అవి పేల్చే బులెట్‌లాంటి వ్యూస్‌ని ఇవాళ చదవబోతున్నాం.
మరి జున్నో?!!
మీ దగ్గర ఏ థియేటర్‌లోనైనా దొరుకుతుంది బాస్.
ఇవాళ్టి ‘తారాంతరంగం’ మాత్రం సాక్షికి... స్పెషల్ !


మీ పేరెంట్స్ ఇద్దరూ (కమల్‌హాసన్, సారిక) సెలబ్రిటీస్.. గొప్ప బ్యాక్‌గ్రౌండ్... మరి మీ బాల్యం ఎలా గడిచింది?
శ్రుతిహాసన్: అమ్మానాన్నలు చిన్నప్పట్నుంచీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏది అడిగినా కాదనేవారు కాదు. నేను, చెల్లి బాగా అల్లరి చేసేవాళ్లం. పిల్లలు కదా అని వదిలేసేవాళ్లు. ఆడింది ఆట పాడింది పాటగానే నా బాల్యం హ్యాపీగా సాగింది.

ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి షూటింగ్స్‌కి వెళ్లారా?
శ్రుతిహాసన్: చాలాసార్లు వెళ్లాను. ఫస్ట్ టైమ్ ఆయనతో షూటింగ్‌కి వెళ్లింది ‘విచిత్ర సోదరులు’ టైమ్‌లో. ఆ చిత్రంలో నాన్న సింహాలు, పులులతో కలిసి నటించారు. అది చూసి ‘అమ్మో’ అనుకున్నాను. నాన్న చాలా ‘డేరింగ్’ అనిపించింది.

మీరు చిన్నప్పుడే ‘దేవర్ మగన్’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’) సినిమాలో పాట పాడారు కదా?
శ్రుతిహాసన్: అవును.. అప్పుడు నాకు ఆరేళ్లు అనుకుంటా. ఇళయరాజాగారి కంపోజిషన్‌లో పాడాను. పాట పూర్తవ్వగానే అందరూ అప్రిషియేట్ చేశారు.

ఇళయరాజా దగ్గర కాంప్లిమెంట్ అందుకోవడం ఎలా అనిపించింది?
శ్రుతిహాసన్: ‘దేవర్‌మగన్’లో పాడక మునుపే ఓసారి నాన్న నన్ను రికార్డింగ్ థియేటర్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఇళయరాజాగారు ఉన్నారు. నేను ఓ పక్కన కూర్చుని, ఎప్పుడో నాన్న నేర్పించిన ఓ దేశభక్తి గీతాన్ని మెల్లిగా హమ్ చేయడం మొదలుపెట్టాను. అది విని, ‘మీ అమ్మాయి గొప్ప సింగర్ అవుతుంది. పేరు కూడా శ్రుతి అని భలే పెట్టారే’ అని ఇళయరాజాగారు అన్నారు. చిన్న వయసులో ఆ కాంప్లిమెంట్స్ విలువ నాకంతగా తెలియలేదు. కానీ ఇప్పుడా సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా.. ‘ఇళయరాజాగారిలాంటి గొప్ప వ్యక్తి అభినందనలు అందుకున్నాను’ అని ఆనందపడిపోతుంటా!

బహుశా మ్యూజిక్ నేర్చుకోవాలనే ఆకాంక్ష అప్పుడు కలిగి ఉంటుందేమో...
శ్రుతిహాసన్: సంగీతం మీద ఎప్పుడు ఇంట్రస్ట్ కలిగిందో కరెక్ట్‌గా చెప్పలేను. కానీ చిన్నతనం నుంచీ ఎప్పుడూ ఏదో ఒక పాట హమ్ చేస్తుండేదాన్ని. కొంచెం ఊహ తెలిశాక ఓ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే బాగుంటుందనిపించింది. అయిదేళ్లు హిందుస్తానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత అమెరికాలో మ్యూజిక్‌లో డిగ్రీ పుచ్చుకున్నాను.

హీరోయిన్ అవ్వాలనే కోరిక చిన్నప్పట్నుంచీ ఉండేదా?
శ్రుతిహాసన్: సినిమా హీరోయిన్ అంటే అందంగా ఉండాలి. మనం అందంగా లేం కదా అనే ఫీలింగ్ ఉండేది. చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని. సో, నీడపట్టున ఉన్నది తక్కువ, ఎండల్లో ఫ్రై అయినది ఎక్కువ (నవ్వుతూ). అందుకని రంగు తక్కువగా ఉండేదాన్ని. హీరోయిన్‌గా పనికి రాననుకునేదాన్ని. కానీ సినిమాలంటే ఇష్టం. అందుకని సింగర్‌గా అయినా ఈ ఫీల్డ్‌లో ఉండాలనుకున్నాను. పెద్దయిన తర్వాత అందం మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. దాంతో సినిమాల్లో ట్రై చేయొచ్చనుకున్నాను.

‘లక్’ చిత్రం ద్వారా సినిమాల్లోకొచ్చి, ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ‘అన్‌లక్కీ’ అనిపించుకున్నారు. దానికి తోడు వరుస ఫ్లాప్‌లతో మీ మీద ‘ఐరన్ లెగ్’ ట్యాగ్ పడింది...
శ్రుతిహాసన్: నిజాయితీగా చెప్పాలంటే.. ఓ సినిమా బాగా రావాలంటే మంచి హీరో, మంచి దర్శకుడు, మంచి బ్యానర్ చాలా ముఖ్యం. అలాగే హిట్ సినిమాకి కావల్సిన అంశాలన్నీ ఉండాలి. సినిమా ఎందుకు ఆడుతుంది? ఎందుకు ఆడలేదు? అని కారణాలు వెతకడం కష్టం. ఇక నా మీద వేసిన ట్యాగ్ గురించి అంటారా.. దాని గురించి పట్టించుకోలేదు. ఏదేదో మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోలేం కదా. ఒక సినిమా వర్కవుట్ అవ్వడం... కాకపోవడం అనేది నా చేతుల్లో ఉండదు. కానీ హార్డ్‌వర్క్ చేయడం మాత్రం నా చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. నా పాత్రకు ఎంత న్యాయం చేయాలో అంతా చేస్తాను. ఒకవేళ శ్రుతి బాగా యాక్ట్ చేయలేదని ఎవరైనా అంటే.. అప్పుడు తప్పు నాది అవుతుంది. ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను.

హీరోలు వరుసగా ఫ్లాప్ సినిమాల్లో యాక్ట్ చేస్తే ‘ఐరన్ లెగ్’ అనరు. మరి.. హీరోయిన్లను మాత్రం ఎందుకు అలా అంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా?
శ్రుతిహాసన్: ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే.. ఒక సినిమాకి హీరోయిన్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టే.. తననే టార్గెట్ చేస్తున్నారనిపిస్తోంది (నవ్వుతూ). సో.. హీరోయిన్స్‌ని అలా మాట్లాడటం మంచిదే.

కమల్‌హాసన్ కూతురు అనే ట్యాగ్ కొంత ప్లస్, కొంత మైనస్ కదా?
శ్రుతిహాసన్: నిజమే. ప్లస్ కొంతవరకు మైనస్ కొంతవరకు ఉంటుంది. కమల్‌హాసన్ కూతురినని అభిమానంగా చూస్తారు... అది ప్లస్! కానీ నాన్నతో నన్ను పోల్చినప్పుడు, మైనస్ అవుతుంది! ఆయన 50ఏళ్లుగా యాక్ట్ చేస్తున్నారు. నన్ను మాత్రమే కాదు ఎవర్నీ నాన్నతో పోల్చడం సరికాదు. నాన్న తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతులకు నాకు గర్వంగా ఉంటుంది. కానీ తనతో నన్ను పోల్చవద్దు. మొదట్లో ఆ పోలిక వచ్చింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో నన్ను నన్నుగా చూడటం మొదలుపెట్టేశారు. అందుకు ఆనందంగా ఉంది.

దేశం గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సినిమా అనుకున్న సమయంలో విడుదలవ్వకపోతే ఇక రోడ్డు మీదకొచ్చేస్తానని అన్నప్పుడు ఓ కూతురిగా మీకేమనిపించింది?
శ్రుతిహాసన్: నాన్నగారిలోని నటుణ్ణి నేను పూర్తిగా గౌరవిస్తా. ఓ ఆర్టిస్ట్‌గా నేను ఆయన్ను సపోర్ట్ చేస్తాను. ఇక ఓ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టాలన్నది నిర్మాత వ్యక్తిగత విషయం. ఆ పరంగా ‘విశ్వరూపం’కి నాన్న పెట్టిన పెట్టుబడిని నేను గౌరవిస్తాను. మా ఇంట్లో సినిమాయే ముఖ్యం. సినిమాని ఉన్నత స్థాయిలో పెడతాం. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆకాశమంత ఎత్తున పెడతాం. కాబట్టి సినిమా కోసం ఏమేం చేయాలో అంతా చేస్తాం.

నాన్నగారి ఆర్థిక స్థితి తెలుసుకున్న తర్వాత అభద్రతాభావానికి గురయ్యారా?
శ్రుతిహాసన్: లేదు. ఎందుకంటే నాకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంది. నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ వేరు. నాది వేరు. నా బిల్స్ నేనే పే చేసుకుంటాను. నా ఫైనాన్స్‌ని నేను మేనేజ్ చేసుకుంటాను.

మీ పేరెంట్స్‌తో మీ సంపాదన గురించి డిస్కస్ చేయరా?
శ్రుతిహాసన్: చెయ్యను. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటాను. నా ఫస్ట్ సినిమా నుంచీ ఇలానే ఉన్నాను. డబ్బు సంపాదించుకుంటూ, ఆ డబ్బుని ప్రాపర్‌గా మేనేజ్ చేయడంలో ఓ కిక్ ఉంది. అలాగే బాధ్యత కూడా ఉంటుంది.

మరి.. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరెంతవరకు సక్సెస్‌ఫుల్ అనుకుంటున్నారు?
శ్రుతిహాసన్: డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టకూడదనేది నా ఫిలాసఫీ. అంతా పోగొట్టుకుంటే ఎవరి దగ్గరైనా చేతులు చాపాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని ఎప్పటికీ తెచ్చుకోకూడదనుకుంటాను. అందుకే సింపుల్‌గా ఉంటా. ఎక్కువ ఖర్చుపెట్టను.

ప్రస్తుతం మీరెక్కడ ఉంటున్నారు?
శ్రుతిహాసన్: ముంబయ్‌లో ఉంటున్నాను.

మీ అమ్మగారు, చెల్లెలు అక్షర కూడా ముంబయ్‌లోనే ఉంటారు కదా.. వాళ్లతో కలిసి ఉంటున్నారా?
శ్రుతిహాసన్: లేదు. నా ఇంటికీ మా అమ్మగారి ఇంటికీ మూడు వీధుల దూరం.

ఒకే ఊళ్లో ఉంటూ.. విడివిడిగా ఉండటమెందుకు?
శ్రుతిహాసన్: నా స్పేస్‌ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను. అందుకే విడిగా ఉంటున్నాను. షూటింగ్స్‌లో యాభై నుంచి వందమంది చుట్టూ ఉంటారు. అందుకని ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం. కవితలు, కథలు రాసుకోవడం, మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం.. ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం. అందుకే ముంబయ్‌లో ఒక్కదాన్నే ఉంటున్నాను.

మీ అమ్మగారు, చెల్లెల్ని ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు?
శ్రుతిహాసన్: ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కలుస్తుంటాము. ఒకట్రెండు రోజులు ఖాళీ వస్తే, వాళ్లతోనే స్పెండ్ చేస్తా.

అక్షర డెరైక్టర్ అవ్వాలనుకుంటున్నారట?
శ్రుతిహాసన్: తను ఏం అవ్వాలనుకుంటుందనేది తనే స్వయంగా చెబుతుంది. అయితే తను ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను.

మీరు మంచి పని చేసినప్పుడు ఎలా ఉన్నా.. తప్పు చేస్తే మాత్రం కమల్‌హాసన్ కూతురు అలా చేసిందా అంటారు. ముఖ్యంగా సినిమాల్లో బికినీ ధరించినప్పుడు, హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్ చేసినప్పుడు, ఎఫైర్లు...?
శ్రుతిహాసన్: మీరన్నది కరెక్టే. కానీ అలా అనేవాళ్లకి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. ఒక ప్రొఫెషన్‌ని ఎంచుకున్న తర్వాత దానికి పూర్తిగా న్యాయం చేయాలనే ఎవరైనా అనుకుంటారు. మేం కూడా అంతే. ఏదైనా సీన్ డిమాండ్ చేసినప్పుడు బికినీ ధరించాల్సి ఉంటుంది. అలాగే సీన్ డిమాండ్ చేస్తే వంటి నిండా చీర కట్టుకుంటాం. మరి.. చీర కట్టుకున్నప్పుడు ఇష్యూ చేయనివాళ్లు బికినీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడతారు? ఇక ఎఫైర్లు... మిగతా విషయాలంటే ఎవరికి తోచినది వాళ్లు మాట్లాడతారు. వాటి గురించి నేనెందుకు మాట్లాడాలి? నాన్న కూడా సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు కాబట్టి.. ఇలాంటివి సహజం అని ఆయనకు తెలుసు.

సిద్దార్థ్‌తో సహజీవనం అంటూ వార్తల్లో నిలిచారు. దీనికి మీరిచ్చే సమాధానం?
శ్రుతిహాసన్: సెలబ్రిటీస్ గురించి ఏవేవో వార్తలు వస్తుంటాయి. నా గురించి వచ్చే వార్తలకు రియాక్ట్ అవ్వడం నా పని కాదు. సినిమాల్లో యాక్ట్ చేయడమే నా పని. ఏ పత్రికలో వచ్చిన వార్త అయినా కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఒక సినిమా డీవీడీ 20, 30, 50 ఏళ్లు... ఆ పైనే ఉంటుంది. సో.. నా ఫోకస్ నిరంతరం నిలిచే సినిమాలపైనే ఉంటుంది. నాపై వచ్చిన వార్తల మీద ఉండదు. నా గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. నేనేంటో నాకు తెలుసు. నా పనేంటో ప్రేక్షకులకు తెలుసు. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకోవాలన్నదే నా ప్రస్తుత కర్తవ్యం.

రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో కమల్‌హాసన్ కూతురు ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలకు మీ రియాక్షన్?
శ్రుతిహాసన్: ఈ వార్తలకు కూడా ఫీలవ్వలేదు. ధనుష్ మంచి కో-స్టార్. మంచి నటుడు. మళ్లీ అవకాశం వస్తే ధనుష్ సరసన తప్పకుండా నటిస్తాను. అది మినహా నాకు తన మీద వేరే ఏదీ లేదు.

ధనుష్ భార్య ఐశ్వర్యతో మీ అనుబంధం?
శ్రుతిహాసన్: తమిళంలో నేను చేసిన రెండో సినిమాకి తను డెరైక్టర్. నా ఫస్ట్ ఫీమేల్ డెరైక్టర్. తనతో నాకు మంచి ఈక్వేషన్ ఉంది.

ఇక ప్రస్తుతం మీ కెరీర్ విషయానికొస్తే... గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మీ చేతినిండా సినిమాలే. ఎలా అనిపిస్తోంది?
శ్రుతిహాసన్: ఆ దేవుడు నా మీద చాలా దయ చూపిస్తున్నాడనిపిస్తోంది. ఇటీవల ‘బలుపు’ విడుదలయ్యింది. హిందీలో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’, ‘డీ-డే’ సినిమాలు వచ్చేనెల 19న విడుదలవుతాయి. ఇంకా తెలుగులో చేస్తున్న ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’ ఈ ఏడాదే విడుదలవుతాయి. ఇలా ఒకే సంవత్సరం ఆరుసార్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఓ మర్చిపోలేని అనుభూతి.

ఈ రెండేళ్లల్లో లేని విధంగా ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ సక్సెస్ మీ కెరీర్‌ని మంచి మలుపు తిప్పిందనుకోవచ్చా?
శ్రుతిహాసన్: ఒక సినిమా సక్సెస్ ప్రభావం కొంతవరకు ఉంటుందేమో. ఆ విషయం నాకు తెలియదు. అయితే నా గత చిత్రాలకు ఎంత హార్డ్‌వర్క్ చేశానో ‘గబ్బర్‌సింగ్’కీ అలానే చేశాను. నా మొదటి రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం దురదృష్టం. ఆ చిత్రాల ఫ్లాప్‌కి కారణాలు తెలియదు. జయాపజయాలు కామన్ కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు.

ఐదారు సినిమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు కాబట్టి ఎప్పుడూ సూట్‌కేస్ రెడీగా పెట్టుకోవాలేమో?
శ్రుతిహాసన్: అవును. యాక్చువల్‌గా ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ పరమ బోర్. వారం రోజులు హైదరాబాద్ ఆ తర్వాత ఏడెనిమిది రోజులు మరో సిటీ.. ఆ తర్వాత ఇంకో సిటీ.. ఇలా ఉంటుంది. సూట్‌కేస్ ఇప్పుడే సర్దినట్లు ఉంటుంది. ఈలోపే వారం ముగుస్తుంది. అన్‌ప్యాక్ చేసి, మళ్లీ ప్యాక్ చేయడం పెద్ద యజ్ఞంలా ఫీలవుతా. ఈ రెండూ నాకు నచ్చని విషయాలు. ఈ ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ లేకపోతే మన జీవితం ఎంత బాగుంటుందని అప్పుడప్పుడు అనుకుంటుంటాను.

ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘డి డే’ పోస్టర్ చూసినవాళ్లు, శ్రుతి విజృంభించింది అంటున్నారు. శ్రుతి ఈ సినిమా చేయడం అవసరమా అన్నది చాలామంది అభిప్రాయం?
శ్రుతిహాసన్: వేశ్యపాత్రను సవాల్‌గా తీసుకున్నాను కాబట్టే ఆ సినిమా ఒప్పుకున్నాను. సినిమా పోస్టర్‌ని దురుద్దేశంతో చూస్తే అది తప్పుగానే అనిపిస్తుంది. అదే కళాత్మక దృష్టితో చూశారనుకోండి అసభ్యం కనిపించదు. చూసేవాళ్ల దృష్టిని బట్టే ఏదైనా ఉంటుంది. నేను ప్రతి ఒక్కరి దృష్టినీ కంట్రోల్ చేయలేను. వాళ్ల అభిప్రాయాలను మార్చలేను. నా పనిని కంట్రోల్ చేయడమే నా పని. ఈ చిత్రంలో నేను చేసింది బోల్డ్ రోల్. అది కాదనను. కథానుగుణంగా చూస్తే ఆ పాత్ర నచ్చుతుంది. నాకు తెలిసి ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఎవరికి వచ్చినా అంగీకరిస్తారు.

టబు, రాణి ముఖర్జీ, అనుష్క.. ఇలా చాలామంది తారలు వేశ్య పాత్రను అద్భుతంగా చేశారు.. వాళ్ల పాత్రలను ఆదర్శంగా తీసుకున్నారా?
శ్రుతిహాసన్: వాళ్లు చేసిన సినిమాలను నేను చూడలేదు. నా స్టయిల్‌లో చేస్తే బాగుంటుందనుకున్నాను. డెరైక్టర్ నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో అందుకు తగ్గట్టుగా యాక్ట్ చేశాను. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. డెరైక్టర్ మనసులో అనుకున్నదాన్ని ఆవిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తా.

తెలుగులో ‘గబ్బర్‌సింగ్’తో బ్రేక్ వచ్చినట్లు ‘డీ డే’, ‘రామయ్యా వస్తావయ్యా’తో హిందీలో కూడా బ్రేక్ వస్తుందనుకుంటున్నారా?
శ్రుతిహాసన్: ఒక సినిమా ఆడటం, ఆడకపోవడం అనేది మా చేతుల్లో ఉండదు. ఆ సినిమాకోసం పడే కష్టం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. ‘డీ డే’పై అంచనాలు ఉన్నాయి. ‘రామయ్యా వస్తాయ్యా’ స్టిల్స్ బాగున్నాయంటున్నారు. లుక్ బాగుందని, పాటలు బాగున్నాయని చెబుతున్నారు. సో.. అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంటుంది.

దేవుణ్ణి బాగా నమ్ముతారా?
శ్రుతిహాసన్: బాగా... బాగా నమ్మకం.

మీ నాన్నగారు నమ్మరేమో?
శ్రుతిహాసన్: నాన్నకి నమ్మకం లేదు. అది ఆయన వ్యక్తిగత ఫీలింగ్.

మరి మీ అమ్మగారి సంగతి?
శ్రుతిహాసన్: తను ఆధ్యాత్మిక బాటలో నడుస్తుంది. గుడికి వెళ్లదు కానీ దేవుణ్ణి నమ్ముతుంది.

మీరు గుడికి వెళ్తుంటారా?
శ్రుతిహాసన్: వీలు కుదిరినప్పుడల్లా గుడికి వెళుతుంటాను. గుడి అంటే కేవలం భక్తి అని మాత్రమే అనుకోను. చరిత్ర అనుకుంటాను. గుడికి వెళితే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతాను. ‘మురుగన్’ అంటే ఇష్టం.

ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకుంటారు?
శ్రుతిహాసన్: నా పర్సనల్, ప్రొఫెషనల్ డెసిషన్స్‌ని నేనే తీసుకుంటాను. అది తప్పయినా, సరైనా ఏ నిర్ణయమైనా అది నాదే. దేవుడు ఉన్నాడు.. చూసుకుంటాడనే నమ్మకంతో నిర్ణయాలు తీసేసుకుంటాను. ఆ దేవుడు మంచే చేస్తాడని నమ్ముతాను.

మీ తోటి కథానాయికలు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుంటుంటారా?
శ్రుతిహాసన్: ఎవరెవరు ఏయే సినిమాలు చేస్తున్నారో ఆరా తీయను. అలాగే పారితోషికం తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపను. నేను నా జర్నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను.

క్రేజ్ ఉన్నప్పుడు ‘క్యాష్’ చేసుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్ముతారా?
శ్రుతిహాసన్: నమ్ముతాను. కానీ కోట్లు కోట్లు పారితోషికం తీసుకోవాలనే లక్ష్యం నాకు లేదు. స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని కూడా లేదు. ఇప్పుడు నాకు క్రేజ్ ఉంది కాబట్టి.. మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. టైమ్ బాగున్నప్పుడు హార్డ్‌వర్క్ చేయాలి. ఆ భగవంతుడి దయ వల్లే ఇంత బిజీగా ఉన్నాను. షూటింగ్స్‌కి మించిన మంచి రిలాక్సేషన్ లేదు. పనిలోనే ఆనందాన్ని వెతుక్కునే టైప్ నేను. మరో ఏడాది వరకు నాకు తెలిసి వెకేషన్ తీసుకునే టైమ్ ఉండదు. నాక్కావల్సింది అదే.

అటు సీనియర్స్ ఇటు యువహీరోలతో నటిస్తున్నారు?
శ్రుతిహాసన్: ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు ఆ హీరో ఏజ్ ఎంత అని ఆలోచించను. నాకు కథ, పాత్ర నచ్చితే సినిమా చేస్తాను. మిగతా విషయాలు నాకనవసరం.

ఓకే... కొంచెం సన్నబడినట్లున్నారు?
శ్రుతిహాసన్: ‘గబ్బర్‌సింగ్’కి కొంచెం సన్నబడితే బాగుంటుందన్నారు. ఆ సినిమా కోసం బరువు తగ్గాను. ఆ తర్వాత అంగీకరించిన ‘బలుపు, రామయ్యా వస్తావయ్యా, డీ డే’ చిత్రాల్లో కూడా సన్నగానే కనిపించాలి కాబట్టి, బరువు పెరగాలనుకోలేదు.

సన్నబడటానికి ఏం చేశారు?
శ్రుతిహాసన్: సహజంగానే తగ్గాను. ఎక్సర్‌సైజ్, డైట్ పరంగా కేర్ తీసుకున్నాను. ఫిట్‌నెస్ ట్రైనర్‌ని పెట్టుకుని, వర్కవుట్లు చేయడం మొదట్నుంచీ అలవాటు లేదు. ఏ వ్యాయామం చేస్తే ఎక్కడ తగ్గుతామనే విషయంలో నాకు అవగాహన ఉంది. నాకు ప్రత్యేకంగా డైటీషియన్ లేరు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో నాకు తెలుసు.

మీ లైఫ్‌స్టయిల్ గురించి?
శ్రుతిహాసన్: చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. షూటింగ్స్‌తోనే సరిపోతుంది. ఇక ప్రత్యేకంగా లైఫ్ స్టయిల్‌కి టైమ్ ఎక్కడుంటుంది? షూటింగ్స్ చేయడం, పేకప్ చెప్పగానే ఇంటికెళ్లిపోవడం, కాసేపు ఎక్సర్‌సైజ్ చేసి, హాయిగా నిద్రపోవడం .. ప్రస్తుతం నా లైఫ్ స్టయిల్ ఇలా ఉంది.

మీ హాబీస్ ఏంటి?
శ్రుతిహాసన్: ట్రావెల్ చేయడం ఇష్టం. వంట చేయడం ఇంకా ఇష్టం. రకరకాల వంటకాలు టేస్ట్ చేయడానికి ఇష్టపడతాను. బుక్స్ చదువుతాను. నా వయసులో ఉన్న అమ్మాయికి ఎలాంటి హాబీస్ ఉంటాయో అలాంటివే.

అయితే వంట చేయడం వచ్చన్నమాట.. ఎప్పుడు నేర్చుకున్నారు?
శ్రుతిహాసన్: యూఎస్‌లో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అక్కడ వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా అలవాటయ్యింది. ఖాళీ దొరికినప్పుడల్లా కిచెన్‌లో ప్రయోగాలు చేస్తుంటాను.

ఇప్పుడు యూత్ అంతా ‘పార్టీయింగ్’ అంటున్నారు. ఈ విషయంలో మీ ఒపీనియన్?
శ్రుతిహాసన్: పార్టీయింగ్ నాకు ఇంట్రస్ట్ లేదు. నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు. అందరూ బయట ఫ్రెండ్సే. వాళ్లతో వీలైనంత సమయం గడపాలనుకుంటాను. ఇంట్లో కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం... అలా ఎంజాయ్ చేస్తాను.

పబ్‌కి వెళతారా?
శ్రుతిహాసన్: ఒక్కోసారి వెళతాను. కానీ ఇప్పుడు టైమ్ లేదు.

ఎన్ని సంవత్సరాలు యాక్ట్ చేయాలనుకుంటున్నారు?
శ్రుతిహాసన్: యాక్టింగ్, రైటింగ్, సింగింగ్.. ఇలా ఏం చేసినా సినిమాకు అనుసంధానంగానే చేస్తాను. సినిమా మినహా నాకు వేరే తెలియదు. ఈ ఫీల్డ్‌ని వదిలే ప్రసక్తే లేదు. పెళ్లి చేసుకుని, బిడ్డలకు తల్లయిన తర్వాత కూడా సినిమాలను వదలను.

ఒకవేళ మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి సినిమాలు వద్దంటే?
శ్రుతిహాసన్: అలాంటి వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోను. పెళ్లి ప్రపోజల్ అప్పుడే సినిమాలు వదలనని కండీషన్ పెడతాను. అందుకు ఇష్టపడ్డ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.

కొంతమంది ఆడవాళ్లు వైవాహిక జీవితం కోసం కెరీర్‌ని త్యాగం చేస్తుంటారు కదా?
శ్రుతిహాసన్: ఎందుకు చేయాలి? ఇష్టపూర్వకంగా చేసేవాళ్ల గురించి నేను మాట్లాడను. కానీ ఎవరో బలవంతం చేస్తే కెరీర్‌ని వదులుకోకూడదన్నది నా అభిప్రాయం. ఇంటిని చక్కబెట్టుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఆడవాళ్లు వంటింటికే పరిమితం అనే రోజులు ఎప్పుడో పోయాయి.

పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?
శ్రుతిహాసన్: జీవితంలో నేనేదీ ప్లాన్ చేయను. సో.. పెళ్లి గురించి ప్లాన్ చేయడంలేదు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ వర్క్ మీదే.

- సంభాషణ: డి.జి.భవాని

మీ తల్లిదండ్రులు విడిపోయినప్పుడు ఏమనిపించింది?
శ్రుతిహాసన్: విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం. నా జీవితం కాని దాని గురించి నేనేం మాట్లాడను! మా అమ్మానాన్నల ఆనందమే నా ఆనందం. అందుకని వాళ్లు ఆనందంగా తీసుకున్న నిర్ణయాన్ని నేనెలా కాదనగలను.

అమ్మానాన్నల్లో మీరు ఎవరి దగ్గర ఎక్కువ పెరిగారు?
శ్రుతిహాసన్: అమ్మ దగ్గర పెరిగాను. నాన్న దగ్గరా పెరిగాను. ఎవరి దగ్గర ఎక్కువ అంటే చెప్పలేను. ఇద్దరితోనూ చాలా ఎటాచ్డ్‌గా ఉంటాను. అయితే అమ్మతో చనువు ఎక్కువ. ఎందుకంటే ఏ ఆడపిల్లయినా తల్లి దగ్గరే కదా అన్నీ చెప్పుకోగలిగేది!

ఎప్పుడైనా ఇద్దర్నీ కలపడానికి ట్రై చేశారా?
శ్రుతిహాసన్: ట్రై చేయలేదు. ఇక ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు.

మీ నాన్నగారి జీవితంలో కీలక వ్యక్తి అయిన గౌతమిని మీరెప్పుడైనా ‘అమ్మ’గా అనుకున్నారా?
శ్రుతిహాసన్: నాకు ఒక తల్లి ఉంది. తన పేరు ‘సారిక’. నాకు ఇంకో తల్లి అవసరం లేదు. అయితే నాన్న ఆనందాన్ని మాత్రం కాదనను.

*********

బ్రాండెడ్ వేర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వను. కంటికి నచ్చిన డ్రెస్సులు బ్రాండెడ్‌వి కాకపోయినా కొనుక్కుంటాను.

స్విమ్మింగ్ మంచి వ్యాయామం. ఇండియాలో ఉన్నప్పుడు కుదరదు. అందుకని షూటింగ్స్ కోసం విదేశాలు వెళ్లినప్పుడు అక్కడ స్విమ్మింగ్‌కి టైమ్ కేటాయిస్తా.

ఫేషియల్ చేయించుకోవడం ఇష్టం ఉండదు. రాత్రి నిద్రపోయే ముందు చక్కగా మొహం కడుక్కుని, నైట్ క్రీమ్ రాసుకుంటాను. అది మినహా పెద్దగా కేర్ తీసుకోను.

గతంలో ఆల్బమ్ చేశాను. ఇప్పుడు టైమ్ దొరకడంలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా టైమ్ దొరికితే ఓ ఆల్బమ్ చేయాలని ఉంది.

ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నాకు ‘గబ్బర్‌సింగ్’, ‘3’ ఇష్టం.

భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలని ఉంది. మరి.. ఆ భగవంతుడు ఏం ప్లాన్ చేశాడో..

చిన్నప్పట్నుంచీ నాకు కథలు రాయడం ఇష్టం. అలాగే కవితలు రాస్తుంటాను. ఏదైనా ఆలోచన రాగానే ఐఫోన్‌లో టైప్ చేసుకుంటాను.

నా డ్రీమ్ రోల్‌ని ఇంకా ఎవరూ రాయలేదు. ఆ పాత్ర ఎవరైనా రాస్తే.. అప్పుడు దాని గురించి మాట్లాడతా.
  

నీ ప్రమేయం లేకుండా నిన్ను చిన్నబుచ్చడం ఎవరి తరమూ కాదు!


వంటింట్లోనే వ్యాధినిరోధకాలు...

 
మీకు తరచూ జలుబు చేస్తోందా? అలా రొంప తగ్గుతుండగానే మళ్లీ వచ్చేస్తోందా? వర్షాలు పడగానే ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. కాస్త దగ్గు, జలుబు, రొంప, జ్వరం కనిపించగానే మందుల దుకాణానికి వెళ్లడం, ఏదో యాంటీబయాటిక్ వేసుకోవడం... దీనితో రెండు నష్టాలు. మొదటిది ఏదో మందు వాడుతున్నందున సాధారణ రోగనిరోధక శక్తి తగ్గడం. దాంతో మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే జలుబు, రొంప తగ్గకపోవడం ఒక దుష్పరిణామం అయితే... ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మరోరకం ప్రమాదంగా చెప్పవచ్చు. అందుకే ఇంట్లో దొరికే సాధారణమైన పదార్థాలతో మంచి రోగనిరోధక శక్తిని సాధించవచ్చు. దీంతో తరచు వచ్చే జబ్బులే కాదు... కొన్నిరకాల దీర్ఘరోగాల నుంచి కూడా ఇమ్యూనిటీ లభిస్తుంది.

వెల్లుల్లి: ఇది ఉల్లి జాతికి చెందిన ప్రభావవంతమైన తినే పదార్థం. ఘాటుగా ఉండే ఇది ఎన్నో వ్యాధులపై తన ఘాటైన ప్రభావాన్ని చూపి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. రోగాలను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసిన్ అనే పోషకం చాలా రకాల జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక ప్రభావపూర్వకమైన యాంటీఆక్సిడెంట్ కూడా. మనం తినే ఆహారాల్లో ఫ్రీ-రాడికల్స్ అనే పదార్థాలు అనేక దుష్ర్పభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది వ్యాధినిరోధకతను పెంచడంతోపాటు ఎన్నోరకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల (పారాసైటిక్) ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు... శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

ఇంట్లో తయారుచేసుకున్న చికెన్ సూప్: జలుబు, రొంప లాంటి తరచూ సోకే ఇన్ఫెక్షన్లకు చక్కటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. అయితే నాటుకోడి చికెన్‌సూప్ వల్ల మరింత ప్రయోజనం. చికెన్‌సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడిపులుసు పెట్టేటప్పుడే ఈ అమైనో యాసిడ్ స్రవిస్తుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో వ్యాధినిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు చికెన్‌సూప్‌లోని జిలాటిన్ అనే అమైనో యాసిడ్... వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు... చికెన్‌సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది.

చిలగడదుంపలు (స్వీట్‌పొటాటో): దీన్నే మొరంగడ్డ/గెణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలూ వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే. ఇది మేనికి మంచి మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్‌నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో ఉండే చక్కెర వల్ల గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవననాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు.

పుట్టగొడుగులు (మష్రూమ్స్): మన వద్ద ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ ఇది చైనా సంప్రదాయ చికిత్స ప్రక్రియల్లో చోటు చేసుకున్న ఆహారం. రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచడానికి వాళ్లు ఎప్పట్నుంచో పుట్టగొడుగులను వాడుతున్నారు. ప్రధానంగా ఈ రోజుల్లో పర్యావరణంలో కాలుష్యం, వృత్తి వ్యవహారాల్లో ఒత్తిళ్లు, బయట పరిసరాల్లో అపరిశుభ్రత వంటి వాతావరణం నెలకొని ఈ రోజుల్లో వయసుతో పాటు వచ్చేవి, వయసు పైబడుతున్నకొద్దీ రావడానికి అవకాశమున్న వ్యాధులను నివారించడానికి పుట్టగొడుగులు మంచి ఆహారం.

అవిశెలు: స్వాభావికంగా ప్రకృతి ప్రసాదించిన వనరుల్లో అత్యధికంగా ఒమెగా-3-ఫ్యాటీ ఆసిడ్స్ లభ్యమయ్యేది అవిశె గింజల నుంచే. మన రాష్ట్రంలో అవిశెలు చాలా ఎక్కువగా లభ్యమవుతున్నా... వాటి ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించక వాటిని పశుపెంపకానికి, పాల లభ్యతకు అధికంగా వాడుతున్నాం. మనిషిలో ఏదైనా వ్యాధికారక క్రిమిగాని, సూక్ష్మజీవిగాని చేరినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను మరింత విస్తృతంగా, మరింత శక్తిమంతంగా సృష్టించే విధంగా కణాన్ని ప్రేరేపించే శక్తి అవిశె గింజలకు ఉంది. ఆ మేరకు కణంలోని జీవరసాయన క్రియలను మరింత ముమ్మరంగా జరిగేలా చూసే సామర్థ్యం కలిగి ఉన్న అద్భుతమైన వనరులవి. అందుకే వాటిని వీలైన రీతిలో మనం వాడటం మంచిది. శాకాహారంలో అవిశెలను మినహాయిస్తే ఈ స్థాయిలో ఎన్3 ఫ్యాటీయాసిడ్స్ లభ్యం కావాలంటే చేపలపై ఆధారపడాలి. సోయాబీన్ నూనెల్లోనూ, ఆవనూనెలోనూ ఈ ఎన్3 ఫ్యాటీ ఆసిడ్స్ లభ్యమవుతాయి.

మా బాబు పరిస్థితి మెరుగుపడుతుందా?

 
     
జెంటిల్‌మెన్ కౌన్సెలింగ్
మా బాబుకు మూడున్నర ఏళ్లు. పుట్టినప్పటి నుంచి రెండువైపులా వృషణాలు సంచిలోకి జారి లేవు. లోకల్ డాక్టర్‌ను అడిగితే ‘వయసు పెరిగే కొద్దీ కిందికి వస్తాయి. కంగారు అక్కర్లేదు’ అన్నారు. మూడున్నర ఏళ్ల తర్వాత కూడా మార్పు లేదు. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలి. ఆపరేషన్ లేకుండా మందులు ఏవైనా అందుబాటులో ఉన్నాయా?
- మధుసూదన్, ఖమ్మం


వృషణాలు సాధారణంగా పుట్టినప్పటి నుండి వృషణాల సంచిలో జారి ఉంటాయి. అలాగాక ఒకవైపు గాని లేదా రెండువైపులా గాని కిందికి అంటే సంచిలోకి జారకుండా ఉంటే కేవలం ఆర్నెల్ల నుంచి సంవత్సరం వరకు మాత్రమే వేచి చూడవచ్చు. ఏడాది తర్వాత కూడా వృషణాలు పొట్టలోనే ఉంటే కడుపులో ఉండే వేడి వల్ల వాటి పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏడాది నుంచి రెండేళ్ల లోపే ఆపరేషన్ చేయించి వాటిని సంచిలోకి వచ్చేలా చూడాలి. ఈ ఆపరేషన్ యూరాలజిస్ట్‌లు చేస్తారు. మీరు మీ దగ్గర్లో ఉన్న యూరాలజిస్ట్‌ను సంప్రదించి వీలైనంత త్వరగా ‘ఆర్కిడోపెక్సీ’ అనే శస్త్రచికిత్స చేయించడం చాలా అవసరం. కాబట్టి పైన పేర్కొన్న శస్త్రచికిత్సను వీలైనంత త్వరగా చేయించండి.

నా వయుసు 32 ఏళ్లు. నా వృషణాల్లో నొప్పి వస్తోంది. లాగుతున్న ఫీలింగ్ కూడా ఉంది. వృషణాల సైజ్ చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. నాకు ఉన్న సవుస్య ఏమై ఉంటుంది? దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి.
- కె.ఎస్.పి., గన్నవరం


చాలావుందిలో తవు వృషణాలు చిన్నవేమో అనే అపోహ ఉంటుంది. ఇతరత్రా ఏ ఇబ్బందులూ లేకపోతే దానిగురించి ఆందోళనపడాల్సిన అవసరమే లేదు. అరుుతే వృషణాలు వుుందు పెద్దవిగా ఉండి, ఇప్పుడు చిన్నవిగా అరుు, నొప్పి ఉంటే దానికి వేరికోసిల్ కారణం కావచ్చని అనువూనించాలి. మీరు యుూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేరుుంచి ఏదైనా సమస్య ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేస్తారు. మీ సమస్యను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
  

కుంకుమపువ్వుతో బిడ్డ రంగు మారుతుందా?

 
     
గైనిక్ కౌన్సెలింగ్
నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు కలిపి ఇస్తోంది. దీనివల్ల బిడ్డ రంగు తేటగా మారుతుందని, పండంటి ఎర్రటి బిడ్డ పుడతాడని అంటోంది. ఇది నిజమేనా? గర్భవతులు కుంకుమపువ్వు తీసుకోవచ్చా?
- సుశ్మిత, బెంగళూరు


మంచి రంగులో పండంటి బిడ్డ పుట్టడానికి కుంకుమపువ్వు దోహదం చేస్తుందన్న నమ్మకం చాలామందిలో ఉంది. కాంప్లెక్షన్ మాట పక్కన పెడితే... ఒక మూలికగా, సుగంధద్రవ్యంగా పరిమితంగా తీసుకుంటే దీనితో పోషకపరమైన ప్రయోజనాలు మాత్రం చాలా ఉన్నాయి. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం.

కుంకుమపువ్వు రక్తపోటును నియంత్రించి, మూడ్స్ త్వరత్వరగా మారిపోవడాన్ని అరికడుతుందని కొన్ని అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇందులో బీ-కాంప్లెక్స్ విటమిన్‌కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గర్భవతుల్లో ప్రోజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్దకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమపువ్వు జీర్ణప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు ఇది మేలు చేస్తుంది.

ఇక మీ అమ్మమ్మగారు చెప్పినట్లుగా ఇది కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు. బిడ్డ ఒంటిరంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ణయిస్తాయి. తార్కికంగా ఆలోచించి చూస్తే... పాలు సంపూర్ణాహారం. గర్భవతులకు చాలా మేలు చేస్తాయి. అయితే మొదటి మూడు నెలల పాటు గర్భవతులు వేవిళ్లు, వికారం కారణంగా పాలు తాగడానికి ఇష్టపడరు. కుంకుమపువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. బహుశా బిడ్డ రంగు కోసం కుంకుమపువ్వు అనే సంప్రదాయం ఇందువల్లనే పుట్టిందనిపిస్తోంది. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతావాళ్లకూ చేకూరుతాయి.

ఇక కుంకుమపువ్వును గర్భవతులు వాడే విషయంలో ఒక్కటి గుర్తుంచుకోవాలి. దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకుని పిసరంతే వాడాలి.

చివరగా... ఆ మాటకొస్తే... నేను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా మా అమ్మగారు పాలకు కుంకుమపువ్వు కలిపి నాకు ఇచ్చేవారు.
  

పీరియడ్స్ వస్తే చాలు... విపరీతమైన కోపం, ఆందోళన!

 
     
సైకియాట్రిక్
నా వయసు 32. పెళ్లయింది. హ్యాపీగానే ఉన్నాను. అయితే ఇటీవల కొంతకాలం నుంచి నాకు కోపం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లమీద అయిన దానికీ, కానిదానికీ చికాకు పడటం, విసుక్కోవటం చేస్తున్నాను. మామూలుగా నాది శాంతస్వభావం. అయితే ఈ కోపం పిరియడ్స్ టైమ్‌లోనే ఉంటోంది. పిరియడ్స్ రావడానికి 5-10 రోజుల ముందు మొదలై, అయిపోయేంతవరకు కొనసాగుతోంది. ఆ సమయంలో నా మూడ్ ఏమాత్రం బాగుండటం లేదు. ఇది తప్ప ఇతరత్రా సమస్యలు ఏమీ లేవు. కోపం వచ్చినప్పుడు అవతలి వారి స్పందనను బట్టి నాకు ఏడుపు రావటం, చేతిలో ఏది ఉంటే అది విసిరేయటం జరుగుతోంది. రాత్రిపూట నిద్ర సరిగా పోలేకపోతున్నాను. గైనకాలజిస్టును సంప్రదిస్తే, ఆమె హార్మోనల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు కానీ, దానివల్ల నాకేమాత్రం ప్రయోజనం కలగలేదు. నా సమస్యకు సరైన సలహా ఇవ్వగలరు.
-ఒక సోదరి, హైదరాబాద్.


మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మెడికల్ పరిభాషలో ప్రీ- మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లేదా ప్రీ మెన్‌స్ట్రువల్ టెన్షన్ అంటారు. సాధారణంగా రుతుచక్రం ఆరంభమయిన పదిహేనేళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వారి వరకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది. మెదడులో స్రవించే సెరటోనిన్ అనే రసాయనంలో చోటుచేసుకునే అసమానతల వల్ల డిప్రెషన్, ఆందోళన వంటివి ఏర్పడతాయి.

ఈ స్థితిలో శరీరమంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, చిన్నపనికి కూడా అలసిపోవటం, చేస్తున్న పని మీద శ్రద్ధాసక్తులు మందగించటం, కడుపులో మంటలు, అజీర్తి, ఆకలి లేకపోవటం, ఊరికూరికే చెమటలు పట్టడం, హృదయస్పందనలో విపరీతమైన తేడాలు, శ్వాసబరువుగా తీసుకోవడం వంటి శారీరక మార్పులు కనపడతాయి. వీటితోబాటు అయోమయం, అస్థిరత, అర్థం చేసుకోలేకపోవటం, మూడ్స్ క్షణక్షణానికీ మారిపోవడం వంటి మానసికపరమైన మార్పులూ చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న శబ్దాలను కూడా భరించలేకపోవటం, వెలుతురును చూడలేకపోవటం, చీటికిమాటికీ కోపం తెచ్చుకోవడం, వెక్కిళ్లతో కూడిన ఏడుపు రావటం, నిద్ర అసలు పట్టకపోవడం లేదా పీడకలలతో కలత నిద్ర, తలదిమ్ముగా ఉండటం వంటివి సర్వసాధారణంగా కనిపించే మానసిక లక్షణాలు.

వీటిమూలంగా కుటుంబ కలహాలు, కాపురంలో కలతలు ఏర్పడతాయి. ఇవన్నీ పీరియడ్స్‌కి నాలుగైదు రోజుల ముందు మొదలై, పీరియడ్స్ అయిపోయేవరకు కొనసాగుతాయి. దీనికి హార్మోన్ చికిత్స ఒక్కటే పరిష్కారం కాదు. దానివల్ల మానసికపరమైన భావోద్వేగాలు అదుపులోకి రావు. మానసిక0వైద్యుల పర్యవేక్షణలో తక్కువ మోతాదులో యాంటీడిప్రెసెంట్స్, యాంటీ -యాంగ్జైటీ మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కొద్దినెలలపాటు తీసుకుంటే సరిపోతుంది.
మీరు వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్‌ను కలవండి. విష్ యు ఆల్‌ది బెస్ట్.

దాగుడు-ముడతలు........

 
     
కాలం అన్ని గాయాలనూ మాన్పుతుందంటారు.
అవునా, మరి... కాలం చేసే గాయాల మాటేమిటి?!
నుదుటిపైన అడ్డంగా, నోటికి ఇరువైపులా నిలువుగా...
కళ్లచుట్టూ వలయాలుగా, గొంతుకింద ముడతలుగా...
కాలం గీసే ‘గీత’లను ఎలా చెరుపుకోవాలి?
ఒక్క వెంట్రుక రాలిపోతేనే గుండె బద్దలౌతుందే...
అందరూ గుర్తించేలా ముఖంపై ముడతలు కనిపిస్తుంటేలోకం తలకిందులే కదా!
ఏం చేద్దాం? కాలంతో కత్తియుద్ధం చేయగలమా?!
అంతకంటే తేలిక... కాలంతో ‘దాగుడుముడతలు’ ఆడడం!


దేహానికి చర్మం అద్దంలాంటిది. శరీరం లోపల ఏదైనా సమస్య ఉంటే చర్మం... మొటిమలు, మచ్చలు, ముడతల రూపంలో బయటకు చూపుతుంది. ఈ మార్పును మెడ, నుదురు, కళ్లకింద, చేతులపైన త్వరగా గుర్తించవచ్చు. వీటివల్ల ఉన్న వయసుకన్నా పైబడినట్టుగా కనిపిస్తారు. అద్దంలో ముఖాన్ని చాలా దగ్గరగా చూసుకున్నప్పుడు ఆ తేడా ఇట్టే తెలిసిపోతుంది. పెరిగే వయసును అడ్డుకోలేకపోయినా, యవ్వనకాంతిని పొడిగించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి సిద్ధంగా వయసు పైబడటం అనేది ఆడ, మగ ఇద్దరిలోనూ ఉంటుంది. అయితే పురుషుల కన్నా స్త్రీలు త్వరగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. దీంతో అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు.

గర్భం దాల్చినప్పుడు ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంటుంది. ఇక కుటుంబ అవసరాలు తీర్చడంలో సరైన నిద్ర , సమతుల ఆహారంపై దృష్టి పెట్టకపోవడం, వ్యాయామం లేక అధికబరువు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వీటికితోడు మార్కెట్లో లభించే ‘వెటైనింగ్ క్రీములు’ వాడటం వల్ల వాటిలో ఉండే గాఢ రసాయనాలు చర్మాన్ని ఇంకాస్త నిర్జీవంగా చేస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడుతుంటుంది. పాతికేళ్ల వయసులోనే ముదిమికి చేరువవుతున్నట్టు కనిపిస్తారు.

ఏం చేయాలంటే...
చాలావరకు 35-40 ఏళ్ల మధ్యవారు చర్మం ముడతలు పడుతుందని, వయసు పైబడినట్టుగా కనిపిస్తోందని నిపుణులను సంప్రదిస్తుంటారు. అలాకాకుండా 20 ఏళ్ల నుంచే చర్మవైద్యులను సంప్రదించాలి.

రోజూ క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడుతుంటే చర్మం త్వరగా ముడతలు పడదు.

క్లెన్సర్: సబ్బులలో చర్మంలోని సహజసిద్ధ నూనెలను తొలగించే పి.హెచ్ స్థాయి (9-10) ఉంటుంది. మన చర్మాన్ని శుభ్రపరచడానికి పి.హెచ్ స్థాయి 4.7 ఉంటే సరిపోతుంది. అందుకే ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు కాకుండా క్లెన్సర్‌ని ఉపయోగించాలి. జిడ్డు చర్మతత్త్వం గలవారు యాక్టివ్ క్లెన్సర్, పొడిచర్మతత్త్వం గలవారు లోషన్ టైప్ క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. పొడిబారిన, సున్నితమైన, డీహైడ్రేటెడ్ చర్మం గలవారు ఆల్కహాల్ ఫ్రీ క్లెన్సర్‌ను ఉపయోగించడం మేలు.

సన్‌స్క్రీన్ లోషన్‌ని 18 ఏళ్ల నుంచే వాడటం మొదలుపెట్టాలి. లేదంటే పిగ్మెంటేషన్, థైరాయిడ్, యాక్నె, మొటిమలు... ఒకదానికొకటి వచ్చి చేరుతుంటాయి జింక్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ డి, విటమిన్ ఇ ఉన్న ఆహారం రోజువారీ ఆహారంగా తీసుకోవాలి

రోజూ 7-8 గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి సమం చేసుకోవాలి నిగనిగలాడే చర్మం చక్కని ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

ఇవి చేయకూడదు...
శరీరంలో కొవ్వు ఎక్కువగా తగ్గిపోయినప్పుడు, క్రాస్ డైట్ చేస్తున్నప్పుడు చర్మంపై త్వరగా ముడతలు వచ్చేస్తాయి తెల్లబడటానికి బ్యూటీ పార్లర్స్‌లో అమ్మకానికి ఉంచినవి, ఇతర వెటైనింగ్ క్రీమ్‌లు 14-15 ఏళ్ల వారు కూడా వాడుతుంటారు. వీటి వల్ల చర్మం జీవం కోల్పోయి ముడతలు పడుతుంది.

35 ఏళ్ల తర్వాత వచ్చే ముడతలను బొటాక్స్ ఇంజక్షన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు. 3-4 నెలల వరకు చర్మం బిగుతుగా ఉంటుంది. ఐతే ఈ ఇంజక్షన్లను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి ముడతల నివారణకు థెర్మేజ్ అనే లేజర్ ట్రీట్‌మెంట్ వాడచ్చు. ఇది బాంబే లాంటి మహా నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ చికిత్స ఏడాదికి ఒకసారి చేయించుకుంటే చర్మం నిగారింపు కోల్పోదు. ముడతలు రావు.

శరీరంలో జీర్ణవ్యవస్థ సక్రమంగా లేకపోవడం, రక్తప్రసరణలో లోపాలు ఉంటే చర్మం త్వరగా ముడతలు పడుతుంది. ముడతలు పోగొట్టడానికి పైన ప్యాక్‌లు వేసినంత మాత్రానా యవ్వనకాంతి రాదు. అందుకే... వేళకు పోషకాహారం తీసుకోవాలి రోజూ 7-8 గంటలు నిద్ర పోవాలి రోజు మొత్తంలో 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలి రోజూ 30 ని.లు వ్యాయామం చేయాలి. జంక్‌ఫుడ్ తీసుకోకూడదు. వీలైనంతవరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్స్ తీసుకోవాలి.

బ్యూటీ ప్యాక్...
శనగపిండి, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరుచుకుంటే చాలు. మిగతా బ్యూటీ ప్యాక్‌లేవీ అవసరం లేదు. స్కిన్‌పాలిషింగ్, గ్లైకాలిక్ పీల్, హైడ్రా పీల్... వంటి సౌందర్య చికిత్సలు ఉంటాయి. ఇందులో భాగంగా మృతకణాలను తొలగిస్తారు. ఈ చికిత్సలు నిపుణులైన చర్మ వైద్యులచే చేయించుకోవాలి.చర్మ సంరక్షణకు మార్కెట్లో ఎన్నో సీరమ్స్ మస్తున్నాయి. వాటిని నిపుణులను సలహాతో చర్మతత్త్వానికి ఉపయోగపడే సీరమ్‌ను ఎంచుకోవాలి.
- డా.శాను
డెర్మటాలజిస్ట్


సాగిన చర్మాన్ని లాగి కుట్టేస్తాం...
ముఖంపైన ముడతలను సర్జికల్, మెడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా సరిచేయవచ్చు. పిల్లర్, బొటాక్స్ ఇంజక్షన్స్‌తో నుదురు, కంటి కింద, లాఫింగ్ లైన్స్ దగ్గర ముడతలను తగ్గించవచ్చు. మెడ, దవడ దగ్గర సాగి ముడతలు పడిన చర్మాన్ని లాగి కుట్టువేస్తాం. జీవనశైలి సక్రమంగా ఉంటే ఏ చికిత్స తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. శస్త్రచికిత్సతో చేసే పద్ధతి కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది.
- డా.వెంకటరమణ, పాస్టిక్ సర్జన్

Thursday, July 4, 2013

అన్ని రకాల బాధలకు ఒక్కటే చికిత్స: అదే త్రిఫలం

ఈ రోజుల్లో స్మార్ట్ వర్క్ కి బదులుగా ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. అన్ని సమస్యలను నిర్వహించడానికి ఎక్కువగా తగిన శైలి మరియు కావలసినంత చురుకు ఉండాలి. దీనిని మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సాధించవచ్చు.

ఈ ఆరోగ్యం సాధించడానికి అతను లేదా ఆమె సాధారణ పని మరియు ఖచ్చితంగా ఒక ఆహారంను అనుసరించాలి. మీరు మానసికంగా ఒత్తిడితో కూడిన జీవితంను గడుపుతూ ఉంటె మీరు మరింత శారీరకంగా సౌకర్యంగా మారాలి. ప్రారంభంలో వయస్సు మీద పడిన సంకేతాలు మరియు వృద్ధాప్యంలో అనేక వ్యాధులకు దారితీస్తోంది.

త్రిఫల అంటే ఏమిటి?
త్రిఫల రసాయనం ప్రసిద్ధి చెందిన ఒక ఆయుర్వేద సంప్రదాయ మెడిసిన్. త్రిఫల ఉసిరి, కరక్కాయ, తానికాయలు అనే మూడు మూలికల మిశ్రమంగా చెప్పవచ్చు.

త్రిఫల ఎలా ఉపయోగపడుతుంది ?త్రిఫలను ఎలాంటి వ్యాధి చికిత్స కోసం అయిన విస్తృతంగా ప్రపంచంలోని ఆయుర్వేద వైద్యులు అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా ఎంపిక చేస్తున్నారు. ఆయుర్వేద ఔషధ పుస్తకం చరక సంహితలో మొదటి అధ్యాయంలో త్రిఫల గురించి ప్రస్తావించాడు. ఉసిరి, కరక్కాయ, తానికాయల శక్తివంతమైన మిశ్రమం వ్యాధికి ఎలాంటి చికిత్స చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉందొ మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది.

రోగనిరోధ ఔషధం - ఆయుర్వేదంలో త్రిఫల మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెప్పుతారు. ఇది సాధారణంగా ఆరోగ్యం మరియు శరీరము యొక్క రోగనిరోధక శక్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి ఆరోగ్యకరమైన జీవనమునకు కావలసిన ముఖ్యమైన అంశాలలో ఒకటి. ఇది బాహ్య పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన నిరోధకతను శరీరంనకు అందించడంలో సహాయపడుతుంది. త్రిఫల శరీరం యొక్క అవరోధం దాటడానికి మరియు శరీరంలో ప్రవేశించే యాంటిజెన్స్ మీద పోరాటం కొరకు ప్రతిరక్షకాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. అంతేకాకుండా త్రిఫల రక్షణ యంత్రాంగంను బలోపేతం చేయటానికి T-సహాయక కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.



యాంటి ఆక్సిడెంట్ - త్రిఫల కణాల జీవక్రియ క్రమబద్దికరణకు సహాయం మరియు సరైన పనితీరుకు సమర్థవంతముగా పనిచేస్తుంది. వృద్ధాప్యం యొక్క లక్షణాలకు ప్రధాన కారణం అయిన ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తిని పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కణాల సరైన పనితీరుకు కీలక పాత్ర వహిస్తుంది. ఒక కణములో ఒక నిర్దిష్ఠ జీవన క్రియకై ఏర్పడిన నిర్మాణములు మైటోకాండ్రియ వంటి వాటి పనితీరును ప్రేరేపిస్తుంది.

అజీర్ణం - త్రిఫల జీర్ణ సమస్యలు కోసం ఒక మేజిక్ అని చెప్పవచ్చు. ఇది జీర్ణకోశానికి సంబంధించి ప్రేగులలో పెరిస్తాలిటిక్ కదలికలను మెరుగుపరచి ఒక తేలికపాటి వీరేచనాల మందుగా పనిచేస్తుంది. జీవక్రియ కోసం అవసరం అయిన పిత్త రసాలను స్రవించటానికి కాలేయంను ఉత్తేజితం చేస్తుంది. ఇది GI ఉత్పత్తి సరైన pH స్థాయిలో కొనసాగించడంలో సహాయపడుతుంది.


మలబద్దకం - త్రిఫల ఉత్తమ పెద్దప్రేగు ప్రక్షాళనలలో ఒకటి. అత్యంత మలబద్ధకంనకు సిఫార్సు చేయబడింది. ఇది శరీరం యొక్క నిర్విషీకరణలో సహాయపడుతుంది. ఇది మృదువుగా వీరేచనాల మందుగా బాగా ప్రాచుర్యం పొందింది.

క్రిములు మరియు అంటురోగాలు - అంటువ్యాధులు మరియు వార్మ్ ముట్టడి చేసి అణచివేయడానికి అత్యంత సమర్థవంతముగా ఉంటుంది. రింగ్వార్మ్ మరియు టేప్ వర్మ్ లను ముట్టడి చేసి బయటకు పంపటానికి సహాయపడుతుంది. త్రిఫల సూక్ష్మజీవి మరియు పురుగుల పెరుగుదలకు అత్యంత విషపూరిత పదార్థంలను నివారించి శరీరంలో సరైన పరిస్థితులు ఉండేలా నిర్వహిస్తుంది.

రక్తహీనత - త్రిఫల రక్తహీనత అనే పరిస్థితికి (హిమోగ్లోబిన్ మొత్తం క్షీణత ఉన్న పరిస్థితి) చికిత్స తద్వారా చాలా సమర్థవంతంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెంచడంలో సహాయపడుతుంది.


డయాబెటిస్ - త్రిఫల మధుమేహం చికిత్సలో చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. ప్యాంక్రియాస్ ఉత్తేజపరిచటంలో సహాయపడుతుంది. క్లోమము నుండి ఇన్సులిన్ విడుదల చేయుటలో సహాయం చేస్తుంది. ఇన్సులిన్ శరీరంలోని సరైన గ్లూకోజ్ స్థాయి నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. చేదైన రుచి కారణంగా మరింత హైపర్గ్లైసీమియా అనేది తీసుకోవడం మంచిది.


స్థూలకాయం - ఇది అత్యంత ఊబకాయం కలిగి ఉన్న రోగులకు సిఫార్సు చేయబడింది. దాని లక్షణాలు కారణంగా శరీరంలోని కొవ్వును మొత్తం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిక్షేపాలకు మీరే బాధ్యత వహిస్తున్నారని గమనించి కొవ్వు కణాలే లక్ష్యంగా పనిచేస్తుంది.


చర్మ సమస్యలు - ఇది రక్త శుద్ధీకరణను సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని తొలగింపుకు సహాయపడుతుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంను శుభ్రపరుస్తుంది మరియు అంటురోగాలు దూరంగా ఉండేలా బాధ్యత వహిస్తుంది.


కంజెషన్ - త్రిఫల సులభంగా శ్వాస తీసుకోవటానికి మరియు బాక్టీరియా పెరుగుదలకు కారణమైన శ్లేష్మంను నిరోధిస్తుంది. శ్వాస నాళం మరియు ఎముక రంధ్రాలలో ఉన్న సమస్యలను క్లియర్ చేయటానికి బాధ్యత వహిస్తుంది.


తలనొప్పి - త్రిఫల తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జీవక్రియ ఆటంకాలు కారణంగా సంభవించే నొప్పులను తగ్గిస్తుంది. ఇది తలనొప్పిని నివారించడానికి మూల కారణమైన చికిత్స ద్వారా జీవక్రియ యంత్రాంగంను నియంత్రిస్తుంది.


క్యాన్సర్ - JNU భారతదేశం నిర్వహించిన ఇటీవలి అధ్యయనాలు ప్రకారం త్రిఫల క్యాన్సర్ కార్యకలాపాలపై వ్యతిరేకత చూపించింది. ఇది క్యాన్సర్ కణాల వ్యాధి వృద్ధి ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా అక్కడ మొదటి దశలో కుదురు నిర్మాణాలను తగ్గించడంలో చాలా సహాయం చేస్తుంది.