మీకు తరచూ జలుబు చేస్తోందా? అలా రొంప తగ్గుతుండగానే మళ్లీ
వచ్చేస్తోందా? వర్షాలు పడగానే ఈ లక్షణాలు కొందరిలో తరచూ కనిపిస్తుంటాయి. కాస్త
దగ్గు, జలుబు, రొంప, జ్వరం కనిపించగానే మందుల దుకాణానికి వెళ్లడం, ఏదో యాంటీబయాటిక్
వేసుకోవడం... దీనితో రెండు నష్టాలు. మొదటిది ఏదో మందు వాడుతున్నందున సాధారణ
రోగనిరోధక శక్తి తగ్గడం. దాంతో మరింత ప్రభావకరమైన మందు వాడితే తప్ప మనకు వచ్చే
జలుబు, రొంప తగ్గకపోవడం ఒక దుష్పరిణామం అయితే... ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా
మరోరకం ప్రమాదంగా చెప్పవచ్చు. అందుకే ఇంట్లో దొరికే సాధారణమైన పదార్థాలతో మంచి
రోగనిరోధక శక్తిని సాధించవచ్చు. దీంతో తరచు వచ్చే జబ్బులే కాదు... కొన్నిరకాల
దీర్ఘరోగాల నుంచి కూడా ఇమ్యూనిటీ లభిస్తుంది. వెల్లుల్లి: ఇది ఉల్లి జాతికి చెందిన ప్రభావవంతమైన తినే
పదార్థం. ఘాటుగా ఉండే ఇది ఎన్నో వ్యాధులపై తన ఘాటైన ప్రభావాన్ని చూపి ఆరోగ్యాన్ని
రక్షిస్తుంది. రోగాలను నిరోధిస్తుంది. దీనిలోని అల్లెసిన్ అనే పోషకం చాలా రకాల
జబ్బులతో పోరాడి, వాటి నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లిసిన్ ఒక
ప్రభావపూర్వకమైన యాంటీఆక్సిడెంట్ కూడా. మనం తినే ఆహారాల్లో ఫ్రీ-రాడికల్స్ అనే
పదార్థాలు అనేక దుష్ర్పభావాలను చూపి, వ్యాధులకు కారణమవుతాయి. అల్లిసిన్ అనే
యాంటీఆక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను ప్రభావరహితం చేసేస్తుంది. అందుకే ఇది
వ్యాధినిరోధకతను పెంచడంతోపాటు ఎన్నోరకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. ఆహారంలో
వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల
(పారాసైటిక్) ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు...
శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల ఇది మంచి ఉపశమనాన్ని
ఇస్తుంది.
ఇంట్లో తయారుచేసుకున్న చికెన్ సూప్:
జలుబు, రొంప లాంటి తరచూ సోకే ఇన్ఫెక్షన్లకు చక్కటి చికిత్స చికెన్ సూప్. ఇది ఎన్నో
ఏళ్లుగా అందరూ అనుసరిస్తున్న రుచికరమైన స్వాభావిక చికిత్సామార్గం. అయితే నాటుకోడి
చికెన్‌సూప్ వల్ల మరింత ప్రయోజనం. చికెన్‌సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్
ఉంటుంది. కోడిపులుసు పెట్టేటప్పుడే ఈ అమైనో యాసిడ్ స్రవిస్తుంది. చికెన్, దాని
ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో వ్యాధినిరోధకశక్తి చేకూరుతుంది. ఉదాహరణకు
చికెన్‌సూప్‌లోని జిలాటిన్ అనే అమైనో యాసిడ్... వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
అంతేకాదు... చికెన్‌సూప్ అన్నది మంచి జీర్ణశక్తికి, కాలేయం పనితీరును
మెరుగుపరచడానికి, ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది.
చిలగడదుంపలు (స్వీట్‌పొటాటో): దీన్నే మొరంగడ్డ/గెణుసుగడ్డ
అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు
పోషకాలూ వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు ఉపయోగపడేవే. ఇది మేనికి మంచి
మెరుపునిస్తుంది. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్‌నుంచి రక్షణ
ఇస్తుంది. ఇందులో ఉండే చక్కెర వల్ల గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బలం
చేకూరుతుంది. ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయులను
పెంచుతుంది. గ్లూటాథయోన్‌ను ‘మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్’ అని వ్యవహరిస్తారు. ఇది మన
కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర
పోషిస్తుంది. ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తుంది. అందుకే చిలగడదుంపలు తినేవారు చాలా
ఆరోగ్యంగా ఉంటారు. మంచి జీవననాణ్యతతో దీర్ఘకాలం బతుకుతారు.
పుట్టగొడుగులు (మష్రూమ్స్): మన వద్ద ఇప్పుడిప్పుడే
ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ ఇది చైనా సంప్రదాయ చికిత్స ప్రక్రియల్లో చోటు
చేసుకున్న ఆహారం. రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచడానికి వాళ్లు ఎప్పట్నుంచో
పుట్టగొడుగులను వాడుతున్నారు. ప్రధానంగా ఈ రోజుల్లో పర్యావరణంలో కాలుష్యం, వృత్తి
వ్యవహారాల్లో ఒత్తిళ్లు, బయట పరిసరాల్లో అపరిశుభ్రత వంటి వాతావరణం నెలకొని ఈ
రోజుల్లో వయసుతో పాటు వచ్చేవి, వయసు పైబడుతున్నకొద్దీ రావడానికి అవకాశమున్న
వ్యాధులను నివారించడానికి పుట్టగొడుగులు మంచి ఆహారం.
అవిశెలు: స్వాభావికంగా ప్రకృతి ప్రసాదించిన వనరుల్లో
అత్యధికంగా ఒమెగా-3-ఫ్యాటీ ఆసిడ్స్ లభ్యమయ్యేది అవిశె గింజల నుంచే. మన రాష్ట్రంలో
అవిశెలు చాలా ఎక్కువగా లభ్యమవుతున్నా... వాటి ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించక
వాటిని పశుపెంపకానికి, పాల లభ్యతకు అధికంగా వాడుతున్నాం. మనిషిలో ఏదైనా వ్యాధికారక
క్రిమిగాని, సూక్ష్మజీవిగాని చేరినప్పుడు వాటిని ఎదుర్కొనే యాంటీబాడీలను మరింత
విస్తృతంగా, మరింత శక్తిమంతంగా సృష్టించే విధంగా కణాన్ని ప్రేరేపించే శక్తి అవిశె
గింజలకు ఉంది. ఆ మేరకు కణంలోని జీవరసాయన క్రియలను మరింత ముమ్మరంగా జరిగేలా చూసే
సామర్థ్యం కలిగి ఉన్న అద్భుతమైన వనరులవి. అందుకే వాటిని వీలైన రీతిలో మనం వాడటం
మంచిది. శాకాహారంలో అవిశెలను మినహాయిస్తే ఈ స్థాయిలో ఎన్3 ఫ్యాటీయాసిడ్స్ లభ్యం
కావాలంటే చేపలపై ఆధారపడాలి. సోయాబీన్ నూనెల్లోనూ, ఆవనూనెలోనూ ఈ ఎన్3 ఫ్యాటీ ఆసిడ్స్
లభ్యమవుతాయి.
No comments:
Post a Comment