ప్రస్తుతం
వివాహాలే కుటుంబ బాంధవ్యాలను దెబ్బతీస్తున్నాయి. ఇక ప్రేమ వివాహాలు కుటుంబాలను
దెబ్బతీయడంలో వింతేముంది. ప్రేమికులు వేర్వేరు కులాలు, మతాలు, అంతస్తులకు
చెందినపుడు ఇరువైపులా ఇబ్బందులు సృష్టిస్తారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న
పిల్లలు ఒకరినొకరు అర్థంచేసుకోలేక, సర్దుబాటు కాలేక బంధాలనే కాదు, జీవితాలనే పాడు
చేసుకుంటారు.
పరిపక్వత, నిజాయితీ లేని చిన్నపిల్లల ప్రేమలు, ప్రేమ వివాహాలు
కుటుంబ బంధాలను తప్పక దెబ్బతీస్తాయి. కానీ ప్రేమలో పరిణతి చెందిన వారైతే పెద్దలు
కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలుంటాయి. ప్రేమ వివాహాలేమీ నిషిద్ధం కాదు, అయితే
అవి రెండు కుటుంబాలను దగ్గర చేసేలా ఉండాలి.
ప్రేమించడం, ప్రేమించబడటం
మానవసహజం. సెటిలయ్యాక పెళ్లాడితే ఇరుకుటుంబాలకు ఇబ్బందులుండవు. కాలేజీ ప్రేమల వల్ల
తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తుపై భయం పట్టుకుంటుంది. దీంతో వారు
తిరస్కరిస్తారు. అయినా పిల్లలు మొండిపట్టుదలతో ముందుకెళ్లి కుటుంబాలకు
దూరమవుతున్నారు.
కులమతాల తారతమ్యం, ఆస్తి తేడాలు, వారి చదువు తేడాలతో
ఒక్కటైన ప్రేమ జంటలు రక్తసంబంధాలకు దూరమైన సందర్భాలు కోకొల్లలు. పరిణతి లేకుండా
ఏకమైన జంటలు చాలా చిన్నకారణాలతో విడిపోతున్నారు. ఆలోచనాసహితమైన ప్రేమ.. ఇరువైపులా
ఇంట్లో ఒప్పించి జరిగిన ప్రేమ పెళ్లి అయితేనే బంధాలను కాపాడగలదు.
నిజమైన
ప్రేమ వివాహాలు అన్ని బంధాలనూ పెంచుతాయి. ఆనందాన్నిస్తాయి. క్షణికాకర్షణ వల్ల
పుట్టిన ప్రేమలు-వివాహాలు, డబ్బును చూసి పుట్టిన ప్రేమలు... బంధాలనే కాదు బతుకులను
కూడా కాలరాస్తాయి. ఈనాటి ఈతరం వీటి గురించి ఆలోచించి అడుగేయాలి. మంచీ చెడూ బేరీజు
వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రేమ పెళ్లిళ్లు బంధాలను తుంచవు.
పెంచుతాయి. ఎందుకంటే ప్రేమ అనేది చాలా విలువైనది. ఆ విలువ తెలుసుకుని ఒక్కటైన
వారికి బంధాల విలువ బాగానే తెలుస్తుంది. అలా హృదయపూర్వకంగా ప్రేమించి ఒక్కటైన వారు
కుటుంబాలను కలుపుతారు తప్ప విచ్ఛిన్నం చేయరు. అందుకే ప్రేమ కారణంగా కుటుంబాలు దెబ్బ
తింటాయనడం సరికాదు. అంతే కాదు, పిల్లల ప్రేమను అర్థం చేసుకుని పెద్దలు అండగా ఉంటే,
అసలు ఏ సమస్యలూ రావని నేనంటాను.
ఐదేళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించడం
సమంజసమేనా?
No comments:
Post a Comment