కావలసినవి:
ఉల్లిపాయలు:3, మైదాపిండి: అరకప్పు, కోడిగుడ్డు:1, పాలు:అరకప్పు, మిరియాల పొడి:1 చెంచా, ఉప్పు, నూనె:తగినంత
తయారీ:
ఉల్లిపాయలను సన్నని చక్రాలుగా తరిగి, ఏ పొరకా పొర రింగుల్లాగా తీసుకోవాలి. ఓ బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, గుడ్డు సొన, పాలు వేసి జారుడుగా కలుపుకోవాలి. ఉల్లి రింగ్స్‌ని ఈ పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
No comments:
Post a Comment