కాలం అన్ని గాయాలనూ
మాన్పుతుందంటారు.
అవునా, మరి... కాలం చేసే గాయాల మాటేమిటి?!
నుదుటిపైన
అడ్డంగా, నోటికి ఇరువైపులా నిలువుగా...
కళ్లచుట్టూ వలయాలుగా, గొంతుకింద
ముడతలుగా...
కాలం గీసే ‘గీత’లను ఎలా చెరుపుకోవాలి?
ఒక్క వెంట్రుక రాలిపోతేనే
గుండె బద్దలౌతుందే...
అందరూ గుర్తించేలా ముఖంపై ముడతలు కనిపిస్తుంటేలోకం
తలకిందులే కదా!
ఏం చేద్దాం? కాలంతో కత్తియుద్ధం చేయగలమా?!
అంతకంటే తేలిక...
కాలంతో ‘దాగుడుముడతలు’ ఆడడం! దేహానికి
చర్మం అద్దంలాంటిది. శరీరం లోపల ఏదైనా సమస్య ఉంటే చర్మం... మొటిమలు, మచ్చలు, ముడతల
రూపంలో బయటకు చూపుతుంది. ఈ మార్పును మెడ, నుదురు, కళ్లకింద, చేతులపైన త్వరగా
గుర్తించవచ్చు. వీటివల్ల ఉన్న వయసుకన్నా పైబడినట్టుగా కనిపిస్తారు. అద్దంలో
ముఖాన్ని చాలా దగ్గరగా చూసుకున్నప్పుడు ఆ తేడా ఇట్టే తెలిసిపోతుంది. పెరిగే వయసును
అడ్డుకోలేకపోయినా, యవ్వనకాంతిని పొడిగించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి
సిద్ధంగా వయసు పైబడటం అనేది ఆడ, మగ ఇద్దరిలోనూ ఉంటుంది. అయితే పురుషుల కన్నా
స్త్రీలు త్వరగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. దీంతో అధిక ఒత్తిడిని
ఎదుర్కొంటుంటారు.
గర్భం దాల్చినప్పుడు ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంటుంది. ఇక
కుటుంబ అవసరాలు తీర్చడంలో సరైన నిద్ర , సమతుల ఆహారంపై దృష్టి పెట్టకపోవడం, వ్యాయామం
లేక అధికబరువు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. వీటికితోడు మార్కెట్లో లభించే
‘వెటైనింగ్ క్రీములు’ వాడటం వల్ల వాటిలో ఉండే గాఢ రసాయనాలు చర్మాన్ని ఇంకాస్త
నిర్జీవంగా చేస్తాయి. ఫలితంగా చర్మం ముడతలు పడుతుంటుంది. పాతికేళ్ల వయసులోనే
ముదిమికి చేరువవుతున్నట్టు కనిపిస్తారు.
ఏం
చేయాలంటే... చాలావరకు 35-40
ఏళ్ల మధ్యవారు చర్మం ముడతలు పడుతుందని, వయసు పైబడినట్టుగా కనిపిస్తోందని నిపుణులను
సంప్రదిస్తుంటారు. అలాకాకుండా 20 ఏళ్ల నుంచే చర్మవైద్యులను
సంప్రదించాలి.
రోజూ క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడుతుంటే చర్మం
త్వరగా ముడతలు పడదు.
క్లెన్సర్: సబ్బులలో చర్మంలోని సహజసిద్ధ నూనెలను
తొలగించే పి.హెచ్ స్థాయి (9-10) ఉంటుంది. మన చర్మాన్ని శుభ్రపరచడానికి పి.హెచ్
స్థాయి 4.7 ఉంటే సరిపోతుంది. అందుకే ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు కాకుండా
క్లెన్సర్‌ని ఉపయోగించాలి. జిడ్డు చర్మతత్త్వం గలవారు యాక్టివ్ క్లెన్సర్,
పొడిచర్మతత్త్వం గలవారు లోషన్ టైప్ క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. పొడిబారిన,
సున్నితమైన, డీహైడ్రేటెడ్ చర్మం గలవారు ఆల్కహాల్ ఫ్రీ క్లెన్సర్‌ను ఉపయోగించడం
మేలు.
సన్‌స్క్రీన్ లోషన్‌ని 18 ఏళ్ల నుంచే వాడటం మొదలుపెట్టాలి. లేదంటే
పిగ్మెంటేషన్, థైరాయిడ్, యాక్నె, మొటిమలు... ఒకదానికొకటి వచ్చి చేరుతుంటాయి జింక్,
ఫోలిక్‌యాసిడ్, విటమిన్ డి, విటమిన్ ఇ ఉన్న ఆహారం రోజువారీ ఆహారంగా తీసుకోవాలి
రోజూ 7-8 గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి సమం చేసుకోవాలి
నిగనిగలాడే చర్మం చక్కని ఆరోగ్యాన్ని సూచిస్తుంది.
ఇవి చేయకూడదు... శరీరంలో
కొవ్వు ఎక్కువగా తగ్గిపోయినప్పుడు, క్రాస్ డైట్ చేస్తున్నప్పుడు చర్మంపై త్వరగా
ముడతలు వచ్చేస్తాయి తెల్లబడటానికి బ్యూటీ పార్లర్స్‌లో అమ్మకానికి ఉంచినవి, ఇతర
వెటైనింగ్ క్రీమ్‌లు 14-15 ఏళ్ల వారు కూడా వాడుతుంటారు. వీటి వల్ల చర్మం జీవం
కోల్పోయి ముడతలు పడుతుంది.
35 ఏళ్ల తర్వాత వచ్చే ముడతలను బొటాక్స్
ఇంజక్షన్స్ ద్వారా సరి చేసుకోవచ్చు. 3-4 నెలల వరకు చర్మం బిగుతుగా ఉంటుంది. ఐతే ఈ
ఇంజక్షన్లను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి ముడతల నివారణకు థెర్మేజ్ అనే
లేజర్ ట్రీట్‌మెంట్ వాడచ్చు. ఇది బాంబే లాంటి మహా నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ
చికిత్స ఏడాదికి ఒకసారి చేయించుకుంటే చర్మం నిగారింపు కోల్పోదు. ముడతలు రావు.
శరీరంలో జీర్ణవ్యవస్థ సక్రమంగా లేకపోవడం, రక్తప్రసరణలో లోపాలు ఉంటే చర్మం
త్వరగా ముడతలు పడుతుంది. ముడతలు పోగొట్టడానికి పైన ప్యాక్‌లు వేసినంత మాత్రానా
యవ్వనకాంతి రాదు. అందుకే... వేళకు పోషకాహారం తీసుకోవాలి రోజూ 7-8 గంటలు నిద్ర
పోవాలి రోజు మొత్తంలో 8-10 గ్లాసుల నీరు తప్పక తాగాలి రోజూ 30 ని.లు వ్యాయామం
చేయాలి. జంక్‌ఫుడ్ తీసుకోకూడదు. వీలైనంతవరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో చేసిన
సలాడ్స్ తీసుకోవాలి.
బ్యూటీ ప్యాక్...
శనగపిండి, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకొని, ఆరాక శుభ్రపరుచుకుంటే చాలు. మిగతా
బ్యూటీ ప్యాక్‌లేవీ అవసరం లేదు. స్కిన్‌పాలిషింగ్, గ్లైకాలిక్ పీల్, హైడ్రా పీల్...
వంటి సౌందర్య చికిత్సలు ఉంటాయి. ఇందులో భాగంగా మృతకణాలను తొలగిస్తారు. ఈ చికిత్సలు
నిపుణులైన చర్మ వైద్యులచే చేయించుకోవాలి.చర్మ సంరక్షణకు మార్కెట్లో ఎన్నో సీరమ్స్
మస్తున్నాయి. వాటిని నిపుణులను సలహాతో చర్మతత్త్వానికి ఉపయోగపడే సీరమ్‌ను
ఎంచుకోవాలి.
- డా.శాను
డెర్మటాలజిస్ట్
సాగిన చర్మాన్ని లాగి
కుట్టేస్తాం...
ముఖంపైన ముడతలను సర్జికల్, మెడికల్ ట్రీట్‌మెంట్ ద్వారా సరిచేయవచ్చు. పిల్లర్,
బొటాక్స్ ఇంజక్షన్స్‌తో నుదురు, కంటి కింద, లాఫింగ్ లైన్స్ దగ్గర ముడతలను
తగ్గించవచ్చు. మెడ, దవడ దగ్గర సాగి ముడతలు పడిన చర్మాన్ని లాగి కుట్టువేస్తాం.
జీవనశైలి సక్రమంగా ఉంటే ఏ చికిత్స తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి.
శస్త్రచికిత్సతో చేసే పద్ధతి కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది.
- డా.వెంకటరమణ, పాస్టిక్ సర్జన్
No comments:
Post a Comment