all

Friday, December 28, 2012

అందమె ఆనందం

 
కప్పుడు కొబ్బరినూనె , టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు... ఈ మూడింటినీ కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది

గతంలో చేసిన తప్పులను దిద్దుకునేందుకు భగవంతుడు ఇచ్చే మరో అవకాశమే భవిష్యత్తు.


తరచూ కళ్లు తిరుగుతున్నాయి..?----డాక్టర్‌ని అడగండి - ఇ.ఎన్.టి.

 
 
నా వయసు 46. నాకు మాటిమాటికీ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోతున్నాను. పక్కకు వంగినప్పుడు లేదా తల పైకి ఎత్తినప్పుడు ఇలా జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. అన్నీ బాగానే ఉన్నాయన్నారు. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పవలసిందిగా కోరుతున్నాను.
- వి.మధు, ఏలూరు


మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవి లోపలిభాగంలో వినికిడిని, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్‌సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి.

కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్నిరకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.

నా వయసు 24. నేను మాట్లాడుతుంటే నత్తి వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. మా నాన్నకు కూడా ఈ సమస్య ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నాను. నా సమస్యకు తగిన సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
- కె.ప్రకాష్, నిజామాబాద్


మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోవడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.

మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.

డాక్టర్ ఇ.సి. వినయకుమార్
సీనియర్ ఇఎన్‌టి నిపుణులు, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్
ఇంపెయిర్డ్ (సాహి), అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్

పెద్దబాలశిక్షకు పెద్దచరిత్రే ఉంది!---సందర్భం - ప్రపంచ తెలుగు మహాసభలు

 
 
సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసంలో ‘పెద్దబాలశిక్ష’ ఆది గ్రంథంలాంటిది. మహాభారతంలాగానే పెద్దబాలశిక్షను కూడా పద్దెనిమిది పర్వాలుగా విభజించారు. అందుకే దీనిని ‘బాలల విజ్ఞానసర్వస్వం’గా భావిస్తారు. పూర్వం ఆంధ్రదేశంలోని ప్రతి విద్యార్థి పెద్దబాలశిక్షతోనే చదువు ప్రారంభించేవారు. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి పెద్దబాలశిక్ష కంఠపాఠమవ్వాలి. ఆంగ్లేయుల కాలంలో ఆంధ్రదేశంలోని అన్ని పాఠశాలల్లోను పెద్దబాలశిక్ష పాఠ్యాంశంగా ఉండేది.

నేపథ్యం...
ఆంగ్లేయుల దగ్గర రెవెన్యూ శాఖలో పనిచేస్తూన్న స్థానికుల కోసం, 1832లో ‘మేస్తర్ క్లూలో’ అనే తెల్లదొర ‘పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి’ అనే పండితుడి చేత ‘బాలశిక్ష’గ్రంథాన్ని రచింపచేశాడు. పిల్లలకు తేలికగా అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తక రూపకల్పన జరిగింది. ఇది 1856 నాటికి 78 పుటలతో పుస్తక రూపంగా వెలువడింది. ఇటువంటి పుస్తకం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు దీనిని మనసారా అక్కున చేర్చుకున్నారు.

1865లో వెలువడిన 90 పుటల బాలశిక్షలో, పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలు, ఛందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను చేర్చి, ‘‘బాలవివేక కల్పతరువు’’ గా రూపొందించారు. అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో ఉన్న పుస్తకం పెద్దబాలశిక్షగా కొత్తపేరును సంతరించుకుంది. ఇందులో భాష, సంస్కృతులకు కావలసిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, రెండుమూడు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ అందరూ తెలుసుకోదగ్గవీ, అప్పటివరకు తెలిసి ఉన్న చారిత్రక భౌగోళిక విజ్ఞాన సంబంధ విషయాలు... వీటన్నిటినీ ఈ పుస్తకం లో పుదూరువారు పొందుపరిచారు.

పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916 లో వచ్చిన వావిళ్ల వారిది. భాషోద్ధారకులు వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో... ‘‘భారతదేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి, ఇట్టి (బాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను’’ అని చెప్పారు.

కొన్ని మార్పులు, చేర్పులతో ఎందరో ప్రచురణకర్తలు, ఎన్నో పండిత పరిష్కరణలతో నేటికీ వెలువడుతూనే ఉంది. పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం తెలుగుదనాన్ని నేర్పి, చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం పెద్దబాలశిక్షకు ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్దబాలశిక్షను ‘గుణశీల పేటిక’ గా అభివర్ణించారు. నాటి నుంచి నేటివరకు పెద్ద బాలశిక్షను తెలుగువారంతా తమ మానసపుత్రికగా కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంటింటా ఈ పుస్తకం ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు, నక్షత్రాలు, రాశులు, చుట్టరికాలు, తిథులు, మాసాలు, ఋతువులు, వారాలు, అధిపతులు, సప్తద్వీపాలు, దశావతారాలు...వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలకు పైనే పెద్దబాలశిక్షలు లభిస్తున్నాయి. బుడ్డిగ సుబ్బరాయన్ రూపొదించిన ‘సురభి’ గాజుల సత్యనారాయణ ‘తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష’ విరివిగా లభిస్తున్నాయి. ఈనాటికీ ‘పెద్దబాలశిక్ష’ పేరుకు ఎంతో గౌరవం, ఆదరణ ఉన్నాయి. ‘పెద్దబాలశిక్ష’ వంటి పుస్తకం తెలుగువారి సొంతం. ఇది తెలుగుభాష గొప్పదనం, తెలుగుజాతి నిండుదనం, తెలుగువారి అదృష్టంగా భావించాలి. ప్రస్తుత ఈ పుస్తకం మూడు సంవత్సరాలలోపే 36 సార్లు ముద్రణ పొంది, రెండున్నర లక్షల ప్రతులు చెల్లాయి. పెద్దబాలశిక్ష పేరు చిరస్థాయిగా నిలిచితీరుతుంది.

- డా.పురాణపండ వైజయంతి

చాకోలైట్స్

 
మొదటి చూపులోనే మోము విప్పారుతుంది.
నాలుక ఆ రుచికి లొట్టలేస్తుంది.
రేపర్ విప్పుతుంటే... నాసికకు తగిలే ఆ స్మెల్ పెదవులపై స్మైల్‌ని అద్దుతుంది.
నోట్లో వేసుకోగానే...
కనులు అరమోడ్పులవుతాయి.
చల్లగా, తియ్యగా... కరిగిపోతూ చాకొలెట్...
జీవితం ఎంత అర్థవంతమైనదో చెప్పకనే చెబుతుంది.
నూతన సంవత్సరం వేడుకలలో చాకొలెట్స్ పంచుకోండి.
ఆ నవ్వుల వెలుగుల్లో ప్రేమలు పెంచుకోండి.


చాకొలెట్ వాల్‌నట్ పుడ్డింగ్

కావలసినవి
చాకొలెట్ చిప్స్ - కప్పు
కోకో పౌడర్ - 6 టేబుల్ స్పూన్లు
వాల్‌నట్స్ (తరగాలి) - అర కప్పు
మ్యారీ బిస్కెట్లు - 400 గ్రా.
పాలు - కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ (మార్కెట్లో దొరుకుతుంది) - 250 ఎం.ఎల్
బటర్ - 100 గ్రా.
తేనె - 2 టేబుల్ స్పూన్లు

తయారి

బిస్కెట్లను చిన్న చిన్న ముక్కలు చేసి, ఒక గిన్నెలో వేయాలి. ఇందులో పాలు పోసి కలపాలి.

మరొక గిన్నెలో కండెన్స్‌డ్ మిల్క్, బటర్, తేనె, కోకో పౌడర్ వేసి కలపాలి. మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, సాస్‌లా అయ్యేలా ఉడికించి, దించి, చల్లారనివ్వాలి. దీంట్లో బిస్కెట్‌మిశ్రమం, వాల్‌నట్స్ తరుగు, చాకొలెట్ చిప్స్, చాకొలెట్ సాస్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కరిగించిన బటర్ లేదా నెయ్యి రాసిన కప్పుల్లో పోసి, పైన చాక్లెట్ ముక్కలు, వాల్‌నట్స్, కోన్‌లతో గార్నిష్ చేయాలి. ఇలా తయారుచేసుకున్న కప్పులను ఫ్రిజ్‌లో ఉంచాలి. మిశ్రమం గట్టిపడ్డాక బయటకు తీసి, సర్వ్ చేయాలి.

చాకో-ఆరెంజ్ టెర్నీ

కావలసినవి
కమలాపండ్లు (ఆరెంజ్) - 5 (చిన్నవి)
ఫ్రెష్ క్రీమ్ - కప్పు
డార్క్ లేదా మిల్క్ చాకొలెట్ - 500 గ్రా. (తరగాలి)
బాదంపప్పు - 100 గ్రా.

తయారి
సాస్‌పాన్‌లో క్రీమ్ వేసి వేడిచేసి, దించేయాలి. దీంట్లో చాకొలెట్ తరుగు వేసి కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక బాదంపప్పు పలుకులు వేసి, ప్లేట్‌లో ఆరెంజ్‌లను అమర్చి వాటిపైన స్పూన్‌తో నెమ్మదిగా పోయాలి. వీటిని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి, సర్వ్ చేసుకోవాలి.

అంబ్రెల్లా చాకొలెట్

కావలసినవి
పాలపొడి, కోకో పౌడర్, బటర్, నట్స్

తయారి
పంచదార, పాలపొడి, కోకో పౌడర్ సమపాళ్లలో తీసుకోవాలి పాల పొడి, కోకోపౌడర్‌లను కలిపి జల్లించాలి.

వెడల్పాటి ప్లేట్‌కి తగినంత బటర్ రాయాలి.

ఫ్రైయింగ్ పాన్‌లో తగినన్ని నీళ్లు, పంచదార వేసి, లేత పాకం పట్టాలి. దీంట్లో పాలపొడి, కోకోపౌడర్ వేసి కలపాలి. దీంట్లో కొద్దిగా బటర్ వేసి, సువాసన వచ్చేదాకా ఉంచాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, స్టౌ ఆర్పేయాలి. బటర్ రాసిన ప్లేట్‌లో ఈ మిశ్రమం పోసి, నట్స్ వేసి, స్పూన్‌తో కలపాలి. కోన్‌షేప్ అచ్చుల లోపల బటర్ రాసి, కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని కూరి, చివర్లో వంకీలున్న ప్లాస్టిక్ పుల్లలను గుచ్చాలి. అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత, ఫ్రిజ్‌లో పెట్టాలి. మిశ్రమం గట్టిపడ్డాక, అచ్చుల నుంచి చాకొలెట్‌లను బయటకు తీయాలి. వీటికి రంగు రంగుల ఫాయిల్ పేపర్స్ చుట్టి, అలంకరించాలి.

నట్ చాకొలెట్

కావలసినవి
పాలపొడి - 250 గ్రా, కోకో పౌడర్ - 250 గ్రా., బటర్ - తగినంత, నట్స్ - తగినన్ని

తయారి
పంచదార, పాల పొడి, కోకో పౌడర్‌లను సమపాళ్లలో తీసుకోవాలి పాల పొడి, కోకోపౌడర్‌లను కలిపి జల్లించాలి వెడల్పాటి ప్లేట్‌కి తగినంత బటర్ రాయాలి ఫ్రైయింగ్ పాన్‌లో తగినన్ని నీళ్లు, పంచదార వేసి వేడిచేయాలి. పంచదార కరిగి లేతపాకం వచ్చాక అందులో పాలపొడి, కోకోపౌడర్ వేసి కలపాలి. దీంట్లో కొద్దిగా బటర్ వేసి, సువాసన వచ్చేదాకా ఉంచాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, మంట తీసేయాలి. బటర్ రాసిన ప్లేట్‌లోకి ఈ మిశ్రమం పోసి, నట్స్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బటర్ రాసిన రకరకాల అచ్చుల్లో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. మిశ్రమం గట్టిపడ్డాక బయటకు తీయాలి. ఇలా చేసుకున్న చాకొలెట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

చాకొలెట్ బాల్స్

కావలసినవి
డ్రై ఆప్రికాట్స్ - 125 గ్రా. (తరగాలి)
ఎండుద్రాక్ష (రైజిన్స్)- 1/3 కప్పు (తరగాలి)
ఎండుద్రాక్ష (సుల్తానాస్) - 1/3 కప్పు (తరగాలి)
నారింజ తొక్క తరుగు - 2 టీ స్పూన్లు
డార్క్ చాకొలెట్ తరుగు - 74 గ్రా.
డార్క్ చాకొలెట్ (అదనంగా) - 200, బటర్ - 75 గ్రా.

తయారి
ఒక గిన్నెలో ఆప్రికాట్, ఎండుద్రాక్ష (రైజిన్స్, సుల్తానాస్), నారింజ తొక్క తరుగు, డార్క్ చాకొలెట్ తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీస్పూన్ పరిమాణంలో తీసుకొని బాల్స్‌లా చేయాలి. వీటిని డీప్ ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచాలి. అదనంగా తీసుకున్న 200 గ్రా.ల చాకొలెట్‌ను ముక్కలుగా చేయాలి. ఒక గిన్నెలో బటర్, చాకొలెట్ ముక్కలు వేయాలి. పాన్‌లో నీళ్లు పోసి, మరిగించి, ఆ నీటిలో ఈ గిన్నె ఉంచి బటర్‌ని కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక దించాలి. ఫ్రిజ్ నుంచి తీసిన ఫ్రూట్ బాల్స్‌ని చాకొలెట్ మిశ్రమంలో ముంచి, తీయాలి. ఆరాక సిల్వర్ ఫాయిల్‌తో ఒక్కో చాకొలెట్ బాల్‌ని చుట్టి, గాలి తగలని కంటెయినర్‌లో వేసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. అవసరమైనప్పుడు చల్లగా సర్వ్ చేసుకోవాలి.

చాకొలెట్ చిట్కాలు...

పంచదార లేనివి, పంచదార తక్కువ ఉన్నవి, మధ్యస్తంగా ఉన్నవి, ఎక్కువ పంచదార ఉన్న వి... ఇలా చాకొలెట్స్‌లో 4 రకాలు ఉంటాయి.

రంపంలాంటి కత్తిని ఉపయోగిస్తే చాకొలెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగడం సులువు.

చాక్లెట్ అంచు దగ్గర పైభాగంలో కత్తి పదునైన భాగాన్ని ఉంచి, మెల్లగా కిందకు అదుముతూ కట్ చేస్తే సమానంగా కట్ అవుతుంది.

చాకొలెట్ గిన్నెను స్టౌ మీద నేరుగా పెట్టకుండా, మరిగేనీళ్లలో పెట్టి కరిగించాలి. చాకొ లెట్‌ను కరిగించే గిన్నె తడిగా ఉండకూడదు.

చాకొలెట్‌ను ఫ్రిజ్ వంటి చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.

కర్టెసీ: డా. స్వజన్,
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐటీటీఎమ్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, హైదరాబాద్


సేకరణ: నిర్మలారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Wednesday, December 26, 2012

ఈ వారం కథ - జర్నీ * సామాన్య *


 


 

చాలా కాలానికి సొంతూరికి వెళ్ళడం ఎలా ఉంటుందో తెలుసా? ఎండాకాలం సెలవులకి అమ్మమ్మ వాళ్ళ పల్లెటూరికి వెళ్లినట్లుంటుంది. శరీరము, మనసూ విమానం కిటికీలో నుండి కనిపిస్తున్న మబ్బుల అడవుల్లా హాయిగా సుఖంగా తేలిపోతున్నాయి. ఎంత బాగుంటుందో మా ఊరు. విమానం నెమ్మదిగా నేలపై వాలడానికి యత్నిస్తోంది. అర్ధరాత్రి మద్రాసు మహానగరం నడిచి వెళుతున్న నగల దుకాణంలా కాసేపు, నలుపు తెలుపు సినిమాలో కుక్కతో కలిసి దేవదాసు కూర్చున్న దీపస్తంభంలా కాసేపు కనిపిస్తోంది. మనుసుకి ఏమిటో ఒకటే సంతోషం.


లగేజిని ట్రాలీ ఎక్కించి బయటకు వచ్చేసరికి మా ఊరంతా నా కోసం వచ్చేసిందా అన్నట్లు మా అమ్మ, పెద్దమ్మలు, అత్తలు ఆహ్వానం పలికారు. అంతమంది ఆడవాళ్ళ మధ్య సస్యక్షేత్రంలో తాటిచెట్టులా కనిపించాడు హరి. అందరితో పాటు వాడూ నన్ను చూడగానే బుగ్గల్ని మా అమ్మమ్మ చేసే పులిబొంగరాల్లా పొంగించి నవ్వాడు. హరి నా చిన్ననాటి సావాసగాడు. ఇప్పుడు నన్ను తీసికెళ్లడానికి వచ్చిన కారు డ్రైవరు.
అందరం సర్దుకుని కూర్చున్నాం. నాకోసం తెచ్చిన పప్పు పొంగలి నేతిలో తేలుతూ ఏరోడైనమిక్ బస్సులా పొట్టలోకి జారిపోతోంది. మద్రాసు నుండి మా పట్టణానికి, అక్కడి నుండి మా ఊరికి అంతా కలిపి నాలుగు గంటల ప్రయాణం. అందరం కబుర్లలో పడ్డాం.

చుట్టుపక్కల షాపులన్నీ షట్టర్లు మూసేసుకున్నాయి. ఇళ ్ళన్నీ నిద్రపోతున్నాయి. మరే పడవా లేని నదిలాంటి రోడ్డుపై మా కారు జోరు జోరుగా ఈత కొడుతోంది. ఎయిర్‌పోర్టు నుండి ఎనభై కిలోమీటర్లు దాటగానే అందరూ నిద్దర్లలోకి జారుకున్నారు. నేను, మా పెద్ద పెద్దమ్మ, హరీ మిగిలాం. బ్రతుకు ప్రయాణంలో బాల్యం ఎప్పుడు చేజారిపోతుందో, ఎప్పుడు పెద్దవాళ్ళం అయిపోతామో గమనించుకోనే గమనించుకోం. నాకోసమని తెచ్చిన పదిమూరల మల్లెపూలమాల నుండి అరమూర తెంపి తలలో పెట్టుకుని మిగిలిన పూలని డాష్‌బోర్డుపైన వున్న రేడియం వినాయకుడి చుట్టూ వలయంలా చుడుతూ "ఒరేయ్ హరీ అప్పుడు నువ్వు గోపాలశెట్టి వాళ్ళ మల్లెచెట్టుకి పూసిన గుండుమల్లె మొగ్గని బా...గా వాసన చూసావ్ గుర్తుందా ?'' అన్నాను. హరి నా మాట వినగానే పులిబొంగరం నవ్వు నవ్వి, "గుర్తుంది చిత్తూ'' అన్నాడు. నా పేరు చిత్కళమాలిని. అంత కష్టమైన పేరు నోరు తిరగక, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విరిచి పిలుస్తారు. స్నేహితులకి నేను చిత్తూని. నిజానికి హరి నన్నట్లా పిలిచేవాడని జ్ఞాపకం కూడా లేదు.

చిన్నప్పుడు పక్కింటి గోపాలశెట్టి వాళ్ళింట్లో ఆడి, వాళ్ళింటికి మా ఇంటికి మధ్య వున్న కరగాడ దాటి వస్తున్నాం. కరగాడ అంచున వున్న మల్లెచెట్టు మొగ్గలతో విరగబూసి వుంది. వస్తూ వస్తూ హరి ఒక మొగ్గ తుంచి ముక్కు దగ్గర పెట్టుకొని గాఢంగా వాసన చూసాడు. అంతే మొగ్గ ముక్కు లోతుల్లోకి దూసుకెళ్లింది. తుమ్మినా ఏం చేసినా బయటికి రాలేదు. ఇంక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అని తీర్మానించుకున్నాం. ఆపరేషన్ చేసి ముక్కు నిలువుగా కోసి మల్లెమొగ్గ తీస్తారని నిర ్ణయించేసాం. మా చర్చలు విని హరి ఏడుపు మొదలుపెట్టాడు. పెద్దవాళ్ళకి చెప్పడానికి భయం. అంతలోకి అటువైపుకి వచ్చిన మా మామ పిన్ను పెట్టి అతి కష్టం మీద మల్లెమొగ్గ బయటకు లాగి గండం గట్టెక్కించాడు.

మల్లెపూలతో ముడిపడిన జ్ఞాపకం అది. ఇప్పటి దాకా పొట్లంలో వున్న మల్లెలు ఇప్పుడు వొళ్ళు విరుచుకుని కారంతా వత్తైన పరిమళాన్ని వెదజల్లడం మొదలుపెట్టాయి. ఆ పరిమళాన్ని గుండెల నిండా పీల్చుకుని "పిల్లలు బాగున్నారా హరీ'' అన్నాను. నా ప్రశ్న వినగానే హరి ముఖం ముడుచుకుపోయింది. ఒక చేత్తో మల్లెలోంచి బయటకు వచ్చిన పచ్చటి పురుగుని పట్టి కిటికీలోంచి బయటకు విసిరేసి, ఏదో చెప్పబోయేంత లో పెదమ్మ "ఆడపిిల్ల చచ్చిపోయింది నాయనా, ట్రాక్టర్ కొట్టేసింది'' అన్నది. ఊహించని ఆ మాటకి నా గుండె బెంబేలు పడ్డది. "యెట్లా జరిగింది?'' అన్నాను నెమ్మదిగా. హరి "మీ ఇంటి ఎదురుగా వున్న ప్లాట్లలో ఏదో పూజ జరుగుతోంటే చూసి, ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతూ వుందట పాప. ట్రాక్టర్ కొట్టేసింది'' అన్నాడు. పెదమ్మ అందుకుని "ఎందుకులే చెప్పుకోవడం నాయనా! అక్కడికక్కడికి ప్రాణం పోవడమే కాదు, బిడ్డ నుజ్జునుజ్జయిపోయింది'' అన్నది.

ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమని ఓదార్చాలి? ఊరుకున్నాను. అయినా మా ఇంటి ఎదురుగా ప్లాట్లు ఏమిటి? అక్కడ ఒక చెరువూ, మట్టిదిబ్బలూ కదా వుండాలి. ఆ మట్టిదిబ్బల్లో లోతైన బొరియలు చేసి పాలపిట్టలు కాపురాలు చేసేవి. పిట్టల కోసమని ఆ బొరియలలో చేతులు పెడితే అప్పుడప్పుడు మెత్తగా మట్టిపాములు చేతికి తగిలేవి. కుడిచేతివైపు వున్న మామిడి తోటని దాటితే, రాయదొరువు వుండేది. హరి నాకోసమని ఆ దొరువులోని కలువలని, దొరువుపైన ఝుంకారం చేసే తుమ్మెదలని తీసుకొచ్చి, తుమ్మెదలని నా ముఖంపైన వదిలి కలువలని చేతికి ఇచ్చేవాడు. అక్కడ ప్లాట్లు వుంటే మరి ఇవంతా ఏమైపోయినట్లు?

మా ముగ్గురి మధ్యా అలుముకున్న విషాద నిశ్శబ్దాన్ని, బద్దలు కొట్టడమంటే కొంచెం భయమేసింది. అయినా, గొంతు పెగుల్చుకుని "ప్లాట్లు ఎక్కడ రా హరీ?'' అన్నాను. హరి "నువ్వు ఊరికి వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది కదా చిత్తూ, మీ ఇంటిముందున్న చిన్న చెరువు, మట్టి దిబ్బలు, రియల్ఎస్టేట్ కిందకు వెళ్ళాయి. ప్లాట్లు చేసి అమ్మేసారు'' అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మా ఊరికి ముప్పయి కిలోమీటర్ల దూరాన వున్న సముద్రపు రేవుకి బోలెడు వ్యాపారాలు త రలివచ్చాయని తెలుసు. కానీ, దానికీ దీనికీ ఏంటి సంబంధం? అదే అడిగాను హరిని. వాడు "పోర్టుకొచ్చిన కంపెనీలను చూసి మన రియల్ ఎస్టేట్‌వాళ్లు ఎక్కడ భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ కొనడం మొదలుపెట్టారు. చవుడా, సున్నమా, మాగాణా, మెట్టా ఏమీ లేదు చిత్తూ, కొనెయ్యడం, అమ్మేయడం. రియల్ ఎస్టేట్ భూం వచ్చింది. టౌన్ నుండి మన ఊరికి వచ్చే రోడ్డు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ లారీలతో, శవాలతో కిటకిటలాడుతూ వుంటుంది. మన పాల శేఖర్ టౌన్‌కి పాలు తీసుకువెళుతూ లారీ కింద పడి చనిపోయాడు. నా బిడ్డ చనిపోయాక నా భార్య ఈ యాక్సిడెంట్లకి భయపడి నన్ను ఆటో వెయ్యడం మానిపించేసింది. ఉన్న ఆటో అమ్మేసుకుని, ఇదిగో ఇట్లా డ్రైవరుగా కుదురుకున్నాను. ఆదాయం తక్కువే. పని కూడా తక్కువే'' అన్నాడు.

వాడు చెప్పిందంతా విని మా పెద్దమ్మ "వీళ్ళకున్న రెండెకరాలను కూడా ముప్పయి అయిదు లక్షల చొప్పున కొన్నారులే. మూడు లక్షలు కూడా చెయ్యని చౌడు భూమి అది. వచ్చిన డబ్బుని ముగ్గురు కొడుకులూ మూడు పాతికలు పంచుకున్నారు. మంచి ఇళ్ళు కట్టుకున్నారు. పని చెయ్యకున్నా గడిచిపోతుంది. లేకపోతే పాడుపొట్ట కోసం నానా గడ్డీ కరవాల్సిందే కదా! కూతురు పోయినంత మాత్రాన ఇంట్లో కూర్చోగలమా'' అన్నది. హరి అవునన్నట్లు తల ఊపి "అదే చిత్తూ రాయదొరువు పక్కన ఉండేవి కదా మా... కయ్యలు..అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ, మా అన్నానికి సరిపడేట్టు కూడా పండేవి కాదు. అంత డబ్బు కళ్ళతో చూడడం అదే మొదటిసారి..చివర కూడాననుకో! మేమనేమిలే 'పోర్టు'చుట్టు పక్కల ఊర్లు ఊర్లు సంపన్నమైపోయాయి. చాలామంది డబ్బు గోతాలకి ఎత్తుకున్నారు. మన టౌన్ ముందు ఇప్పుడు బొంబాయి కూడా దిగదుడుపే. ఎన్నెన్ని అపార్ట్‌మెంట్లు, కొత్త కొత్త వ్యాపారాలు, ఎన్నెన్ని బంగారు అంగళ్ళు..'' అన్నాడు.

నాకు హరి వాళ్ళ చేను గుర్తుకొచ్చింది. చేను గట్టుపైన రెండు కొబ్బరి చెట్లుండేవి. ఆకాశమంత పొడవుండి చాలా పెద్ద సైజు కాయలు కాసేవి. కాయల్లో నీళ్ళు కూడా చాలా ఉండేవి. అవి గంగాభవానీ రకం కొబ్బరిచెట్లు అని చెప్పాడు హరి ఒకసారి. నాకు ఆ పేరెందుకో బాగా గుర్తుండిపోయింది. అందుకే అన్నాను "గంగాభవానీ చెట్లు కూడా కొట్టేసారా హరీ'' అని. హరి నవ్వి "నీకు భలే గుర్తుంది చిత్తూ, అందుకే నువ్వు అంతపెద్ద సైంటిస్టువి అయ్యావ్. వాటిని రియల్ఎస్టేట్ వాళ్ళు సైట్ మధ్యలో వుంచి చుట్టూ షోగ్గా గుండ్రటి ఆఫీసు ఒకటి కట్టుకున్నారు'' అన్నాడు.

కొత్త మేకప్ వేసుకున్న మా ఊరిని కళ్ళ ముందు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ "జరిగిందంతా మంచికా చెడుకా హరీ?'' అన్నాను. నా హృదయంలోని ద్వైదీయ ఘర్షణ అసంకల్పితంగా అట్లా అనేలా చేసిందనుకుంటా. ఆ ప్రశ్నకు హరి అరసెకను కూడా ఆలస్యం చేయకుండా నవ్వి "అదేం మాట చిత్తూ, ముందే చెప్పా కదా అంత డబ్బుని మా కళ్ళతో చూసి, చేతులతో తాకగలమని కలలో కూడా అనుకోలేదు. పోర్టు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి చేసేందుకు చిన్నవో చితకవో ఉద్యోగాలున్నాయి. మంచి ఇళ్ళు కట్టుకున్నాం. అందరం సుఖంగా వున్నాం'' అన్నాడు. అది విని మరి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన నీ కూతురి సంగతో... అంతకు ముందు మన ఊరికి ఇన్నేసి వాహనాలు రావడం, ప్రమాదాలు జరగడం ఎప్పుడూ లేదు కదా, అనబోయి ఊరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము వెళుతున్న కారుకి ప్రమాదం జరగనే జరగదని ఏ దేవుడైనా చీటీ రాసివ్వగలడా?
నాకు హరి వాళ్ళ ఇల్లు గుర్తుకు వచ్చింది. చిన్న పూరి గుడిసె. వానొస్తే నీళ్లన్నీ వాళ్ళ ఇంట్లోనే వుండేవి. తుఫానైతే ఇల్లు వదిలి విష్ణాలయం సత్రాలకు పరుగులెత్తేవారు. ఇప్పుడు మంచి ఇళ్ళు కట్టుకున్నారు. చేతిలో డబ్బులున్నాయి. సంఘంలో హోదా పెరిగి ఉంటుంది.

టీ తాగడానికి హరి చెంగాళమ్మ తల్లి గుడి దరిదాపుల్లో కారుని ఆపాడు. నిద్దర్లో వున్న వాళ్ళు కూడా కాళ్ళు జాడించుకోడానికని కిందకు దిగారు. అటు ఇటు నాలుగడుగులు వేసి చెంగాళమ్మకి నమస్కరించుకోడానికి వెళ్లారు. చెంగాళమ్మ గుడికి తలుపులు వుండవు. ఏ సమయంలో వెళ్ళినా నమస్కారం పెట్టుకుని రావొచ్చు. ఎప్పుడో ఒకసారి తలుపులు పెట్టారట. అప్పుడు అమ్మవారు, "నా గుడికి తలుపులు పెడతారా బాడకోవ్‌లారా'' అని ఎగిసి ఒక తన్ను తన్నిందట. అంతే, తలుపులెళ్లి ఏదో ఊరిలో పడ్డాయట. అప్పటినుండి మందిరానికి తలుపులు మూసే సాంప్రదాయం లేనే లేదంట. నిజానిజాల తరాజుని వదిలేస్తే నాకు ఆ కథంటే చాలా ఇష్టం. సమాజం ఆడవాళ్ళకి అడ్డుపెట్టిన తలుపులన్నింటినీ అలా తన్నాలి ఎడమకాలుతో ఎగిసిపెట్టి.

టీలు తాగి అందరం మళ్లీ కారెక్కాం. ఎందుకు గుర్తొచ్చిందో ఏమో సీట్లో సర్దుకున్నాక "సీతమ్మ వాళ్ళు బాగున్నారా?'' అన్నాను జనాంతికంగా. మా ఊర్లో 'అందరికీ తెలిసిన వేశ్య' సీతమ్మ. ఆవిడ కుదిమట్టంగా, తెల్లగా, పల్చగా బాగుండేది. ఆమె అమృతం తాగిందనేవాళ్ళు మా అమ్మావాళ్ళు. ఎందుకంటే ఆవిడ మా అమ్మ చిన్నప్పుడు యెట్లా ఉండేదో, మా అమ్మ పెద్దయ్యాక కూడా అట్లానే ఉందట. సీతమ్మ మేం పుట్టకముందు కొంత కాలం మా వైష్ణవాలయం పూజారిని వుంచుకున్నదట. మాకు ఊహ తెలిసేసరికి మా పెద్ద మామని ఉంచుకుంది. సీతమ్మ దగ్గర ఉండడానికి ఊరంతా ఎగబడే వారట. మా చిన్నప్పుడు మామ కనిపించకపోతే సీతమ్మ వాళ్ళింట్లో వున్నాడేమో చూసి రమ్మని తరిమేవాళ్ళు మమ్మల్ని.

నేను, మా తమ్ముడు చేతుల్ని బస్‌స్టీరింగ్‌లా పెట్టి కాలెత్తి యాక్సిలేటర్ తొక్కినట్టు తొక్కి డుర్రుమంటూ సీతమ్మ వాళ్ళింటికి పరుగెత్తేవాళ్ళం. పొద్దుట పూటైతే సీతమ్మ వాళ్ళ అమ్మ సీనమ్మ, ఇంటి ముందర కూర్చుని దోశలు, గుడ్డు దోశలు, బెల్లం దోశలు పోసి అమ్ముతుండేది. సాయంత్రం పూటైతే పులిబొంగరాలు, సుకీలు అమ్మేది. సీతమ్మ ఇంటి లోపలికి వెళ్లకూడదని మాకు గట్టి శిక్షణ వుండేది. అందుకని సీనమ్మ అంగటి ముందు మా బస్సుల్ని ఆపి "మామోయ్ తాత నిన్ను పిలుచుకు రమ్మన్నాడు'' అని కేకపెట్టి బస్సుల్ని రివర్సు చేసుకుని పరిగెత్తేవాళ్ళం. తర్వాత తర్వాత- అంటే మా మామకి పెళ్ళి అయిన తర్వాత సీతమ్మ ఆ పంచలోనే అంట్లు కడుగుతూనో అప్పచ్చులు వొత్తుతూనో చాలాసార్లు కనిపించేది. ఎప్పుడూ భుజాల చుట్టూ నిండుగా పైట కప్పుకుని వుండేది. చాలా మామూలుగా మా మామ పెళ్ళి చేసుకున్న మా అత్తలాగే వుండేది. సినిమాలలో వేశ్యలాగా అస్సలు వుండేది కాదు.

"సీతమ్మవాళ్ళు బాగున్నారా'' అన్న నా ప్రశ్నకి హరి "వాళ్ళు ఊరు వదిలి టౌన్‌కి వెళ్లిపోయార''ని సమాధానం ఇచ్చాడు. "సీతమ్మవాళ్ళు తరతరాల నుంచి ఆ ఊరిలోనే వున్నారు కదా. అమ్ముకుని వెళ్ళిపోవడానికి వాళ్ళకి పొలంపుట్రా ఏమీ లేదనుకుంటా కదరా. టౌన్‌కి ఎందుకు వెళ్ళినట్లు?'' అన్నాను. అందుకు మా అమ్మ "వాళ్ళకి పొలం పుట్రా ఏమీ లేదు. సంపాదించిన డబ్బుని నీ బోటి నా బోటి వాళ్ళకి వడ్డీలకి తిప్పేవాళ్ళు. వాళ్ళు ఊరొదిలి పొయ్యింది అవమానానికి. తను చేసే తార్పుడు పనులకి ఉపయోగపడలేదని రంగారెడ్డి పోలీసులని పెట్టి కొట్టించాడు'' అన్నది. నాకేమీ అర్థం కాలేదు. వాళ్ళు ఊరెరిగిన వేశ్యలు. ఎవరెరుగని బాగోతమని ఇవాళ పోలీసులు కొట్టడం. అదే అడిగాను అమ్మని. హరి అందుకుని "సీతమ్మ కూతురు జ్యోతి గుర్తుంది కదా చిత్తూ. ఆ పిల్ల ఎదిగొచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారం పుంజుకుంది.

రంగారెడ్డి జ్యోతిని ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి, ఈ ఆఫీసర్ దగ్గరికి తీసుకు వెళ్ళేవాడు. వాళ్ళొక పదివేలు ఇచ్చారనుకో... జ్యోతి చేతిలో ఒకటో రెండో పెట్టి, మిగిలింది తన జేబులో వేసుకునేవాడు. జ్యోతి ఆ విషయం గుర్తించి సీతమ్మతో చెప్పిందట. సీతమ్మ "ఇదేం పని రెడ్డిగారూ, ఇష్టం లేకున్నా నువ్వు పిలిచిన దగ్గరికంతా వస్తున్నాం అది చాలక..మీరిట్లా చెయ్యడం ఏం బాగాలేదు. ఇలాగైతే మా అమ్మిని పంపించడం కుదరదు'' అన్నదట. అయినా రంగారెడ్డి తన బుద్ధి పోనిచ్చుకోలేదు. వీళ్ళేమో ఇక రామని మొరాయించారు. రంగారెడ్డికి కోపం వచ్చింది. పడుపుకూడు తినడానికి సిగ్గనిపించలేదు కానీ, వాళ్ళు కాదనేసరికి అవమానమేసి పోయిందట ఆయనకి. వీళ్ళ పని పట్టాలని పోలీసువాళ్ళని మాట్లాడుకున్నాడు. ్ల సీతమ్మ ఎదురింట్లో వుండే సీనడు వీళ్ళమీద 'వ్యభిచారం' కేసు పెట్టాడు. పోలీసులు జ్యోతిని జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకుని వచ్చారు. జ్యోతి ఏడుపులకి, గగ్గోళ్ళకి మేమందరం పొలోమని వాళ్ళింటికి పరుగులు తీశాం. పెద్ద రెడ్లెవరూ ఇళ్ళలోంచి బయటకు రాలా. జ్యోతికి అడ ్డం పడ్డ సీతమ్మ చెంపలు పగలేసి, అందరినీ కొడుతూ ఫర్లాంగు దూరం నడిపించి జీపెక్కించారు. ఆ రోజు జ్యోతి ముఖం నాకింకా గుర్తు. తెల్లటి మనిషి ఏడ్చి ఏడ్చి ఎర్రగా కందిపోయింది.

స్టేషన్‌నుండి వచ్చిన తర్వాత, ఎవరూ వారంరోజులు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టనేలేదు. ఇంట్లో శవం వెళ్ళినట్లు తలుపులు మూసుకు కూర్చున్నారు. ఎవరు వెళ్ళి పిలిచినా పలకలా. ఎనిమిదో రోజు లారీ వచ్చింది. అందులో సామానెక్కించుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఎస్.ఐ పేరు రామసుబ్బారెడ్డి అనుకుంటా'' అన్నాడు. అంతా వింటూ ఉందేమో మా రెండో అత్త వెనుకనుండి "ఆ..ఆ ముదనష్టపోడే...'' అన్నది. మా పెదమ్మ "మన ఊరొక మురికిగుంట. ఊరు వొదిలి పోతే పోయారు గానీ, వాళ్ళ దరిద్రం మన ఊళ్ళోనే నిలబడిపోయింది. టౌన్‌కు పోగానే వాళ్ళ దశ తిరిగింది. మంచి ఫ్లాట్ కొనుక్కున్నారు. జ్యోతి ఎవరో మార్వాడీవాడితో ఉందట. ఈ పిల్లంటే వాడికి ప్రాణమట. ఆ పిల్ల వొళ్ళంతా బంగారమే ఇప్పుడు'' అన్నది. మా అమ్మ "గృహ ప్రవేశానికి సీతమ్మ వచ్చి పిలిచివెళ్ళింది. అప్పుడు వెళ్ళడం కుదరలేదు కానీ, మొన్న నేను, మీ నాన్న అదే దారిలో వెళ్తుంటే చూసి ఇంటికి తీసుకెళ్ళి బొట్టు, జాకెట్టు ముక్క పెట్టి పం పారు. వాళ్ళ ఇల్లు అద్దమే అనుకో. ఏమి శుచీ.. ఏమీ శుభ్రం! చక్కగా సంసారుల్లా బతుకుతున్నారు'' అన్నది.
అది విని హరి, మా అమ్మతో "అమ్మా! సీతమ్మకి ఎప్పుడూ శుభ్రత పిచ్చే. ఇక్కడ వుండగా వాళ్ళ ఇంటికి నువ్వు ఎప్పుడూ వెళ్ళి వుండవు కాబట్టి, నీకు తెలియదు. కిందపడ్డ పాలని కూడా జవురుకోవచ్చు సీతమ్మ వాళ్ళ ఇంట్లో. షో రూములా వుంటుంది'' అన్నాడు.

ఆకాశం ఎర్రటి సోయగాలీనుతోంది. సూర్యుడు బుడిబుడి అడుగులేసుకుంటూ, తూర్పుదిక్కు మెట్లు ఎక్కుతున్నాడు. వంద కిలోమీటర్ల వేగంతో కారు మా టౌన్ మినీ బైపాస్‌రోడ్డుని ఎక్కింది. సూర్యుడిని చూసి వెనుకసీటు నుండి తేనీటి ప్రియురాలయిన మా చిన్నత్త "ఒరేయ్ అబ్బయ్య, కారు ఎక్కడైనా ఆపురా, ఒక చుక్క టీ తాగుదాం'' అన్నది. మా పెదమ్మ "ఎక్కడో ఆపడం ఎందుకు గానీ, నాలుగు నిమిషాలు కూడా పట్టదు. శ్రీధర్ వాళ్ళ ఇంటికి పొయ్యేసొద్దాం పదండి'' అని, నాతో "శ్రీధర్‌కి అమ్మోరు పోసింది నాయనా. మేమందరం విచారింపుకి వెళ్ళేసి వచ్చాం. ఇప్పుడు బాగానే ఉందిలే. వాడి భార్య స్రవంతి నిన్ను కలవరిస్తూ వుంటుంది. ఎట్లాగూ దారే కదా, వాళ్ళ కొతిల్లు నువ్వు చూడను కూడా లేదు. వెళ్ళొద్దాం'' అన్నది.

శ్రీధర్ నాకు మామ వరస. శ్రీధర్ వాళ్ళ నాన్న దువ్వూరు వెంకటరెడ్డి మునసబుగిరి చేశాడు. ఆయనంటే మా ఊర్లో ఆడవాళ్ళకి వణుకు. వాళ్ళ చేలు ఊరికి మొదట్లో ఉండేవి. రోడ్డు మీద పెద్దపెద్ద వడ్లకొట్టాలు ఉండేవి. వెంకట తాత అక్కడ వున్నాడంటే ఊరి ఆడవాళ్ళు ఎంత అక్కరవచ్చినా ఆ దారిలో వెళ్ళేవాళ్ళు కాదట. భలే ఆటోపం మనిషి. ఊరికొచ్చే పెద్దమనుషులు ఎంతటి వాళ్లయినా సరే ఆయన ఇంట్లో చెయ్యి కడగాల్సిందే. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే చాలు ఇంటి నుండి మొదలుపెట్టి చేల గట్ల వరకు శుభ్రం చేయించేవాడట. ఇప్పటికీ ఊర్లో ఎవరైనా అట్లాంటి ఆటోపం చేస్తోంటే "ఏంటి సంగతి? వెంటక రెడ్డి శెకళ్ళు పోతున్నావే'' అంటారు సామెతలాగా.

ఆయన పోతూ పోతూ ఆస్తినంతా కరిగించి పొయ్యాడు. తొమ్మిదెకరాలు మిగిలాయి. తండ్రికి వున్న చెడ్డపేరుతో తల్లిలేని శ్రీధర్‌కి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పిల్లనిచ్చిందే చాలని పేద పిల్లయినా స్రవంతిని ఎదురుపెట్టి చేసుకున్నారు. "ఇప్పుడు పోర్టు పుణ్యమా అని రోడ్డు పక్కన వున్న వాళ్ళ తొమ్మిది ఎకరాలూ కోట్లు పలికి బికారులు కావాల్సిన సమయంలో కోటీశ్వరులైపోయారు. చేలమ్మి టౌన్‌కి వచ్చి ఇల్లు కట్టుకుని సెటిలైపోయారు...'' అని మా పెదమ్మ చె పుతుండగానే శ్రీధర్ వాళ్ళింటికి చేరుకున్నాం. మా కారు శబ్దానికి మేడ దిగి వచ్చారు శ్రీధర్, స్రవంతి. స్రవంతి టీ పెడితే శ్రీధర్ అందరికీ ఇచ్చాడు. ఊర్లోని వాళ్ళ పాత పెద్దమేడ ఈ ఇంటిముందు దిగదుడుపే. అంత ఆర్భాటంగా వుంది.

అదే చెప్పాను శ్రీధర్‌తో. ఆ మాటకి మొహాన్ని దిగులుగా పెట్టి "ఏం బాగో లే..డబ్బు వచ్చింది కదా అని ఆర్భాటంగా ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు డబ్బులిస్తాం అన్నా పనిమనుషులు దొరకడం లేదు. చేసుకోలేక చస్తున్నాం. టౌన్ బాధలు ముందే తెలుసుంటే ఇంత పెద్ద ఇల్లు కట్టకనే పోదుము. అయినా కలికాలం దాపురించిందిలే'' అన్నాడు. శ్రీధర్ మాటలకి నవ్వొచ్చింది. మనసులోనే నవ్వేసుకుని "అది సరే కానీ మావా నీకేదో అనారోగ్యం అన్నది పెదమ్మ. ఇప్పుడు ఎలా వుంది?'' అన్నాను. శ్రీధర్ విచారంగా మొఖంపెట్టి "ఏమి బాగుండడమోలే. అదే మన ఊర్లోనైతే పలానా దువ్వూరు శ్రీధర్‌రెడ్డికి బాగలేదంటే ఊరు ఊరంతా విచారింపుకి వచ్చేది. ఇక్కడ ఎవరికి ఎవరు? పక్కింటి వాళ్ళకి కూడా మనమెవరో తెలియకపోతిమి'' అన్నాడు.

దూరంగా నిలబడి టీ తాగుతున్న హరి "పక్కనుండేది పండు తాత వాళ్ళ అల్లుడు రాజారత్నం డాక్టరే కదన్నా! వాళ్లకి నువ్వెందుకు తెలియదు?'' అన్నాడు. పండుతాత మా ఊరి మాలపెద్ద. శ్రీధర్ వాళ్ళ నాన్నకి బాగా దగ్గరగా ఉండేవాడు. వెంకటరెడ్డి ఆయన్ని పండు మామ అని పిలిచేవాడు. పండు తాత కొడుకు బాగా చదువుకొని ఆర్‌డీఓ అయ్యాడు. కూతుర్ని టీచర్ని చేసి డాక్టర్‌కి ఇచ్చి పెళ్ళి చేసాడు. ఆ అల్లుడే ఈ రాజరత్నం డాక్టరు. ఆయన హస్తవాసి మంచిదని పేదవాళ్ళని బాగా చూస్తాడని పేరు. చాలా సంవత్సరాలు దుబాయ్‌లో వుండి వచ్చి ఆ డబ్బుతో ఈ సంపన్నుల కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు. పండుతాత కొడుకు దగ్గర కొన్ని రోజులు, కూతురి దగ్గర కొన్ని రోజులు ఉంటూ ఉంటాడట. హరి మాట విని శ్రీధర్ విచారంగా పెదవి విరిచి "ఆయనకి టైం ఎక్కడిది రా! ఆయనతో మాట్లాడాలంటే మనకి రోగం రావాలి. దాని పేరుతోనే ఈ మధ్య అప్పుడప్పుడు కలవడం'' అన్నాడు.

మేం టీలు తాగి ఇంక వెళతామని లేచాం. స్రవంతి ఇడ్లీ పెడతా తిని వెళ్ళండంటూ బ్రతిమిలాడింది. మరోసారి వస్తామని చెప్పి కారెక్కాం. ఉదయకాలపు వెండి ఎండలో మా పట్టణం హరి చెప్పినట్టు మినీ మద్రాసులా కనిపించింది. మా గ్రామానికి వెళ్ళే దారి కూడా పూర్తిగా మారిపోయింది. కనుచూపు మేర విశాలమైన నున్నటి నల్లటి రోడ్డు. అవన్నీ విన్నాక మా ఊరు ఎలా ఉండబోతోంది అనే ఆలోచన నా మనసుని పీడించడం మొదలుపెట్టింది. నాకు తెలిసిన మా ఊరు ఎంత బాగుండేదో. ఎండల్లో మంచమేసుకుని పడుకుంటే కనిపించినంత మేరా పచ్చగా పరుచుకుని, ఏవో గాలి పాటలు పాడుకుంటున్నట్లు పరవశంగా తల ఊపేది మా వేపచెట్టు. అప్పుడప్పుడూ చెట్టుకొమ్మల్లో పాకుతూ పసరిక పాములు కనిపించేవి. ఆ పాముల అందం అద్భుతం. అంతటి పచ్చదనం ఎక్కడిదో వాటికి. సన్నగా..నాజూకుగా ఉండేవి. పసరికలు కళ్ళు పొడుస్తాయి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కానీ, అవి ఎవరి కళ్ళనూ పొడవగా ఎవరూ చూడలేదు. రంగు రంగుల నీళ్ళ పాములు పంపు షెడ్లో హాయిగా విశ్రాంతి తీసుకునేవి. వాటిది సప్తవర్ణ సౌందర్యం. జెర్రిగొడ్లు, తాటి బులుగులు, రక్త పెంజెరిలు, చెట్టిరిగిలు... ఎన్నెన్ని పాములో.

నక్షత్రాల నీలి ఆకాశం కింద, సమిష్టి కుటుంబపు జనాభా అంతా నిద్రపోయే వాళ్ళం. ఉదయం కళ్ళు తెరిచేసరికి పెద్దవాళ్ళ మంచాలన్నీ మాయమై ఉండేవి. పచ్చటి కళ్ళాపి వాకిలి కళ్ళ ముందట పరుచుకుని కనిపించేది. ఎంత పెద్ద వాకిలో! ఎంత చాకి రీయో! యెర్రని సూర్యుడితో పాటు ఆకలి పాటలయ్యే పక్షుల్లా, మంచినీళ్ళకోసం మా బావికి బారులు తీరి వచ్చేవాళ్ళు మనుషులు. జీవనదిలాటి మా బావి ఇప్పుడు ఎండి పోయింది. సంవత్సరాల తరబడి దాహపు గొంతులను ఊరడించిన మా ఇల్లు, నీళ్ళ డబ్బాకోసం మోర ఎత్తిన లేగదూడలా పట్టణం దిక్కుకు చూస్తూ ఉంటుంది. రొయ్యల పంట మాకు ఇచ్చి వెళ్ళిన బహుమతి అది.

తంపటి గణుసు గడ్డలు ఎంత తియ్యగా ఉండేవో. ఇంటి దగ్గరి కూరగాయల తోట ఎంత బాగుండేదో. మొక్కజొన్నలకి ఎన్ని గిచ్చుళ్ళో .యెర్రటి మిరపతోటలో విరబూసిన బంతులది బలే సౌందర్యం. తోపు చిలుకలదా, తాటి చెట్లదా అనిపించే గుడి పక్కని చిలుకలగూళ్ళ తాటితోపు. గుడి ఆవరణ అంతా పరుచుకుని వేల పక్షులకు ఇల్లునిచ్చే మర్రిచెట్టు. సందేళ బర్రె వాహనంపై ఇంటికి వచ్చే స్నేహితుడు సురేంద్ర హసితపు మోము మనసుమీద ముద్ర కొట్టినట్టు జ్ఞాపకం. ఆసుపత్రి దగ్గర పెంచలమ్మ ఇంటి ముందర తెల్లటి నురుగుతో కళ కళలాడుతూ వుండే నల్లటి కల్లు కుండ. ఎర్రెర్రని ఎండల్లో తాటిచెట్ల కింద గుంపు కూడి చలచల్లని కల్లు తాగే మా ఊరి మగవాళ్ళు.

గొంతు మొయ్య తాగి మా ఇంటికొచ్చి నేలపై కొంగు పరిచి పడుకుని, ఊరందరి మీదా చాడీలు చెప్పే పల్లోళ్ళ బుజ్జమ్మ. ఆసక్తిగా ఆ చాడీలు వినే మా ఇంటి ఆడవాళ్ళు. తేలు కుట్టి కుయ్యోమంటూ మా తాత మందుకోసం ఇంటికి వచ్చే మనుషులు. మా ఆటల మట్టి గోర్లు కత్తిరించి బీడీలో కూర్చి వాళ్ళ చేత తాగించే మా తాత బ్రహ్మాండ విచిత్ర వైద్యం. పాచి పళ్ళతో పండుగ నెల ప్రసాదం కోసం గుడి దగ్గర లైనులో నిలబడుకోవడం... హరి వాళ్ళ నాన్న చెప్పిన "దొల్లు దొల్లు పుచ్చకాయ్ దొల్లితే రెండొక్కలు'' కథలు... స్వేచ్ఛగా ఆడిన కోతి కొమ్మచ్చి ఆటలు..నా మనసులో నిలిచి ఆగిపోయిన రంగు రంగుల మా ఊరిచిత్రం ఇప్పుడు చెదిరిపొయ్యింది. గెలిచినవే నిలిచాయి అందుకని ఇప్పుడు నేను దిగులుపడాలా? ఏమో!! అసలు అప్పటి మా ఊరు నాకు మాత్రమే అంత ఆనందాన్ని కలిగించిందేమో. హరికి, సీతమ్మకి అంత గొప్ప ఆనందాన్ని ఎప్పుడూ ఇవ్వనేలేదేమో. హరిని అడగాలి.

అయినా నేను చిన్నప్పటి నేనుగానే ఆగిపోయానా? లేదు కదా! ఉన్నత సౌకర్యాలను వెతుక్కుంటూ, మరిం త మెరుగైన జీవితం కోసం ఎక్కడికో ఎగిరిపోయాను. నా ఊరు మాత్రం పాతకాలంలోనే ఎందుకు ఆగిపోవా లి? ఏమిటీ నాస్టాల్జియా? ఆలోచిస్తూ వేగంగా వెనక్కి వెళ్లిపోతున్న దారి పక్కని చెట్లని చూస్తూ కూర్చున్నాను.
కబడ్డీ ఛాంపియన్
"నీవు విడాకులు కోరడం ఆశ్చర్యంగా ఉంది. మీ ఆయన అందగాడు, మంచివాడు, పైగా కబడ్డీ ఛాంపియన్ కూడానూ ...'' ఆశ్చర్యపోయింది లాయర్ సుహాసిని.
"అదే ప్రాబ్లం ... నన్ను చేత్తో అలా 'టచ్' చేసి పారిపోతున్నాడు మరి'' బోరుమంది అలివేలు.

డిష్యుం నీకు, విషయం నాకు
"సార్, మీ శ్రీమతిగారు ఫోన్ చేశారండి'' రిసీవర్ ఎత్తిన సెక్రటరీ వినమ్రంగా అన్నాడు.
"అయితే, మూడు నిమిషాలు అలాగే పట్టుకొని ఉండు'' చెప్పేడు బాస్.
"ఎందుకు సార్?'' ఆశ్చర్యపోయాడు సెక్రటరీ.
"ఆవిడ మూడు నిమిషాల పాటు ఏకధాటిగా తిట్టిగానీ అసలు విషయం లోకి రాదు '' చెప్పాడు బాస్.

తమ్ముడు తమ్ముడే - పేకాట పేకాటే
"మామూలు తాళంతో పాటు కాంబినేషన్ లాక్ కూడా ఉన్న ఆ బీరువాని ఎలా తెరవగలిగావు?'' ఆశ్చర్యంగా అడిగాడు జడ్జి జరాసంధరావు.
"మామూలుగా అలాంటి కిటుకు చెప్పడానికి వెయ్యి రూపాయల ఫీజు తీసుకుంటాను బాబయ్యా'' నసుగుతూ చెప్పాడు ముద్దాయి మునిసుందరం.

కన్నును బట్టి దానం
"పుట్ట గుడ్డివాణ్ని బాబయ్యా ... పది రూపాయలు ధర్మం చేయండి'' కర్రని తాటిస్తూ అరిచాడు బిచ్చగాడు.
"పచ్చి అబద్ధం ... నీకు ఒక కన్ను బాగానే కనిపిస్తోంది'' చెప్పాడు పాపారావు.
"ఐతే, 5 రూపాయలు ధర్మం చెయ్యండి బాబయ్యా'' చేతిలోని చిల్లర డబ్బాని గలగలలాడిస్తూ అరిచాడు బిచ్చగాడు.

ఆ మాటకొస్తే అమ్మాయే తెలివైంది
"ఈ రోజుల్లో కాణీ కట్నం లేకుండా అమ్మాయి పెళ్లి చేయడం అంటే మామూలు విషయమా వదినా? ఏదైతేం, అన్నయ్యగారు భలే సంబంధం తెచ్చారు'' మెచ్చుకోలుగా అంది ఎదురింటి కామాక్షమ్మ.
"సర్లే సంబడం, ఆయనకంత తెలివి కూడానా? మా అమ్మాయే వెతుక్కుంది సంబంధం'' నిట్టూరుస్తూ అంది అలివేలమ్మ.
బొమ్మలు: ఎన్.రాజశేఖర్‌రెడ్డి

వంట


పర్‌ఫెక్ట్ ఫ్రైడ్ రైస్


వెజిటెబుల్స్‌తో
కావలసిన పదార్థాలు:

బాస్మతి రైస్ - 3కప్పులు,
ఉల్లికాడ తరుగు - అర కప్పు, (సన్నగా, పొడుగ్గా తరిగిన)
క్యాప్సికం - 1,
(రెండు నిమిషాలు ఉడికించిన) బీన్స్, క్యారెట్, క్యాబేజ్ తరుగు - 2 కప్పులు,
వెనిగర్ - ముప్పావు టేబుల్ స్పూను,
మిరియాలపొడి - పావు టీ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.

తయారుచేసే విధానం:నూనెలో ఉల్లికాడ తరుగు దోరగా వేగించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిమిషాలు వేగించాలి.
ఉప్పు, మిరియాలపొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు సోయా సాస్ వేసి (హై ఫ్లేమ్‌లో) బాగా కలిపి, తర్వాత సర్వ్ చేయాలి.

మష్రూమ్స్‌తో
కావలసిన పదార్థాలు:
మష్రూమ్స్ - 100 గ్రా.,
బాస్మతి రైస్ - 2 కప్పులు,
ఆలివ్ నూనె - 2 టీ స్పూన్లు,
అల్లం - అంగుళం ముక్క,
వెల్లుల్లి - 3 రేకలు,
క్యాప్సికం - సగం ముక్క,
ఉల్లిపాయ - 1,
(లైట్) సోయాసాస్ - 2 టీ స్పూన్లు,
వెనిగర్ - 1 టీ స్పూను,
మిరియాలపొడి -పావు టీ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేసే విధానం:

క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, మష్రూమ్స్ సన్నగా తరగాలి. నూనెలో అల్లం, వెల్లుల్లి, ఉల్లి తరుగు వేసి 2 నిమిషాలు తర్వాత క్యాప్సికం, మష్రూమ్స్ తరుగు కలిపి మెత్తబడేవరకూ వేగించాలి. ఇప్పుడు ఉప్పు, సోయాసాస్, వెనిగర్ కలిపి ఇంకో నిమిషం పాటు వేగించాలి. తర్వాత అన్నం కలిపి (పెద్దమంటపై) 2 నిమిషాలు కలపాలి. మిరియాలపొడి వేసి మరోసారి కలిపి వేడి వేడిగా తినాలి. గోబి మంచూరియాతో మంచి కాంబినేషన్.

ఎగ్స్‌తో(సింపుల్‌గా)
కావలసిన పదార్థాలు:
గుడ్లు - 3,
ఉల్లిపాయ - 1,
ఉప్పు - రుచికి తగినంత,
మిరియాల పొడి - పావు టీ స్పూను,
పచ్చిమిర్చి - 1,
ఉల్లికాడల తరుగు - గుప్పెడు,
నూనె - 1 టీ స్పూను.

తయారుచేసే విధానం:

ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, (కొద్దిగా) మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టాలి.
సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో దోరగా వేగాక ఉల్లికాడ, పచ్చిమిర్చి తరుగు (పెద్దమంటపై) గుడ్ల మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించి, మిగిలిన మిరియాలపొడి చల్లాలి.
ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి వేడి వేడిగా తినాలి.

అందరికీ స్నేహితుడైనవాడు ఎవరికీ స్నేహితుడు కాలేడు.


తల్లిదండ్రుల మీదే ఆ బాధ్యత...

గృహస్థ జీవితంలో భార్య, భర్త దంపతులుగా జీవిస్తారు. వారు జీవిత భాగస్వాములుగా, వారి ఇద్దరి జీవితాలను కలిపి ఒకటిగా భావిస్తారు. అదేవిధంగా వారి జీవితాలను వారు చెరి సగంగా పంచుకోవలసినవారే. కనుక హక్కులు, బాధ్యతల విషయంలో కూడ, ఈ భాగస్వామ్యత ఉంటుంది. అలా ఉంటేనే వారు ఆదర్శదంపతులవుతారు.

అలాగే, సామాజిక జీవితంలోనూ వారు భాగస్వాములే. వారు పౌర బాధ్యతలు, హక్కులను కలిగి ఉండాలి. సామాజిక ఆచారాలు, కట్టుబాట్లు, సర్కారు శాసనాలను అనుసరించడం... వంటివాటిని విధిగా భావించాలి. ఎందుకంటే వీటిని పాటించడమన్నది పౌరబాధ్యతలలో అతి ముఖ్యమైన అంశం.

సంతానం విషయంలో వారసత్వ ఆధారితంగా పౌరహక్కులు పరోక్ష రీతిలో ఉన్నప్పటికీ, వారి భవిష్యత్తు, రక్షణతో కూడిన శ్రద్ధాపూర్వక బాధ్యతలే ముఖ్యం. మంచిపౌరులుగా వారిని తయారుచేయడమే కాక, వారి జీవితాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. 
ఆ విషయంలో తమ వ్యక్తిగత కోరికలు, ఆశలు, అంచనాలు, ఊహలతో కాకుండా, పిల్లల మానసిక, సహజ అవగాహనతో, వారి విద్యాబుద్ధుల విషయంలో, తల్లిదండ్రులు తమ బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. 

జీవితాలు పిల్లలవే అయినప్పుడు వారి భవిష్యత్తుకు సంబంధించి తల్లిదండ్రుల కోరికలు, ఆశలకు మాత్రమే ప్రాధాన్యత వహించరాదు. ఆ మేరకు, పిల్లల వ్యక్తిగతాన్ని, వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు అంచనా వేయగలగాలి. వారి భావిజీవితానికి అది వరంగా అన్వయం కావాలి.

సాధారణంగా పౌరధర్మానికి బాధ్యతతోపాటు వ్యక్తిత్వ ఉన్నతి అవసరం. మానసిక బానిసత్వాన్ని, అలసత్వాన్నే స్వేచ్ఛగా భ్రమపడరాదు. తగిన క్రమశిక్షణతోనే స్వేచ్ఛకు విలువ ఉంటుంది. భౌతికం, ఆధ్యాత్మికం, వేదాంతం... వీటితో పాటు శాస్త్ర సంబంధమైన మనసుకు... మూఢత్వం, మూర్ఖత్వం వంటివి కలిగే అవకాశం ఉండరాదు. విచక్షణాయుత, ఆలోచనకు అవకాశం ఉండాలి. అయినా ఆత్మవిశ్వాసం అదుపు తప్పితే అది అహంకార వృద్ధికి అవకాశాన్నిస్తుంది. 

ఆత్మపరిశీలన నశిస్తుంది. అజ్ఞాన విముక్తే స్వేచ్ఛ. జ్ఞానమే మోక్షం. ఆ మేరకు తల్లిదండ్రులు ప్రేరితులు కావాలి. వ్యక్తిగత ఆలోచనలకు, వ్యక్తిత్వ వికాసానికి వారికి వారుగా తెలుసుకునే అవకాశం పిల్లలకు ఉండాలి.

దేనినైనా ప్రశ్నించినప్పుడు దానికి కావలసిన సమాధానాన్ని, సమాచారాన్ని పొందగలగాలి. అలాగే సమస్యను ఆహ్వానించి, దానికి తగిన పరిష్కారాన్ని సాధించగలిగిన సమర్థత, స్వేచ్ఛ, మనసుకు కలిగేలా చేయాలి. స్వీకరణ, తిరస్కారం ఏదైనా ఏకపక్షం కారాదు. జ్ఞానప్రస్థాన దిశగా మానవ మనసు సాధన మార్గంలో పయనించాలి.
ఇందుకు బాల్యాన్ని ప్రాథమికదశగా తీసుకుని, పిల్లలను ఉత్తమ మార్గాన నడిపించగల సమర్థత, జవాబుదారీతనం తల్లిదండ్రులు స్వీకరించి నెరవేర్చాలి.
- శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి

ఔదార్యమంటే మనం ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం! అవసరమైన దానికన్నా తక్కువ తీసుకోవడం హుందాతనం!


జయసుధ---సినీనటి,పొలిటికల్ లీడర్‌....

దేవుని జననం, దేవుని మరణం, దేవుని పునరుజ్జీవనం.. అన్నీ మనిషి కోసమే! మనిషిని సన్మార్గంలో పెట్టేందుకు ఆయన జన్మించాడు. పాప ప్రక్షాళనకు రక్తాన్ని చిందిస్తూ మరణించాడు. మనిషికి తన తండ్రి రాజ్యంలో చోటిచ్చేందుకు పునరుజ్జీవించాడు. మనిషి కోసం దేవుడు ఇన్ని చేస్తే.. సాటి మనిషికి మనం ఏమీ చేయలేమా? కనీసం ఇంత ప్రేమను, ఇంత ఆప్యాయతను పంచలేమా? జయసుధలో ఏ ఒక్కరోజులోనో కలిగిన భావాలు కావివి. ఏ ఒక్కరోజులోనో ఆమెను భ క్తిపరురాలిగా మార్చిన ఆలోచనలు కావివి. ఒకానొక సంఘటనలోని... ఆ చివరి క్షణాలలో.. జీసస్ పెట్టిన ప్రాణభిక్షతో బయటపడి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు తలెత్తిన ప్రశ్నలు! సినీనటిగా, పొలిటికల్ లీడర్‌గా జయసుధలో కనిపించే వివిధ కోణాలకు ఇదొక ‘అదర్‌సైడ్’


ఇప్పటికీ స్టైల్ అన్నా గ్లామర్ అన్నా మీరు కళ్లముందు మెదులుతారు. మొదట్నుంచీ ఇలాగే ఉండేవారా?
జయసుధ: అస్సలు లేదు. చిన్నప్పుడు అబ్బాయిల్లాగే తయారై తిరుగుతుండేదాన్ని. షర్ట్స్, ట్రౌజర్స్, జీన్స్ వేసుకుని సైకిల్ మీద చక్కర్లు కొట్టేదాన్ని. నాకంటే చిన్నవాళ్లైన ఓ పదిమందిని వెంటబెట్టుకుని తిరగడం, వాళ్లందరినీ తీసుకుని క్రికెట్ చూడ్డానికి స్టేడియమ్‌కి వెళ్లిపోవడం... ఇదీ వరస!


ఆడపిల్లకుండే రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదా...?
జయసుధ: నాన్న తరఫువారంతా బ్రహ్మసమాజానికి చెందినవారు. దాంతో మా ఇంటి వాతావరణం చాలా భిన్నంగా ఉండేది. ఆడపిల్లలిలా ఉండాలి, మగపిల్లలు ఏవైనా చేయొచ్చు లాంటి మాటలు నేనేనాడూ వినలేదు.


అసలు నటి కావాలని ఎందుకనుకున్నారు?
జయసుధ: మా ఆంటీ విజయనిర్మలతో షూటింగులకు వెళ్తూండటంతో, పదకొండేళ్లు వచ్చేసరికి సినిమాల్లో నటించాలన్న కోరిక బలపడింది నాకు. నా ఆసక్తిని గమనించిన ఆంటీ నా పన్నెండో యేట ‘పండంటి కాపురం’లో అవకాశం ఇచ్చారు. అయితే అది అటు చైల్డ్ ఆర్టిస్టుగానూ ఇటు హీరోయిన్‌గానూ చేయలేని వయసు. దాంతో కెరీర్ కాస్త స్లోగా ఉండింది. లక్ష్మణరేఖ, జ్యోతి సినిమాల తర్వాత ఊహించనంత బిజీ అయిపోయాను.


అప్పట్లో నటీనటుల మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉండేది?
జయసుధ: నేను ఇండస్ట్రీకి వచ్చేసరికే రామారావు గారు, నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్లు. వాళ్లకీ నాకూ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఎన్టీయార్‌గారు మా నాన్నకంటే పెద్దవారు. దాంతో వారంటే గౌరవం, భయం, భక్తి ఉండేవి. అందుకే వాళ్లకీ మాకూ మధ్య కాస్త దూరం ఉండేది. అయితే నేను కాస్త అల్లరిపిల్లని కావడంతో అందరితోనూ కల్పించుకుని మాట్లాడేసేదాన్ని. 


శోభన్‌బాబు, నేను చాలా సినిమాలు చేశాం కాబట్టి వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకునేంత చనువు ఉండేది మా మధ్య. కృష్ణగారితో చేయడానికి మాత్రం కాస్త ఇబ్బంది పడేదాన్ని. ఆయన మా ఆంటీ భర్త కదా... ఆ మొహమాటంతో క్లోజ్ అవ్వలేకపోయేదాన్ని. కమల్ హాసన్ టైమొచ్చేసరికి అందరం ఒకే ఈడువాళ్లం కాబట్టి సరదాగా గడిపేవాళ్లం. టీమ్ అంతా కలసి సినిమాలకు కూడా వెళ్లేవాళ్లం. ఇక హీరోయిన్లంటారా... ఒక హీరోయిన్ మరో హీరోయిన్‌తో పర్సనల్ విషయాలు చెప్పుకోవడమన్నది చాలా తక్కువ. 


హీరోయిన్ల మధ్య పోటీ ఉండేదా?
జయసుధ: అప్పట్లో ఈ పోటీలు, నంబర్ గేములు లేవండీ. ఓ బీద అమ్మాయి పాత్ర చేయాలంటే జయసుధే చేయాలి. అంతే తప్ప సడెన్‌గా ఆ పాత్రను జయప్రదకి ఇవ్వరు. ఎందుకంటే తను రిచ్‌గా కనిపిస్తుంది! పేదదానిగా సూటవదు. అందుకే తనూ ఆ చాన్స్ కోసం ప్రయత్నించదు. అలాగే శ్రీదేవి కూడా. వాళ్లకు తగ్గ పాత్రలు వాళ్లకుండేవి. నా పాత్రలు నాకుండేవి.


ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారన్న మాట నిజమేనంటారా?
జయసుధ: ఎక్కడైనా ఆడది అనగానే చిన్నచూపు చూస్తారు. ఇండస్ట్రీలో అయితే అమ్మాయి గౌరవం తన తల్లిదండ్రుల్ని బట్టి కూడా ఉంటుంది. పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి బాలేక, ఎలాగైనా డబ్బులు సంపాదించి వాళ్లకి సాయపడాలని వచ్చే అమ్మాయిలు ఉంటారు. వాళ్లలో ఒకరో ఇద్దరో తప్ప 99 శాతం మంది పెద్ద హీరోయిన్లు అవ్వరు. ఇదంతా ఓ గేమ్. ఎంత తెలివిగా నెట్టుకు రాగలం అన్నదానిమీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కుటుంబం కోసం త్యాగం చేయాల్సి రావచ్చు. 

కానీ ఆ త్యాగం మరీ ఎక్కువైతే ఆ అమ్మాయి జీవితం రెడ్‌లైట్ ఏరియాలో ముగిసిపోతుంది. అయితే జస్ట్ బికాజ్ యు స్లీప్ విత్ సమ్‌బడీ, నువ్వు హీరోయిన్ అయిపోతావు అంటే అది కరెక్ట్ కాదు. టాలెంట్ ఉండాలి. దానితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే తప్పకుండా ఎదుగుతాం. చాలామంది హీరోయిన్స్ అందరితోనూ నవ్వుతూ మాట్లాడతారు. క్లోజ్‌గా మూవ్ అవుతారు. అంతమాత్రాన వాళ్లది లూజ్ క్యారెక్టర్ అనడానికి వీల్లేదు. ఎంత చనువుగా ఉన్నా గీత దాటకుండా జాగ్రత్తపడేవారు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీలో. 


మరి వివక్ష సంగతి...?
జయసుధ: అదీ ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా హీరోకే వెళ్లిపోతుంది. అదెలా? హీరో వల్లే సినిమా ఆడదు కదా! ఆ విజయంలో హీరోయిన్‌కీ భాగముంటుంది కదా! నిజానికి ఈ వివక్ష ప్రపంచమంతా ఉందేమో! ఆస్కార్ అవార్డుల్ని చూసినప్పుడు కూడా ఆడవాళ్లకు కాస్త తక్కువ ప్రాముఖ్యతనిచ్చారేమోఅనిపిస్తూంటుంది నాకు. మన విషయానికొస్తే దక్షిణాది కంటే ఉత్తరాదిన హీరోయిన్లకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత, గౌరవం లభిస్తున్నాయని చెప్పొచ్చు.


ఈ వివక్షలు, సమస్యలు చూశాక ఎందుకివన్నీ, ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదాం అని ఎప్పుడైనా అనుకున్నారా?
జయసుధ: వాటి వల్ల కాదు కానీ నటించడం మొదలుపెట్టిన మూడేళ్లకే నాకు సినిమాల మీద ఆసక్తి పోయింది. కొన్ని పాటలు, సన్నివేశాలు చేయడానికి ఇబ్బందిగా అనిపించేది. అలాగే, అవతల ఎవరున్నా గలగలా మాట్లాడేసేదాన్ని. దాంతో పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదనుకునేవారు. పైగా పెద్దవాళ్లని ఒకలా, చిన్నవాళ్లని ఒకలా చూసేవారు. నైట్ షిఫ్టులంటే కూడా విసుగొచ్చేది. కాకపోతే సినిమాలు మానేస్తే మళ్లీ చదువుకోవాలి. నాకేమో చదువు నచ్చదు. 

అందుకే కంటిన్యూ అయ్యాను. అయినా పెళ్లయ్యాక సినిమాలు మానాలనుకున్నాను. అదీ చేయలా. పెదబాబు పుట్టాక మానేద్దామనుకున్నా. అప్పుడూ లేదు. చిన్నోడు పుట్టాక మానేస్తానన్నాను. అదీ జరగలేదు. ఓసారి రామారావుగారు- ‘మానేసి ఏం చేస్తావ్? అలా అస్తమానం మానేస్తాను అనకూడదు. నువ్వలా అంటావు కానీ జీవితాంతం నటిస్తూనే ఉంటావు చూడు’ అన్నారు. ఆయనఅన్నట్టే జరిగింది. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను.


అవార్డులకు ఎంత విలువిస్తారు?
జయసుధ: అవార్డులొస్తేనే గొప్ప అని కాదు గానీ, ప్రతిభకు గుర్తింపు అవసరం కదా! నేనైతే చాలా అవార్డులు అందుకున్నాను. అంబేద్కర్ యూనివర్శిటీ వాళ్లు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. మీకు పద్మశ్రీ ఇవ్వలేదేంటి అని ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. నిజానికి నాకంటే ముందు ఇంకొందరికి ఇవ్వాలి. వాణిశ్రీ గారికి ఇంతవరకూ ఇవ్వలేదు. దాసరి నారాయణరావుగారికైతే పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు ఏదైనా ఇవ్వాలి. ఓ మహిళ యాభై సినిమాలు డెరైక్ట్ చేయడం మామూలు విషయం కాదు కాబట్టి విజయ నిర్మలగారికి కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ఓసారి ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది.


అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులేమిటి?
జయసుధ: ఇప్పటి సినిమాలు టెక్నికల్‌గా బాగుంటున్నాయి. మా కాలంలో కూడా ఉన్న ఎక్విప్‌మెంట్‌తోనే మంచి సినిమాలు చేసినవాళ్లు ఉన్నారు. అయితే కథకే ప్రాధాన్యత! ‘కలియుగ స్త్రీ’ సినిమా తీసుకోండి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రాస్టిట్యూట్ అవుతుంది. 

దానివల్ల ఆమె బిడ్డ అవకరాలతో పుడతాడు. వాణ్ని పైకి తీసుకురావడానికి ఆమె పడే తపనను అద్భుతంగా చూపించారు. అలాంటి సినిమాలు ఇప్పుడెవరు తీస్తున్నారు? ఎంతసేపూ ఇద్దరు హీరోయిన్లు, ప్రేమ, రొమాన్స్. ‘ఇది కథ కాదు’లో ఒక హీరోయిన్, ఆమెను ప్రేమించే ముగ్గురు హీరోలు. ‘ఓ భార్య కథ’లో అయితే హీరో తన భార్యను వేరెవరికో అద్దెకిస్తాడు. ఎంత బోల్డ్‌గా తీశారు! ఇలాంటివిపు్పుడు తీయరు, తీయలేరు. అంత గట్స్ ఎవరికీ లేవు. 


ఫ్యాన్స్ టేస్ట్ మారిందంటున్నారు కదా?
జయసుధ: మంచి సినిమా తీస్తే ఫ్యాన్స్ ఎందుకు చూడరండీ. మహేశ్‌బాబుని ‘అతడు’లో ఇష్టపడ్డారని ఆ తర్వాతి సినిమాల్లోనూ అలాగే చూపించారు. వేరేలా చూపిస్తే జనం చూడరని ఫిక్సైపోయారు. కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్‌వి తీయొచ్చు కదా! ‘బొమ్మరిల్లు’ వ చ్చింది. చిన్న మెసేజ్ ఇచ్చారు కదా! అలాగే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మంచి చెప్పడానికి ఎందుకు ప్రయత్నించకూడదు! ఇంకో విషయం ఏమిటంటే ఫ్యాన్స్‌కి ఇంపార్టెన్స్ కేవలం సినిమా విషయంలోనే ఇస్తామా! ఒకప్పుడు మేము ఫ్యాన్స్‌ని బాగా రిసీవ్ చేసుకునేవాళ్లం. 

ఇప్పుడసలు వాళ్లని దగ్గరకు రానిస్తున్నారా? సెక్యూరిటీ ప్రాబ్లెమ్ అంటారు. ఒకప్పుడు మేము చెట్ల కింద, గుట్టల వెనుక బట్టలు మార్చుకున్న రోజులున్నాయి. అప్పుడేం సెక్యూరిటీ ఉంది! కేవలం పోలీసులే ఉండేవారు. అలాగే హీరోయిన్ పాత్రలు. నేను చేసిన రెండు వందలకు పైగా సినిమాల్లో వంద సినిమాల వరకూ హీరోయిన్ ఓరియెంటెడే. ఇప్పుడసలు హీరోయిన్‌కి నటనకు ఆస్కారముంటోందా!


మీది సక్సెస్‌ఫుల్ మ్యారీడ్ లైఫ్. ఈ సక్సెస్‌లో మీ పార్ట్ ఎంత?
జయసుధ: మా ఇద్దరిదీ సమానమే. నా వరకు నేను నా పని చేసుకుంటూ పోతాను. మా ఆయనేం చేస్తున్నారని ఎంక్వయిరీ చేయను. ఒకరిపై ఒకరికి నమ్మకముండాలి. అర్థం చేసుకోవాలి. అలాగే సహనం కూడా చాలా అవసరం. ఇక ప్రేమ. అది లేకపోతే కాపురం చేయడం కష్టం. ఒక్కమాటైనా మాట్లాడుకోకుండా వేర్వేరు గదుల్లో పడుకునే భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. అలా ఎలా ఉండగలరో అని ఆశ్చర్యమేస్తుంది నాకు. 


ఓ పక్క నటిస్తూనే... భార్యగా, తల్లిగా బాధ్యతల్ని ఎలా నిర్వర్తించగలిగారు ?
జయసుధ: చాలా కష్టమయ్యేది. నేను షూటింగులకు వెళ్లిపోతే అమ్మ, మా వారు పిల్లల్ని చూసుకునేవారు. పిల్లల పట్ల నాకు చాలా కలలున్నాయి కానీ వాటిని సాకారం చేసుకునే సమయం లేకుండా పోయింది. పెద్దవాడు నీహార్‌ని డాక్టర్‌ని, చిన్నవాడు శ్రేయన్‌ని క్రికెటర్‌ని చేయాలనుకున్నాను. కానీ నేను బిజీగా ఉండటం వల్ల వాళ్ల మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ఇద్దరూ బాగానే చదువుకున్నారు కానీ నాకిష్టమైనవి చేయించలేకపోయానని ఫీలవుతుంటాను. 


కూతురు ఉండివుంటే, మీలా హీరోయిన్‌ని చేసేవారా?
జయసుధ: కాదు... టెన్నిస్ ప్లేయర్‌ని చేసి ఉండేదాన్ని. నాకు చిన్నప్పట్నుంచీ స్పోర్ట్స్ అంటే మహా పిచ్చి. నేనెలాగూ అటు వెళ్లలేకపోయాను కాబట్టి నా కూతుర్ని కచ్చితంగా ప్లేయర్‌ని చేసివుండేదాన్ని. 


మీకిప్పటికీ తెలుగు రాయడం రాదంటారు. నిజమేనా? మీరంతా ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారు? 
జయసుధ: ఇంగ్లిష్, తెలుగు... రెండూ మాట్లాడతాం. మావారు నార్త్ ఇండియన్ కాబట్టి ఆయనకు తెలుగు రాదు. నాకు, పిల్లలకి మాట్లాడటం వచ్చు కానీ రాయడం రాదు. నేను నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ రాలేదు. (నవ్వుతూ) మా వాళ్లంటూంటారు... నా తెలుగు అక్షరాలు విరిగిపోయిన జిలేబీ ముక్కల్లా ఉంటాయని!


నటిగా సక్సెస్ అయ్యారు. భార్యగా, తల్లిగా సక్సెస్ అయ్యారు. మరి రాజకీయ నాయకురాలిగా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నారా? 
జయసుధ: లేదు. ఇక్కడ అనుకున్నది చేయడం అంత తేలిక కాదని తెలుసుకున్నాను. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఎంత ఘోరం జరిగింది! ఒక అమాయకురాలు బలయ్యింది. దానికెవర్ని బాధ్యుల్ని చేయాలి! ఎందుకు మనం అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతున్నాం! కచ్చితంగా ఇది మన వైఫల్యమే. ఒక్కసారి వైన్ షాపుల ముందు చూడండి... ఎంత పెద్ద క్యూ ఉంటుందో! షాపును దాటి రోడ్డు మీదకు వచ్చేస్తున్నారు. 

నడిరోడ్డు మీద నిలబడి తాగుతుంటారు. పోలీసులకు చెప్తే, అప్పటికప్పుడు వాళ్లను చెదరగొడతారు. మర్నాడు మళ్లీ మామూలే. ఎవరో సినీ నటుడు డ్రగ్స్‌తో దొరుకుతాడు. అంతే, పొద్దుట్నుంచి సాయంత్రం వరకూ టీవీలో అదే చూపిస్తారు. కానీ చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ అమ్ముతున్నారు. వాళ్ల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా! ఆ పిల్లల జీవితాలను బాగుచేయడానికి ప్రయత్నిస్తున్నారా! ఈ ట్రాఫికింగ్‌ని ఆపాల్సిన బాధ్యత మనకు లేదా! 


మరి ఒక పొలిటీషియన్‌గా దీనికి మీరేం చేస్తున్నారు? 
జయసుధ: ఇది ఏ ఒక్కరో చేసేది కాదు. మన సమాజంలో ఉన్న సమస్యలన్నీ పేదరికం వల్లనే. దాన్ని పూర్తిగా నిర్మూలించగలిగినప్పుడు సమస్యలన్నీ పోతాయి. అలా జరగా లంటే వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలి. నా వరకూ నేను ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలనుకుంటున్నాను. ముందు ముందు మరిన్ని చేయాలని ఉంది. ఇవి రాజకీయ నాయకురాలిగా కాదు, ఈ సమాజంలోని వ్యక్తిగా చేస్తాను. నేను ఏం చేస్తానన్నా మావారి సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. 


మీరు క్రిస్టియానిటీ తీసుకుంటానన్నప్పుడు కూడా మీ వారు సపోర్‌‌ట చేశారా? ఆయన రియాక్షన్ ఏమిటి? 
జయసుధ: మా దేవుడి గదిలో అందరు దేవుళ్లూ ఉన్నారు. క్రిస్టియానిటీ తీసుకుంటాను అన్నప్పుడు - ‘అందరిలాగే ఆయన్నీ (యేసుక్రీస్తుని) పూజించు, మొత్తానికే పూర్తిగా మారిపోవడం ఎందుకు’ అన్నారు మావారు. ఆ తర్వాత ఎవరో జోస్యం చెప్పేవాళ్లనూ అడిగారట మా ఆవిడ ఇలా మారిపోతోందేంటి అని. వాళ్లు చెప్పారట- ‘తను ఆయన మనిషి, ఆయన దగ్గరకు వెళ్లనివ్వండి’ అని. ఇక అడ్డు చెప్పలేదు. పిల్లలు కూడా నా అభిప్రాయాన్ని గౌరవించారు. 


క్రైస్తవురాలిగా మారాలని మీకు ఎందుకనిపించింది? 
జయసుధ: ఎందుకో జీసస్ అంటే మొదట్నుంచీ ఇష్టం. చిన్నప్పుడు కొన్నాళ్లు క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. కానీ అప్పుడు క్రీస్తు గురించి నాకేమీ తెలియదు. సినిమాల్లోకి వచ్చాక ఆస్తమాతో షూటింగులకు వెళ్లడం కష్టమయ్యేది. దాంతో నాగపట్నం వెళ్తే సమస్య తీరిపోతుందని ఒకరు చెప్తే వెళ్లాను. నిజంగానే నా సమస్య పోయింది. అలాగే 1985లో బ్యాంకాక్ వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాను. 

ఈత రాకపోవడంతో నా పని అయిపోయిందనుకున్నాను. ఎప్పుడూ సాయిబాబాను తలచుకునే నేను... ఆ విపత్కర క్షణాల్లో... తెలియకుండానే యేసుక్రీస్తును తలచుకున్నాను. వెంటనే నీటిలో యేసుక్రీస్తు ముఖం కనిపించింది. ఆ తర్వాత ఏం మహిమ జరిగిందో తెలియదు. నేను ఒడ్డున పడ్డాను. కాదు, క్రీస్తే నన్ను రక్షించారనిపించింది. అప్పుడే నేను దేవుడితో చెప్పాను- యాభయ్యేళ్లు వచ్చాక నీ మార్గంలోకి వచ్చేస్తాను అని. అయితే 42 యేళ్లకే ఆయన మనిషిగా మారిపోయాను. బాప్టిజం తీసుకున్నాను. 


మిమ్మల్ని చూసి మీ వాళ్లెవరూ మారలేదా? 
జయసుధ: మతం అనేది నమ్మకం. ఎవరికే మతం ఇష్టమైతే దాన్ని నమ్ముతారు. నేను క్రిస్టియానిటీ తీసుకున్నాను కాబట్టి అందరినీ తీసుకొమ్మని చెప్పకూడదు కదా! నేను జీసస్‌ని విశ్వసిస్తున్నాను. మా అమ్మ సాయిబాబాను నమ్ముతుంది. మా అబ్బాయి వేరే గుడులకెళ్తుంటాడు. ఎవరి నమ్మకం వారిది! ఈ రోజు నేను జీసస్‌ను నమ్ముతున్నాను కాబట్టి, మిగిలినవాళ్ల నమ్మకాన్ని తప్పు పట్టలేను కదా! అందుకే ఎవరి అభిప్రాయాలను వారికి వదిలేస్తాను. నాతో పాటు మావారు, పిల్లలు చర్చికొస్తారు. వాళ్లతో పాటు నేను గుడికి వెళ్తాను. నా నమ్మకాల కోసం నేనెవర్నీ ఇబ్బంది పెట్టను, పెట్టలేను. ఎవరైనా తన దగ్గరకు రావాలని ప్రభువు అనుకుంటే ఆయనే వాళ్లను రప్పించుకుంటాడు.


నిజమైన క్రిస్టియన్‌కి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? 
జయసుధ: క్రీస్తును నమ్మినవారు, ఆయన మార్గంలో నడిచేవారు నిజమైన క్రైస్తవులు. ఆశ, స్వార్థం లేకుండా, పొరుగువారిని ప్రేమిస్తూ, క్రీస్తు చెప్పిన దారిలో నడిచేవాడే నిజమైన క్రిస్టియన్!


ఈసారి క్రిస్మస్‌ని ఎలా జరుపుకోబోతున్నారు? 
జయసుధ: జలంధర్‌లో ఒక పెళ్లికి వెళ్తున్నాను. సో... క్రిస్మస్ అక్కడే చేసుకుంటాను. ఈస్టర్ కూడా నాకు బాగా ఇష్టం. యేసుక్రీస్తు జననం ఎంత గొప్పదో, ఆయన మరణించి లేవడం అన్నది అంతకంటే ఘనమైన విషయం. అసలు రిసరెక్షన్ ఉండడమే ఆయన పుట్టకలోని పరమార్థం. అందుకే క్రిస్మస్‌ని ఎంత బాగా చేస్తామో, ఈస్టర్‌ని కూడా అంతే బాగా చేయాలి. అంతేకాదు, క్రిస్మస్ అంటే కొత్తబట్టలు వేసుకుని సెలెబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదని నా ఉద్దేశం. క్రిస్మస్ అంటే గివింగ్. ప్రేమని ఇవ్వడం. మన దగ్గరున్నదాన్ని లేనివాళ్లకు పంచడం. అదే నిజమైన క్రిస్మస్.
సంభాషణ: సమీర నేలపూడి 

హెచ్-4 మీద వెళ్లే ‘స్పౌజ్’ అమెరికాలో ఉద్యోగం చేయవచ్చా?

 
హెచ్-1 మీద యూఎస్‌లో ఉన్న నా భర్త దగ్గరకు నేను, నా పిల్లలతో వెళ్లబోతున్నాను. నేనక్కడికి వెళ్లిన తర్వాత ఆన్‌లైన్ ట్యూషన్ల ద్వారా ఆదాయం సంపాదించాలనుకుంటున్నాను. అక్కడ అలా వర్క్ చేయవచ్చా?
- ప్రణీత

అనేక దేశాల నుంచి వెళ్లినవారు అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు కనుక అందరూ ఒక నిర్ణీత ప్రాతిపదిక మీద మాత్రమే కొన్ని ఉమ్మడి ప్రయోజనాలు పొందేందుకు వీలుగా అమెరికాలో కొన్ని నిబంధనలు అమలులోకి తెచ్చారు. అవే ఇమ్మిగ్రేషన్ రూల్స్. వాటి ప్రకారం యూఎస్‌లో తాత్కాలిక ఉద్యోగం మీద (హెచ్-1) ఉండేవారి జీవిత భాగస్వామి (స్పౌజ్) లేదా వారి సంతానం డిపెండెంట్ (హెచ్-4) వీసా మీద వెళ్లి అక్కడ ఎటువంటి ఆదాయం సంపాదించడానికి వీలులేదు.

వారే కాదు... విజిటర్, బిజినెస్ వీసాల మీద వెళ్లినవారు, ఎఫ్-1 విద్యార్థుల డిపెండెంట్లు కూడా అమెరికాలో వర్క్ చేయడం కుదరదు. అది ఒకచోట ఉద్యోగం చేయడమైనా, బేబీ సిట్టింగ్ అయినా, రెస్టారెంట్‌లో పనిచేయడం అయినా, లేక ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పడమైనా, లేక ఒక వెబ్‌సైట్ పెట్టుకుని దాని ద్వారా కొంత డబ్బు గడించడమైనా, లేక ఇంట్లోనే కూర్చుని సలహాలు చెప్పడం ద్వారా ఆదాయం పొందడమే అయినా లెక్క ప్రకారం అలాంటివన్నీ వీరికి నిషిద్ధమే.

దీనికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ అక్కడ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయో లోగడ ఒక సందర్భంలో చెప్పాను. యూఎస్ పర్మనెంట్ రెసిడెంట్ అయిన ఒకాయనకు అక్కడ ఒక బిజినెస్ ఉంటే అక్కడికి ఇండియా నుంచి విజిటర్‌గా వెళ్లే ఆయన కుమారుడు గాని, హెచ్-4 మీద వెళ్లే ఆయన కుమార్తె గాని కనీసం (శాలరీ తీసుకోకుండా కూడా) ఆయన షాపులో కూర్చుని ఉచిత సహాయం అందించడానికి నిబంధనలు ఒప్పుకోవు (వీరి ఉచిత సహాయం వల్ల ఆ షాపులో ఒకరికి రావలసిన ఉపాధి రాకుండా పోతుంది కనుక). 

యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలన్నీ బాగా సున్నితమైనవీ, వివిధ దేశాల వారందరి ఉమ్మడి ప్రయోజనానికి ఉద్దేశించినవీ కనుక వీటి పట్ల విస్తృత అవగాహన, పరిణత సంయమనం ఎంతైనా అవసరం. ఈ వీసా క్యాటగిరీల వారు రూల్స్‌ని పట్టించుకోకుండా అమెరికాలో ఏదో ఒక పనిచేసి ఒక్క డాలర్ సంపాదించినా, దొరికినప్పుడు మాత్రం వారిని దేశం నుంచి పంపించి వేసే ప్రమాదం కూడా ఉంటుంది.

అయితే హెచ్-4 మీద వెళ్లినవారు అక్కడ యూనివర్సిటీలో చదువకోవడానికి లేదా అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం చూసుకుని హెచ్-1కి మారడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అంగీకరిస్తాయి. మీరు హెచ్-4 మీద ఉండి ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పే అవకాశం లేకపోయినా మీకు తగిన అర్హతలు ఉంటే అక్కడే ఉద్యోగం సంపాదించుకుని హెచ్-1కి మారి ఆదాయం పొందే అవకాశాన్ని యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్నాయి. విదేశీయులు సంపాదించుకోవడం పైన అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఆ సంపాదన ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. వివరాలకు యు.ఎస్.సి.ఐ.ఎస్. వెబ్‌సైట్‌ని గూగుల్ సెర్చ్ చెయ్యండి.

కాగా, యూఎస్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్‌లో భాగంగా హెచ్-4లకు అమెరికా నుంచి ఒక శుభవార్త నిశ్శబ్దంగా ప్రాణం పోసుకుంటోంది. తాము పనిచేస్తున్న కంపెనీల ద్వారా ఇప్పటికే గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకుని అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అయ్యే ప్రాసెస్‌ని ప్రారంభించిన హెచ్-1లకు గ్రీన్‌కార్డు వచ్చేలోగా వారి స్పౌజ్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్‌ని ఇచ్చే ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. 

దీనికి మద్దతుగా అమెరికన్ కాంగ్రెస్‌కి సంతకాలు సమర్పించే కార్యక్రమం కూడా నడుస్తోంది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో అసాధారణ ప్రతిభావంతులైన విదేశీయులను అమెరికా అభ్యున్నతి కోసం అక్కడే అట్టిపెట్టుకునేందుకు వారికి ఒక ప్రోత్సాహకంగా హెచ్-1 స్పౌజ్‌కి ఈ ప్రత్యేక సదుపాయం కల్పించే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నారు. 

ఇలా ఉండగా, కంపెనీ ట్రాన్స్‌ఫర్ (ఎల్) వీసాల డిపెండెంట్లలో స్పౌజ్ (ఎల్-2)కి మాత్రం యు.ఎస్.సి.ఐ.ఎస్. నుంచి ‘ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్’ పొందడం ద్వారా అక్కడ పనిచేసే అవకాశం లభిస్తోంది. వారికి ‘ఇ.ఎ.డి.’ రెండేళ్ల కాలపరిమితితో లభించవచ్చు. ఎల్-2 స్టేటస్ కొనసాగినంత కాలం కూడా ఈ ఆథరైజేషన్‌ని పొడిగించుకోవచ్చు. యు.ఎస్.సి.ఐ.ఎస్. దీనిని ‘ఓపెన్ మార్కెట్ ఎంప్లాయ్‌మెంట్’గా అభివర్ణిస్తుంది. ఈ క్యాటగిరీలో ‘ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్’ ద్వారా ఎటువంటి జాబ్ అయినా చేయవచ్చు.

మీ విషయంలో మీ భర్త హెచ్-1 మీద కాక ఎల్-1 మీద వెళ్లి ఉంటే మీకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ అవకాశం ఉండి ఉండేది. హెచ్-1 మీద ఉన్నవాళ్లు ఎల్-1కి మారడానికి కూడా యూఎస్ చట్టాలు అంగీకరిస్తున్నా స్క్రూటినీ చాలా నిశితంగా ఉంటుంది. హెచ్-1 ఫీజులను, ప్రాసెస్‌ని తప్పించుకోవడానికి కొన్ని ఇండియన్ కంపెనీలు తమ ఉద్యోగాలకి ఎల్-1లు ఎక్కువగా ఇస్తున్నాయనే భావన అమెరికన్ యంత్రాంగంలో ఉన్నట్టు అనిపిస్తుంది. భర్త హెచ్-1 నుంచి ఎల్-1కి మారితే భార్య అమెరికాలో యు.ఎస్.సి.ఐ.ఎస్. ద్వారా హెచ్-4 నుంచి ఎల్-4కి మారడానికి కూడా పెద్ద సమస్య ఏమీ ఉండదు. నిబంధనలన్నీ కూలంకషంగా పరిశీలించి మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోండి. బెస్ట్ విషెస్.

నిరుపేదల కళ్లలో ఆనందం తొణికిసలాడిన రోజే నిజమైన పండగ.


చిన్నపిల్లలకు వీసా దరఖాస్తు విధానం ఏమిటి?

 
పాఠకుల ప్రశ్నలు










మా 10 ఏళ్ల బాబు వీసా రెన్యువల్‌కి వెళ్లాలంటే ప్రొసీజర్స్ ఏమిటి? సరైన సమాచారం మాకు ఎక్కడ లభిస్తుంది?
- సుమన నాగిరెడ్డి
మీరు అడిగిన వివరాలన్నీ హైదరాబాద్‌లోని యు.ఎస్. కాన్సులేట్ జనరల్ వెబ్‌సైట్‌లో మీకు లభిస్తాయి.(http://hyderabad. usconsulate.gov/). కాన్సల్ జనరల్ కాథరీన్ ధనాని, ఆమె నేతృత్వంలో ఇతర అమెరికన్ ఆఫీసర్లు సాధికారిక వీసా సమాచారాన్ని ప్రజలందరి వద్దకు తీసుకువెళ్లడానికి నిరంతరం చాలా చురుకుగా పనిచేస్తుంటారు. అలాగే, వీసా దరఖాస్తుదారుల సౌకర్యం కోసం యు.ఎస్. ప్రభుత్వం తలపెట్టిన అనేక నూతన చర్యలను కూడా హైదరాబాద్ కాన్సులేట్ సమర్థంగా అమలుజరుపుతోంది. వాటిలో ముఖ్యమైనది ‘ఇంటర్వ్యూ వైవర్ ప్రోగ్రాం’.

దాని ప్రకారం ఇప్పుడు 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూకోసం ఇండియాలోని ఏ యు.ఎస్. కాన్సులేట్‌లోను వీసా ఇంటర్వ్యూకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు. బి1/బి2,హెచ్4,ఎల్2 అన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. (ఇంటర్వ్యూ వైవర్ ప్రోగ్రాం పూర్తి వివరాలను హైదరాబాద్ కాన్సులేట్ వెబ్ పేజిలోని ప్రెస్‌రిలీజ్‌ల విభాగంలో చూడవచ్చు.)

www.ustraveldocs.com/in వెబ్ లింక్‌లోని సూచనల ప్రకారం మీ బాబుకు ఇంటర్వ్యూ వైవర్ ప్రోగ్రాం కింద మీరు అప్లయ్ చేయవచ్చు. మీ (తల్లిదండ్రుల)వీసా కాపీలు, యు.ఎస్‌లో మీరు సందర్శించబోతున్న వారి పేర్లు, చిరునామా లాంటి వివరాలు; మీకు ఇండియాతో గల గట్టి అనుబంధాన్ని తెలిపే మీ ఇళ్లు, ఆస్తులు, ఐ.టి. డాక్యుమెంట్లు, మీ బాబు ఇక్కడ స్కూలులో చదువుతున్న ఆధారాలు లాంటి వాటి కాపీలు సమర్పించండి.

ఇంటర్వ్యూ నుంచి మినహాయించినంత మాత్రాన వీసా ఖచ్చితంగా మంజురవుతుందన్న హామీ ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో అప్లయ్ చేసిన పిల్లల్ని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం కూడా ఉంటుంది. మీ బాబు ఇప్పటికే తన ఐదేళ్ల వీసా మీద వెళ్లి వచ్చాడు కనుక తన విషయంలో సమస్య ఏమీ ఉండకపోవచ్చు.

అనేక భాషలలో టెలిఫోన్, ఇ-మెయిల్ ద్వారా అప్లికెంట్ల సందేహాలు తీర్చే ఒక సమర్థమైన కాల్ సెంటర్ వ్యవస్థ (స్టాన్లీ) కూడా ఉంది. మీ బాబు వీసా రెన్యువల్ కోసం డాక్యుమెంట్లు ఎక్కడ, ఎలా సమర్పించాలి. మళ్లీ ప్రింటెడ్ వీసాని ఎలా అందుకోవాలి తదితర సందే హాలకు హైదరాబాద్ కాన్సులేట్ వెబ్ సైట్ చూడండి. లేదా అందులో ఇచ్చిన సూచనల మేరకు కాల్ సెంటర్‌కి ఫోన్ చెయ్యండి/ఇ-మెయిల్ పంపండి.

యు.ఎస్. వీసాలకు సంబంధించి ఈ ప్రాంతంలోని వారికి హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ మాత్రమే మీకు పూర్తి సాధికారిక సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే యు.ఎస్. కాన్సులేట్ నుంచి మీకు వీసాలను ఇప్పించగలమని ఆన్‌లైన్‌లో గాని, ప్రత్యక్షంగా గాని ఎవరైనా మిమ్మల్ని నమ్మించాలని చూస్తే అది ఒక వీసా స్కామ్‌లో భాగం అని అర్థం చేసుకుని స్థానిక పోలీసులకు తెలియజేయమని ైెహ దరాబాద్ కాన్సులేట్ తన వైబ్ సైట్‌లో పెట్టిన హెచ్చరికని కూడా గమనించండి.

నాకు ‘స్టామరింగ్’ ప్రాబ్లం ఉంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకి యు.ఎస్.కాన్సులేట్‌కి వెళ్లబోతున్నాను. నాకు ఈ సమస్య ఉండడం వల్ల వీసా రెఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా?
- అనిల్ యాదవ్

మీరు ఇంటర్వ్యూకి వెళ్లగానే వీసా ఆఫీసర్‌తో విషెస్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునేటప్పుడే ‘అయ్ హావ్ సమ్ స్పీచ్ డిఫికల్టీ. కైండ్లీ బేర్ విత్ మి...’ అని పొలైట్‌గా అనవచ్చు. ఒకవేళ మీరు మొదట చెప్పకపోయినా వారు ఆ తర్వాత అయినా మీ ఇబ్బందిని అర్థం చేసుకుని మీరు నింపాదిగా సమాధానం చెప్పడానికి పూర్తి సహకారం అందజేస్తారు. ఇటువంటి డిఫికల్టీస్ ఉన్నవారికి మిగతా అందరితో సమంగా అవకాశం కల్పించడానికి యు.ఎస్. ప్రభుత్వం సిన్సియర్‌గా ప్రయత్నిస్తుంది. మిగతా అప్లికెంట్లకి వీసా ఇవ్వడానికి లేదా తిరస్కరించడానికి ఏయే కారణాలు ప్రాతిపదిక అవుతాయో మీకు కూడా అవే వర్తిస్తాయి. మీకున్న ‘స్టామరింగ్’ వల్ల మాత్రమే మీకు వీసా రె ఫ్యూజ్ అయ్యే అవకాశం ఆవ గింజంత కూడా ఉండదు.