అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్
Health and Beauty with Dry Fruits
మనలో చాలామంది ఆకలి తీర్చుకోడానికి ఏదో ఒకటి తింటాం. అంతేతప్ప మనం తీసుకున్న ఆహారంలో ఎన్ని కాలరీలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందా, మానసికంగా ఏమైనా మేలు చేస్తుందా లాంటివి బొత్తిగా ఆలోచించం.
కొందరు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అందుకు తగ్గట్టు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కనుక ఆకలి తీరితే సరిపోతుంది అనుకోకుండా ఎం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా, ఎంత పరిమాణంలో తినాలో, వాటివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
ఖర్జూరం , అత్తి పండు , సీమబాదం
అత్తిపండు, సీమబాదం డ్రైఫ్రూట్స్ చాలా మేలైనవి. వీటిల్లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిని కడిగి నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు ఉదయాన ఆ నీళ్ళు తాగండి.. ఒకసారి ఒక రకం సరిపోతుంది. ప్రతిదీ టానిక్ లా పనిచేస్తుంది.
బాదం
బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువ. కనుక రోజుకు ఐదు, ఆరు బాదం పప్పులు తినండి. విడిగానే కాదు, ఏ రూపంలో అయినా తినొచ్చు. బాదం పైపొరలో వగరు ఉన్నప్పటికీ దానిలో ఉండే ఫ్యాట్ అన్ స్యాచురేటెడ్ కావడంతో అది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బాదంలో ఉండే కాపర్ పరిమాణం ఎనీమియాను పోగొడుతుంది. బాదంవల్ల ముఖానికి గ్లో వచ్చి సౌందర్యం ఇనుమడిస్తుంది.

No comments:
Post a Comment