all

Tuesday, November 20, 2012

abut lentils

లెంటిల్ డిష్ రెసిపీస్ -- బెస్ట్ డైట్
లెంటిల్ డిష్ రెసిపీస్ బెస్ట్ డైట్ అని చాలామందికి తెలీదు. నాన్ వెజ్ తినేవాళ్ళు సాధారణంగా ఇతర కూరగాయలు, లెంటిల్ డిష్ రెసిపీస్ (పప్పు ధాన్యాలు) ఇష్టపడరు. పైగా "అబ్బే వాటిల్లో ఏముంటుంది, గడ్డి?" అని చులకన చేసి మాట్లాడతారు. నిజానికి మాంసాహారం కంటే కూరగాయలు, లెంటిల్ డిష్ రెసిపీస్ ఉత్తమం అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు.
కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఏదైనా కావచ్చు... లెంటిల్ డిష్ రెసిపీస్ ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు లెంటిల్స్ ను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. భోజనంలో రోజూ ఒక కప్పు పప్పు ఉండేట్టు చూసుకోండి. పప్పుల్ని ఉడకబెట్టి, పకోడీలుగా చేసుకుని, కూరగా వండుకుని, లేదా కిచిడీ చేసుకుని తినవచ్చు.
లెంటిల్స్ వేయించడం కంటే ఉడకబెట్టి తినడం మంచిది. అలా కూడా కాకుండా నీళ్ళల్లో నానబెట్టి మొలకలు వచ్చాక తింటే ఇంకా ఉత్తమం. అందువల్ల పోషకవిలువలు నశించవు. వీటిల్లో సమృద్ధిగా ఉండే మాంసకృత్తులు, కాల్షియమ్, ఫైబర్ శరీరానికి చక్కగా అందుతాయి.
పెసలు, శనగలు లాంటి పప్పు ధాన్యాల మొలకల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. తేలికగా అరుగుతాయి. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన కీరా, కారెట్, టొమాటో ముక్కలు, అరటి ముక్కలు, వేసి, చాట్ మసాలా చల్లండి. కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి. ఆహా ఏమి రుచి అనుకోక మానరు. తీపిదనం ఇష్టపడేవారు ఇందులో దానిమ్మ గింజలు, కిస్ మిస్ ముక్కలు, అంజీరా ముక్కలు వేసుకోవచ్చు. ఇది మరింత పుష్టికరం.

No comments: