చురుకైన మెదడుకు కావలసిన పోషకాలు
Nutritious food for Sharp mind
మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తినే ఆహారానికి సరిపడా వ్యాయామం ఉంటే ఎటువంటి రోగాలు దరికి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏకకాలంలో అనేక పనులను చేయగల సామర్ధ్యం కలిగింది. ఆధునిక కాలంలో మానవుడు సృష్టించిన కంప్యూటర్ కన్నా మన మెదడు ఎన్నో రెట్లు సామార్తవంత మైనది. దాని పని తీరు కేవలం మనం తినే ఆహారంలోని పోషకాల పై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం తినే ఆహారంలో మెదడుకు కావాల్సిన పోషకాలు ఉండేలా ఆహారాన్ని తినాలి. మెదడుకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు కొన్ని...
ఆల్చిప్పలు
ఏ వయసులో ఉన్న వారికైనా ఆల్చిప్పలు మంచి పోషకాలు ఉన్న ఆహారం . ఆల్చిప్పల్లో ఉండే ఐరన్, మరియు జింక్ మెదడును చురుగ్గా పని చేయడంలో సహకరిస్తుంది. . తద్వారా కాన్సంట్రేషన్ పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది
ఆహార ధాన్యాలు
ఆహార ధాన్యాలు ఆరోగ్యానికి మంచివని మనకు తెలిసిందే. అందునా అధిక బరువుతో బాధపడే వారు వీటిని తినడం ఉత్తమం. మెదడు విషయానికి వస్తే ఈ ఆహారపు ధాన్యాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం, ఓట్ మీల్, మరియు బార్లీలో మెదడుకు కావలసిన ఎన్నోపోషకాలు ఉన్నాయి. ఆహారపు ధాన్యాల్లో ఉండే విటమిన్ B6, థయామిన్, రక్తప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.
టీ
టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఫ్రెష్ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ మెదడుకి చాలా మంచిది. టీలో ఉండే క్యాటెకిన్స్ మెదడును షార్ప్ గా,హెల్దీగా ఉంచడంలో తోడ్పడతాయి. కాబట్టి ప్రతి ఉదయం టీ తాగడం వల్ల రోజంతా హుషారుగా ఉండొచ్చు.
గ్రుడ్లు
మానవునిలో సహజంగా జరిగే మార్పులు ఉదాహరణకి, వయసులో మార్పు, ముఖ్యంగా వృద్ధాప్యాన్ని తగ్గించే గుణం గుడ్లలో ఉందని ప్రూవ్ అయింది. గుడ్డులో ఉండే విటమిన్ B12, లెసిథిన్ వయసును తగ్గించడంతో పాటు, అల్జేమేర్ అనే డిసీజ్ నుండి కూడా దూరంగా ఉంచుతుంది. మెదడుపై అధిక ప్రభావాన్ని చూపే గుడ్డు మంచి పోషక విలువలున్న ఆహారమే కాదు, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుందన్న మాట.
కూరలు
స్పైసీ ఫుడ్ ని ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. కూరలు వండేటప్పుడు వాడే పౌడర్ లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పసుపులో ఉండే రోగనిరోధక శక్తి, మెదడుకు శక్తినిస్తాయి. అందుకే స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడే వారు సాధారణంగా చలాకీగా ఉంటారు.
బెర్రీస్
బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
నట్స్ అండ్ సీడ్స్
సాయంత్రం పూట స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు , స్నాక్స్ కి బదులు వేరుశనగ, జీడిపప్పు, బాదంపప్పు , పీకన్స్, వాల్ నట్స్ , సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు పంప్ కిన్ ని తినడం అలవాటు చేసుకోవడం మంచిది. వీటిలో ఉండే పోషకాలు ఒమెగా- 6, ఫ్యాటీ ఆసిడ్స్, ఫోలేట్, విటమిన్ e, మరియు B6, థయామిన్ మరియు మెగ్నీషియం మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుంది.
పైన సూచించిన ఆహారపదార్థాలు మీ రోజువారి ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకోండి. చురుకుగా, ఆరోగ్యంగా జీవించండి.
No comments:
Post a Comment