all

Tuesday, November 20, 2012

బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు.కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. చిన్న చిన్న నీటి బిందువులే మహా సముద్రం అయినట్లు మనం తీసుకునే కొద్దిపాటి జాగ్రత్తలే ఆరోగ్యాన్ని కాపాడతాయి. సాయంత్రం పిజ్జా, బర్గర్ లు లాగించేసి రాత్రి కేవలం పెరుగన్నం తినేస్తే సరిపోతుంది అన్నది పొరపాటు. పిజ్జా బర్గర్ లతో పాటు పెరుగులో ఉండే వెన్న కూడా శరీరంలోకి చేరి కొవ్వును మరింత పెంచేస్తుంది. డైట్ కంట్రోల్ లో వున్నవారు మీగడను తీసేసిన పాలు, మజ్జిగను మాత్రమే వాడాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని పాటించకపోతే ఎన్ని జాగ్రత్తలు పాటించినా వ్యర్థమే.
* నీరు ప్రధానం : నీరు ఎక్కువ తాగడం వలన ఆకలి త్వరగా వేయదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొంటారు. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల నూనె తక్కువ పట్టడంతో పాటు పదార్థాలలో పోషకవిలువలు పోకుండా ఉంటాయి. అప్పడాలను వేయించుకునే బదులు కాల్చుకొని తింటే వాటిని తినాలన్న కోరిక తీరుతుంది. నూనెనుండి తప్పించుకున్నట్లు ఉంటుంది.
* స్టాట్యుటరీ ఫాట్ ను తగ్గించాలి: నూనె, నెయ్యిలలో స్టాట్యూటరీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వంటకాలలో వీటిని సాధ్యమైనంత తక్కువ ఉపయోగిస్తూనే మరికొన్నింటిలో పూర్తిగా మానేయొచ్చు. చపాతీలలోనూనె కన్నా పుల్కాలు ఆరోగ్యకరం. దోశ, వడ కన్నా ఆవిరి మీద తయారు చేసిన ఇడ్లీమేలు. రోజూవారీ భోజనంలో ఉపయోగించే నెయ్యిని కూడా పూర్తిగా నిషేధించాల్సిందే.
* మాంసాహారం: మాంసాహారం తప్ప మరేమి తినని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ చిట్కా. మాంసాహారం వండేటప్పుడు చర్మం తీసేసి వండాలి. దీని వలన వందక్యాలరీలు తగ్గిపోతాయి. దీని తయారీలో నూనెకు బదులు నీటిని వాడితే కొవ్వు చేరకుండా జాగ్రత్తపడచ్చు. చేపలలో తక్కువ పరిమాణంలో కొవ్వు ఉంటుంది. చికెన్, మటన్ కి బదులుగా చేపలు తినడం .

* కాల్షియం చాలా అవసరం: బరువు తగ్గడంలో కాల్షియం ముఖ్యం పాత్ర వహిస్తుంది అని మనకు తెలిసిన మనం దానిని పట్టించుకోకుండా ఉంటాము కాని ఆహారంలో కాల్షియం తప్పనిసరిగా వుండేటట్లు చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పెరుగు, పనీర్ చాలా బాగా పనిచేస్తాయి. పాలలో వుండే మీగడలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పాలను నేరుగా తీసుకోవడం కన్నీ మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది


No comments: