all

Thursday, December 20, 2012

చికెన్ చిల్లీ టోస్ట్ - ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

సాధారణంగా ప్లేయిన్ టోస్ట్ బట్టర్, లేదా జామ్ వంటి కాంబినేషన్ లో బయట తింటుంటాం. అలాగే ఇంట్లో కూడా తయారు చేసి తింటుంటాం. అయితే ప్లెయిన్ టోస్ట్ తిని, తిని బోర్ గా అనిపిస్తుంటే మాత్రం బ్రేక్ ఫాస్ట్ రిసిపీగా ఈ వెరైటీ చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ ను తయారు చేసుకోవచ్చు.

మీరు ఎప్పుడైనా చికెన్ టోస్ట్ ను ప్రయాత్నించారా?ఇది ఖరీదైనా అల్పాహార వంటకం కాదు. ఎందుకంటే చికెన్ గ్రేవి, కర్రీ, ఫ్రై వంటివి ఇంట్లో తయారు చేసి తినగా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. దాన్నే ఇలా తయారు చేసుకోవచ్చు. ఉదయం తయారు చేసుకోవడం వల్ల బ్రేక్ ఫాస్ట్ పూర్తి అవుతుంది. చికెన్ కాలీ అవుతుంది.

ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి పనిచేసే, జాబ్స్ కు వెళ్లే వారికి అతి త్వరగా బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు. 15నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. అందుకు చికెన్, దానికి కావల్సిన మసాలాలు, చీజ్ తురుము ఉంటే చాలు. వీటన్నింటినీ బేస్ గా పరిచి బేక్ చేస్తే చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ. మరి మీరూ తయారు చేసి చూడండి.

బ్రెడ్ స్లైస్: 4
బట్టర్(వెన్న): 1tbsp
చికెన్(తినగా మిగిలిన చికెన్): 100grams(shredded)
పచ్చిమిర్చి: 4(తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4(చితగొట్టుకోవాలి)
ఓరిగానో(ఇంగువ వేరు): 1tsp
చీజ్: 2cubes(తురుముకోవాలి)
టమోటో: 1(కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా

chicken cheese chilli toast

తయారు చేయు విధానం:
1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీ వరకూ ప్రీ హీట్ చేయాలి.
2. తర్వాత బ్రెడ్ స్లైసులకు బట్టర్ ను రాయాలి. ఆ బట్టర్ మీద లేయర్ గా చితగొట్టిపెట్టుకొన్న వెల్లుల్లి సర్ధాలి.
3. ఇప్పుడు వండి తినగా మిగిలిన చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్రెడ్ మీద పరవాల. దాని మీద పచ్చిమిర్చి తురుము, ఉప్పు, ఓరిగానో ఇలా ఇకదాని తర్వాత ఒకటి చల్లుకోవాలి.
4. ఇప్పుడు చివరగా చీజ్ తురుము ను కూడా చల్లుకొని బేకింగ్ డిష్ లో పెట్టాలి.
5. ఇప్పుడు బ్రెడ్ ను 10 నిముషాల పాటు అరవై శాతం పవర్ లో వేడి చేయాలి. అంతే టమోటో స్లైస్ ను గార్నిష్ చేయాలి. అంతే చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ.

దీన్ని వేడి టీ, కాఫీ లేదా బెవరేజస్ తో(థమ్సప్, కోక్,)వంటి వాటితో సర్వ్ చేయాలి.

No comments: