all

Thursday, December 20, 2012

గర్భాధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..!

గర్భం ధరించిన తర్వాత గర్భిణీలు ఏంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ సమయంలో జనన పూర్వక రక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. దీనినే ప్రినాటల్ కేర్ అని అంటారు. తల్లి మరియు పుట్టబోయే బిడ్డకి అందించే ఆరోగ్య సంరక్షణ, విజ్ఞానం, ఆరోగ్య పరమైన మరియు మానసిక పరమైన సలహాలు, వనరులు మొదలైనవి జనన పూర్వక రక్షణలో ని ముఖ్యమైనవి.

గర్భం దాల్చిన విషయం తెలిసిన వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్యున్ని వెంటనే సంప్రదించాలి.

ప్రాముఖ్యత:
గర్భధారణ ప్రారంభదశలోనే ప్రీనాటల్ కేర్ తీసుకోవడం వల్లన గర్భదారణకి సంబంధించిన సమస్యలని గుర్తించి, వాటిని పరిష్కరించే అవకాసం ఉంటుంది.

జననపూర్వక రక్షణ విధి:
తల్లి మరియు బిడ్డ యొక్క ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదల, ఆహారనియమావళి వంటివి పర్యవేక్షించడమే జనన పూర్వక రక్షణ ఒక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా కొన్నివిటమిన్స్ ని తీసుకోవడం ద్వారా తల్లి మరియు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటారు.
పుట్టుకతో వచ్చే వెన్నెముక మరియు మెదడుకి సంబంధించిన లోపాలని నిరోధించడానికి ప్రతి రోజు 400మిల్లీగ్రామ్స్ ఫోలిక్ ఆసిడ్ తీసుకోవాలి.
గర్భదారణ సమయంలో కొన్ని ఔషదాలు వాడకూడదు. మీ వైద్యుని ద్వారా వాటి గురించి తెలుసుకుని పుట్టబోయే బిడ్డకి హాని కలగకుండా జాగ్రత్తపడండి.
ఎక్స్ రేస్ వంటివి హాని కలిగించవచ్చు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. తల్లి తన శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి.
తగిన వ్యాయామం తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షకుల ద్వారా మీరు ఈ విషయాలు తెలుసుకోవచ్చు.

what is prenatal care

వైద్యుని పర్యవేక్షణ :
గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటి నుంచి మీ వైద్యున్ని సంప్రదించి ఒక షెడ్యూల్ తెలుసుకోండి. నిపుణులు సూచించిన ప్రకారం నాలుగు వారాల నుండి 28 వారాల వరకు నెలకొక సారి వైద్యున్ని సంప్రదించాలి.
28 వారాల నుండి 36 వారాల వరకు నెలలో రెండు సార్లు మీ వైద్యున్ని సంప్రదించాలి.
35 సంవత్సరములు దాటిన మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు లేదా మరేవైన దీర్గ కాలిక సమస్యలతో బాధపడే వారు వైద్యున్ని మరింత తరచుగా సంప్రదించవలసి రావచ్చు.


జాగ్రత్తలు :
గర్భం దరించాక జాగ్రత్తలు తీసుకోవడాన్ని ప్రినాటల్ కేర్ అని అంటారు. అదే గర్భ దారణ కోసం ప్రయత్నిస్తున్న వారు తీసుకోబోయే జాగ్రత్తలని ప్రికన్సెప్షన్ జాగ్రత్తలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత ధోరణి గర్భదారణకి ప్రయత్నించేవారు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలని తెలుసుకుని పాటిస్తున్నారు. గర్భదారణకి మూడు నెలల ముందు నుండే ఫోలిక్ ఆసిడ్ తీసుకోవడం, రోగనిరోధక శక్తి వాక్సిన్స్ ని తీసుకోవడం వంటివి ప్రికన్సేప్షన్ జాగ్రత్తలలోకి వస్తాయి. మీరు తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్య కరమైన ఆహారాన్ని తినాలి. ఇంకా, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

జననపూర్వక రక్షణ ప్రభావాలు:
తొలిదశలో నే గర్భాదారణకి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు, పుట్టబోయే మీ బిడ్డ క్షేమంగా ఉంటారు. గర్బదారణకి సంబందించిన ప్రమాదాలని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి జనన పూర్వక రక్షణ చాలా ఉపయోగపడుతుంది. పుట్టబోయే బిడ్డ రాకకి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడంలో జనన పూర్వక రక్షణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు.

ఇవన్ని పాటించడం ద్వారా ఆరోగ్యమైన మరియు ఆనందకరమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

No comments: