పండుగల సీజన్ వచ్చేస్తోంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి, ఇలా...ప్రతి ఒక్కరూ ఈ పండుగలను, పార్టీలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనల్లో మునిగితేలుతుంటారు. విలువైన వస్త్రాలు, మోడల్ మోడల్ నగలు, స్టైలిష్ చెప్పులు ఇలా ప్రతి ఒక్కటీ ఫర్ ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. ఇవేకాదు మరొక ముక్యమైన విషయం కూడా ఉంది. అదే మిమ్మల్ని మరింత సౌందర్యంగా కనబడేలా చేస్తుంది. అదేంటంటే హెయిర్ స్టైల్.
మీ అవుట్ ఫిట్ పర్సనాలిటీని పెంచే వాటిలో ప్రధానమైనది హెయిర్ స్టైల్.సాధారణంగా మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన హెయిర్ స్టౌల్ ను మెయింటైన్ చేస్తుంటారు. కొందరికి కర్లీ హెయిర్ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్ హెయిర్ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
హెయిర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అంటే పెర్మింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి వాటి వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారిపోయి, నిస్తేజంగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని సందర్భాలలో చివర్లు చిట్లిపోవడం, కుదుళ్లు పూర్తిగా దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. ఐరన్ మరియు కెమికల్స్ తో కురులను స్ట్రెయింట్ చేయించుకోవడం వల్ల కురులకు డ్యామేజ్ కలగవచ్చు. అందువల్ల కురులను స్టైయింట్ చేసుకోవడానికి కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఎంపిక చేసుకోవడం వల్ల నేచురల్ గానే స్ట్రెయిట్ హెయిర్ ను పొందవచ్చు. అందుకోసం కొన్ని నేచురల్ హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను మీకోసం కొన్ని...

అరటి మరియు పపాయ హెయిర్ ప్యాక్: బాగా పండిన అరటిపండును మరియు పపాయను ఒక బౌల్ లో ముక్కలు ముక్కలుగా చేసి, అందులోనే కొద్దిగా తేనె కూడా వేసి బాగా మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఎండిన తర్వాత మంచి షాంపూతో చల్లటి నీటితో కురులను శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్దిగా తడిగా ఉండంగానే తలను దువ్వుకోవాలి. దువ్వుని తర్వాత తడి ఆరే వరకూ ముడి వేయకుండా అలానే ఉంచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ హెయిర్ నేచురల్ గానే స్టైయిట్ హెయిర్ ను పొందుతుంది.
ముల్తాని మట్టి మరియు బియ్యం పిండి: ఒక కప్పు ముల్తానీ మట్టి, ఐదు టీస్పూన్ల బియ్యం పిండి మరియు ఒక ఎగ్ వైట్ అన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తలకు గోరువెచ్చని నూనెతో బాగా మర్ధన చేసిన తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా నెలకొకసారి చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నీళ్ళు మరియు నిమ్మరసం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఇది క్రీమ్ లా చిక్కబడే టప్పుడు బయటకు తీసి తర్వాత కురులకు మరియు తలబాడుకు బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత వేడినీళ్ళలో టవల్ ను ముంచి తలకు చుట్టి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల కురులు నిఠారుగా మారుతాయి.
ఆమ్ల(ఉసిరి) మరియు శీకాకాయ, బియ్యం పిండి: ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు ఉసిరికాయ పొడి, అరకప్పు శీకాకాయ పొడి మరియు అరకప్పు బియ్యం పిండి వేసి, అందులోనే రెండు గుడ్లలోని తెల్లని సొన వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట పాటు అలాగే ఉండాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల సహజంగానే మీ కురులకు స్ట్రెయింట్ గా మార్చుతుంది.
డీప్ కండీషనర్: కండీషనర్స్ కూడా మంచి హెయిర్ కేర్ ప్రొడక్టే. ఎందుకంటే మంచి కండీషనర్ ను అప్లై చేయడం వల్ల కురులు స్ట్రెయింట్ గా మారుతాయి. తలస్నానం చేసిన తర్వాత మీకు నచ్చిన కండీషనర్ ను తలకు పట్టించాలి. తలకు బాగా మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగించి మీ కురులకు కూడా స్ట్రెయిట్ గా మార్చేసుకోండి
No comments:
Post a Comment