all

Thursday, December 20, 2012

బటర్‌ స్కాచ్ కేక్- క్రిస్మస్ స్పెషల్

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చేసింది. మరి కొద్దిరోజూల్లో ప్రపంచమంతటా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. క్రిస్మస్ అంటే ముందుగా ట్రీ గుర్తుకువస్తుంది. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని.

ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు. క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి ఏ రకం కేకు చేయాలా? అని ఆలోచిస్తున్నవారికి ఈ వెరైటీ కేకు అంధిస్తున్నా తయారు చేసి ఆనందించండి.






.కావలసిన పదార్థాలు:

మైదాపిండి: 100grms
వెన్న: 100grms
పంచదార పొడి: 100grms
కోడిగుడ్లు: 2-3
బేకింగ్ పౌడర్: 1tsp
వంట సోడా: 1/2tsp
పాలపొడి: 2tbsp
బటర్‌స్కాచ్ ఎసెన్స్: 1tsp
లెమన్ ఎల్లో ఫుడ్ కలర్: తగినంత
ఐసింగ్ కోసం: వెన్న: 100grms
ఐసింగ్ షుగర్: 200
గ్రాలెమన్ ఎల్లో కలర్: కొన్ని చుక్కలు
బటర్‌స్కాచ్ కాండీస్: అర కప్పు
వేడినీరు:కొద్దిగా

Butterscotch Cake Christmas Special

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాత్రలో కొంత మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, వెన్న, పంచదార వేసి కలపాలి.

2. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి. దీనికి కోడిగుడ్ల సొన, బటర్‌స్కాచ్ ఎసెన్స్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి.

3. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్‌లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40:50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్ చేయాలి.

4. ఐసింగ్ ఇలా: వెన్న, ఐసింగ్ షుగర్‌లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. దీనికి ఎసెన్స్, ఫుడ్ కలర్, కొద్దిగా వేడినీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన బటర్‌స్కాచ్ క్యాండీస్‌తో అలంకరించాలి.

No comments: