all

Thursday, December 20, 2012

మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం ఎలా ?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనలకి గురై ఆత్మవిశ్వాస లోపానికి గురవుతున్నారు. ఇలాంటి పోటి మరియు ప్రమాదకరమైన ప్రపంచంలో మసలడానికి పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. చదువు సంధ్యలలో పిల్లలకి సహకరిస్తూనే ఆట పాటలలో కూడా పిల్లలని పాల్గొనేలా ప్రోత్సహించాలి. వాటిలో ని గెలుపు సాధించేందుకు తగిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో పెంచాలి. తమ మిద తమకి నమ్మకం, ఆందోళనలని అధిగమించడం వంటివి తెలుసుకుంటే పిల్లలు తమ భవితని చక్కగా తిర్చిదిద్దుకోగలరు. జీవితం పట్ల వారిలో ఉండే భయాలు, అపనమ్మకాలు వంటివి తొలగి పోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకొని బంగారు భవిష్యత్తుని రుపుదిద్దుకోగలరు. ఇవన్నీ తల్లిదండ్రుల సహకారం వల్లే సాధ్యపడతాయి.


how make your child confident

ఆత్మవిశ్వాస నిర్మాణం.



1.సమాజంలో మీకున్న ఇమేజ్ ని, మీలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాత్మక ఆలోచనలని, సమాజం పట్ల మీ బాధ్యతని పిల్లలకి తగిన సందర్భాలలో ప్రదర్శించడం ద్వారా వివరించండి. మీ పిల్లల ముందు మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి. నిశ్చితంగా ఆత్మవిశ్వాసంతో గౌరవ పరమైన పద్దతిలో సంఘర్షణలని పరిష్కరించడం ద్వారా పిల్లలకి సమస్యలనుండి పారిపోవడం తప్పించుకు తిరగడం వంటివి పరిష్కారాలు కాదని తెలియచేయండి.

2. మీ పిల్లల మంచి ప్రవర్తన పట్ల మీ సంతృప్తిని వారికి తెలియచేయండి. మీ పిల్లల యొక్క సామర్ధ్యాలని, ప్రతిభని మెచ్చుకునే కంటే వారు ఆ ప్రతిభని సామర్ధ్యాన్ని సంపాదించేందుకు పడిన కష్టాన్ని గురించి పొగడండి. "నువ్వు చాలా తెలివిగలవాడివి" అనడానికి బదులు "నువ్వు మంచి మార్కులు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను" అని చెప్పండి. పిల్లల ప్రయత్నాలని ప్రోత్సహించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని వారిలో కలుగచేయండి.

3. మీ పిల్లలు చేసే మంచి ప్రయత్నాల లో ఉండే గొప్పతనం చూపెట్టడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ పిల్లలు గెలుచుకున్న బహుమతులని ఇంట్లో ప్రదర్శనకి పెట్టడం ద్వారా వారి ప్రయత్నానికి విలువ ఇస్తున్నట్టు తెలియచేయండి. మీ పిల్లల అభివృద్దిని గుర్తించే స్నేహితులతో, బంధువులతో మీ పిల్లలు సాధించిన విజయాల్ని పంచుకోండి. వారు గెలిచిన ప్రతి సందర్భాన్ని ఒక పుస్తకంలో వివరాలతో సహా పొందుపరచడం ద్వారా వారికి మీరు ఈ పుస్తకాన్నికొంత కాలం తర్వాత చూపెట్టి సంతోషపెట్టవచ్చు.

4. చింతని తగ్గించండి. మీ పిల్లలు చెప్పే సమస్యలు వినండి. వారు చెప్పే సమస్యలని చిన్న సమస్యలుగా కొట్టిపారేయకండి. తల్లిదండ్రులు తమ సమస్యలని వింటున్నారు అనే భావన వారికి కలుగచేయండి. మీకు వారి సమస్యలని చెప్పుకునే స్వేచ్చ వైపు ప్రోత్సహించండి.

5. వారి సమస్యలకి పరిష్కారాలని చూపడం ద్వారా వారి బాధను తగ్గించండి. గ్రేడ్స్, స్నేహితులు, బాడీ ఇమేజ్ వంటి వాటిలో సలహాలు ఇవ్వండి. మీ పిల్లలతోని చర్చించడం ద్వారా వారి పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించండి. యుద్ధం, కరవు వంటి ప్రపంచ సమస్యల గురించి మీ పిల్లలు బాధపడుతూ ఉంటే వారితో చర్చించి మీ పిల్లల మీద వాటి ప్రభావం తెలుసుకోండి. వారికి జరుగుతున్న వాస్తవాలని తెలియచేయండి.

6. మీ పిల్లల భవిష్యత్తు ని బంగారు భవిష్యత్తు చేసే దిశానిర్దేశకులు మీరే. మీ సమస్యలని మీ పిల్లలపై రుద్దకండి. వారికి అనవసరపు ఆందోళనలు అత్రుతలు కలిగించకండి. భయం, అనుమానం వంటి భావాలను మీ పిల్లల ముందు వ్యక్తపరచకండి. ధైర్యం, సానుకూల దృక్పధం వంటివి వ్యక్తపరచడం ద్వారా చింత లేని జీవితం పొందవచ్చునని వారికి తెలియచేసీలా మసలుకోండి.

No comments: