ఇళ్లు, ఆఫీసులను చల్లబరిచే ఏసీ వంటి యంత్రాలు వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్ పొరను దెబ్బతీసి పర్యావరణ అసమతౌల్యానికి దారితీస్తుంది. ఏసీ వాడకాన్ని నియంత్రించుకుంటే పర్యావరణ ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
ఇటీవల మనలో చాలామందికి ఆరోగ్య స్పృహ పెరిగింది. అలాగే పర్యావరణ స్పృహ కూడా. దాంతో ఒకే చర్యతో అటు మనిషి ఆరోగ్యం, ఇటు పర్యావరణ ఆరోగ్యం... ఈ రెండు ఆరోగ్యాలూ సమకూరితే... అంతకన్నా కావాల్సిందేముంది? అందుకే అటు మనుషులకూ, ఇటు వాతావరణానికీ ఈ రెండు విధాలైన ఆరోగ్య ప్రయోజనాలూ సమకూరే కొన్ని పనులను కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అవి... మీ రవాణాకు సైకిల్ లేదా నడకే బెస్ట్ మనదేశంలో ఇటీవల దగ్గరి దూరాలకు సైతం మోటార్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకస్థాయి వ్యక్తులు సైకిల్ ఉపయోగించడాన్ని స్థాయికి తగనిపనిగా పరిగణిస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలు చేసే అంశమని విస్తృత ప్రచారం చేస్తే, అటు వ్యక్తులకూ, ఇటు పర్యావరణానికీ మేలు జరుగుతుంది. వ్యాయామానికి తీరిక లేనివారు తమ రవాణా కోసం సైకిల్ లేదా నడకను ఎంచుకుంటే మంచిది. మోటారు వాహనాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. కర్బన కాలుష్యాల నివారణ వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. త్వరగా నిద్రకు ఉపక్రమించండి గతంలో మనం ఎనిమిది లేదా తొమ్మిది గంటల లోపే నిద్రకు ఉపక్రమించేవారం. పదిగంటల వరకు మేల్కొని ఉన్నారంటే అది చాలా ఆలస్యంగా నిద్రపోవడంగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు రాత్రి ఒంటిగంటకు నిద్రపోవడం అన్నది సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. వ్యక్తుల ఆరోగ్యంతో పాటు పర్యావరణం సైతం దెబ్బతింటోంది. ఒంటిగంట లేదా రెండు వరకూ మేల్కొని ఉండటం వల్ల విద్యుత్ వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆ విద్యుత్తుకు ప్రధాన వనరులైన బొగ్గు, గ్యాస్ వినియోగం పెరగడం, దాంతో పర్యావరణంపై భారం కూడా సాధారణమే. నిద్రగంటలు తగ్గడం స్థూలకాయానికి దారితీస్తోంది. ఫలితంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్యాలకు కారణమవుతోంది. నిద్రగంటలు తగ్గడం వల్ల మెదడులో స్రవించే లెప్టిన్ వంటి హార్మోన్లస్థాయి తగ్గుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ మనకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తిలో వినియోగించే సామర్థ్యం ఎంత, ఆకలి నియంత్రణ, అనేక జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడుతుంది. దాంతో జీవక్రియల్లో సమతౌల్యం దెబ్బతింటుంది. ఇక ఘ్రెలిన్ అనే మరో హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆకలిని పుట్టిస్తుంది. నిద్రపోయే గంటలు తగ్గినప్పుడు ఆకలి పెరిగి అనవసరమైన చెత్త తింటూంటాం. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే త్వరగా నిద్రపోవడం వల్ల వ్యక్తుల ఆరోగ్యాన్ని, పర్యావరణ ఆరోగ్యాన్ని... రెంటినీ కాపాడినట్లే. ఎయిర్ కండిషన్ వినియోగాన్ని తగ్గించండి రక్తం వేడిగా ఉండే క్షీరదాలైన మిగతా అన్ని జీవుల్లాగే... మనిషికీ ఒక స్థిరమైన శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. వ్యక్తులలో జరిగే జీవక్రియలు, పరిసరాలను బట్టి దాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడమనేది మనిషికి స్వాభావికంగానే ఉంటుంది. ఉదాహరణకు పరిసరాలు బాగా చల్లగా ఉన్నప్పుడు జీవక్రియలను వేగవంతం చేసి శరీరాన్ని వెచ్చబరుచుకునే గుణం, పరిసరాలు వేడిగా ఉన్నప్పుడు చెమటలు పుట్టించి శరీరాన్ని చల్లబరుచుకునే గుణం ప్రకృతి మనకు ఇచ్చిన వరం. అయితే మనం ఒక స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర దీర్ఘకాలం పాటు ఉంటున్నామనుకుందాం. దానివల్ల పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్పు చేసుకునే ఆ స్వాభావిక శక్తి మనలో క్షీణిస్తుంది. నిత్యం ఏసీలో ఉండే వారికి విటమిన్-డి లోపం కారణంగా అనేక న్యూరలాజికల్ సమస్యలు వస్తున్నాయి. ఎక్కువసేపు ఏసీల్లో ఉండేవారు మందకొడిగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల స్థూలకాయం వంటి ఆరోగ్యసమస్యలు వచ్చి, ఇతర అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, December 6, 2012
డబుల్ హెల్త్ బెనిఫిట్స్!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment