ప్రతిపక్షాల నోరు మూయించినంత తేలిక కాదు...
పిల్లల పెంపకం! వన్డేలో సెంచరీ కొట్టినంత తేలిక కాదు... పిల్లల పెంపకం! ఫారిన్ కంపెనీతో బిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకున్నంత తేలిక కాదు.. పిల్లల పెంపకం! బాలీవుడ్ బాద్‌షా అయినంత తేలిక కాదు.. పిల్లల పెంపకం! మరి... మన్మోహన్‌సింగ్, సచిన్ టెండూల్కర్,ముఖేష్ అంబానీ, అమితాబ్ బచన్‌లు... తమ పిల్లల్ని ఎలా పెంచి ఉంటారు? వారితో పాటు వారి జీవిత సహచరులు... ఎన్ని కత్తుల మీద సాము చేసి ఉంటారు? చదవండి... ఈవారం ‘అలా పెంచాం’లో. ప్రధాని కూతుళ్లమని చెప్పుకోరు! దేశాన్ని సంస్కరణల బాటలో నడిపించిన మితభాషి మన్మోహన్‌సింగ్.. పిల్లల పెంపకంలో అనుసరించిన సంస్కరణలు, ఆచరించిన సూత్రాలేమై ఉంటాయి?! ఏం లేదు, పొదుపుగా మాట్లాడడమే ఆయన పాటించిన సూత్రం! అలాగే పుస్తకాలు చదవడం నేర్పించారు. గురుశరణ్ కౌర్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్దమ్మాయి ఉపీందర్ సింగ్. రెండో అమ్మాయి దామన్‌సింగ్, ఆఖరి అమ్మాయి అమృతాసింగ్. అమెరికా పౌరహక్కుల పరిరక్షణ సంఘంలో ‘స్టాఫ్ ఆటార్నీ’ అయిన అమృత ఏనాడూ తననొక ప్రధాని కూతురిగా ఎవరికీ పరిచయం చేసుకోలేదు. మిగతా ఇద్దరు కూడా ఇంతే. లో ప్రొఫైల్. దామన్ సుప్రసిద్ధ రచయిత్రి, ఉపీందర్ ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ ప్రొఫెసర్. అయినాసరే, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన నిరాడంబరతతో చాలా సింపుల్‌గా ఉంటారు. ఇక కౌర్ సెన్సిబుల్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ కూడ. చిన్నతనంలో పిల్లలు ఇంట్లో ఏ పనీ చేయకుండా పుస్తకాల్లో తలలు దూర్చేస్తే ఆమె ఒక్కోసారి కోప్పడేవారు. ఈ తల్లిదండ్రులు ముగ్గురమ్మాయిల్లో ఎవరినీ కొంచెం ఎక్కువగా కానీ, తక్కువగా కానీ చూళ్లేదు. తమ అభిప్రాయాలు, ఆశలు, కోరికలను పిల్లల మీద రుద్దలేదు. అయితే ఏది చేసినా శ్రద్ధగా చేసేటట్లు ప్రభావితం చేశారు. పేరుకు గొప్పైనా... పిల్లల దగ్గర పేరెంట్సే! ప్రపంచ పారిశ్రామికవేత్తలలో పేరెన్నికగన్న వ్యక్తి ముఖాష్‌అంబానీ. అతని భార్య నీతా అంబానీ. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. సంపన్నవర్గాల పిల్లలు తరతరాలుగా వచ్చే ఆస్తులను అనుభవిస్తూ, ఎంజాయ్ చేస్తుంటారని చాలామంది అనుకుంటుంటారు. కాని ఎంత కలిమి ఉన్నా వీళ్ల పిల్లలూ బాధ్యత తెలిసిన వ్యక్తులుగానే మసలుకుంటుంటారు. ముఖేష్, నీతా కూడా బాధ్యత గల పేరెంట్స్‌గా అన్నింటికన్నా పిల్లలతో గడిపే సమయమే బెస్ట్ అని చెబుతారు. కొన్నిసార్లు అకస్మాత్తుగా పిల్లల ఆనందంలో పాలుపంచుకునే సందర్భాలు వస్తుంటాయని అంటారు. ఎంతమంది పనివాళ్లున్నా పిల్లలకు మాత్రం తానే స్వయంగా వండి, వడ్డించడాన్నే ఆమె ఇష్టపడతారు. పిల్లల ఆనందంలో పాలుపంచుకోవడం వల్లనే తమ తల్లిని బెస్ట్ ఫ్రెండ్‌గా భావిస్తుంటారా పిల్లలు. ముఖేష్ కూడా ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత స్పేస్ ఉంచుకుంటారు. తనకు ఉన్న సమయంలోనే తాను ఆడుతూ, పిల్లలూ పాల్గొనేలా చేస్తారు. ఎదిగే వయసులో పిల్లల శారీరక బలానికి ఆటలు ఎంతో అవసరం కాబట్టి ఆ ప్రోత్సాహం అందిస్తానంటారాయన. పేరెంట్స్ అడుగుజాడల్లో... సచిన్ టెండూల్కర్ ప్రపంచప్రఖ్యాతి చెందిన క్రికెటర్. భార్య అంజలి వృత్తిరీత్యా డాక్టర్. వీరి సంతానం పదిహేనేళ్ల సారా, పదమూడేళ్ల అర్జున్. సారాకి టెన్నిస్ అంటే ఇష్టం. అర్జున్‌కి క్రికెట్ అంటే ప్రాణం. భార్యాభర్తలిద్దరూ వారి వారి రంగాలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఆ దంపతులు తమ బిడ్డలను ప్రయోజకులయ్యేలా, విలువలను కలిగి ఉండేలా తీర్చిదిద్దడంలో తగినంత శ్రద్ధ తీసుకుంటున్నారు. తాను విశ్వవిఖ్యాత క్రికెటర్ అయినప్పటికీ బిడ్డల విషయానికి వచ్చేసరికి ఓ సాధారణ తండ్రిలా మారిపోతారు సచిన్. వీలుదొరికినప్పుడల్లా క్రికెట్‌కు సంబంధించిన టిప్స్ కొడుక్కి, టెన్నిస్‌కు సంబంధించిన మెళకువలు కూతురుకు చెబుతుంటారాయన. అయితే భవిష్యత్తులో వారు ఏ రంగంలోకి వెళ్లాలన్నది మాత్రం బిడ్డలే స్వేచ్ఛగా నిర్ణయించుకోవాలన్నది ఈ దంపతుల ఉద్దేశం. సాధారణంగా తల్లిదండ్రులనుంచి బిడ్డలు నేర్చుకుంటారు. అయితే తన కూతురి నుంచి సేవాభావాన్ని నేర్చుకున్నట్లు గర్వంగా చెప్పుకుంటారు సచిన్. శాంతంతో విజయాలను, ఓటమి నుంచి పాఠాలను పిల్లలు నేర్చుకునేలా పెద్దలే జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు ఈ పేరెంట్స్. వ్యక్తిత్వాన్ని మించిన సంపద లేదు అమితాబ్ సూపర్‌స్టార్. జయ మరో సూపర్‌స్టార్. వీరి పిల్లలంటే గోల్డెన్ స్పూన్‌తో పెరిగి ఉంటారని అనుకుంటాం. కాని అమితాబ్ దంపతులు.. అభిషేక్, శ్వేతలను సెలబ్రిటీ హోదాకు దూరంగా పెంచారు. ‘‘పిల్లల్లో తాము సెలబ్రిటీల పిల్లలం అనే భావన రాకూడదు’’ అంటారు అమితాబ్. చిన్నప్పుడు తను ఇల్లంతా నీరు పోస్తే తన చేతనే తుడిపించిందట అమితాబ్ వాళ్ల అమ్మ. ‘‘చిన్న పిల్లాడి చేత ఈ పనులు చేయిస్తావా?!’’ అని అమితాబ్ తండ్రి నొచ్చుకుంటే అందుకు ఆమె ‘‘తన పొరపాటును తానే సరిదిద్దుకోవాలని తెలిసేది ఇలాంటప్పుడే’’ అన్నారట. ‘‘ఈ విషయం నాకూ గుర్తు లేదు, నాన్న జీవిత చరిత్ర చదివినప్పుడు తెలిసింది’’ అంటారు అమితాబ్. ఆ మాట ఆయన్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉండేదట. ‘‘వారసత్వపు ఆస్తిని బంధువులు కాజేసినప్పుడు వ్యక్తిత్వం ముందు ఏ సంపదా ఎక్కువ కాదని తరచు అనేవారు నాన్న. ఇలాంటివే నేను నా పిల్లలకు చెప్పాను’’ అంటారు అమితాబ్. జయ మరింత కచ్చితంగా ఉంటారు. ఇంటికి అతిథులు వస్తే వాళ్లకు టీ, బిస్కట్‌లు పిల్లలే ఇచ్చేవాళ్లు. బంధువుల దగ్గర డాబు వద్దని ఆమె అభిప్రాయం. వాళ్ల అభిప్రాయాలు, ఉన్నత వ్యక్తిత్వాలకు అనుగుణంగానే పెరిగారు అభిషేక్, శ్వేత. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, December 6, 2012
పిల్లలేప్రతిబింబాలు--) అలా పెంచాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment