all

Monday, January 28, 2013

భుక్తాయాసపు నడక గుండెకు మంచిదే!

 
చటుక్కులు
కడుపారా తిన్న విందుభోజనాన్ని హరాయించుకోవాలంటే నాలుగు అడుగులేస్తే మేలని మన పెద్దలు చెబుతూంటారు. జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఇదే చెబుతున్నారు.. కాకపోతే కొంచెం తేడాతో... కొవ్వుపదార్థాలు ఎంత ఎక్కువగా ఉన్న భోజనం తిన్నా ఒక గంట తరువాత కొంత వ్యాయామం చేస్తే గుండెజబ్బులు వచ్చే అవకాశాల్ని తగ్గించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రక్తంలోని ట్రై గ్లిజరైడ్స్ మోతాదు గణనీయంగా తగ్గుతుందని వారు జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది.

ఈ ట్రై గ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వ్యాయామం చేస్తే వీటి మోతాదు తగ్గుతుంది కానీ భోంచేసిన కొద్ది సమయానికే వ్యాయామం చేస్తే ఏమవుతుందనేది ఈ జపనీస్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. కొద్దిదూరం నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ మోతాదు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అయితే వీరు సేకరించిన సమాచారం కేవలం పదిమందికి సంబంధించినది మాత్రమే కావడంతో ఇదే సూత్రం అందరికీ వర్తిస్తుందా? లేదా? అన్నది పరిశీలించాల్సిన అవసరమేర్పడింది.
  

No comments: