‘మొగలిరేకులు’లో లిఖిత మాయమై కరుణ ప్రత్యక్షమవగానే అందరూ చాలా నిరుత్సాహపడ్డారు. కానీ అది కొద్దిసేపే. కళ్లతో భావాలను పలికిస్తూ, కరుణ అద్భుతంగా నటిస్తుంటే లిఖితను మర్చిపోవడానికి ప్రేక్షకులకు పెద్దగా సమయం పట్టలేదు. ‘దేవి’ పాత్రకు ప్రాణం పోస్తోన్న కరుణ మనసులోని మాటలివి...
‘దేవి’ పాత్రకి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక సీరియల్‌లోని పాత్రకి ఇంత క్రేజ్ ఉంటుందా అనిపిస్తోంది నాకు. ఎక్కడికెళ్లినా కరుణ అనడం మానేసి దేవీ, దేవీ అని పిలుస్తున్నారంతా. ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? ‘పసుపు-కుంకుమ’ టీమ్‌తో కలిసి ‘భలే చాన్సులే’ ప్రోగ్రామ్‌కి వెళ్లాను.. మంజు మేడమ్ నన్ను అక్కడ చూశారట. ఆ తర్వాత ఓరోజు నా ఫ్రెండ్ అంజు అస్రానీని కలవడానికి ‘అగ్నిపూలు’ షూటింగు జరుగుతున్న చోటికి వెళ్లాను. అప్పుడు మంజు మేడమ్ ‘దేవిగా చేస్తావా’ అని అడిగారు. ‘పసుపు కుంకుమ చేస్తున్నాను, నెలంతా డేట్స్ ఇవ్వలేను, పదిహేను రోజులైతే చేయగలను’ అని చెప్పాను. ఆవిడ ఓకే అనడంతో ‘దేవి’నైపోయాను. తర్వాత డేట్స్ కుదరకపోవడంతో ‘పసుపు-కుంకుమ’ మానేశాను. అంతకుముందు ‘మొగలిరేకులు’ చూశారా? లేదు. మామూలుగానే నేనెక్కువ టీవీ చూడను. ఇక సీరియల్స్ చూసే అలవాటే లేదు. మరి ‘దేవి’ని ఎలా ఓన్ చేసుకున్నారు? మొదట టెన్షన్ పడ్డాను. నెట్‌లో ఎపిసోడ్స్ అన్నీ చూడటం మొదలుపెట్టాను. ఆ పాత్రను ‘లిఖిత’ ఎలా చేసిందో అబ్జర్వ్ చేశాను. మెల్లమెల్లగా ఓన్ చేసుకున్నాను. ఇంకోటేంటంటే, నేను స్వతహాగా దేవి అంత సెలైంట్ కాదు. బాగా టాకెటివ్. కానీ దేవి మౌనంగా ఉంటుంది. కళ్లతోటే ఎక్కువ మాట్లాడుతుంది. ఎక్కడా పోలికే లేదు. దాంతో కాస్త కష్టపడ్డాననే చెప్పాలి. అసలు మీరు నటన వైపు ఎలా వచ్చారు? నా చిన్నప్పుడు బాలభవన్‌కి సమ్మర్‌క్యాంపు కోసం వెళ్లాను. అప్పుడు ‘ఆహా’ సినిమాలో ఓ చిన్న బిట్ కోసం చైల్డ్ ఆర్టిస్టు కావాలంటూ కో ఆర్డినేటర్స్ వచ్చారు. నన్ను సెలెక్ట్ చేశారు. తర్వాత నిన్నే ఇష్టపడ్డాను, మాస్, మంత్ర, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, శంకర్‌దాదా ఎంబీబీఎస్... ఇలా అవకాశాలు బాగానే వచ్చాయి. మరి సీరియల్స్...? సీరియల్స్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘యువ’ సీరియల్ కోసం అడిగినప్పుడు... ఎప్పుడూ ఏడవాలి, నావల్ల కాదన్నాను. కానీ ఫన్ ఉంటుందని చెప్పడంతో ఒప్పుకున్నాను. ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఇబ్బందులుంటాయంటారు. నిజమేనా? మనమెలా ఉంటామన్నదాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. మనం నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటే అందరూ మనతో బాగానే ఉంటారు. యాటిట్యూడ్ చూపిస్తే వాళ్లూ అలానే చేస్తారు. అంతేతప్ప ఈ ఫీల్డ్‌లోనే ఇబ్బందులు ఉన్నాయని, ఇక్కడేవో పాలిటిక్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటాయని అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు వివాహిత కదా! కెరీర్‌ని ఇంటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మావారు భరత్ భూషణ్ యాడ్ ఫిల్మ్ మేకర్. నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. షూటింగ్‌కొస్తే బాబు ఎలా ఉన్నాడో అన్న టెన్షన్ ఉండదు నాకు. ఎందుకో మా అత్తమ్మో, ఆడపడుచో వాడిని చూసుకుంటారు. అలాంటి ఫ్యామిలీ ఉండగా ఇక కష్టం ఏముంటుంది! ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏమీ లేవు. నటన నాకు ప్యాషన్ కాదు. నాకు కెరీర్ కంటే ఫ్యామిలీ ముఖ్యం. అనుకోకుండా నటినయ్యాను. కెరీర్ బాగుంది కాబట్టి కొన్నాళ్లు పని చేస్తాను. తర్వాత మావాళ్లను చూసుకుంటూ హ్యాపీగా ఇంట్లో ఉండిపోతాను. - మీరా |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Sunday, May 12, 2013
నేను‘దేవి’లా కాదు! (టీవీక్షణం)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment