కంటి నిండా నిద్ర పోవడం... చాలా మందికి ఒక కల. బిజీ లైఫ్‌స్టయిల్‌లో నూటికి తొంబై మందికి సాధ్యం కాని వరం. ప్రశాంతత కొరవడితే నిద్ర దూరమవుతుంది. నిద్ర దూరమైతే చికాకులు మొదలవుతాయి. ఆ ప్రభావం పని నైపుణ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకదానికి మరొకటి ఇంటర్‌లింక్‌గా సాగే సమస్యల వలయం ఇదంతా.
‘అందమైన ఇల్లు కట్టుకోవడం సాధ్యమైంది కానీ ప్రశాంతంగా నిద్రపోవడం అసాధ్యంగా మారుతోంది’ అని ఆవేదన చెందేవాళ్లకి తథాగతుడి రూపమే సమాధానం. బుద్ధుని ప్రశాంత వదనం చూస్తే పగలంతా ఎదురైన చికాకులన్నీ తొలగిపోతాయి. తెలియని ఆధ్యాత్మిక భావంతో మనసు నిండిపోతుంది. ధ్యానమూర్తి రూపాన్ని చూస్తూ మనసు ప్రశాంతతను ఆస్వాదిస్తుంటే మనిషి నిద్రలోకి జారిపోతాడు. అందుకు దోహదం చేసేవే బుద్ధుని వాల్ హ్యాంగింగ్స్. ఇక్కడ కనిపించే వాల్ హ్యాంగింగ్‌లో చిన్న లైట్ ఉంది. బుద్ధుని పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తి రూపం ఉంది. మనకు కనిపించే ఆ వెలుతురు పెయింటింగే, కానీ దాని లోపల చిన్న బల్బు అమర్చారు. అలాగే చాలా రూపాలున్న పెయింటింగ్‌లో బుద్ధుని ముఖంపై తిలకం స్థానంలో బల్బు ఉంది. రాత్రి గదిలో లైట్లు ఆపేసి దీనిని ఆన్ చేస్తే మిణుకు మిణుకుమంటూ బెడ్‌ల్యాంప్‌గా చిరుకాంతులీనుతుంది. బెడ్‌రూమ్‌లో ల్యాంప్‌షేడ్‌కి ప్రత్యేకంగా స్థలం కేటాయించడం సాధ్యం కానప్పుడు గోడకు బెడ్‌ల్యాంప్ అమర్చుకుంటాం. అదేదో ఇలా... వాల్ హ్యాంగింగ్‌లో ఉంటే పగలంతా మంచి పెయింటింగ్‌గా గది అందాన్ని పెంచుతుంది, రాత్రి బెడ్‌ల్యాంప్‌గా పనిచేస్తుంది. బుద్ధుని రూపం అలసిన మనసుకు సాంత్వననిస్తుంది. పైగా నిద్రలేచిన వెంటనే మొదటగా బుద్ధుడిని చూస్తుంటే మనిషి ఏ రోజుకారోజు తనను తాను సంస్కరించుకుంటూ ఉంటాడు. మనసులో క్రోధం, సహోద్యోగుల మీద ఆవేశకావేశాల వంటివి పెరగకుండా ఉంటాయి. కాబట్టి మానవసంబంధాలు మెరుగుపడుతుంటాయని బౌద్ధాన్ని ఆచరించేవారి విశ్వాసం. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Sunday, May 12, 2013
బుద్ధుడిని చూస్తూ నిద్రలోకి...ఇంటిరియం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment