శ్రీరామకృష్ణ పరమహంస మహాయోగి. ఆయన తనను చూడవచ్చే భక్తులకు, శిష్యులకు కథల రూపంలో ఎన్నో మంచి విషయాలను చెప్పేవారు. వాటిల్లో ఈనాటికీ మనకు అత్యంత ముఖ్యమైనవి, ఉపయోగకరమైనవి ఎన్నో ఉన్నాయి.
ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద నడిచి వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా!’’ అని లోపలకి వెళ్లి కూర్చుని వినసాగాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగిచూసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు. కాని ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, అక్కడి వారి ప్రవర్తన అతడికి విరక్తి కలిగించాయి. ‘ఛీ! ఎంత సిగ్గుచేటు! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేం చేస్తున్నాను?’ అని పశ్చాత్తాపపడ్డాడు. ఇక రెండవవాడు... భాగవతం వింటూ విసుగు చెందాడు. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. వీడి వాగుడు వింటూ ఇక్కడ కూర్చున్నాను. అక్కడ నా మిత్రుడు కులాసాగా కాలం గడుపుతూ, ఆనందం అనుభవిస్తూ ఉండి ఉంటాడు’ అని వాపోయాడు. కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు. యమభటులు వచ్చి, భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుపోయారు. విష్ణుదూతలు వచ్చి వ్యభిచారగృహానికి వెళ్లినవాడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోయారు!’’ ఈ కథను ప్రియనాథముఖర్జీ అనే వ్యక్తికి రామకృష్ణ గురుదేవులు చెప్పారు. ప్రియనాథ ముఖర్జీ ఇంజినీరు. కొంత ధనాన్ని నిల్వ చేసుకుని చిన్నతనంలోనే ఉద్యోగాన్ని విరమించాడు. అతడికి కలకత్తాలోను, గ్రామప్రాంతంలోనూ ఇళ్లు ఉన్నాయి. తాను సంసారంలో బందీనైపోయానని చెబుతూ తన నిరుత్సాహాన్ని గురుదేవునికి వ్యక్తపరిచాడు. అప్పుడు రామకృష్ణులు అతడికి ఈ కథ చెప్పి, ‘అన్నింటికీ ప్రధానమైనది మనస్సు. బంధించేది మన స్సే, విముక్తి కలిగించేదీ మనస్సే! బంధింపబడేది మనస్సే, విముక్తి పొందేదీ మనస్సే! భగవంతుడు మానవునిలో చూసేది అతడి మనస్సులోని భావాన్ని, పవిత్రతను మాత్రమే గాని, అతడు ఏమి చేశాడా? ఎక్కడ ఉన్నాడా? అనే విషయాన్ని పట్టించుకోడు’ అని కూడా చెప్పారు. ఒకరోజు రామకృష్ణులవారు తమ గదిలో ఉన్నారు. మహేంద్రనాథ గుప్త అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. గురుదేవులు మాటిమాటికీ గోడకు తగిలించి ఉన్న పటాలవైపు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున సరస్వతిపటం, దాని పక్కన గౌరాంగ సత్యాంగదులు సంకీర్తన చేస్తున్న పటం, ఎదురుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళికామాత పటాలు, కుడివైపున రాజరాజేశ్వరీదేవి పటం, వెనుకవైపు మునిగిపోతున్న పీటర్‌ను లేవనెత్తుతున్న జీసస్ పటం ఉన్నాయి. ఉన్నట్టుండి గురుదేవులు మహేంద్రనాథ గుప్తాతో ‘‘చూడు! సాధువులు, సన్యాసులు, సజ్జనుల చిత్రపటాలను ఇంట్లో తగిలించి ఉండటం మంచిది. నిద్రలేవగానే ఇతరుల ముఖం చూడకుండా, ముందుగా వారి ముఖాన్నే చూడటం శ్రేయస్సును కలిగిస్తుంది. రజోగుణ స్వభావులైనవారు తమ ఇళ్లల్లో తమకు ఇష్టులైన రకరకాల వారి పటాలు తగిలించుకుంటారు. ఎటువంటివారి సాంగత్యం చేస్తే అటువంటివారి గుణాలు మనకు కలుగుతాయి. అందుకే ఇంటిలో మనం ఎటువంటి చిత్రపటాలను రోజూ చూస్తూ ఉంటామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటివల్ల కూడా సాంగత్యదోషం అంటుతుంది!’’ అని చెప్పారు. ఆధునికయుగంలో మనం ఇళ్లలో ఉంచుకుంటున్న రకరకాల దృశ్యశ్రవణ యంత్రాలు, వాటిద్వారా మనకు లభించే హీనమైన సాంగత్యం, అది మనకు కలిగించే అత్యంత అపాయకరమైన అనర్థాలను గురించి గురుదేవులు దాదాపు నూటయాభై ఏళ్ల క్రితమే మనల్ని హెచ్చరించటం వారి దూరదృష్టికి నిదర్శనం. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Sunday, May 12, 2013
బంధించేది మనసే... విడిపించేదీ మనసే..దైవాలజీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment