ప్రపంచాన్ని పరిమళభరితం, ఆనందమయం చేసే అంశాల్లో పూలది తిరుగులేని స్థానం. అందులో గులాబీ చోటు మరింత పదిలం. అందుకే దానిని పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.
గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా మరియు మధ్య ప్రాక్ దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
గులాబీ పండ్లు వాటిలోసి విటమిన్ కొరకు జామ్, జెల్లీ, మరియు మర్మలాడ్, మరియు టీ తయారు చేయడంలో వాడబడుతున్నాయి. వాటిని దంచి వడగట్టి గులాబీ పండ్ల రసాన్ని తయారు చేస్తారు.గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడతారు
గులాబీ మొక్క పెంచడమంటే పసికందును సాకినంత మెలకువగా ఉండాలి. పసిపాపలా పెంచుకున్న ఆ మొక్కకు పూవు తొడిగి నవ్వులు రువ్వుతూ అందరినీ పలకరిస్తే ఆ ఆనందం వర్ణించగలమా? మనచేతుల్లో విరబూసిన ఆ అందాన్ని తనివితీరా చూసుకుని మురిసిపోతాం.

ఇంతటి ఆనందాన్ని పంచే ఆ మొక్క మనింట్లో కూడా పెంచితే బాగుంటుందని అందరికీ అని పిస్తుంది. కానీ అది బతికి బట్టకట్టి పూలు పూసే వరకూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ప్రయత్నాన్ని విరమించుకుంటారు. నేలపైన, తొట్లలోనూ ఈ మొక్కను ఒక పద్ధతి ప్రకారం పెంచితే మీ పెరటి అందం ఇనుమడిస్తుంది.
గులాబి మొక్క ఎలా నాటాలి?
పెరట్లో మొక్కలు వేయడానికి సరైన ప్రదేశాన్ని చూసుకోవాలి, కుండీల్లోనైనా పెంచుకోవచ్చు. గులాబీ మొక్క నాటేందుకు ఒకటిన్నర అడుగు లోతు, వెడల్పు ఉన్న గొయ్యి తవ్వాలి. ఇలా తీసిన గొయ్యి ఒక నెలపాటు వదిలేస్తే తరువాత మొక్కకు పురుగు పట్టకుండా ఉంటాయి. తరువాత గొయ్యిని మట్టితోనింపాలి, దానికీ లెక్కలున్నాయి.
ఎర్రమట్టి, మాన్యూర్ (ఎరువు), ఇసుక తీసు కోవాలి. వీటిని వరుసగా 1:1:0.5 నిష్పత్తిలో తీసు కోవాలి.
ఈ మిశ్రమాన్ని గొయ్యిలో వేసి గులాబీలో ఏ రకం కావాలంటే వాటిని తీసుకొని నాటుకోవాలి.
జాగ్రత్తలు:
1. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలంలో గులాబీ మొక్కకు ఆయా రుతువుల్ని బట్టి జాగ్రత్తలు తీసు కోవాలి. ఎండాకాలంలో గులాబీమొక్కలు ఎండలో ఉండకూడదు. నీడపట్టున ఉండాలి. అందుకు పైన షేడ్ వెయ్యాలి.
ఇంట్లో అయితే మొక్కల కుండీలు నీడలో ఉంచాలి.
2. వర్షాకాలంలో మొక్క తడవచ్చు కానీ మొదళ్లలో నీరు నిలువ కాకుండా చూసుకోవాలి. అందుకోసం మొదళ్లలో మట్టి పోగులా చేసి ఉంచితే నీరు జారి పోతుంది. శీతాకాలంలో ఎలా ఉన్నా పరవాలేదు. మరి నీరుపోసే విషయంలో వేసవికాలంలో ప్రతిరోజూ తగినంత నీరు పోయాలి. వర్షాలు పడితే నీరు పోయనక్కర్లేదు.
శీతాకాలంలో రెండురోజులకోసారి నీరుపోయాలి.
3. గులాబీల సీజన్ నవంబర్ నెల నుంచి జనవరి వరకూ. మొక్కని ఆగస్టులో నాటితే సీజన్‌కి అందు కుంటుంది. 15 రోజులకొకసారి పురుగుల మందులు స్ప్రే చేయాలి. మొక్కనాటిన తరువాత 40 నుంచి 45 రోజుల్లో గులాబీమొగ్గ తొడుగుతుంది.

No comments:
Post a Comment