నగరాలు, పట్టణాలలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ప్రైవసీ (ఏకాంతం) తగ్గుతోంది. అడ్డుగా గోడను నిర్మించుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ ఆ అడ్డు గోడను గోడలా కాకుండా విలక్షణం గా తయారుచేశారు హైదరాబాద్ దోమల్‌గూడలో ఉంటున్న వసుధ. మొక్కల పెంపకం అంటే ఆమెకు ప్రాణం.
ఇంటిని తీర్చిదిద్దడమంటే మరీ ఇష్టం. అందువల్లే ప్రైవసీ గోడ నిర్మాణం విషయమై ఆమె ఆర్కిటెక్ట్ తో మాట్లాడుతున్నప్పుడు ఆమెకు వచ్చిన ఆలోచనకు ఆచరణ రూపమే ఈ ఫొటోలో కనిపిస్తున్న డ్రిప్ ఇరిగేషన్‌వాల్. అయితే దీనిని ఎలా నిర్మించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం... ‘‘మాకు కావాలనుకున్న ఎత్తు లో ముందుగా స్టీల్ గ్రిడ్ వేశాం. అది పూలకుండీలను జాగ్రత్తగా పట్టి ఉంచుతుంది. దానికి అనువుగా పూలకుండీలు ఏర్పాటుచేశాం. తరవాత వాటికి నీరు అందచేయడానికి అనువుగా కింద సంప్ కట్టించాం. మొక్కలను... కుండీల సైజుకి అనుగుణంగా, పెరిగే విధానాన్ని అనుసరించి, చూడటానికి అందంగా ఉండేవాటిని ఎంచుకున్నాం. చిన్న స్విచ్ వేయగానే ప్రతి కుండీలోకి నీరు చేరేలా ఏర్పాటు చేసుకున్నాం. స్ట్రక్చర్, నీటిపారుదల, కుండీ లు, మొక్కలు... వీటన్నిటికీ కలిపి సుమారు రెండున్నర లక్షల దాకా ఖర్చు అయింది. ఇటువంటి స్ట్రక్చర్ ఏర్పాటుచేసుకోవడం వల్ల ఉష్ణోగ్రత నియంత్రణ జరగడమే కాకుండా ప్రైవసీ కూడా లభిస్తుంది’’ అని చెప్పారు వసుధ. ఫోటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎండుటాకులను తీసేయాలి మట్టిని గుల్లబరుస్తుండాలి మొక్కలకు పురుగులు, చీడ పట్టకుండా మందులు చల్లాలి ఎప్పటికప్పుడు మంచి ఆకృతిలో ఉండేలా కట్ చేయాలి నాచు పట్టకుండా చూసుకోవాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Sunday, May 12, 2013
ఏకాంతం కోసం... కుండీల కర్టెన్,,,,,,-ఇంటిరియం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment